Saturday, 14 June 2014

శాతవాహనులు



తెలుగు వారి చరిత్ర పరిశోధనలో మొట్ట మొదట తెలుసుకొవలసిన వంశం శాతవాహనులది. క్రీ.పూ. 220 మొదలుకుని క్రీ.శ. 200 వరకు సుమారు 400 సంవత్సరాలు పాలించారు.

శాతవాహనుల పూర్వం ఆంధ్ర చరిత్రకు సంబంధించిన ఆధారాలు పెద్దగా లేవు. ఆంధ్ర ప్రాంతం మౌర్య సామ్రాజ్య అంతర్భాగంగా వుంది అనటానికి శాసన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రాంతాన్ని జయించిన మౌర్య చక్రవర్తి ఎవరన్నది స్పష్టంగా తెలియలేదు. చంద్రగుప్తుని ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఆంధ్రులకు 30 దుర్గాలు, ఒక లక్ష పదాతి దళం, మూడువేల అశ్వికదళం (గుర్రాలు), రెండువేల గజదళం (ఏనుగులు)తో పరాక్రములైన సైనిక బలం వుందని వర్ణించినాడు. మరొక గ్రీకు చరిత్రకారుడైన ఏరియస్ కూడా 30 రాజ్యములను ప్రస్థావించినాడు. దీనిని బట్టి ఆంధ్రప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో విభిన్న చిన్న చిన్న గణరాజ్యాలుగా వుందని తెలుస్తున్నది.

శాతవాహనయుగము

మౌర్య సామ్రాజ్య పతన కాలంలో నెలకొన్న అస్థిర పరిసిథతులలో శాతవాహన యుగం మొదలయింది. ఉత్తరాపథం శకులు, యువనులు, పమ్లావలు మొదలగు విదేశీయుల దాడులతో అస్థిరపడింది. ఆ సమయంలో దక్షిణపథం ఐక్యత సాధించి, శాంతిభ్రదతలు కల్పించిన ఘనత శాతవాహనులకు దక్కుతుంది. శాతవాహనులు సుమారు 400 ఏళ్ళు రాజ్యం చేసారు. క్రీ.పూ. 231/230లో శాతవాహన రాజ్య స్థాపన జరిగింది. క్రీ.శ. 220 వరకు వారి పాలన సాగంది.

వంశస్థాపకుడు

శాతవాహన వంశ స్థాపకుడు సాద్వాహనుడు లేక శాతవాహనుడు, ఇతడు శ్రీముఖుని కంటే పూర్వుడు. శాతవాహన అనునది వ్యక్తి పేరు అనుటకు శాసనాలు, నాణేలు ప్రమాణాలు శాతవాహనుడు వంశస్థాపకుడే కాని ఇతను స్వతంత్ర రాజ్య స్థాపన చేయలేదు. ఆ ఘనత శ్రీముఖునికి దక్కింది. అతడు క్రీ.పూ. 231/230లో శాతవాహన రాజ్యాన్ని స్థాపించి 23 సంవత్సరాలు పాలించినాడు.

శాతవాహన రాజులు

తొలిరాజులు

శ్రీముఖుని తరువాత, అతని తమ్ముడు కన్హ క్రి.పూ 208 సింహాసనం ఎక్కి 10 సంవత్సరాలు రాజ్యం చేసాడు. శ్రీముఖుని కుమారుడు మొదటి శీతకర్ణి ఆ తరువాత రాజ్యమేలినాడు (క్రీ.పూ. 197-179) ఇతడు 18 సంవత్సరాలు పాలించినాడు. అతడు చిన్న వయసులోనే మరణించినప్పటికి తొలి శాతవాహనులలో అతను ముఖ్యుడు. అతనికి కుమారహకుశతి శ్రీమత్, కుమారశాతవాహన, వేదసిరి కుమారులు. తండ్రి మరణ సమయానికి వీరు చిన్నవారు. తల్లి నాగనకాదేవి ఈవిడ మహారథి అంగీయ రాకుమారి. భర్త మరణానంతరము తన తండ్రి త్రణకాయిరో సాయముతో రాజ్యభారం వహించింది. నాగనిక మరణానంతరం అన్నదమ్ముల మధ్య గొడవలు రేగి రాజ్యాన్ని పంచుకొని పాలించినారు.


ఆతరువాత కాలంలో ముఖ్యంగా చప్పుకోవలసింది రెండవ శీతకర్ణి. మొదటి శీతకర్ణి తరువాత వచ్చిన్నమైన రాజ్యాన్ని తిరిగి ఏకం చేసినాడు. శకులను ఓడించి మగధ, కళింగ రాజ్యాలను ఆక్రమించినాడు. ఇతడు 56 ఏళ్ళు పాలన సాగించాడు. ఇతడుక్రి.పూ. 100 ప్రాంతంలో రాజ్యం చేసాడు.


రెండో శాతకర్ణి తరువాత అపీలక, మేఘస్వాతి, కుంతల శీతకర్ణి, పులోమావి, హాలశాతవాహనులు రాజ్యం చేసారు. పులోమావి మగధ రాజు కాణ్వసుశర్మను వధించినాడు. ఇతడు క్రీ.పూ. 43-19 మధ్య రాజ్యపాలన చేసినాడు. పులోమావి 15వ శాతవాహన రాజు. క్రి.శ 6-7 మధ్య కాలంలో హాలుడు పాలించినాడు. ఇతడు స్వయంగా గాధాసప్తశతిని సంకలనం చేసినాడు. లీలావతి కావ్యం, అభిధాన చింతామణి దేశీనాయమాల మొదలైన గ్రంథాలు హాలుని కీర్తిని తరువాతి కాలాలకు నిలిపినాయి.


