Monday, 30 June 2014

మొదటి పుస్తకం ప్రచురితం




ఒక వ్యక్తి తన ఆలోచనలు గుహ గోడలు, చెట్టు బెరడు లేదా జంతువు చర్మంపై చిహ్నాలు డ్రా లేదా వ్రాయడానికి కూడా ప్రారంభమయ్యాయి పుస్తకం యొక్క చరిత్ర, ప్రాచీన రోజుల తిరిగి సాగుతుంది మిడ్ 15 వ శతాబ్దం Germany పనివాడు జోహాన్స్ గుటెన్బర్గ్ లో -. దీని అసలు పేరు జోహాన్స్ గుటెన్బర్గ్ Gensfleisch ఉంది జూమ్ - వ్రాసిన పదం యొక్క వ్యాపించే సులభతరం చేసే విధంగా వ్యవస్థ రూపొందించినవారు తన వ్యవస్థ 1455th మొదటి పుస్తకం ముద్రించి అనుమతించే - బైబిల్ |..

చైనీస్ 6 వ శతాబ్దం కాపీ పాఠాలు మరియు కదిలే కోసం చెక్క పలకలను చెక్కారు ఉపయోగించారు ఉన్నప్పటికీ మెటల్ అక్షరాలు వాటిని ఖరీదైన మరియు అరుదైన చేసిన ఏ చేయి ద్వారా అధిక సమయాన్ని గుణించడం మధ్యకాలంలో 15 వ శతాబ్దం పుస్తకాలు, యూరోప్ లో మధ్య 13 వ శతాబ్దంలో కొరియా లో ముద్రణా అప్ చేశారు ఉపయోగిస్తారు. గుటెన్బర్గ్ యొక్క కల్పన పునర్జన్మ యూరోప్ లో విజ్ఞాన పేలుడు విస్తరణ ఎనేబుల్. ఉపయోగించే సాంకేతిక విప్లవం ముద్రణా వ్యాపార లో ప్రధాన మార్పులు. మీ అంతర్ దృష్టి గుటెన్బర్గ్ కదల్చటానికి ఉపయోగించే క్రింది తీసుకుని వచ్చారు, వరకు ఇటీవల ఉపయోగంలో అని. గుటెన్బర్గ్ ఒక విధానాన్ని లోహాలు నుండి మరియు ఈ అక్షరాల యొక్క వ్యక్తిగత అక్షరాలు అవ్ట్ పోయడం ప్రారంభించారు మరియు పేజీ ఒక మట్టి న పంక్తులు డ్రా గుటెన్బర్గ్ పుస్తకాలు ముందు ప్లేట్. అతను కాగితం ఒక షీట్ మీద print పత్రికా flat ప్లేట్ పొందింది ఒక చెక్క ప్రింటింగ్ ప్రెస్ నిర్మించాడు.


మానవీయంగా ట్రాన్స్క్రైబ్డ్ మరియు వర్ణించబడింది చేయబడ్డాయి. శతాబ్దాల చిత్రాలు పునరుత్పత్తి కోసం ప్రత్యేక పద్ధతులు ఉపయోగించారు. చెక్క మాతృక తీసుకోవడం ఇది వారు . వివిధ పాత్రలు చెక్కారు మాతృక తర్వాత, పెయింట్, కాగితం లో ముంచిన, మరియు న ఒత్తిడి, మీరు print గురించి పొందవచ్చు. ఇటువంటి వర్ణమాల యొక్క అక్షరాలతో ప్రయత్నించారు, కానీ అది ఈ విధానాన్ని చాలా క్లిష్టమైన అని బయటకు చెయ్యబడ్డాయి, కారణంగా చిన్న చెక్కడం మరియు కలప సులభంగా వక్రీకృతమై ఎందుకంటే. గుటెన్బర్గ్ కనిపెట్టిన యొక్క ప్రాముఖ్యతను అంటే ఏమిటి?


అతని వ్యవస్థ గతంలో కాపీ మరియు అందువలన చాలా కొద్ది కాపీలు అందుబాటులో ఉండేవి ఆ ఖండికలు కాపీ దోహదపడ్డాయి. సో వారు కేవలం కొన్ని చదివి కాలేదు విశేష. గుటెన్బర్గ్ తర్వాత, పుస్తకాల కాపీలు, గుటెన్బర్గ్ కల్పన తర్వాత శుద్ధి జరిగినది. ఇది ఒకే ఒక పుస్తకం ఒక మంచి రెండు వేల ముద్రిత కాపీలు ఉంది. తీవ్ర సర్క్యులేషన్ కోసం సమయం చేరుకున్నారు సరళీకృత యొక్క ఉదాహరణకు, అక్షరాలు టైప్. సమయం కంటే ప్రదర్శన అక్షరాలు అది దాని ప్రస్తుత రూపాన్ని వచ్చింది క్రొయేషియా మిస్సాల్ లో మొదటి ముద్రిత పుస్తకాలను Senj 1494th సంవత్సరంలో ముద్రించిన గత శతాబ్దం చివరలో, వర్ణమాల వివిధ అక్షరాలు వేరు మరియు కనెక్ట్ చేసే యంత్రాలు కనుగొన్నారు ఈ యంత్రాలు వరకు -... linotype, ఒక సాధారణ టైపురైటర్ యంత్రము ఉపయోగిస్తారు . వారు పదాలు సృష్టించడానికి మరియు వరుసలు వాటిని ఉంచండి, వీటిలో సృష్టించిన పేజీలను. గుటెన్బర్గ్ యొక్క రికార్డు వ్యక్తిగతంగా అచ్చు లో overflow, మరియు ప్రతి అక్షరం ఉంది. అచ్చు నుండి సేకరించే వారు, రికార్డు సులభంగా పాటు సాధించటం లేదా పదాలు, లైన్లు మరియు పేజీలు పోస్ట్ కాలేదు. మీరు కు మరియు ముద్రణ అంగీకరిస్తున్నారు, పేజీలు విరగొట్టాడు ఉంటాయి, అక్షరాలు కొత్త సైట్లు మరియు పుస్తకాల ముద్రణ మళ్లీ ఉపయోగించడానికి కంపార్ట్మెంట్లు లో ఉంచారు

ఎర్రకోట


“భూమ్మీద స్వర్గమంటూ ఉంటే అది ఇక్కడే అది ఇక్కడే అది ఇక్కడే!!!”
“If there is Heaven on the Earth,
It is this, It is this, It is this”
“అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్,
హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.”


అని అమీర్ ఖుస్రో పరవశించి పాడే నాటికి మొఘలులు భారతదేశంలోకి ఇంకా రాలేదు. ఎర్రకోట లాంటి బృహత్తర నిర్మాణమొకటి ఇక్కడ వెలుస్తుందని ఎవరూ ఊహించనైనా లేదు. ఐనా ఎర్రకోటలో షాజహాన్ ఆంతరంగిక సమాలోచనలు జరుపుతూ ఉండిన మందిరం దివాన్-ఇ-ఖాస్ గోడ మీద చెక్కబడి ఉన్న ఆ అమృతవాక్కులు ఆ కోట విశిష్టతను చాటడానికి సరిగ్గా సరిపోయాయి. ఎన్నో భవంతులుండగా ఎర్రకోటనే స్వర్గధామంగా భావించడానికి కారణం అది ఖురాన్ లో స్వర్గం గురించి ఉన్న వర్ణనకు అనుగుణంగా నిర్మించబడడమే!

