అమెరికాలోని ఈ గ్రామ జనాభా కేవలం ఒకరు మాత్రమే
మొనోవీ అనే ఈ గ్రామములో 1930 లో 150 మంది నివసించేవారు. మిగిలిన అన్ని గ్రామాలలాగానే ఈ గ్రామములోని యువత కూడా పెద్ద పెద్ద నగరలాకు వలస వెళ్లేరు. 2000 లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామములో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళు భార్యాభర్తలు.2004 భర్త చనిపోయిన తరువాత భార్య మాత్రమే మిగిలింది. ఆమే ఈ నగరానికి మేయర్. టాక్స్ కడుతూ ఆమె ఇంటికి దగ్గరున్న 4 వీధి దీపాలకూ మరియూ రోడ్దుకూ ప్రభుత్వం నుండి ఉపాధి తెచ్చుకుంటుందిట.
ఫిలిపైన్స్ లో ఉన్న స్టిట్లిస్ గ్రామం
ఫిలిపైన్స్ లోని సమలేస్ ద్వీపాలలో ఇది ఒకటి.ఇక్కడున్న ప్రజలను బడ్జోస్ అంటారు. వీరు ముస్లీం మైనారిటీకి చెందిన వారు.వీరిని సీ జిప్సీస్ అని పిలుస్తారు.
రష్యా లోని "చ్చెస్ సిటీ"
చెస్ ఆట మీద ఎక్కువ ఉత్సాహం చూపే రష్యా ప్రెశిడెంట్ కిర్సాన్ ఇల్యుంజినావ్ ఈ సెటిల్మెంట్ గ్రామాన్ని నిర్మించేరు.చక్కటి రోడ్లు, అద్భుతమైన ఒక చ్చెస్ ప్యాలస్ మరియూ ఖరీదైన ఇళ్లు కలిగిన ఈ గ్రామమంలో ఎవరూ నివసించరట.
భారతదేశం లోని కవలల గ్రామం
కేరళాలోని కోధిని అనే ఈ గ్రామం 250 మంది కవల పిల్లలు ఉన్నారట. ఇది ప్రపంచ సరాసరి సంఖ్య కంటే 6 రెట్లు ఎక్కువట. ఇప్పుడు అక్కడి కవలల సంఖ్య 350 కి పెరిగిందట. 3 తరాల క్రితం మొదలైన ఈ కవల పిల్లల పుట్టుక ఈ గ్రామంలో అప్పటి నుండి పెరుగుతోందట. దీనికి కారనమేమిటా నని పరిశోధనలు చేస్తున్నారు.
ఈజిప్ట్ లోని గార్బేజ్ సిటీ
మన్షియాట్ నజర్ అనే ఈ గ్రామము ను గార్బేజ్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడున్న గ్రామ వాసులు చెత్త్ ఏరుకుని దానిని నగరాలలో ఉన్న రీసైకిల్ కంపనీలకు అమ్ముకుని బ్రతుకు గడుపుతారట. ఈ గ్రామం చుటూ ఆధునిక నగరాలు ఉన్నాయట.
చైనా లోని మరుగుజ్జుల గ్రామం
ఇక్కడ నివసిస్తున్న వారందరూ మరుగుజ్జులే. 1.5 మీటర్ల ఎత్తుకంటే ఎక్కువ ఎత్తు ఉండరు. వీరి ఇళ్లు కూడా వింతగా ఉంటాయి. వీరు పాడే సంగీతం, వాయించే వాద్యాలూ కూడా వితగా ఉంటాయట.
ఆస్ట్రేలియా లోని భీమి క్రింద ఉండే పట్టణం
ఇది స్పటికతో నిండిన ఎడారి ప్రదేశం.భూమి ఉపరితలం మీద ఉండే వేడి నుండి తప్పించుకోవటానికి ఇక్కడున్న ప్రజలు భూమి క్రింద ఇళ్లు కట్తుకుని నివసిస్తున్నారట. భూమి పైన ఇళ్లు కట్టుకోవడాని అయ్యే ఖర్చు, భూమిని త్రవ్వి అక్కడ కట్టుకునే ఇళ్ల ఖర్చు ఒకటిగానే ఉంటుందట. ప్రపంచ మొత్తానికీ స్పటిక ఇక్కడి నుండే సరఫరా అవుతుందట. తవ్వుకున్న ఇంటి మట్తిని అమ్ముకుని జీవిస్తారట.
ప్రపంచానికే అతి దూరం గా ఉండే గ్రామం
ఎడింబరో ఆఫ్ ది సెవెన్ సీస్ అని పిలువబడే ఈ గ్రామం ప్రపంచ భూభాగానికే చాలా దూరం లో ఉన్న ఒక చిన్న ద్వీపకల్పం.
No comments:
Post a Comment