Sunday, 15 June 2014

భూమి కోసం.. భుక్తి కోసం.. -‘నల్లమల’ పోరు నిజాం పాలనలో రజాకార్ల ఘోరాలు


భూమి కోసం.. భుక్తి కోసం.. -‘నల్లమల’ పోరు
- నిజాం పాలనలో రజాకార్ల ఘోరాలు
- తల్లడిల్లిన సాధారణ ప్రజలు
- రజాకార్ల ఆగడాలకు చెక్
- ఉక్కుపాదంతో అణిచివేసిన ‘ఉక్కుమనిషి’
‘ఓ నిజాం పిశాచమా...
కానరాడు నిన్నుబోలిన రాజుమాకెన్నడేను
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’
అన్నాడు మహాకవి డాక్టర్ దాశరథి .. ఆనాటి నిజాం సంస్థాన పరిస్థితికి ఈ మాటలు అద్దం పడుతున్నాయి. 5వ నిజాం అఫ్జల్‌దౌలా నిజాం రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా ‘బందీలు’గా విభజించి మొత్తం రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా తెలంగాణ... మరక్వాడాగా చేసి తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళీ రెండు సుభాలుగా ఏర్పాటు చేశాడు. నిజాం జిల్లాలుగా ఉండిన హైద్రాబాద్, అత్రాఫ్‌బల్లా, నల్లగొండ, వరంగల్లు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, బీదర్, నాందేడ్, మెదక్, పర్బనీ, ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, గుల్బర్గ, రాయిచూర్, మహబూబ్‌నగర్ ఉండేవి.

అసఫ్‌జాహి వంశంలో చివరి వాడైన 7వ నవాబ్ ఉస్మాన్ అలీఖాన్ నవాబులు తమ ఏలుబడిలో తాము నియమించి జాగిర్దార్లకు వంత పాడుతూ ప్రజా సంక్షేమం మరిచి ప్రజల్ని పిండి పిప్పిచేసి గ్రామాల్లో భయానక వాతావరణాన్ని కల్పించినా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తించారని, దీంతో ప్రజల్లో నైజాం పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1927లో మజ్లిస్ ఇత్తెహదుల్ బైనుల్ముస్లమీన్ సంస్థగా బహద్దూర్ యార్‌జంగ్ ఆధ్వర్యంలో ఒక సంస్థగా ఏర్పడింది. ఆ తర్వాత ఈ పార్టీకి ఒక వైపు ప్రజల నుండి వ్యతిరేకత ఎదురౌతుందని తెలుసుకున్న వీరు 1929లో మజ్లిస్ ఇత్తెహదూల్ ముస్లిమిన్‌గా పేరు మార్చారు. 1937లో సంస్థ మత పరివర్తన ఉద్యమం ‘తబ్లిగ్’ అనే కార్యాక్షికమం ద్వారా సంస్థానంలోని హరిజన, గిరిజన , పేద, అట్టుడిగిన ప్రజలకు ఆర్థిక స్వావలంభన, భూ వితరణ కల్పిస్తామని ఆశపెట్టి మత మార్పిడీలు విచ్చలవిడిగా కావించారు. ఇలా మత చాందస వాద ప్రేరణనిస్తూ ప్రజలను ఒకే మతం పైపు ఆకర్షితులను చేయడంలో భాగంగా పుట్టిన సంస్థ రజాకార్ అని చెప్పుకోవచ్చు. అసలు రజాకార్ అనగా శాంతిని వాంచించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. కాని నిజానికి వీరు శాంతిని నాశనం చేసి రక్తం పిండే రాకాసి మూకలుగా వీరికి ముద్రపడింది. రజాకార్ల ముఠాలు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్రలను చేసి స్త్రీలను ఎత్తుకెళ్ళారు. పురుషులను కట్టేసి కొట్టారు. హైద్రాబాద్ సమీపాన మహ్మద్ అస్లం, ఖరీంలు అరాచకాలు సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది.

నిజాం రజాకార్లపై ఇక్కడి వారు కేంద్ర ప్రభుత్వంలోని నెహ్రూ మరియు సర్ధార్ పటేల్‌లకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో ఆర్యసమాజ్ కార్యకర్త నారాయణ్‌రావు పవార్ నిజాం రైలులో ప్రయాణం చేస్తుండగా షాద్‌నగర్ వద్ద బాంబు విసరగా ఆయన తృటిలో తప్పించుకున్నాడు. రజాకర్ల సమస్యను అర్థం చేసుకున్న కేంద్రం మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి నేతృత్వంలో భారత సైన్యాల్ని హైద్రాబాద్‌కు తరలించారు. సెప్టెంబర్ 13న సైన్యం హైద్రాబాద్‌లో దిగింది. ఎలాంటి రక్తపాతం లేకుండానే 17 సెప్టెంబర్ నాడు నిజాం సంస్థానాన్ని అస్తగతం చేసుకొని స్వాతంత్య్ర ఫలాలను 16 జిల్లాలకు కల్పించింది. ఉక్కు మనిషికి విమానాక్షిశయంలో నిజాం తలవంచాడు. 16 జిల్లాలకు 1947 ఆగస్టు 15 రోజు స్వాంతంత్య్రం రావాల్సి ఉండగా చివరకు 17 సెప్టెంబర్ నాడు పోలీస్ చర్యతో ఈ ప్రాంతానికి విమోచనం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడానికి ఈ ప్రాంతం 17 సెప్టెంబరుకు అన్ని విధాలా అర్హత కలిగిందని చెప్పవచ్చు.

