తెలంగాణ పోరాటం లో వికసించిన అగ్నిపుష్పం డాక్టర్ ఆరుట్ల కమల దేవి మహిళా లోకానికి ఆదర్శనీయం. భర్త ఆరుట్ల రామచంద్ర రేడ్డి ఆశయాలు ఆదర్శాలకు ప్రతిబింభంగా నిలిచి ప్రజల హృదయాల లో సుస్టిర స్తానాన్ని పొందారు.
జాగిర్దారీ,నైజాం కర్కషపాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోతుంటే కదన రంగం లో సంఘం కట్టిన భర్తకు తోడుగా ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం తుపాకి నెత్తిన వీరవనిత కమలదేవి మత సామరస్యానికి స్త్రీ విద్య ను పెంపొందించడానికి ఆ రోజుల్లోనే కృషి చేసిన ఆమెలోని దయాగుణం ,చైతన్య మూర్తిత్వం కొనియాడదగింది.
వంటింటికి బానిసలుగా బ్రతుకుతున్న మహిళలకు వెన్ను దన్ను గా నిలిచి ఆలేరు నుంచి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి MLA గా వెళ్ళిన కమలాదేవి నిస్వార్దసేవా రాజకీయాలకు నిర్వచనం చెప్పిన మహొన్నత వ్యక్తి, తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రామచెంద్రా రెడ్డి దర్మ పత్నిగా ఆయన అడుగు జాడల్లొ నడిచి చరిత్ర లో నిలిచి పొిన మహిళమణి కమలాదేవి .
పోరాటాలఖిల్లా నల్లగోండ జిల్లా ఆలేరు సమీపం లోని మంతపురి గ్రామం లో 1920 లో పల్లా లక్ష్మినర్సమ్మ-వెంకట్రామిరెడ్డి దంపతులకు జన్మించింన కమలాదేవి తల్లిదండ్రులు పెట్టిన పేరు రుక్మిణి. పదకొండు సంవత్సరాల వయస్సు లో కొలనుపాక కు చెందిన మేనబావ ఐన ఆరుట్ల రామచంద్ర రెడ్డి తో కమలాదేవి వివహం జరిగింది. స్వాతంత్ర్యోద్యమం దేశమంత ముమ్మరంగా సాగె రోజులు, జాతీయొద్యమ నాయకురాలు కమలదేవి చటోపాధ్యాయ స్పూర్తి తో ఆమె పేరును కమలాదేవి గా మర్చారు.
హైద్రాబాద్ లోని మాడపాటి హనుమంత రావు స్తాపించిన ఆంద్ర గర్ల్స్ హైస్కూల్ లో కమలాదేవి చదువుకొంది. ఈ సమయం లోనే హైద్రాబద్ లో బాలికల కోసం రెడ్డి హాస్టల్ ఎర్పాటైంది. చదువుకుంతున్న రోజులలోనే భర్త రామచంద్రా రెడ్డితొ కలిసి క్రియశీలక రాజకీయాల్లో పాల్గొంటుండే వారు. స్కూల్ ఫైనల్ పాసైన తర్వాత స్వగ్రామమైన కొలనుపాక వెళ్ళిన కమలదేవి గ్రామం లో జగీర్దారుకు వ్యతిరేకంగా నిషేదాన్ని ఉల్లంఘించి వంటశాల పేరుతో వయోజన విద్యాకేంద్రాన్ని, గ్రంథాలయాన్ని నడిపించడం లో క్రియశీలక పాత్ర పోషించారు.
చిలుకూరు లో జరిగిన10 వ ఆంద్రమహాసభలో కమలదేవి పాల్గోన్న తర్వాత రాజకీయల్లో చురుకైన పాత్ర పోషిస్తు వచ్చారు. భర్త రమచెంద్రా రెడ్డి వెంట కమలాదేవి ఆంద్ర మహాసభల సమవేశాలకు వెళ్ళెవారు. ఆంద్ర మహా సభ లో కమ్యినిస్టు పార్టి సబ్యత్వమ్ స్వీకరించిన కమలాదేవి రాజకీయ ,సైనిక శిక్షనలు పొందారు.క్రమ శిక్షన కల్గిన నాయకురాలి గా ఆనాడు పార్టీ నాయకు లైన రావి నారయణ రెడ్డి ,బద్దం ఎల్లారెడ్డి ,ముగ్దుం మొినొద్దీన్ ల వద్ద పేరు తెచ్చుకున్నారు. న్ల్లగోండ జిల్లాలో మర్షల్ లా విదించడంతో పురిటి బిడ్డని వదిలి ఉధ్యమమ్ కోసం భర్త తో కలిసి రహస్య జీవితమ్ లో కి వెళ్ళారు. సాయుధ పోరాటం లో భర్త తో పాటు పాల్గొన్న కమల దేవి చల్లూరు గుట్టల్లో చేసిన పోరాటం నేటికి గ్రామల్లో కథలు గ చెప్పుకుంటారు.
1948 లో జైలు కెళ్ళి విడుదలైన ఆరుట్ల కమలాదేవి 1952 లో ఆలేరు అసెంబ్లి నుంచి MLA గా ఎన్నికై 1967 వరకు ఆ పదవి లో కొనసాగారు. ప్రజభిమానం పెట్టని కోటవలే పెంచుకున్న కమలదేవి శాసన సభ లోమహిళా ప్రతిపక్ష నాయకు రాలిగా అందరి మన్ననలు పోందారు. దేశంనే ప్ర ప్రథమ ప్రతిపక్ష నాయకు ఉరాలి గా ఆమెకీర్తికెక్కారు.1955 కమ్యునిస్టు దేశాలైనా బల్గెరియా,జెకొస్లెవియా,ఆస్ట్రేలియాలు పర్యటించిన కమలదేవి 1983 లో రామచంద్రారెడ్డి తో కలసి సోవియట్ యూనియన్ వెళ్లారు 1973 లో ఆంద్రప్రదేశ్ మహిళ సమాఖ్య కార్యదర్శి గా పని చేసారు.65 సంత్సరాల సుదీర్గ క్రీయశీల రాజకీయ ప్రస్థానం లో ఎన్నో కీర్తి శిఖరాలను అధిరొహించిన ఆమె స్వచ్చందంగా విశ్రమించి రాజకీయాలకు కొత్త వొరవడిని సృష్టించారు.
ప్రజసేవలే కర్తవ్యంగా విమిక్తి పోరాటం లో పాల్గొన్న వీరనారి కమలాదేవికి 1988 లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చెసింది. భారత స్వాతంత్ర్యా స్వర్ణోత్సవాల సందర్భం గా తెలంగాణ విమోచన స్వర్ణొత్సవాల సందర్భం గా సత్కారాలు జరిగాయ్ . జీవన ప్రయాణం లో అలిసిపోిన కమలాదేవి 2001 జనవరి 1వ తేదిన తుదిశ్వాస విడిచారు.
బ్రతికి చచ్చియు
ప్రజలకెవ్వరు
ప్రీతి గూర్చునో
వారె ధన్యులు
అన్న గురజాడ మాటలను సార్ధకం చేస్తూ తిరిగిరాని లోకాలకి వెళ్ళి పోింది ఈ తెలంగాణ అగ్ని పుష్పం.
ఆరుట్ల కమలా దేవి పోరట స్పూర్తి తో తెలంగాణ పోరాట యొదులవుదాం
జై తెలంగాణ!
జై జై తెలంగాణా!!
No comments:
Post a Comment