Sunday, 8 June 2014

ఆచార్య ఎన్.జి.రంగా



ఆచార్య ఎన్.జి.రంగా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబర్ 7,1900 - జూన్ 9 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతిచ్చిన ఈయన్ను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.

రంగా, 1900, నవంబర్ 7న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో జన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయము నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో ఆర్ధిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు.హేతువాది .


స్వాతంత్ర్యసమరంలో


1930లో మహాత్మా గాంధీ పిలుపుకు స్పందించి రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.


రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952లో ఒట్టావాలో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954లో న్యూయార్కులో జరిగిన ఇంటర్నెషనల్ పెజెంట్ యూనియన్లోనూ మరియు 1955లో టోక్యోలో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను భారతదేశం తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.


ఈయన కాంగ్రేసు పార్టీ నుండి నిష్క్రమించి భారత కృషీకార్ లోక్ పార్టీ, ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రేసు (ఐ)లో చేరాడు.


రాజకీయ జీవితము

లోక్ సభ పదవీకాలం నియోజకవర్గం పార్టీ
2వ లోక్ సభ 1957-1962 తెనాలి కాంగ్రేసు పార్టీ
3వ లోక్ సభ 1962-1967 చిత్తూరు స్వతంత్ర పార్టీ
4వ లోక్ సభ 1967-1970 శ్రీకాకుళం స్వతంత్ర పార్టీ
7వ లోక్ సభ 1980-1984 గుంటూరు కాంగ్రేస్ (ఐ)
8వ లోక్ సభ 1984-1989 గుంటూరు కాంగ్రేస్ (ఐ)
9వ లోక్ సభ 1989-1991 గుంటూరు కాంగ్రేస్ (ఐ)

రైతు బాంధవుడు రంగా

  

సుదీర్ఘ పార్లమెంటేరియన్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కిన ప్రొఫెసర్‌ ఎన్‌. జి.రంగా నేటి తరానికి సుపరిచితుడు కాదు. 1900లో పుట్టి 1995లో మరణించిన రంగా అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ 60 ఏళ్ళు రైతుల పక్షాన పోరాడిన నాయకుడు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో పుట్టి, ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశా రు. మద్రాసులోని పచ్చయప్పాస్‌ కళాశాలలో ఆర్థిక శాస్త్రాచార్యుడిగా చేరి నాలుగేళ్ళపాటు ఉన్నప్పుడు రంగాకు విద్యార్థిగా అన్నాదొరై (ఉత్తరోత్త రా తమిళనాడు ముఖ్యమంత్రి) ఉండేవారు. 

 

1930లో కాంగ్రెస్‌లో చేరి జమీందారీ వ్యతిరేక పోరాటంలో రైతుల పక్షాననిలిచారు. 1935లో తొలిసారి కేంద్ర శాసనసభకు సభ్యుడై అప్పటి నుంచి మరణించే వరకు నిరంతరం పార్లమెంటేరియన్‌గానే కొనసాగారు. రంగా పార్లమెంటులో ఉంటే రైతులకు భద్రత ఉంటుందని పండి ట్‌ నెహ్రూ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర పోరాటంలో నిర్విరామంగా పాల్గొన్న రంగా అనేక పర్యాయాలు జైలుపాలయ్యారు. జైళ్ళలోకూడా రాజకీయ ఖైదీలకు పాఠశాలలు నిర్వహించారు. ఆయనకు పోటీగా కె.బి. కృష్ణ వంటి కమ్యూనిస్టులు రాజకీయ పాఠశాలలు నడిపారు. 