800px-red_fort_delhi_by_alexfurr.jpg

ఖొరాన్ లో వర్ణించిన స్వర్గాన్ని తలపించే విధంగా అమృతవాహిని (నహర్-ఎ-బిహిష్ట్) తో సహా నిర్మించబడ్డ ఈ అద్భుతమైన కట్టడం World heritage site గా గుర్తింపు పొందడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టిందనేది ప్రశ్న. 

నిజానికి పదహైదేళ్ల కిందటే ఎర్రకోటను ఆ జాబితాలో చేర్చడానికి UNESCO వాళ్ళు పరిశీలించారు. ఐతే అప్పుడు అది సైన్యం ఆధీనంలో ఉండేది. అప్పుడే కాదు, అంతకు నూటయాభయేళ్ల కిందటి నుంచి 2003 వరకు అది సైన్యం ఆధీనంలోనే ఉంది. ఎర్రకోట ప్రాభవం మనకళ్ళముందే మసకబారిపోతూండడాన్ని గమనించిన UNESCO ‘ఇంత గొప్పదైనా ఈ కట్టడం ఒకపక్కనుంచీ నాశనమైపోతుంటే పట్టించుకునే నాథుడే లేడే’ అని దాన్ని అప్పుడే ప్రపంచవారసత్వసంపదగా ప్రకటించడానికి నిరాకరించింది.

800px-red_fort_28-05-2005.jpg

కోట లోపలా, వెలుపలా అడ్డదిడ్డంగా వెలసిన 250 పైగా ఆధునిక కట్టడాలు ఎర్రకోటను భ్రష్టుపట్టించాయి. అలాంటి కట్టడాల్లో స్వాతంత్ర్య పూర్వకాలానికి చెందినవీ, స్వాతంత్ర్యానంతరం సైన్యం నిర్మించినవీ కూడా ఉన్నాయి. దాంట్లో ఆవాసాలున్న సైనికాధికారుల నేమ్ ప్లేట్లు కోటగోడల మీద వదిలిన గుర్తులు కోట అందాన్ని దెబ్బతీశాయి. సైన్యం నుంచి ఆ కట్టడాన్ని స్వాధీనం చేసుకున్న పురాతత్వశాఖ కోట ఆవరణలో అడ్డదిడ్డంగా వెలసిన కట్టడాలను తొలగించి, కోటగోడలను శుభ్రం చేసే పనిలో ఉంది.

d-i-khas.JPG

“అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్,
హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.”

అన్న అమీర్ ఖుస్రో పలుకులు ఈ కోటలో పాలరాతితో నిర్మించబడిన దివాన్-ఇ-ఖాస్ అనే భవనంలోని గోడలమీద చెక్కించాడు షా జహాన్ పెద్ద కొడుకైన దారా షిఖో. ఈ భవనంలోనే చరిత్రప్రసిద్ధి గాంచిన నెమలిసింహాసనం మీద కూర్చుని కొలువుదీరేవాడు షా జహాన్. ప్రస్తుతం ఆ నెమలి సింహాసనమూ లేదు, ఆ కొలువుదీరడాలూ లేవు. విశాలమైన కొలువుకూటం మాత్రం జరిగిన దారుణానికి సాక్షీభూతంగా నిలిచి ఉంది. ఆ భవంతిలోని అపురూపమైన జాలీ లు కొన్ని ధ్వంసమై జాలిగొలుపుతున్నాయి.

732px-jama_masjid_is_the_largest_mosque_in_india_delhi_india.jpg

భారతదేశంలోని మసీదులన్నిట్లోకీ అతిపెద్దదైన జామామసీదు ఈ కోటకెదురుగానే ఉంది.
యునెస్కో ఒక కట్టడాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన తర్వాత కేవలం ఆ కట్టడమొక్కటే కాకుండా ఆ కట్టడం లోపల, వెలుపల ఉన్న ప్రాంతాల మెయింటెనెన్స్ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందువల్ల కోట ఆవరణలోని మీనాబజారులో ఉన్న దుకాణసముదాయాల్లో అమ్మే వస్తువుల నాణ్యత మీదే కాకుండా, ఏయే రకాల వస్తువులు అక్కడ అమ్మొచ్చో, మరేయే రకాలు అమ్మకూడదో కూడా పురాతత్వశాఖ నిర్దేశించనుంది.


800px-fuerte_rojo_delhi_2.JPG
 

ఆర్కిటెక్చరు:

తైమూరు, పర్షియన్, హిందూ భవననిర్మాణశైలులు ఈ కోటనిర్మాణంలో కనిపిస్తాయి. ఈ భవన నిర్మాణ శైలి, ఇందులోని తోటల ప్రణాళికల ప్రభావం ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్, తదితర ప్రాంతాల్లోని కట్టడాలు, తోటల మీద స్పష్టంగా కనిపిస్తుంది.

చరిత్రలో ఎర్రకోట: ఆధునిక భారతదేశ చరిత్రతో ఈ ఎర్రకోటకు విడదీయరాని అనుబంధముంది.

 

800px-fuerte_rojo_delhi_1.JPG

1857లో సిపాయిల తిరుగుబాటుగా ప్రారంభమైన అలజడి మహా సంగ్రామంగా రూపు దాల్చింది. తొలుత మీరట్ లో తిరుగుబాటు ప్రారంభం కాగానే అక్కడి సిపాయిలు ఆఘమేఘాల మీద ఢిల్లీకి వచ్చి ఈ ఎర్రకోటలోనే బహదూర్ షా-II ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించిందీ, ఆయన (నామమాత్రపు) నాయకత్వం కిందే సమరయోధులంతా ఒక్కటై నడిచిందీ. 

ఈ ఎర్రకోటలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ కు చెందిన ముగ్గురు వీరులు గురుభక్ష్ సింగ్ ధిల్లాన్, ప్రేమ్ కుమార్ సెహగల్, సయ్యద్ షానవాజ్ ఖాన్ లపై రాజద్రోహనేరం మోపి సైనిక విచారణ (కోర్ట్ మార్షల్) జరిపిందీ. స్వాతంత్ర్య పోరాటాన్ని క్లైమక్స్ కు చేర్చిన మహోద్విగ్న ఘట్టాలవి. కోట లోపల విచారణ జరుగుతుండగా వెలుపల నుంచి అశేషప్రజానీకం

“లాల్ ఖిలే సే ఆయీ ఆవాజ్,
సెహగల్, ధిల్లాన్, షానవాజ్,
తీనోంకీ హో ఉమర్ దరాజ్”


అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేసింది. ఈ నినాదాలే దేశమంతటా ప్రతిధ్వనించాయి. లా చదివినా అప్పటికి ఎన్నో యేళ్ళ కిందటే కోటు విప్పి కదనరంగంలోకి దూకిన హేమాహేమీలు -జవహర్లాల్ నెహ్రూ, అసఫ్ అలీ, భులాబాయ్ దేశాయ్, తేజ్ బహదూర్ సప్రూ, కైలాస్ నాథ్ కట్జు – మళ్ళీ లాయర్లుగా మారి ఈ యోధత్రయం తరపున వాదించింది ఇక్కడే. 

