Friday, 20 June 2014

మోనాలిసా ఎవరు..?మోనాలిసా గురించి ఏది నిజం....?


సినిమాల్లో రజనీకాంత్, చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటారో మనకు తెలుసు కాని మోనాలిసా మాత్రం ‘పెయింట్ మోనాలిసా'గానే మనకు తెలుసు. మోనాలిసా చిత్రపటాన్ని మనలో చాలా మంది చాలా చోట్ల చూసే ఉంటారు. కొంత మంది ఇప్పటికీ తమ ఇళ్ళలో బెడ్ రూమ్ ల్లో, హాలుల్లో అలంకరించుకుంటూనే ఉంటారు. ఈ చిత్రపటంలో సంతోషం, విషాదం, సమ్మిళితమై తెలిసీ తెలియని చిరునవ్వుతో తొలియవ్వనంలో అడుగుపెట్టిన అమ్మాయి ముఖచిత్రం మోనాలిసా. ఈ అపురూపమైన మోనాలిసా అనే పేరుతో ఆ చిత్రాన్ని గీసింది ఒక ఇటలీ శాస్త్రవేత్త. చిత్రకారుడిగా ఎక్కువ గుర్తింపు లభించినా అతణ్ణి మామూలు చిత్రకారుడిగా పరిగణించలేం. ఆయన పేరు లియోనార్డొ డావెన్సీ. ఆ చిత్రించిన పెయింటింగ్‌లో లేని అసలు మోనాలిసా రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి కొన్ని శతాబ్దాలుగా లక్షల డాలర్లు ఖర్చుపెట్టి తెలుసుకునే ప్రయత్నం పరిశోధకులు చేస్తూనే ఉన్నారు. మోనాలిసా ముఖంలో విరుబూసిన నవ్వు వందల సంవత్సరాలుగా మానవజాతిని వెంటాడుతున్న విధంగానే ‘ఎవరీ మోనాలిసా?'అనే సందేహం కూడా పరిశోధకులను వేధిస్తోంది. మోనాలీసా.... లియోనార్డ్ డా వెన్సీ అందమైన ఊహల్లో నుంచి, భావుకతలో నుంచి పుట్టిన చక్కని చుక్కా? లేక రక్తమాంసాలతో ఈ భూమి మీద నడియాడిన స్త్రీ యా? భిన్న రంగాలకు చెందిన నిష్ణాతులు ఈ ప్రశ్నను చేధించడానికి అవిశ్రాంతగా కృషి చేస్తున్నారు. కృషి చేస్తూనే ఉన్నారు... ‘డావెన్సి ఫిమేల్ వెర్షన్ మోనాలిసా' అని కొద్దిమంది పరిశోధకులు నమ్ముతున్నారు. డావెన్సీ తనను తాను యువతిగా ఊహించుకొని, తన రూపురేఖలు ప్రతిబింబించేలా ‘మోసాలిసా'ని సృష్టించాడు అంటారు వాళ్లు. డిజిటల్ విశ్లేషణ ద్వారా డావెన్సీ ముఖ కవళికలతో మోనాలిసా ముఖ కవళికలను పోల్చుతూ లోతైన అధ్యయనం చేసి తమ వాదనకు బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేశారు. మోనాలిసా ‘ఆవిడ' కాదు ‘ఆయన' అనే విషయం నిజమేగానీ ‘ఆయన' ‘ఈయన' కాదు అన్నాడు ఇటలీకి చెందిన సిల్వెనో విన్సెంటీ. కళాప్రపంచానికి చెందిన రహస్యాలను ఛేదించడంలో ఇతను సుప్రసిద్ధుడు. సాలై అనే యువచిత్రకారుడిని మహిళగా ఊహించుకొని గీసిన చిత్రమే మోనాలిసా అంటాడు విన్సెంటీ. మరి మోనాలిసా ఎవరు? ఎలా ఉంటుంది?



మోనాలిసా ఎవరు: 

చారిత్రకంగా, మోనాలిసా ఒక ప్లోరెంటైన్ పెద్దమనిషి భార్య. నిజమైన పేరు లిసా డెల్ జియోకొండో. ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరంలో జన్మించిన గెరార్డిని వస్త్ర వ్యాపారి గికాండోను పెళ్లాడింది. అప్పుడు ఆమె వయసు పదిహేను సంవత్సరాలు. చిత్ర పటం తప్పు ఆమె యొక్క అసలు రూపానికి ఇంత వరకూ ఏ ఒక్క రుజువు లేదు.


