శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల
ప్రతినిధిగా పనిచేస్తూ మొఘల్ రాజులకు వ్యతిరేకంగా అనేక యుద్ధాల్లో
పాల్గొన్నాడు. షాజహాన్ దండయాత్ర చేసిన సమయంలో కీలకపాత్ర పోషించాడు. తన
సహచరుడిని నిజాంషాహీ ప్రభువు హత్యచేయించడంతో తిరుగుబాటు బావుటాను ఎగురవేసి
స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనకు నాంది పలికాడు. రాజ్య విస్తరణ కోసం
చేసిన యుద్దాలలో పరాజయాన్ని చవిచూశాడు. తండ్రి వద్ద యుద్ధవిద్యలు, రాజనీతి
మెలుకువలు నేర్చుకున్న శివాజీ తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి
అనేక నూతన యుద్ధతంత్రాలను రూపొందించాడు.
సకలవిద్యలను అవపోసన పట్టిన ఆయన మరాఠాసామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలను రచించాడు. 17 సంవత్సరాల వయస్సులోనే సూల్తానులలో యుద్ధాలకు తలపడిన శివాజీ బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. యుద్ధ భయంకరుడుగా పేరుపొందిన అఫ్జల్‌ఖాన్ శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకుని ఆయనను రెచ్చకొట్టేలా శివాజీకి ఇష్టదైవమైన భావానీదేవి ఆలయాన్ని కూల్చివేశాడు. అఫ్జల్ కుట్రలు తెలుసుకున్న శివాజీ ప్రతాప్‌ఘడ్ కోట లోసమావేశానికి అంగీకరిస్తాడు, ముందు జాగ్రత్తగా ఉక్కుకవచాన్ని ధరించి పిడిబాకును దాచుకుని చర్చలకు సిద్ధమవుతాడు.
శివాజీ ని అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అఫ్జల్ కత్తితో శివాజీపై దాడి చేస్తాడు, ఉక్కుకవచం కారణంగా రక్షించబడిన శివాజీ వెంటనే పిడిబాకులో దాడిచేస్తాడు, సైనికాధికారి చేతిలో అఫ్జల్ ఖాన్ మరణించగా మెరుపుదాడుల్లో సైనాన్ని మట్టికరిపిస్తాడు. ప్రతాప్ ఘడ్ యుద్ధంతో శివాజీ కీర్తిప్రతిష్టలు భారతదేశమంతటా వ్యాపిస్తాయి. ఎందరో హిందూ రాజులు ఆయన కు సంఘీభావం తెలియజేస్తారు. అఫ్జల్‌ఖాన్ మరణాన్ని సహించలేని బిజాపూర్ సుల్తాన్ పదివేలమంది అతిబలవంతులైన సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపిస్తాడు. ఐదు వేలమంది మరాఠాయోధులతో హరహరమహా దేవ అంటూ విజృంభించిన శివాజీ వారిని ఊచకోతకోశాడు.
శివాజీ పరాక్రమాలను తెలుసు కున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ముందుజాగ్రత్తగా అపారమైన సైనికశక్తిని, సిద్ది జోహార్ అనే సైనికాధ్యక్షుడిని కొల్హాపూర్‌లో మొహ రిస్తాడు. సమీపంలోని పన్‌హాలా కోటలో వందలమంది అనుచరులతో ఉన్న శివాజీ విషయం తెలుసుకుని కోటనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ యుద్ధంలో అతిఎక్కువమంది సైనికులను కోల్పోయిన శివాజీ సంధికి అంగీకరిస్తాడు. ఈ సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్య్ర రాజ్యంగా గుర్తింపు, సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్‌హాలా కోట దక్కింది. సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరు పోరు పవన్ ఖండ్ యుద్ధం.
శివాజీతో యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఔరంగజేబు తన మేనమామ షాయిస్తాఖాన్ వెంట లక్షకు పైగా సైన్యాన్ని, ఆయుధాలను ఇచ్చి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తాడు. అయితే మొగల్‌సేనల ముందు మరాఠి సేనలు నిలువలేక పోతారు. ఓటమిని అంగీకరించిన శివాజీ పూణే వదిలి వెళ్లిపోతాడు. శివాజీ నిర్మించిన లాలామహల్ లో షాయిస్తాఖాన్ నివాసం ఏర్పాటుచేసుకుని, శివాజీ దాడి నుంచి ముందస్తుజాగ్రత్తగా పూణే నగరమంతా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసుకుంటాడు. మారువేషంలో వచ్చిన శివాజీ షాయిస్తాఖాన్ గదిలోకి చేరి కత్తితో దాడి చేస్తాడు. గాయపడిన ఖాన్ సైనికుల సహాయంలో ప్రాణాలు దక్కించుని ఔరంగజేబు వద్దకు చేరుతాడు. తిరిగి తన కోటను స్వాధీనం చేసుకున్న శివాజీ సూరత్ నగరం పై దాడి చేసి అపారమైన ధనాన్ని, ఆయుధాలను దోచుకుని తన సైన్యాన్ని బలోపేతం చేసుకుని
క్రమంగా మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటాడు.