ఇక స్వాతంత్ర్యానంతర చరిత్ర అందరికీ తెలిసిందే! ప్రతీ ఆగస్టు పదహైదు నాడు ఎర్రకోట బురుజులమీద మువ్వన్నెల పతాకావిష్కరణ తర్వాత ప్రధాని ఇచ్చే ప్రసంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ఇక రిపబ్లిక్ దినోత్సవం రోజు ప్రపంచంలోనే అతి విశిష్టమైన రిపబ్లిక్ డే పెరేడ్ రాష్ట్రపతి భవన్ నుంచి మొదలై, ఇండియా గేటు, కనాట్ ప్లేసుల మీదుగా ఎర్రకోటకు చేరుతుంది. ఆ పెరేడ్ లో భాగంగా ఎర్రకోట ముందు విన్యాసాలు చెయ్యాలని ఉవ్విళ్ళూరని సైనికుడుండడు. ఏనుగుమీదెక్కి ఎర్రకోటకు వచ్చే అవకాశం తమకు దక్కినందుకు పులకించిపోయే సాహసబాలల ఉద్వేగానికి హద్దులుండవు. ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో తన విశిష్టతను అక్కడ ప్రదర్శించాలని పోటీ పడని రాష్ట్రముండదు. త్రివిధ దళాల పాటవప్రదర్శనకు అచ్చెరువొందని ప్రేక్షకులుండరు. 

రిపబ్లిక్ డే పెరేడ్ ఏడాదికొక్కసారే జరిగితే అదే ఎర్రకోటలో ప్రతిరోజూ జరిగే అద్భుతమొకటుంది. అదే సౌండ్ అండ్ లైట్ షో. ప్రేక్షకులకు తాము కాలనాళికలో ప్రవేశించామా అని భ్రాంతి కలిగేలా కాలాన్ని వెనక్కి తిప్పి చరిత్రలో కొన్ని వందల సంవత్సరాల కిందట షాజహాన్ మొదటిసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కోట నిర్మాణం గురించి ఆయన మదిలో మెదిలిన ఆలోచన మొదలుకుని స్వాతంత్ర్య సాధన వరకు ఎర్రకోటతో సంబంధమున్న చారిత్రిక ఘట్టాలను వివరించే ఆ షో చూడడమొక మరపురాని అనుభూతి.

red_fort_night.jpg

భగత్ సింగ్




భగత్ సింగ్ ఈ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. ఒక్కసారి ఆయన ధైర్యసాహసాలని గుర్తుచేసుకుందాం… 

    భగత్ సింగ్ స్వస్థలం లయాల్పూర్ జిల్లాలోని ఖాత్కర్ కళన్ గ్రామం.. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్.. భగత్ సింగ్ పుట్టిన సమయంలో, కిషన్ సింగ్ సోదరులందరూ, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వలన, వాళ్ళందరిని జైల్లో పేట్టారు.. ఐతే పిల్లాడు పుట్టీ పుట్టగానే, వాళ్ళందరినీ జైలు నుండి విడుదల చేస్తున్నారనే వార్త తెలిసింది.. తమ కుటుంబానికి అదృష్టం వచ్చింది అని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అని నామకరణం చేశారు...

కుటుంబంలో అందరూ, స్వాతంత్ర్య ఉద్యమంలో, చాలా చురుకుగా పాల్గొనే వాళ్ళు కావడంతో చిన్నప్పటినుండే, భగత్ సింగ్ మనసులో బ్రిటీష్ వాళ్ళంటే, వ్యతిరేక భావం కలిగింది.. ఒకసారి వాళ్ళ నాన్న, బాబాయి తో కలిసి, భగత్ సింగ్ అలా బయటకు వెళుతున్నాడు.. ఐతే కొంచెంసేపైన తరువాత భగత్ సింగ్ కనిపించకపోవడం తో, వెనక్కి తిరిగి చూస్తే, అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ, భగత్ సింగ్, నాన్న ఈ మొక్క నుండి తుపాకులు వస్తాయి, వాటితో ఆ బ్రిటీష్ వాళ్ళని పారద్రోలచ్చు అని ఆవేశంగా చెప్పాడు.. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు..
ఆయన 12యేళ్ళ వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది… ఆ సంఘటన ఆయన్ని చాలా ప్రభావితం చేసింది.. ఆ ప్రదేశానికి వెళ్ళి భూమిని ముద్దాడి, అక్కడ రక్తం తో తడిసిన మట్టిని ఇంటికి తీసుకు వచ్చారు.. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశ భక్తుడో చెప్పడానికి…

చిన్నతనంలో, యూరోప్ లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు.. వాటి వల్ల ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షించబడ్డారు.. ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది మార్కిసిస్ట్ ల్లో, ఆయన ఒకరు..
భగత్ సింగ్ లాహోరు లోని డి.ఎ.వి. కళాశాలలో చదువుతున్నప్పుడు, అప్పట్లో స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్ళు పరిచయమయ్యారు.. వాళ్ళలో ముఖ్యులు, “లాలాలజపతి రాయి”, “రాజ్ బిహారి బోస్”.. మహాత్మా గాంధీ గారు 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు.. దానికి ప్రతిగా, భగత్ సింగ్ అప్పటివరకు తను చదువుతున్న పాఠశాల మానేసి, లాహోరు లోని, నేషనల్ కాలేజీ లో చేరారు..
భగత్ సింగ్ కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది.. ఆయన ఎప్పటికైనా భారత దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తాడని నమ్ముతూ ఉండేవాడు.. అయితే 1922లో చౌరీ చోరా లొ జరిగిన సంఘటనల వలన, ఆయన సహాయ నిరాకరణొద్యమం ఆపేశారు.. దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్పృహుడయ్యరు.. అదే సమయంలో, పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో, ఆయన ప్రధమ బహుమతి సాధించారు.. అక్కడ పరిచయమయ్యారు భీమ్ సేన్ విద్యాలంకార్(సాహితి సమితి అధ్యక్షులు)..

కళాశాలలో చదువుతున్న సమయంలో, తెల్లవారికి వ్యతిరేకంగా పనిచేసే చాలా విప్లవకారుల సంస్థల్లో చేరారు.. అలాంటి సమయంలో, విద్యాలంకార్ దగ్గర నుండి పిలుపు వచ్చింది.. దాంతో, “హిందుస్థాన్ రెపబ్లికన్ అసోసియేషన్”లో సభ్యులుగా చేరారు.. భగత్ సింగ్ దాంట్లో చేరిన తరువాత దాని పేరు “హిందుస్థాన్ సోషలిస్ట్ రెపబ్లికన్ అసోసియేషన్” గా పేరు మార్చబడింది.. ఆ సంస్థ సభ్యులలో, ప్రముఖమైన వాళ్ళు, “చంద్రశేఖర ఆజాద్”, “యోగేంద్ర శుక్లా”.. ఈ సంస్థ ఏర్పాటుకి ముఖ్య కారణం రష్యాలోని “బోల్ష్ విక్ విప్లవం”..
సంస్థలో చేరిన దగ్గరి నుండి, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు చేశారు… దాంతో బ్రిటీష్ ప్రభుత్వం వాళ్ళందరినీ తీవ్రవాదులు గా ముద్రవేసింది..

అది ఫిబ్రవరి, 1928వ సంవత్సరం.. సైమన్ కమీషన్ భారతదేశంలో అడుగుపెట్టింది.. ఆ కమీషన్ ముఖ్యోద్దేశ్యం, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం… ఐతే ఆ కమిటీ లో ఒక్క భారతీయుడు కూడా లేడు.. అందుకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. కమిటీ లాహోరులో పర్యటిస్తున్నప్పుడు, లాలాలజపతి రాయ్ దానికి నిరసనగా, ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు..కానీ పోలీసులు అత్యుత్సాహంతో, దాంట్లో పాల్గొంటున్న వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేశారు.. ఆ దెబ్బలకి లాలలజపతి రాయ్ చనిపోయారు.. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షైన, భగత్ సింగ్, లజపతి రాయ్ ని చంపిన పోలిస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు.. తన స్నేహితులైన శివరామ రాజగురు, జై గోపాల్, సుఖదేవ్ థాపర్ తో కలిసి ప్రణాలిక రచించారు..వాళ్ళ పధకం ప్రకారం, జైగోపాల్ ఆ అధికారిని చూసి, భగత్ సింగ్ కి సైగ చేయాలి.. అయితే జైగోపాల్ తప్పిదం వల్ల, అసలు అధికారి బదులు, వేరే వాళ్ళని కాల్చేశాడు భగత్ సింగ్…
పోలీస్ అధికారిని చంపిన తరువాత, భగత్ సింగ్ మీద నిఘా ఎక్కువైంది.. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో, మారువేషంలో సంచరించ సాగాడు..