హాలుని తరువాతి రాజుల కాలంలో శకులు విజృంభించి శాతవాహన రాజ్యానికి గడ్డుకాలం పట్టింది. వారి రాజ్యం ఆంధ్రదేశ ప్రాంతాలకు పరిమితమయింది. శాతవాహనుల ప్రతిష్టను తిరిగి సంపాదించిన రాజు గౌతమీపుత్ర శాతర్ణి. శాతవాహనులందరిలోకి అత్యంత పేరు పొంది భారతీయ చక్రవర్తులలో ప్రముఖునిగా నిలిచాడు. క్రి.శ 75-110 మధ్య పరిపాలించాడు.


గౌతమీ పుత్ర శతకర్ణి పలు దిగ్విజయాత్రలు జరిపి తిరగి శాతవాహనుల రాజ్యాన్ని సువిశాల సామ్రాజ్యంగా మలిచాడు. నాసిక్లో అతను వేయించిన రెండు శాసనాలు, అతని తల్లి బాలశ్రీ వేయించిన శాసనం గౌతమీపుత్ర శతకర్ణి గురించి తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు. ఇతని తల్లి బ్రాహ్మణీ. ఇతను వూదిక విద్యాధర్మతత్పరుడు. రాజకీయ కారణాలచేత పరమత సహనాన్ని కనబర్చినాడు. బౌద్ధ మతాలనుయూయిలకు దాన ధర్మములు చేసినాడు.

గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత అతని కుమారుడు వాసిష్టీపుత్ర రెండో పులోమావి రాజ్యాధిపత్యం వహించారు. ఇతడు క్రీ.శ. 110-13.. కాలం మధ్య రాజ్యపాలన చేశాడు. (ఇందులోను, గౌతమీపుత్ర శాతకర్ణి కాలనిర్ణయంలోను కొన్ని విరుధ సమయాలను పలువురు చరిత్రకారులు తెల్పుతున్రాని గ్రహింపవలె) రెండో పులోమావి తండ్రి వలే జయించిన ప్రాంతాలు లేవు. ఇతని కాంలోనే శాతవాహనుల వైభవం తగ్గడం ప్రారంభమైందని చెప్పవచ్చు.


రెండో పులోమావి తరువాత శివశ్రీశీతకర్ణి రాజ్యమేలినాడు. మహాక్షాత్తప రుద్రదాముని కుమార్తె రుద్రదామునికను పెండ్లి చేసుకున్నాడు. అయినప్పటికి క్షాత్రపులతో సమరం తప్పలేదు. రుద్రధాముడు అతనిని ఓడించి అల్లుడని విడిచిపెట్టినట్లు జూనాగడ్ శాసనం వల్ల తెలుస్తున్నది.


శాతవాహన రాజులలో శివశ్రీ శ్రీతకర్ణి తరువాత యజ్ఞశ్రీ శాతకర్ణి చివరివాడు. ఆంధ్రపదేశ్, మధ్యప్రదేశ్, బిరార్, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర ప్రాంతాలలో దొరికిన ఇతని నాణేలను బట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజ్యాన్ని పూర్వం వలే విస్తరింపచేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ బౌద్ధ మతాచార్యుడైన నాగార్జునా చార్యుని పోషించినాడని ప్రతీతి.
యజ్ఞశ్రీ మరణానంతరం శాతవాహన రాజ్యం క్షిణించి త్వరలోనే నశించింది.


శాతవాహన యుగ విశేషాలు 

 ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరికం శాతవాహనుల రాజ్యాంగానికి మూలం. రాజు సర్వసైన్యాధక్షుడు. పరిపాలనాధ్యక్షుడు. మంత్రుల ఆజ్ఞ సాయముతో రాజు పాలించేవాడు. రాజే ఆజ్ఞలు జారీ చేసేవాడు. ధర్మశాష్ట్రసమంతమైన పన్నులు వసూలు చేసి ప్రజలకవసరమైన సంస్థలను పోషించేవాడు. శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృత రాజరికం కాదు. వారి కింద అనేక సామంతరాజ్యాలుండేవి. సామతరాజులు ప్రాంతాలు కాని ప్రదేశాలను రాజు పాలించేవాడు. అనేక ఉన్నతోద్యోగులు రాజ్యపాలనకి సహకరించేవారు. నగరాలన్నింటిలోను కార్యాలయాలు ఉండేవి (Records offices) ధన రూపంలో జీతాలు ఇచ్చేవారు. '' దేయమేయ'', ''రాజభాగం'' అనే పేర్లతో పంటలో రాజుకు భాగం వుండేది. భూమి పనున, వృత్తి పన్నులు వసూలు చేసేవారు. రాజు ప్రత్యక్ష పాలనలో ఉన్న ప్రాంతాలు ( అంటే సామంత రాజ్యాలు కాని సామ్రాజ్య భాగం) '' ఆహారాలు'' అనే రాష్ట్రాలుగా విభజించచారు. ప్రతి రాష్ట్ర రాజధానిలోను సైన్యాగారాలు ఉండేవి. నగరాలకు రక్షణగా దుర్గనిర్మాణం ఉండేది. రాష్ట్ర పాలనకు '' ఆమాత్యులను'' రాజు నియమించేవాడు. వారిని తరచు బదిలీ చేస్తుండేవాడు. ఆమాత్యులకు వంశపారంపర్య మక్కులల ఉండేవి కావు. పరిపాలనకు గ్రామం ప్రాతిపదిక.





No comments:

Post a Comment