చిరునవ్వు వెనుక దాగిన రహస్యం: 

మోనాలిసా అందరికీ తెలుసు. ఐతే ఆమె చిందించే చిరునవ్వు వెనకాల ఓ రహస్యం ఉందట! అదేమిటంటే ఓ సారి చూసినప్పుడు అమె చిరునవ్వు నవ్వుతున్నట్లు, ఇంకోసారి మామూలుగాను కనిపిస్తున్నట్లుందంటారు! దీనిమీద ప్రపంచం లో చాలా రీసెర్చ్ లు కూడా జరిగాయి! ఐతే ఈమద్యనే 'లూయిస్ మార్టినెజ్ ఒటేరొ' అనే ఒక న్యూరో శాస్త్రవేత్త ఓ విషయం కనిపెట్టారుట! మనం చిత్రాన్ని చూసేటప్పుడు మన కంట్లోని రెటీనాలోని ఏ సెల్స్ పికప్ చేసుకొని ఏ ఛానల్ ద్వారా మెదడుకి ఇమేజ్ ను పంపిస్తుందన్న దానిపై చిత్రం లోని చిరునవ్వు లేక సీరియస్సా అన్నది ఆధారపడుతుందట!



మోనాలిసా గర్భవతినా?: 

మోనాలిసా గర్భవతి అని తెలుసుకోవడానికి ఆమె యొక్క కడుపు బాగా ఉబ్బుగా ఉండి, మరియు ఆమె రెండు చేతులతో ఆ ప్రదేశాన్ని దాచడానికి ప్రయత్నించి రూపురేకల చిత్రపటం ఇది.


మోనాలిసా మగవాడా?: 

మొనాలిసా అసలు స్త్రీ కాదనీ...మహిళ రూపంలో ఉన్న పురుషుడనీ ఇటలీ చరిత్రకారుడు విన్సెటీ పేర్కొనడం సంచలానికి తెరతీసింది. కొన్ని సంవత్సరాల నుంచీ విన్సెటీ ప్రత్యేకంగా డావిన్సీ చిత్రాలపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి డావిన్సీ తన శిష్యుడైన గియాన్‌ గియాకోమో కాప్రోటీ అనే యువకుడినే మోడల్‌గా స్వీకరించి ఆ చిత్రాన్ని సృజించి ఉండవచ్చన్నది తాజా విశ్లేషణ.




మోనాలిసా లియోనార్డ్ తల్లి:

కొన్ని చారిత్రక సాక్ష్యాల ఆధారంగా లియోనార్డ్ తన తల్లి కటరినా డా వెన్సీ మీద ఉన్నప్రేమ, ఇష్టంతోనే ఇలా చిత్రపటాన్ని చిత్రీకరించినట్లు సూచిస్తున్నాయి.


లియోనార్డ్ మరయు మోనాలిసా వేరు వేరు కాదా?: 

కొందరు సిద్ధాంతకర్తలు ఆధారంగా మోనాలిసా లియోనార్డో డా విన్సీ తనను తాను యుక్త వయస్సులో ఉన్నప్పుడు, మరియు తను మొసలితనంలో ఎలా ఉంటాడో ఊహించికొని ఇలా చిత్రీకరించాడంటారు.





మోన్ మరియు లిసా( మెన్ మరియు స్త్రీ): 

కొందరు చిరిత్రకారులు మోనాలిసా మొనాలిసా అసలు స్త్రీ కాదనీ... మహిళ రూపంలో ఉన్న పురుషుడనీ అంటారు. అమోన్ (పురుషుడు)మరియు లిసా(స్త్రీ) అనే రెండు లాటిన్ పదాల నుండి ఈ మోనాలిసా కలపబడిందని అంటారు.



కనుబొమ్మలు ఎందుకు ఉండవు: 

మోనాలిసా చాలా వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ముఖంలో కనుబొమ్మలు కనబడవు. కనుబొమ్మల ప్రదేశంలో నునుపైన చర్మం ఉండటం వల్ల కొంచెం వింతగా అనిపిస్తుంది.






గోల్డెన్ ట్రాయాంగిల్: 

ఫోటోగ్రఫీలోని ముఖ్యమైన నియమాల్లో ఇది ఒక నియమం. మోనాలిసానా శరీర సౌష్టవ పరంగా ఏ యాంగిల్లో చూసిన మోనాలిసా మనల్నిచూస్తున్నట్టుగానే అగుపిస్తుంది.

No comments:

Post a Comment