దేశమంతా ఎన్నో ఉద్యమాలు జరుగుతుండడంతో, వాటిని అణచి వేయడానికి, బ్రిటీష్ వారు, ఒక కొత్త చట్టం తీసుకు వచ్చారు.. దాని పేరే, “డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్”.. ఐతే ఈ చట్టం, అసెంబ్లీలో, ఒక వోటు తేడా తో వీగిపోయింది.. ఐతే దాన్ని ప్రత్యేక చట్టంగా తీసుకు వచ్చారు.. అందుకు ప్రతిగా, భగత్ సింగ్ వాళ్ళు అసెంబ్లీలో బాంబ్ పెట్టాలని అనుకున్నారు..

ఏప్రిల్ 8, 1929 న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ కలిసి, అసెంబ్లీలో పెద్దగా "ఇంక్విలాబ్ జిందాబాద్" అని నినాదాలు చేస్తూ బాంబ్ వేశారు.. ఐతే వాళ్ళకి దాన్ని తయారు చేయడంలో అనుభవం లేకపోవడం వలన, అంతే కాక, దాన్ని అక్కడ ఉన్న సభ్యులకి దూరం గా విసిరి వేయడం వలన, ఎవరికీ ఏమి అవలేదు..

బాంబ్ కేసులో, భగత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.. వాళ్ళు దీని మీద విచారణ జరుపుతున్న సమయంలోనే, పోలీసు అధికారిని చంపిన సంగతి కూడా బయటపడింది.. దాంతో, ఆయనతో పాటు ఆయన స్నేహితులైన రాజగురు, సుఖదేవ్ కి కూడా మరణశిక్ష పడింది..

కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. దానితో ఆయన పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. (అంతకుముందు వరకూ ఆయన కేవలం పంజాబ్ ప్రాంత వరకు మాత్రమే పరిమితమయ్యారు)

చివరికి మార్చ్23, 1931న రాజ గురు, సుఖదేవ్ తో సహా భగత్ సింగ్ ని ఉరి తీశారు…. అలా ఒక విప్లవకారుని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది..

మీకో విషయం తెలుసా?



ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు....
ఇంకో అద్బుతమైన విషయం తెలుసా? .....

మనం తల్లి గా భావించే ఈ గోవు తో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితో పాటు కొంత సమయం గడపటం వల్ల, మన శరీరం లో వున్న అనారోగ్యాన్ని , ఆ గోవు ముక్కు లో వున్న ఒక గ్రంధి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేత కు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డి ని తిని, అందుకు తగిన విధం గా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడం వల్ల మన వ్యాధి నయం అవుతుంది. ఇది మహా అద్భుతం. అందుకే ప్రతి ఒక ఇంట్లో ఒక గోవు వుంటే దైవం మన వెంటే వున్నట్లు మన పురాణాల లో చెప్పారు.
మన భారత దేశం లో జాతి ఆవులు 36 రకాలు, ప్రపంచం లో వింత వ్యాది సోకడం తో ఎన్నో జాతులు నశించిపోయాయి. కాని మన జాతి గోవు జాతు ల పై ఆ ప్రభావం పడలేదు. ఎండకు, వానకు, చలి కి అన్నిటికి తట్టుకొని జీవించింది. ఏ శాత్రవేత్తలకు అర్థం కానిది మన గోవు, వారు ఎన్ని జన్యు మార్పిడి లు చేసిన జాతి అయిన ఆన్ని వాతావరణాల కు తట్టుకోలేక పోతున్నాయి ఆ కృతిమ జాతులు. అందుకే ప్రపంచం లో ఎన్నో దేశాలు మన గోవు ను ఎగుమతి చేసుకొని వృద్ధి చేసుకొంటున్నారు.
ఇక గోమూత్రం లో 47 రకాల మూల పదార్థాలు వున్నాయి. మన పురాణాల లో చెప్పిన పంచాకవ్యం లో ని 64 సూత్రాల పైన జరిగిన పరిశోధన తో గోమూత్రం మరియు గోవు పేడ తో 300 రకాల మానవుల ఆరోగ్యానికి సంబంధించిన అవుషదాలు కనుగోన్నారు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 25 రకాల అవుషదాలు కూడా కనుగొన్నారు. ఈ అవుషదాలు ప్రకృతి సహజమైనవి, ఎంటువంటి రసాయనాలు అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చు.
అందుకే మాన భారతీయ సంస్కృతి ని గోసంస్కృతి అని కూడా అంటారు, గోవు యొక్క విశిష్టత ఎంతో అందుకే మన పూర్వికులు మన పురాణాల లో ఎప్పుడో చెప్పారు.

అందుకే మన గోవు ని మనం రక్షించుకొందాం, మన సంస్కృతి ని మనం రక్షించుకొందాం. ఆరోగ్యం మరియు ఆనందం మన సొంతం.

Sunday, 29 June 2014

వింత గ్రామాలూ మరియూ పట్టణాలు...

అమెరికాలోని ఈ గ్రామ జనాభా కేవలం ఒకరు మాత్రమే



మొనోవీ అనే ఈ గ్రామములో 1930 లో 150 మంది నివసించేవారు. మిగిలిన అన్ని గ్రామాలలాగానే ఈ గ్రామములోని యువత కూడా పెద్ద పెద్ద నగరలాకు వలస వెళ్లేరు. 2000 లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామములో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్ళు భార్యాభర్తలు.2004 భర్త చనిపోయిన తరువాత భార్య మాత్రమే మిగిలింది. ఆమే ఈ నగరానికి మేయర్. టాక్స్ కడుతూ ఆమె ఇంటికి దగ్గరున్న 4 వీధి దీపాలకూ మరియూ రోడ్దుకూ ప్రభుత్వం నుండి ఉపాధి తెచ్చుకుంటుందిట.

ఫిలిపైన్స్ లో ఉన్న స్టిట్లిస్ గ్రామం


ఫిలిపైన్స్ లోని సమలేస్ ద్వీపాలలో ఇది ఒకటి.ఇక్కడున్న ప్రజలను బడ్జోస్ అంటారు. వీరు ముస్లీం మైనారిటీకి చెందిన వారు.వీరిని సీ జిప్సీస్ అని పిలుస్తారు.

రష్యా లోని "చ్చెస్ సిటీ"


చెస్ ఆట మీద ఎక్కువ ఉత్సాహం చూపే రష్యా ప్రెశిడెంట్ కిర్సాన్ ఇల్యుంజినావ్ ఈ సెటిల్మెంట్ గ్రామాన్ని నిర్మించేరు.చక్కటి రోడ్లు, అద్భుతమైన ఒక చ్చెస్ ప్యాలస్ మరియూ ఖరీదైన ఇళ్లు కలిగిన ఈ గ్రామమంలో ఎవరూ నివసించరట.