మొఘల్ సర్దార్‌గా ఉండడానికి అంగీకరించి 23కోటలను, నాలుగు లక్షల రూపాయలను చెల్లిస్తాడు. ఔరంగజేబు తన పుట్టినరోజు సందర్భంగా శివాజీని , అతని ఆరేళ్ల కొడుకు శంభాజీని ఆహ్వానించి నిండుసభలో అవమానపరుస్తాడు. మరాఠీల తిరుగుబాటుకు బయపడి శివాజీని హతమర్చకుండా అతిధిగృహంలోనే బందీచేస్తాడు. చాకచాక్యంతో అక్కడినుంచి తప్పించున్న శివాజీ రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ 1674 నాటికీ లక్షమంది సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలను, అశ్వాలను, గుఢాచారి వ్యవస్థను, నౌకావ్యవస్థను ఏర్పాటుచేసుకుంటాడు. శ్రీశైలం వచ్చి అక్కడ భవానీదేవిని ధ్యానిస్తాడు. ఆయన భక్తికి మెచ్చిన దేవి ప్రత్యేక్షమై ఖడ్గాన్ని ప్రసాదిస్తుంది.(ఇప్పటికీ ఆ ఖడ్గం మ్యూజియంలో ఉంది.) మరాఠ సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న ఆకాంక్ష, దేవి ఆశీస్సులు ఉన్న ఖడ్గంతో శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నాడు. కొండ కోట ను స్వాధీనం చేసుకోవడానికి అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీని పురమాయిస్తాడు శివాజీ. కోట నిర్మాణాన్ని క్షుణ్ణంగా
పరిశిలించిన
తానాజీ యశ్వంతి అనే ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరి, ఆ తాడు హాయంతో కోట
లోకి ప్రవేశించి కోటను స్వాధీనం చేసుకుంటాడు. అయితే ఈ పోరులో తానాజీ
మరణిస్తాడు. కోటను గెలిచాం కాని సింహాన్ని కోల్పోయామని ఆవేదన చెందిన శివాజీ
ఆ కోటను సింహఘడ్ గా మార్చాడు.
మరాఠాసామ్రాజ్యాన్ని వ్యాపించచేసిన శివాజీకి రాయఘడ్ కోటలో వేదపఠనాల మధ్య క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి బిరుదును ప్రదానం చేస్తారు. ఎన్నో కోటలపై దండయాత్రలు చేసిన శివాజీ ఏ మతానికి చెందిన పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. మొగలులకు, సుల్తాన్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన కొలువులో అనేకమంది ముస్లీంలు ఉండేవారు. సైన్యంలో మూడొంతులు ముస్లింలే. శివాజీకి సర్వసైన్యాధ్యక్షులుగా
దౌలత్‌ఖాన్, సిద్ధిక, నావికాదళానికి ఇబ్రహీం ఖాన్, మందుగుండు విభాగానికి అధ్యక్షుడుగా సిద్ది ఇబ్రహీం బాధ్యతలు నిర్వహించేవారు. పరస్త్రీలను మాతృ సమానురాలుగా చూసిన గొప్ప వ్యక్తి శివాజి. గెరిల్లా విధానంలో పోరాటం, కొత్త ఆయుధాలను కనుగొవడం శివాజీ అవలంభించిన యుద్ధవైెపుణఅయాలే. 27 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అనేక యుద్ధాలు చేస్తూ మూడువందల కోటలను తన ఆధీనంలో ఉంచుకుని, లక్షమంది సైన్యాన్ని తయారు చేసిన శివాజీ కొండలపై సాంకేతిక విలువలతో శత్రుదుర్బేధ్యమైన కోటలను నిర్మించడంలో ప్రపంచఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. నాసిక నుంచి మద్రాసు వరకు 1200 కిలోమీటర్ల మధ్య 300 కోటలు నిర్మించాడు.
తన సామ్రాజ్యంలో అన్ని మతాల వారిని సమానంగా చూసిన ఆయన అనేక దేవాలయాలతో పాటు మసీదులను కూడా నిర్మించాడు. మతసామరస్యానికి ప్రతీకగా సాగిన శివాజీ పరిపాలన ను ఉదాహరించవచ్చు. ఏప్రిల్ 3, 1680న శివాజీ మరణం తరువాత ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాపాలన బాధ్యతలు చేపట్టి తండ్రికి తగ్గ తనయుడిగా మొగల్‌లను ఎదుర్కొన్నారు. జనరంజకంగా పరిపాలన సాగించాడు.
No comments:
Post a Comment