ధీటుగా ఎదుర్కొన్న కొందుర్గు
నైజాం ప్రభుత్వ కాలంలో తెలంగాణ పల్లెల్లో రజాకార్ల ఆగడాలు చెప్పతరం కాకుండా సాగేవి, 1938లో హైద్రాబాద్‌లో ఆర్యసమాజ్ వారు హిందూవుల ఏకీకరణకై ఉద్యమాలు ప్రారంభించారు. అదే సమయంలో స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రామానంద తీర్థ ఆధ్వర్యంలో కూడా జనజాగృతి ఉద్యమాలు సాగాయి. తెలంగాణలో రజాకార్లు బహదూర్ యార్‌జంగ్ (జాగీర్ధార్) అప్పటికీ మజ్లిస్ ఇత్తిహదుల్‌ముస్లిమిన్ పార్టీని స్థాపించి తద్వారా నిజాంకు ప్రభుత్వానికి సమాంతరంగా తెలంగాణలో తమ ఆధిపత్యం కోస గ్రామాలపై పడి ప్రజలను భయవూభాంతుల్ని చేసేవారు. అప్పటికి స్టేట్ కాంగ్రెస్ నాయకులుగా బూర్గుల రామకృష్ణారావు, మేల్కోటి వంటి వాళ్ళు చురుకుగా పాల్గొంటున్న రోజులు, 1947 ఆగస్టులో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కాని తెలంగాణ మాత్రం నిజాం పరిపాలనలోనే ఉండి 1948 సెప్టెంబర్ 17 నాడు భారత దేశానికి హోంమంవూతిగా ఉన్న సర్ధార్ వల్లభాయ్‌ప రాజకీయ చతురతతో పోలీస్ చర్య జరిపి నిజాం పాలనకు చరమగీతం పలికాడు. భారత ప్రభుత్వం పోలీసు యాక్షన్ చేపట్టి నిజాం పాలన నుండి సెప్టెంబర్ 17-1948 నాడు విముక్తి చేసింది. రజాకార్ల ఉద్యమ నాయకుడైన ఖాసీం రజ్వి అరెస్ట్ చేసి జైల్లో ఉంచింది.

పోలీస్ చర్య తర్వాత నిజాం ప్రభువైన మీర్ ఉస్మాన్ అలీఖాన్, భారత ప్రభుత్వంతో చర్యలకు సిద్ధపడి, హైద్రాబాద్‌ను ‘బీ’ స్టేట్‌గా ఉంచాలని రాజ ప్రముఖ్‌గా తనకు గౌరవ స్థానం కల్పించాలని కోరాడు. 1881లో మొదటి సాలార్‌జంగ్ ప్రభువు(నిజాం) హాయాంలో పావిన్స్) ప్రాంతాల విభజన చేపట్టాడు. అప్పుడే జిల్లాల ఏర్పాటు కావించబడినవి. నిజాం పరిపాలనలో తెలంగాణ మరట్వాడ, కర్ణాటక మూడు ప్రాంతాలుగా ఉండేవి. కర్నూలు ప్రాంతంగా కిషన్‌సింగ్, కమతం వెంకట్‌డ్డి, గడియారం రామకృష్ణశర్మ, గొట్టిముక్కుల కృష్ణమూర్తి తదితరులు రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేశారు. కొందుర్గు ప్రధాన వీధుల్లో ప్రతి నిత్యం రజాకార్ల కవాతును,్ల వారి ఆగడాలను ప్రత్యక్షంగా చూసిన రిటైర్డ్ టీచర్ స్థానికుడు లక్ష్మీకాంత్‌రావు ఆకాలంలో ఈ ప్రాంతంలో రజాకార్ల విధ్వంసకర చర్యలు, వారి ని ఎదురొడ్డి పోరాడిన ప్రజల గురించి టీన్యూస్‌కు తెలిపారు.

ఆగడాలకు హద్దే లేదు: కందూరు కృష్ణాడ్డి, పెద్ద ఎల్కిచర్ల
రజాకార్లంటే శాంతిని వాంచించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. కాని వీరు శాంతిని నాశనం చేసి మానవ రక్తాన్ని తాగిన రాకాసి మూకలుగా ఉండేవారు. రజాకర్ల దౌర్జన్యాలు జరిగే రోజుల్లో నేను ఉర్దూ మీడియంలో 6వ తరగతి చదువుతుండేవాడినని పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన కందూరు కృష్ణారెడ్డి తెలిపారు. పరిగి కేంద్రంలో ప్రతి నిత్యం తల్వార్లు, కత్తి తుపాకులు బరిసెలు, లాఠీలు చేత పట్టుకున్న రజాకర్లు కవాతు నిర్వహించి ప్రజలు తమకు ఎదురు తిరగడానికి కూడా సాహసించని పరిస్థితిని కల్పించేవారు.

No comments:

Post a Comment