భారతదేశం లోని కవలల గ్రామం


కేరళాలోని కోధిని అనే ఈ గ్రామం 250 మంది కవల పిల్లలు ఉన్నారట. ఇది ప్రపంచ సరాసరి సంఖ్య కంటే 6 రెట్లు ఎక్కువట. ఇప్పుడు అక్కడి కవలల సంఖ్య 350 కి పెరిగిందట. 3 తరాల క్రితం మొదలైన ఈ కవల పిల్లల పుట్టుక ఈ గ్రామంలో అప్పటి నుండి పెరుగుతోందట. దీనికి కారనమేమిటా నని పరిశోధనలు చేస్తున్నారు.

ఈజిప్ట్ లోని గార్బేజ్ సిటీ


మన్షియాట్ నజర్ అనే ఈ గ్రామము ను గార్బేజ్ సిటీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడున్న గ్రామ వాసులు చెత్త్ ఏరుకుని దానిని నగరాలలో ఉన్న రీసైకిల్ కంపనీలకు అమ్ముకుని బ్రతుకు గడుపుతారట. ఈ గ్రామం చుటూ ఆధునిక నగరాలు ఉన్నాయట.

చైనా లోని మరుగుజ్జుల గ్రామం


ఇక్కడ నివసిస్తున్న వారందరూ మరుగుజ్జులే. 1.5 మీటర్ల ఎత్తుకంటే ఎక్కువ ఎత్తు ఉండరు. వీరి ఇళ్లు కూడా వింతగా ఉంటాయి. వీరు పాడే సంగీతం, వాయించే వాద్యాలూ కూడా వితగా ఉంటాయట.

ఆస్ట్రేలియా లోని భీమి క్రింద ఉండే పట్టణం


ఇది స్పటికతో నిండిన ఎడారి ప్రదేశం.భూమి ఉపరితలం మీద ఉండే వేడి నుండి తప్పించుకోవటానికి ఇక్కడున్న ప్రజలు భూమి క్రింద ఇళ్లు కట్తుకుని నివసిస్తున్నారట. భూమి పైన ఇళ్లు కట్టుకోవడాని అయ్యే ఖర్చు, భూమిని త్రవ్వి అక్కడ కట్టుకునే ఇళ్ల ఖర్చు ఒకటిగానే ఉంటుందట. ప్రపంచ మొత్తానికీ స్పటిక ఇక్కడి నుండే సరఫరా అవుతుందట. తవ్వుకున్న ఇంటి మట్తిని అమ్ముకుని జీవిస్తారట.

ప్రపంచానికే అతి దూరం గా ఉండే గ్రామం


ఎడింబరో ఆఫ్ ది సెవెన్ సీస్ అని పిలువబడే ఈ గ్రామం ప్రపంచ భూభాగానికే చాలా దూరం లో ఉన్న ఒక చిన్న ద్వీపకల్పం.

Friday, 27 June 2014

మరాఠాయోధుడు ఛత్రపతి శివాజీ



శివాజీ తండ్రి షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా పనిచేస్తూ మొఘల్‌ రాజులకు వ్యతిరేకంగా అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. షాజహాన్‌ దండయాత్ర చేసిన సమయంలో కీలకపాత్ర పోషించాడు. తన సహచరుడిని నిజాంషాహీ ప్రభువు హత్యచేయించడంతో తిరుగుబాటు బావుటాను ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్య స్థాపనకు నాంది పలికాడు. రాజ్య విస్తరణ కోసం చేసిన యుద్దాలలో పరాజయాన్ని చవిచూశాడు. తండ్రి వద్ద యుద్ధవిద్యలు, రాజనీతి మెలుకువలు నేర్చుకున్న శివాజీ తండ్రి పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనేక నూతన యుద్ధతంత్రాలను రూపొందించాడు. 

సకలవిద్యలను అవపోసన పట్టిన ఆయన మరాఠాసామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలను రచించాడు. 17 సంవత్సరాల వయస్సులోనే సూల్తానులలో యుద్ధాలకు తలపడిన శివాజీ బిజాపూర్‌ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. యుద్ధ భయంకరుడుగా పేరుపొందిన అఫ్జల్‌ఖాన్‌ శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకుని ఆయనను రెచ్చకొట్టేలా శివాజీకి ఇష్టదైవమైన భావానీదేవి ఆలయాన్ని కూల్చివేశాడు. అఫ్జల్‌ కుట్రలు తెలుసుకున్న శివాజీ ప్రతాప్‌ఘడ్‌ కోట లోసమావేశానికి అంగీకరిస్తాడు, ముందు జాగ్రత్తగా ఉక్కుకవచాన్ని ధరించి పిడిబాకును దాచుకుని చర్చలకు సిద్ధమవుతాడు. 

శివాజీ ని అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అఫ్జల్‌ కత్తితో శివాజీపై దాడి చేస్తాడు, ఉక్కుకవచం కారణంగా రక్షించబడిన శివాజీ వెంటనే పిడిబాకులో దాడిచేస్తాడు, సైనికాధికారి చేతిలో అఫ్జల్‌ ఖాన్‌ మరణించగా మెరుపుదాడుల్లో సైనాన్ని మట్టికరిపిస్తాడు. ప్రతాప్‌ ఘడ్‌ యుద్ధంతో శివాజీ కీర్తిప్రతిష్టలు భారతదేశమంతటా వ్యాపిస్తాయి. ఎందరో హిందూ రాజులు ఆయన కు సంఘీభావం తెలియజేస్తారు. అఫ్జల్‌ఖాన్‌ మరణాన్ని సహించలేని బిజాపూర్‌ సుల్తాన్‌ పదివేలమంది అతిబలవంతులైన సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపిస్తాడు. ఐదు వేలమంది మరాఠాయోధులతో హరహరమహా దేవ అంటూ విజృంభించిన శివాజీ వారిని ఊచకోతకోశాడు. 

 శివాజీ పరాక్రమాలను తెలుసు కున్న మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ముందుజాగ్రత్తగా అపారమైన సైనికశక్తిని, సిద్ది జోహార్‌ అనే సైనికాధ్యక్షుడిని కొల్హాపూర్‌లో మొహ రిస్తాడు. సమీపంలోని పన్‌హాలా కోటలో వందలమంది అనుచరులతో ఉన్న శివాజీ విషయం తెలుసుకుని కోటనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ యుద్ధంలో అతిఎక్కువమంది సైనికులను కోల్పోయిన శివాజీ సంధికి అంగీకరిస్తాడు. ఈ సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్య్ర రాజ్యంగా గుర్తింపు, సిద్ది జోహార్‌ విజయానికి బహుమతిగా పన్‌హాలా కోట దక్కింది. సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరు పోరు పవన్‌ ఖండ్‌ యుద్ధం.

శివాజీతో యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఔరంగజేబు తన మేనమామ షాయిస్తాఖాన్‌ వెంట లక్షకు పైగా సైన్యాన్ని, ఆయుధాలను ఇచ్చి దక్కన్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తాడు. అయితే మొగల్‌సేనల ముందు మరాఠి సేనలు నిలువలేక పోతారు. ఓటమిని అంగీకరించిన శివాజీ పూణే వదిలి వెళ్లిపోతాడు. శివాజీ నిర్మించిన లాలామహల్‌ లో షాయిస్తాఖాన్‌ నివాసం ఏర్పాటుచేసుకుని, శివాజీ దాడి నుంచి ముందస్తుజాగ్రత్తగా పూణే నగరమంతా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసుకుంటాడు. మారువేషంలో వచ్చిన శివాజీ షాయిస్తాఖాన్‌ గదిలోకి చేరి కత్తితో దాడి చేస్తాడు. గాయపడిన ఖాన్‌ సైనికుల సహాయంలో ప్రాణాలు దక్కించుని ఔరంగజేబు వద్దకు చేరుతాడు. తిరిగి తన కోటను స్వాధీనం చేసుకున్న శివాజీ సూరత్‌ నగరం పై దాడి చేసి అపారమైన ధనాన్ని, ఆయుధాలను దోచుకుని తన సైన్యాన్ని బలోపేతం చేసుకుని
క్రమంగా మొఘలుల, బీజాపూర్‌ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటాడు. 

