Thursday, 12 June 2014

ఆల్బర్ట్ ఇన్‌స్టీన్





e=mc 2

ఈ ఈక్వేషన్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు....e ఎమిటి, m ఏమిటి c ఏమిటి అనేవి తెలయక పోవచ్చు..కానీ e=mc 2 మాత్రం తెలియని వాళ్ళు బహు కొద్ది. అదిగో, ఆ ఈ క్వేషన్ కనుకున్నాయనే మన ఆల్బర్ట్ ఇన్‌స్టీన్ గారు. వీరు తెలిపిందే ఇంకొక జగద్విదిత సిద్ద్ధాంతం "రిలెటివిటీ"...సాపేక్ష సిద్ధాంతం.

 1879 మార్చి 14న ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీలోని ఉట్టెంబర్గ్ లోని ఉల్మ్ అనే ప్రాంతంలో పౌలీన్ ఐన్‌స్టీన్, హెర్మన్ ఐన్‌స్టీన్ అనే యూదు దంపతులకు జన్మించారు.ఇతని తండ్రి ఒక సేల్స్ మాన్ మరియు ఇంజనీరు. ప్రపంచ సైన్స్ చరిత్రనే మలుపుతిప్పిన సింద్ధాంతాలు ఆయన కనుగొన్నారు. మరి మన ఐన్‌స్టీన్ గారి తెలివితేటలు అలాంటివీ. ఇప్పటీ తెలివిగల వారిని "ఇతనో ఐన్‌స్టీన్" అని అంటుంటాం. అలాంటి ఆయనకు మొదట్లో మాటలు రావడం కష్టమైందంటే నమ్ముతారా? కాని అది నిజం! ఏప్రిల్ 17, 1955న ఐన్‌స్టీన్ అమెరికాలోని ప్రిన్స్‌టన్ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించారు. ఐన్‌స్టీన్ చనిపోయినా ఆయన మెదడు మాత్రం ఇంకా బధ్రపరచబడే ఉంది. ఆయన భౌతిక కాయం నుంచి మెదడును వేరు పరచి పరిశోధనల నిమిత్తం భద్రపరిచారు. ఐన్‌స్టీన్‌కు గల అసాధారణ తెలివితేటలకు కారణాలేమైనా దానినుంచి శాస్త్రవేత్తలు రాబట్టగలరేమోనని ఆశ. దానికింకా భవిష్యత్తులో న్యూరో సైన్సు అభివృద్ధి చెందవలిసివుంది.
 

ఇంతకీ E=mc2 ద్రవ్య-శక్తి సమతులనము తెలుపుతుంది. మాస్ ఎనర్జీల మధ్య ఉన్న సబంధాన్ని సూత్రీకరిస్తోంది. మనం నేడు చెప్పుకునే ఆటంబాంబులు, న్యూక్లియార్ ఎనర్జీలకు ఈ సూత్రమే మూలం. ఐన్‌స్టీన్‌కు 1921 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబుల్ బహుమతి లభించింది. అయితే అది ఆయన ఇంత ఫేమస్ అవడానికి కారణమైన పై రెండికీ కాదు. 1905 లో ప్రచురితమైన ఫొటొ-ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ (కిరణజన్య-విద్యుత్) వివరణకు, మరియు సైద్ధాంతిక భౌతిక శాస్త్రములో చేసిన విశేష కృషికిగానూ ఈ అవార్డును ప్రధానం చేశారు.

No comments:

Post a Comment