Thursday, 26 June 2014

చమురు ప్రపంచాన్ని ఎలా నడిపించిందో తెలుసుకోండి....

చమురు ప్రతి చోటా ఉన్నది. అంటే మనం ఉపయోగించుకుంటున్న వస్తువులతో కలిపి. ఈ రోజు సంఘం దీనిమీదే ఆధారపడి ఉందటే ఆశ్చర్యపోనక్కరలేదు. మరి అలాంటి చమురు గురించిన చరిత్రను తెలుసుకోవటం మనకు ఎంతైన అవసరం ఉంది. తెలుసుకుందాం.

చైనా 3 వ AD శతాబ్ధములో:....ఎప్పుడూ చెప్పినట్లే 2000 సంవత్సరాలకు మునుపు చైనాలో లోతుగా తవ్వే అలవాటు ఉండేది. అలా తవ్వుతున్నప్పుడు బయటకోచ్చే నీరు కొంత చమురుతో కూడుకుని ఉండేది. అ నీటిని వారు కాలే నీరు అనే వారు. చైనా వారూ మరియూ జపానీయులూ ఈ నీటిని మంటలు పెట్టుకోవడానికీ మరియూ వేడిచేసుకోవడానికీ వాడుకున్నారు.



పెర్సియా, 9 వ AD శతాబ్ధములో:.....రజీ అనే పెరిషియన్ శాస్త్రవేత్త ఈ నీటిలో నుండి చమురును వేరు చేసి "కిరోసిన్" అని పేరు పెట్టి దీపాలు వెలిగించుకునేలా చేసేడు. అయితే 1854లో కెనడాకు చెందిన ఆబ్రహం జెన్సర్ అనే శాస్త్రవేత్త కిరోసిన్ ను డిస్టిల్ చేసి వ్యాపారం చేయించేడు. అప్పుడు ఈ కిరోసిన్ ను ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోగలిగేరు.
 

1854 యలే విశ్వవిద్యాలయం:....ఒక పక్క జెన్సర్ కిరొసిన్ దీపాల అమ్మకం మొదలు పెట్టి డబ్బు గడిస్తుంటే, యలే విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త బెంజమిన్ సిల్లి మాన్ ఆ నీటిలో నుండి క్రూడ్ ఆయిల్ కనుగొని చమురు ప్రపంచములో మరో విప్లవం తెచ్చేరు.
 

ఆధునిక ప్రపంచం: ప్రస్తుత ప్రపంచములో చమురు ఒక ముఖ్య శక్తి. అది అమూల్యమైనది. అందుకే దీనిని నల్ల బంగారం అంటారు. ఈ రోజు 90 శాతం వాహనాలు ఈ శక్తితోనే నడుస్తున్నాయి. అంతే కాదు, ఇది ఎన్నో రసాయన వస్తువులకు, ఉదాహరణ: రసాయనాలు,మందులు,ఎరువులు, ప్లాస్టిక్ ఇలా ఎన్నో వస్తువులకు ముడి సరకుగా ఉంటోంది.

 


వస్తువులలో ముఖ్యమైనది క్యాసెట్లు: ప్రపంచ చమురులో 5 శాతం వీటి తాయారుకు పోతోంది.
 

అతికింపదగిన బంక: దీనికి కూడా చమురే ముడి సరకు.

 


షాంపూ


ప్లాస్టిక్

 




మందులు: ముఖ్యముగా ఆస్ప్రిన్: నొప్పి అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆస్ప్రిన్. ఎన్నో రకాల నొప్పులను తగ్గించే ఈ ఆస్ప్రిన్ ఫినాయిల్(దీని ముడి సరకు కూడా చమురే) తో కలిపి తయారుచేయబడిందే.
 

No comments:

Post a Comment