మొఘల్‌ సర్దార్‌గా ఉండడానికి అంగీకరించి 23కోటలను, నాలుగు లక్షల రూపాయలను చెల్లిస్తాడు. ఔరంగజేబు తన పుట్టినరోజు సందర్భంగా శివాజీని , అతని ఆరేళ్ల కొడుకు శంభాజీని ఆహ్వానించి నిండుసభలో అవమానపరుస్తాడు. మరాఠీల తిరుగుబాటుకు బయపడి శివాజీని హతమర్చకుండా అతిధిగృహంలోనే బందీచేస్తాడు. చాకచాక్యంతో అక్కడినుంచి తప్పించున్న శివాజీ రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ 1674 నాటికీ లక్షమంది సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలను, అశ్వాలను, గుఢాచారి వ్యవస్థను, నౌకావ్యవస్థను ఏర్పాటుచేసుకుంటాడు. శ్రీశైలం వచ్చి అక్కడ భవానీదేవిని ధ్యానిస్తాడు. ఆయన భక్తికి మెచ్చిన దేవి ప్రత్యేక్షమై ఖడ్గాన్ని ప్రసాదిస్తుంది.(ఇప్పటికీ ఆ ఖడ్గం మ్యూజియంలో ఉంది.) మరాఠ సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న ఆకాంక్ష, దేవి ఆశీస్సులు ఉన్న ఖడ్గంతో శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నాడు. కొండ కోట ను స్వాధీనం చేసుకోవడానికి అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీని పురమాయిస్తాడు శివాజీ. కోట నిర్మాణాన్ని క్షుణ్ణంగా
పరిశిలించిన తానాజీ యశ్వంతి అనే ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరి, ఆ తాడు హాయంతో కోట లోకి ప్రవేశించి కోటను స్వాధీనం చేసుకుంటాడు. అయితే ఈ పోరులో తానాజీ మరణిస్తాడు. కోటను గెలిచాం కాని సింహాన్ని కోల్పోయామని ఆవేదన చెందిన శివాజీ ఆ కోటను సింహఘడ్‌ గా మార్చాడు.

మరాఠాసామ్రాజ్యాన్ని వ్యాపించచేసిన శివాజీకి రాయఘడ్‌ కోటలో వేదపఠనాల మధ్య క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి బిరుదును ప్రదానం చేస్తారు. ఎన్నో కోటలపై దండయాత్రలు చేసిన శివాజీ ఏ మతానికి చెందిన పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. మొగలులకు, సుల్తాన్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన కొలువులో అనేకమంది ముస్లీంలు ఉండేవారు. సైన్యంలో మూడొంతులు ముస్లింలే. శివాజీకి సర్వసైన్యాధ్యక్షులుగా
దౌలత్‌ఖాన్‌, సిద్ధిక, నావికాదళానికి ఇబ్రహీం ఖాన్‌, మందుగుండు విభాగానికి అధ్యక్షుడుగా సిద్ది ఇబ్రహీం బాధ్యతలు నిర్వహించేవారు. పరస్త్రీలను మాతృ సమానురాలుగా చూసిన గొప్ప వ్యక్తి శివాజి. గెరిల్లా విధానంలో పోరాటం, కొత్త ఆయుధాలను కనుగొవడం శివాజీ అవలంభించిన యుద్ధవైెపుణఅయాలే. 27 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అనేక యుద్ధాలు చేస్తూ మూడువందల కోటలను తన ఆధీనంలో ఉంచుకుని, లక్షమంది సైన్యాన్ని తయారు చేసిన శివాజీ కొండలపై సాంకేతిక విలువలతో శత్రుదుర్బేధ్యమైన కోటలను నిర్మించడంలో ప్రపంచఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. నాసిక నుంచి మద్రాసు వరకు 1200 కిలోమీటర్ల మధ్య 300 కోటలు నిర్మించాడు. 

తన సామ్రాజ్యంలో అన్ని మతాల వారిని సమానంగా చూసిన ఆయన అనేక దేవాలయాలతో పాటు మసీదులను కూడా నిర్మించాడు. మతసామరస్యానికి ప్రతీకగా సాగిన శివాజీ పరిపాలన ను ఉదాహరించవచ్చు. ఏప్రిల్‌ 3, 1680న శివాజీ మరణం తరువాత ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాపాలన బాధ్యతలు చేపట్టి తండ్రికి తగ్గ తనయుడిగా మొగల్‌లను ఎదుర్కొన్నారు. జనరంజకంగా పరిపాలన సాగించాడు.

లెనిన్ మెదడులో ఏముంది?



సోవియెట్ అధినేత, ప్రపంచ కమ్యూనిస్టు అగ్రనాయకుడు లెనిన్ 1924లో చనిపోయాడు. ఆయన శరీరాన్ని కొన్నాళ్ళపాటు తయలంతో నిక్షిప్తం చేసి ప్రదర్శనకు పెట్టారు. అదొక కమ్యూనిస్టు యాత్రా స్థలంగా మారింది. ఆయన తర్వాత కమ్యూనిస్టు నాయకుడైన స్టాలిన్ కొన్నాళ్ళతర్వాత లెనిన్ మెదడులో కొంత భాగాన్ని శాస్త్రీయ పరిశోధనకు గురిచేశారు. జర్మనీలో ఉన్న నరాల సంబంధ సైన్ టిస్టు ఆస్కార్ ఓట్ (Oskar vogt) ద్వారా పరిశీలింపజేశారు. అతడి సహాయంగా మాస్కో నుండి ఇద్దరు వైద్యులను పంపారు. 

లెనిన్ మెదడు అధ్యయన నిమిత్తం నిధులను సమకూర్చారు. మెదడు పరిశీలనా సంస్థను పెట్టారు. అయితే ఆ సంస్థ అధ్యక్షుడిగా ఆస్కార్ ఓట్ ను తటపటాయిస్తూనే నియమించారు. మెదడు పరిశీలన అనంతరం నిజం చెప్పేస్తే కమ్యూనిస్టులకు చిక్కు వస్తుందేమోనని భయపడ్డారు. లెనిన్ మెదడును పోలిన మరొక వ్యక్తి మెదడును పరిశీలించినప్పుడు మానసికంగా కుంచించుకు పోయిన ధోరణి వ్యక్తమయిందని జర్మనీలో నిపుణులు అప్పటికే వెళ్ళడించారు. అలాంటిదే లెనిన్ గురించిది కూడా చెబితే చిక్కు వస్తుందనుకున్నారు. ఈ లోగా జర్మన్ సైన్ టిస్ట్ ఆస్కార్ ఓట్ పదవిని కోల్పోయాడు. హిట్లర్ రాజ్యంలో అతడికి అనుకూలత లభించలేదు. ఆ తర్వాత మెదడు పరిశీలనా సంస్థకు రష్యా సైంటిస్టును పెట్టి లెనిన్ మెదడును పరిశీలించమన్నారు. 

