మహాభారతం ఎన్నో రహస్యాలు కలిగిన పౌరాణిక గ్రంధం. ఈ పురాణంలో మీరు ఒకేచోట ప్రేమ, గౌరవం, ధైర్యం, తెలివి, భక్తీ, నీతి కధలను చూస్తారు. మరోవైపు మీరు ద్రోహం, అవినీతి, రంకుతనం, అన్యాయాన్ని కూడా చూస్తారు.
మహాభారత కధ పాండవులు, కౌరవుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది: ఈ పురాణం మహాభారత యుద్ధంలో చోటుచేసుకున్న వివిధ సంఘటనల గురించి వివరిస్తుంది. ఈ సాహసోపేతమైన కధలు ఈ యుద్ధంలో పాల్గొన్న పురుషులందరూ తట్టుకుని నిలబడ్డారా లేదా అనేదాన్ని వివరిస్తుంది. కానీ ఈ కధలో ఒక విధ్వంసం కోసం యుద్ధాన్ని తీసుకు వచ్చిన బాధ్యత గల ఒక స్త్రీ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. అవును, మనం ద్రౌపది గురించే మాట్లాడుతున్నాం.
మహాభారతంలో ద్రౌపదిది చాలా కీలకమైన పాత్ర. ఆమె పాంచాల రాజ్యానికి రాణి, పాండవుల భార్య, ఆమె తన భర్తల పట్ల ఎంతో భక్తి, గొప్ప వివేకం గల స్త్రీ. మహాభారత యుద్ధానికి కారణం ఈమేనని అపార్ధం చేసుకున్నారు, నమ్మారు. అదంతా నిజం కాదు, అయితే కౌరవులను నాశనం చేయడానికి తీసుకున్న ఈ నిర్ణయంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.
ద్రౌపది గురించి అంతా ఆశక్తి కరంగా ఉంటుంది. ఆమె అబ్బురపరిచే అందం, ఆమె అహంకారం, ఆమె భక్తీ, ఆమె ప్రేమ, ఆమె అవమానం, ఆమె ప్రతిజ్ఞ అన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందువల్ల, కౌరవ రాజులను నాశనం చేసిన ద్రౌపది ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం.
పేరుగాంచని పాచికలాట
కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన ఈ ప్రసిద్ధ పాచికలాట అందరికీ తెలిసే ఉంటుంది. ఇది తెలియని వారికోసం, కౌరవులు పాచికలు ఆడడానికి పాండవులను హస్తినాపురానికి ఆహ్వానిస్తారు. ధర్మరాజుకు కూడా ఈ ఆట ఇష్టం కాబట్టి ఆహ్వానాన్ని మన్నించాడు. అయితే, కౌరవుల మోసంతో ధర్మరాజు అన్నీ కోల్పోయాడు. పందెంలో అతని అన్నతమ్ములను, చివరికి తనకు తానె ఆముడుపోయాడు. అతను చివరికి కౌరవులకు బానిసగా అమ్ముడుపోయాడు. అతను తానూ కోల్పోయిన ప్రతిదీ గెలుచుకోవడానికి తన భార్యను పందెంగా పెట్టాడు. కానీ ఆమెను కూడా కోల్పోయాడు.
ద్రౌపది వస్త్రాపహరణం
ధర్మరాజు ద్రౌపది ని ఓడిపోయిన తరువాత జరిగిన సంఘటన, మొత్తం మనవ జాతికే అవమానకర విషయం. దుర్యోధనుడు స్త్రీల అంతఃపురం నుంచి ద్రౌపది ని లాక్కుని వచ్చి, ఈ కొలువులో అందరిముందు ఆమెను వివస్త్రను చేయమని దుశ్శాసనుడిని ఆదేశించాడు. దుశ్శాసనుడు అతని ఆజ్ఞ ప్రకారం ద్రౌపదిని జుట్టుపట్టుకుని లాక్కొచ్చాడు. ఆమె తన అన్నాను అవమానించిందని, కొలువుకు చేరేవరకు జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళాడు. ద్రౌపది అక్కడ ఉన్న తన కుటుంబ సభ్యులందరి సహాయం కోరింది, కానీ ఎవరూ ఆమె అపాయాన్ని తప్పించడానికి ముందుకు రాలేదు. ఆమె భర్తలు సిగ్గుతో తలలు వంచుకుని ఉన్నారు. తరువాత దుశ్శాసనుడు వదినను వివస్త్రను చేయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ద్రౌపది అపాయం గ్రహించిన కృష్ణుని వల్ల అతని పాచిక పారలేదు.
అందువల్ల, తనకు జరిగిన అవమానం ఎప్పుడూ పాండవులకు గుర్తుండేట్లు, ఈ అవమానకర సంఘటన జరిగిన తరువాత ద్రౌపది తన జుట్టును ముడివేయలేదు. తరువాత భీముడు దుశ్శాసనుడిని చంపి అతని రక్తాన్ని ద్రౌపది కోసం తీసుకువచ్చాడు. అప్పుడు ఆమె ఆ రక్తంతో తన జుట్టును కడుగుకొని ఆ తరువాత జుట్టు ముడి వేసుకుంది.
No comments:
Post a Comment