Wednesday, 18 June 2014

పర్సనల్ కంప్యూటర్ చరిత్ర



టెక్నాలజీ అనగానే మనకు గుర్తు వచ్చే మొదటి వస్తువు కంప్యూటర్. దాదాపు మన జీవితంలో ప్రతీ మలుపూ, కంప్యూటర్ తో ఏదో ఒక విదంగా ముడి పడి ఉంటుంది. మనం ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులలో (టీ.వీ, ఓవెన్‌, సెల్ ఫోను ) మైక్రో ప్రాసెసర్ లు అమర్చబడి ఉంటాయి. కానీ సాధారణంగా మనం కంప్యూటర్ అంటే అలోచించేది పర్సనల్ కంప్యూటర్ ను గూర్చి.

ఒక మైక్రో ప్రాసెసర్ చుట్టూ నిర్మించబడుతుంది ఈ కంప్యూటర్. ఇందులో చాలా భాగాలు ఉంటాయి. వాటిలో మెమొరీ లేదా ర్యాం, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ వంటివి ముఖ్యమైనవి. ఇవన్నీ కలిసికట్టుగా పని చేస్తాయి. దీన్ని వివిద పనులు చేయటానికి ఉపయోగిస్తాం. ఉదాహరణకు డాక్యుమెంట్లు వ్రాసుకోవటానికి, ఈ-మైల్ పంపటానికి, ఇంటెర్నెట్‌ లో శోదించటానికి , గేంస్ ఆడటానికీ మొదలైనవి.

ఎడ్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఇంటెల్ వారు తయారు చేసిన మైక్రో ప్రాసెసర్ వాడి చేసిని కంప్యూటర్ కిట్లను అమ్మటం 1970లో మొదలు పెట్టాడు. దాని పేరు ఆల్‌టైర్ 8800. దాన్ని 395 డాలర్లకు అమ్మసాగాడు. అంటే ఇప్పటి వెళ 6 లక్షల రూపాయలు.

1975లో ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితం కావటం వల్ల దీనికి ఆదరణ పెరగగింది. అప్పట్నుంచీ పర్సనల్ కంప్యూటర్ యుగం మొదలైంది.  కానీ స్టివ్ జాబ్స్ మరియూ స్టివ్ వోజ్నియాక్ యాపిల్-2 కంప్యూటర్ ను ప్రపంచానికి పరిచయం చేసే వరకూ పీ.సీ కి ప్రాముఖ్యత లభించలేదు. దాంతో కంప్యూటర్ తయారు చేయటం మరికొన్ని సంస్థలు మొదలు పెట్టాయి. వెంటనే IBM కూడా బరిలోకి దిగింది.

నిజానికి ఆపరేటింగ్ సిస్టకు సంభందం లేకుండా ఇంట్లో వాడే ఎలాంటి కంప్యూటర్ ను ఐనా పీ.సీ అనాలి. కానీ ఈ రోజుల్లో మైక్రో సాఫ్ట్ వారి ఆపరేటింగ్ సిస్టం వాడే కంప్యూటర్ లను మాత్రమే పీ.సీ అంటున్నారు.

No comments:

Post a Comment