కమ్యూనిస్టు పార్టీ ప్రకటన ప్రకారం లెనిన్ చివరిలో జబ్బు పడినా మెదడు మాత్రం బాగా పనిచేసిందని నివేధిక సమర్పించారు. కానీ పూర్తి నివేదికను శాస్త్రీయంగా పరిశీలించి భయటపెట్టలేదు. పురావస్తు శాఖలో నేరాల విభాగంలో ఆ నివేధికను దాచిపెట్టారు. అలా ఎందుకు చేశారో ఇప్పటికీ తెలియదు. లెనిన్ చేసిన నేరాలు దృష్టిలో పెట్టుకుని అలా చేసిఉండవచ్చునేమో అనుకున్నారు. మొత్తం మీద ఈ విషయాలన్నీ ఇటీవల పరిశోధన చేసి 2008లో 164 పేజీల గ్రంథాన్ని అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో హూవర్ సంస్థ ప్రచురించింది. దీని పేరు లెనిన్స్ బ్రెయిన్. 

ఆయుధం పట్టని యోధుడు ... మార్టిన్‌ లూథర్‌ కింగ్‌



నల్లజాతీయలపై తెల్లదొరల పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, అహింసాయుత మార్గంలో పోరాటం చేసిన మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిమార్టిన్‌ లూథర్‌ కింగ్‌. 

అట్లాంటా లో 1929, జనవరి 15న జన్మించిన ఆయన అసలు పేరు మిచేల్‌ లూథర్‌ కింగ్‌. తండ్రి లూధర్‌ కింగ్‌ సీనియర్‌, తల్లి ఆల్బెర్టా విలియమ్స్‌ కింగ్‌, ఆయన తాత, తండ్రి అట్లాంటాలోని బెనేజర్‌ బాప్టిస్ట్‌ చర్చిలో పాస్టర్లుగా పనిచేశారు. చిన్నతనం నుంచి చదువులో చాలాచురుకుగా ఉండే మార్టిన్‌ హైస్కూల్‌ పూర్తి చేయకుండానే నేరుగా 1948లో సామాజిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. బోస్టన్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ పూర్తి చేసిన తరువాత కోరెట్టాస్కాట్‌ ను వివాహం చేసుకున్నాడు. 

 భారతదేశంలో తెల్లదొరలకు వ్యతిరేకంగా జరిగిన అహింసాయుత ఉద్యమం, సహాయనిరాకరణ, శాసనోల్లంఘన ఉద్యమాలు ఆయనను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆఫ్రికన్‌లపై అమెరికన్ల వివక్షను ఆయన సహించలేకపోయాడు. అమెరికన్లు పరిశ్రమల్లో ఆఫ్రికన్లతో కలిసిభోజనం చేసేవారుకాదు, బస్సులో ప్రయాణించేవారుకాదు. ఆఫ్రికన్‌ ,అమెరికన్‌ పౌరహక్కుల ఉద్యమం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 1955వ సంవత్సరంలో మౌంట్‌ గోరీ బస్సు నిరసనకు ప్రాతినిధ్యం వహించాడు. వర్ణవివక్షకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమం నల్ల జాతీయులకు ఓటు హక్కు కల్పించాలన్న డిమాండ్‌తో మరింత బలపడి రాజకీయ ఉద్యమంగా మారింది. అతి తక్కువకాలంలోనే అమెరికాలోని నల్లజాతీయు లందరికీ అనధికారిక ప్రతినిధిగా మార్టిన్‌ గుర్తింపు సాధించాడు.

పేదరిక నిర్మూలన కోసం పోరాటం సాగించిన ఆయన వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పాడు. మంచివక్తగా పేరుగాంచిన ఆయన హింసా విధానాలను మతపరమైన దృష్టితో విమర్శించాడు. సదరన్‌ క్రిస్టియన్‌ లీడర్‌ షిప్‌ కాన్ఫరెన్స్‌ సంస్థ (ఎస్‌సిఎల్‌సి)ను స్థాపించడానికి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఎంతగానో శ్రమించారు. 1957వ సంవత్సరంలో ఎస్‌సిఎల్‌సిని ప్రారంభించాడు. ఈసంస్థకు మొదటి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. 

1963లో బర్మింగ్‌ హాంలోసాగించిన పోరాటం మానవహక్కుల ఉద్యమంలో మైలురాయి వంటిది. ఈఉద్యమంలో లక్షలాదిమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యమయ్యారు. ఇది చూసి సహించలేని ప్రభుత్వం జరిపిన దమనకాండలో రెండువేల ఐదువందలమంది బలి అయ్యారు. మార్టిన్‌ కు ప్రభుత్వం జైలుశిక్ష విధించింది. నల్ల జాతి ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న మరోసంస్థ సహాయంతో పోరాటాన్ని ఉధృతం చేశాడు.

ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కెన్నడీ ప్రభుత్వం సామదాన భేద దండోపాయాలను ప్రయోగించింది.
నల్లజాతి ప్రజలకు కొన్ని హక్కులు ఇస్తూ చట్టాలు చేసింది. అయితే సొంత పార్టీ నుంచి వచ్చిన వ్యతిరేకతను గమనించి మానవహక్కుల ఉద్యమ డిమాండ్లను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు కెన్నడీ. ప్రభుత్వాలను అర్థించడం ద్వారా సామాజిక న్యాయం సాధ్యం కాదని గ్రహించిన మార్టిన్‌ తనపోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. 1965లో ప్రారంభమైన వియత్నాం యుద్ధం మార్టిన్‌కు, కెన్నడీప్రభుత్వానికి మధ్య పోరాటాన్ని మరింత పెంచింది. 

 మానవహక్కులకే ఉద్యమాన్ని పరిమితం చేయాలని, రాజకీయలో జోక్యంవద్దని కెన్నడీ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. తన ఆశయాలకు ప్రభుత్వ విధానాలకూ పొంతన లేకపోవడంతో మోసపూరిత రాజకీయాలతో నిరాశచెందిన మార్టిన్‌, హక్కుల పోరాటపరిధి నుంచి బయటకువచ్చే ప్రయత్నంచేశాడు. పేదరికానికి వ్యతిరేకంగా పోరాటంచేస్తూ1967లో టీంస్టెర్స్‌లో గొర్రెలకాపరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 'దేశంలో పేదలు నల్లజాతి వారేకాదు. తెల్లజాతివారు రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. పేదరికంపై పోరాటం వర్ణ వివక్షకు సంబంధించిన పోరాటం కాదు, ఆర్థిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమం' అన్నాడు. 1968లో ఆయన పేద ప్రజల ఉద్యమాన్ని ప్రారంభించాడు. చలో వాషింగ్టన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నల్లజాతి, తెల్లజాతి పేదప్రజలను సంఘటితం చేశాడు. 1968 ఏప్రిల్‌ 4న పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా దారుణంగా హత్యకు గురయ్యాడు.

'దోపిడి దారులు దయతో హక్కులు ఇవ్వరు. దోపిడికి గురయ్యే వారే పోరాడి సాధించుకోవాలి' అన్న మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ మాటలు నాటికీ...నేటికీ...ఏ నాటికి చిరస్మరణీయాలు...!

లెహ్ రాజభవనం: హిమాలయాలలో వదిలేసిన కోట.....


17 వ శతాబ్ధములో లడక్ ప్రదేశ రాజు సెన్ గే నం గయాల్ అనే రాజు ఈ రాజభవనం ను కట్టించేడు. హిమాలయాలలోని లేహ్ నగరంపై ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు భారతదేశ రాష్ట్రమైన జమ్మూ అండ్ కాష్మీర్ గా మారింది. 1834 లో వంశపారంపర్య పరిపాలనా విధానాన్ని అక్కడి ప్రజలు తిప్పికొట్టినప్పుడు ఈ రాజభవనం ను వదిలి వెళ్ళిపోయేరు. అయినా ఇది ఇప్పటికీ గంబీరంగా కనబడుతూ భారత దేశంలో లిటిల్ టిబెట్ గా పేరుపొందింది.

