ఒకే చోట 7 ఆలయాలున్నాయి.వాటిలో శివాలయం ప్రధాన ఆకర్షణ.రామ మందిరం , హనుమాన్ గుడి వున్నాయి. ఆ ఆలయాలు క్రీ.శ.6వ శతాబ్ధం నుంచి 9వ శ. వరకు రూపుదిద్దుకొన్నాయి. ఆ ఆలయాలకు సమీపంలోనే బౌద్ధ స్తూపాల ఆనవాళ్లున్నాయి. సింధూ నాగరికత కాలం నాటి వస్తువులు కొన్ని ఆ ప్రాంతంలో దొరికాయి. కటాసరాజ ఆలయం పాకిస్తాన్లోని పంజాబురాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ దేవాలయం. ఇది చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉoది. ఇది ఒక శివాలయం.
మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపారట. ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తేవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగానూ, రెండవది రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్)లోని పుష్కరరాజ్ తీర్థంగానూ మారాయి.
ఇక్కడ100కి పైగా ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం 900 సంవత్సరాలు లేదా అంతకన్నా పూర్వానివేనని చరిత్రకారుల ఉద్దేశ్యం. కటాసక్షేత్రం ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు విశ్వవిద్యాలయంగా కూడా భాసిల్లినది. ఎందరో దేశీ, విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తూ ఉండేవారు. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరూనీ ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ, భూమి చుట్టుకొలతను లెక్కించాడు.
ఇక్కడి ఏడు ఆలయాలలో విగ్రహాలను పునఃప్రతిష్టించేందుకు భారతదేశంనుండి విగ్రహాలను దిగుమతి చేసుకొంది.
No comments:
Post a Comment