 

ఆంధ్రలో తొలిసారి రాజకీయ పాఠశాలలను ప్రారంభించిన ఖ్యాతి రంగాదే. తొలి రాజకీయ పాఠశాలలో పుచ్చలపల్లి సుందరయ్యతో సహా కొందరు కమ్యూనిసులూ పాల్గొన్నారు. రంగా ఆంగ్లంలోను, తెలుగులోను మంచి రచయిత. 'హరిజన నాయకుడు' అనే నవల కూడా రాశారు. ఆంధ్ర రాజకీయాలలో గాంధీ అనుచరుడిగా పట్టాభి సీతారామయ్య ఉండ గా, రంగా గాంధీకి సన్నిహితుడు కాలేకపోయాడు. అయినప్పటికీ పార్టీ రీత్యా సిద్ధాంత పరంగా గాంధేయునిగానే కొనసాగాడు. సుభాస్‌చంద్రబోస్‌ అంటే ఇష్టపడేవారు.1938 నాటికే ఇందూలాల్‌ యాగ్నిక్‌తో కలిసి కిసాన్‌ సభలు నిర్వహించారు. ప్రకాశం పంతులుతో కలిసి ఆంధ్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించిన రంగాకు చాలా మంది శిష్యులు ఉండేవారు.

 

గౌతు లచ్చన్న, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, కందుల ఓబుల రెడ్డి, చేగిరెడ్డి బాలిరెడ్డి, ఎన్‌.వి. నాయుడు, నీరుకొండ రామారావు, బీశెట్టి అప్పారావు, పి.రాజగోపాలనాయుడు ఇత్యాదులు ఎందరో రంగా పిలుపునందుకొని రాజకీయాలలో ప్రవేశించారు. 

 

స్వాతంత్య్రానంతరం తొలి ఎన్నికలు వచ్చేనాటికి ముఠా తగాదాల కారణంగా రంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చి కృషీకార్‌ లోక్‌ పార్టీ స్థాపించారు. ఆ ఎన్నికలలో చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే కృషీకార్‌ లోక్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు. అందుకే నార్ల వెంకటేశ్వరరావు దానికి కొసల పార్టీ అని నామకరణం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అనే వివాదం వచ్చినప్పుడు రంగా వర్గం తిరుపతిలో ఉండాలన్నారు.

 

కర్నూలు రాజధానిగా ఉన్న రోజుల్లో రంగా అనుచరులు లచ్చ న్న, కందుల ఓబులరెడ్డి, నీరుకొండ రామారావు మంత్రులయ్యారు. ప్రకాశం మంత్రి వర్గాన్ని పడగొట్టడంలో రంగా వర్గమే కీలక పాత్ర వహించింది. ప్రకాశం ప్రభుత్వ పతనం 1955లో ఉప ఎన్నికలకు దారి తీసింది. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారనే భయం పట్టుకున్నది. రంగా, ప్రకాశం, పివిజి రాజు కాంగ్రెస్‌తో కలిసి ఐక్య కాంగ్రెస్‌ ఏర్పరచి బరిలోకి దిగి కమ్యూనిస్టులను 15 సీట్లతో సరిపెట్టుకునేటట్లు ఓడించగలిగారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడేనాటికి రంగా కాంగ్రెస్‌ నుంచి చీలి బయటకు వచ్చారు. 1958 నాటికి కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయం బాగా పెంపొందింది. 

 

నెహ్రూ నాయకత్వాన్ని, ఆయన ప్రతిపాదించిన సహకార వ్యవసాయాన్ని కాదని దేశ వ్యాప్తంగా స్వతంత్ర పార్టీ ఏర్పడింది. దానికి తొలి అధ్యక్షుడిగా ఆచార్య రంగా ఉన్నారు. రాజగోపాలాచారి, మినూ మసానీ, పీలూ మోడీ, రత్నస్వామి, బెజవా డ రామచంద్రారెడ్డి మొదలైనవారు ఎందరో చేతులు కలిపారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన పార్టీలో డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి కూడా తొలిదశలో ఉన్నారు. క్రమేణా స్వతంత్ర పార్టీ పలచబడుతుండగా రంగా దానికి దూరమౌ తూ వచ్చారు. ఆయన్ను బోల్షివిక్‌ అని రాజాజీ పిలిచారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వాన ఉన్న కాంగ్రెస్‌లో చేరి, రంగా తన జీవితాంతం అందులోనే ఉండిపోయారు. ఆచార్య రంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు.

 

1946లో కోపెన్‌ హేగన్‌లో జరిగిన వ్యవసాయ సమాఖ్యలో పాల్గొన్నారు. 1952లో కామన్వెల్త్‌ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొని అటావా నగరంలో ప్రసంగించారు. 1954లో న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ రైతు సమాఖ్యలో ప్రధానోపన్యాసం చేశా రు. 1955లో టోక్యోలో జరిగిన 'ఏషియన్‌ కాంగ్రెస్‌ ఫర్‌ వరల్డ్‌ గవర్నమెంట్‌' సభలో సుదీర్ఘోపన్యాసం చేశారు. రైతు సమస్యల్ని అంతర్జాతీయ సభ ల దృష్టికి తీసుకువచ్చారు. పొగాకు, పత్తి రైతుల, చేనేత కార్మికుల సమస్యలకు తన కాలాన్ని చాలా వినియోగించారు. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ పుంఖా ను పుంఖంగా రచనలు చేశారు. 

 

పత్రికలు స్థాపించారు. 1937 నుంచి వాహిని అనే పత్రికను నడిపారు. రంగా తన అనుచరులను గురించి, తనకు తెలిసిన రైతు ప్రముఖులను గురించి చక్కని పదచిత్రాలు రాశారు. వారిలో నాగినేని వెంక య్య, కల్లూరి వీరయ్య, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, ధనెంకుల నరసింహం, నన్నపనేని వెంకట సుబ్బ య్య, కావూరి వెంకయ్య ఇలా ఎందరో ఉన్నారు. కాకతీయ నాయకుల గురించి రాశారు. విప్లవోద్యమాలలో రైతులు నిర్వహించిన పాత్రను అధ్యయనం చేసి రివల్యూషనరీ పెజంట్స్‌, ది క్రెడో ఆఫ్‌ వరల్డ్‌ పెజంట్స్‌ అనే గ్రంథాలు రాశారు. 

 

రంగా అటు ఆంగ్లంలోను, ఇటు తెలుగులోను అనర్గళం గా మాట్లాడేవారు. అతి సాధారణ అలవాట్లతో జీవితం గడిపారు. జాతీయ నాయకులలో అంబేద్కర్‌తో రంగా సన్నిహితం గా ఉండేవారు. రాజ్యాంగసభకు అంబేద్కర్‌ పేరును ప్రతిపాదించడంలో ఆయన కీలకపాత్ర వహించారు, ఆంధ్రలో సంస్కరణ వివాహాలను రంగా ప్రోత్సహించారు. ఆయ న పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సమ్మేళన్‌, మహిళా విభాగంలో ఎందరో శిక్షణ పొందారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో సహా బిఎస్‌ఆర్‌ కృష్ణ, ఎస్‌వి పంతులు వంటివారు వివిధ రంగాల్లో ఆరితేరారు. 

 

పార్లమెంటులో కమ్యూనిస్టు నాయకుడు ప్రొఫెసర్‌ హీరేన్‌ ముఖర్జీతో రంగాకు మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. అంతర్జాతీయ రైతు నాయకులుగా పేరొందిన జార్జి డిమిట్రోవ్‌, పెరంక్‌ నాగీ, దీనా స్టాక్‌లు రంగాకు సన్నిహిత మిత్రులు. సుదీర్ఘ రాజకీ య జీవితంలో ఎలాంటి పదవులు లేకుండా ప్రతిష్ఠాత్మకమైన నీతివంతమైన రాజకీయాన్ని పాటించిన ఖ్యాతి ఆచార్య రంగాదే. 

 

 

No comments:

Post a Comment