ద్రౌపది ప్రతిజ్ఞ: ఆమె ఎపుడూ జుట్టు ముడి వేసుకోదు ఎందుకు?



మహాభారతం ఎన్నో రహస్యాలు కలిగిన పౌరాణిక గ్రంధం. ఈ పురాణంలో మీరు ఒకేచోట ప్రేమ, గౌరవం, ధైర్యం, తెలివి, భక్తీ, నీతి కధలను చూస్తారు. మరోవైపు మీరు ద్రోహం, అవినీతి, రంకుతనం, అన్యాయాన్ని కూడా చూస్తారు.

మహాభారత కధ పాండవులు, కౌరవుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది: ఈ పురాణం మహాభారత యుద్ధంలో చోటుచేసుకున్న వివిధ సంఘటనల గురించి వివరిస్తుంది. ఈ సాహసోపేతమైన కధలు ఈ యుద్ధంలో పాల్గొన్న పురుషులందరూ తట్టుకుని నిలబడ్డారా లేదా అనేదాన్ని వివరిస్తుంది. కానీ ఈ కధలో ఒక విధ్వంసం కోసం యుద్ధాన్ని తీసుకు వచ్చిన బాధ్యత గల ఒక స్త్రీ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. అవును, మనం ద్రౌపది గురించే మాట్లాడుతున్నాం.

మహాభారతంలో ద్రౌపదిది చాలా కీలకమైన పాత్ర. ఆమె పాంచాల రాజ్యానికి రాణి, పాండవుల భార్య, ఆమె తన భర్తల పట్ల ఎంతో భక్తి, గొప్ప వివేకం గల స్త్రీ. మహాభారత యుద్ధానికి కారణం ఈమేనని అపార్ధం చేసుకున్నారు, నమ్మారు. అదంతా నిజం కాదు, అయితే కౌరవులను నాశనం చేయడానికి తీసుకున్న ఈ నిర్ణయంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

ద్రౌపది గురించి అంతా ఆశక్తి కరంగా ఉంటుంది. ఆమె అబ్బురపరిచే అందం, ఆమె అహంకారం, ఆమె భక్తీ, ఆమె ప్రేమ, ఆమె అవమానం, ఆమె ప్రతిజ్ఞ అన్నీ ఆశ్చర్యకరంగా ఉంటాయి. అందువల్ల, కౌరవ రాజులను నాశనం చేసిన ద్రౌపది ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం.

పేరుగాంచని పాచికలాట


కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన ఈ ప్రసిద్ధ పాచికలాట అందరికీ తెలిసే ఉంటుంది. ఇది తెలియని వారికోసం, కౌరవులు పాచికలు ఆడడానికి పాండవులను హస్తినాపురానికి ఆహ్వానిస్తారు. ధర్మరాజుకు కూడా ఈ ఆట ఇష్టం కాబట్టి ఆహ్వానాన్ని మన్నించాడు. అయితే, కౌరవుల మోసంతో ధర్మరాజు అన్నీ కోల్పోయాడు. పందెంలో అతని అన్నతమ్ములను, చివరికి తనకు తానె ఆముడుపోయాడు. అతను చివరికి కౌరవులకు బానిసగా అమ్ముడుపోయాడు. అతను తానూ కోల్పోయిన ప్రతిదీ గెలుచుకోవడానికి తన భార్యను పందెంగా పెట్టాడు. కానీ ఆమెను కూడా కోల్పోయాడు.

ద్రౌపది వస్త్రాపహరణం


ధర్మరాజు ద్రౌపది ని ఓడిపోయిన తరువాత జరిగిన సంఘటన, మొత్తం మనవ జాతికే అవమానకర విషయం. దుర్యోధనుడు స్త్రీల అంతఃపురం నుంచి ద్రౌపది ని లాక్కుని వచ్చి, ఈ కొలువులో అందరిముందు ఆమెను వివస్త్రను చేయమని దుశ్శాసనుడిని ఆదేశించాడు. దుశ్శాసనుడు అతని ఆజ్ఞ ప్రకారం ద్రౌపదిని జుట్టుపట్టుకుని లాక్కొచ్చాడు. ఆమె తన అన్నాను అవమానించిందని, కొలువుకు చేరేవరకు జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళాడు. ద్రౌపది అక్కడ ఉన్న తన కుటుంబ సభ్యులందరి సహాయం కోరింది, కానీ ఎవరూ ఆమె అపాయాన్ని తప్పించడానికి ముందుకు రాలేదు. ఆమె భర్తలు సిగ్గుతో తలలు వంచుకుని ఉన్నారు. తరువాత దుశ్శాసనుడు వదినను వివస్త్రను చేయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ద్రౌపది అపాయం గ్రహించిన కృష్ణుని వల్ల అతని పాచిక పారలేదు.

అందువల్ల, తనకు జరిగిన అవమానం ఎప్పుడూ పాండవులకు గుర్తుండేట్లు, ఈ అవమానకర సంఘటన జరిగిన తరువాత ద్రౌపది తన జుట్టును ముడివేయలేదు. తరువాత భీముడు దుశ్శాసనుడిని చంపి అతని రక్తాన్ని ద్రౌపది కోసం తీసుకువచ్చాడు. అప్పుడు ఆమె ఆ రక్తంతో తన జుట్టును కడుగుకొని ఆ తరువాత జుట్టు ముడి వేసుకుంది.

Thursday, 26 June 2014

చప్పట్లుకొడితే చల్లని నీళ్లు...



chinnaiahచుట్టూ దట్టమైన అడవి... దారి పొడవునా ఎత్తైన గుట్టలు... అన్ని సమయాల్లో నీళ్లూరే బుగ్గ.. చప్పట్లు కొడితే చాలు చల్లని నీరందించే మంచుకొండలు.... భీముడి పాదముద్రలు.. దండకారణ్యంలో ఆహ్లాదంతో పాటు భక్తినీ పంచుతున్న చిన్నయ్య, పెద్దయ్య దేవుని గుట్టల విశేషాలు ఇవి....
ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతంలో ఉన్న చిన్నయ్య, పెద్దయ్య గుట్టలు గిరిజనులకు ఆరాధ్యదైవాలుగా నిలుస్తున్నాయి.


దండేపల్లి మండలంలో ఉన్న పెద్దయ్యదేవుని గుట్ట, లక్సెట్టిపేట మండలంలో ఉన్న చిన్నయ్య గుట్ట ఇక్కడి ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆధ్మాత్మికంగా భక్తుల కోర్కెలూ తీరుస్తున్నది. పెద్దయ్యదేవుని గుట్ట దండేపల్లి మండల కేంద్రం నుంచి దాదాపు పదికిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఉంటుంది. గుట్ట చూడటానికి ఒక నిటారు స్తంభం లాగా ఉంటుంది. ఎత్తు సుమారు వేయి అడుగులు. గుట్టచుట్టూ అంతే ఎత్తయిన కొండల వరుసలు వలయాకారంగా ఉండటంతో అవన్ని దాటుకుని వెళ్లే వరకు పెద్దయ్య గుట్ట మనకు కనిపించదు.

చిన్నయ్య మంచుకొండలు.. జలపాతం...


chinnaiah 
 
కుంతీదేవి సంతానం కోసం శంకరుడి వద్ద మొరపెట్టుకుంది. తనకు సంతానం ప్రసాదించమని ఆయనను వేడుకోవడంతో ఆయన ఆమెను పరీక్షించాలనుకుని కప్పలు, చేపలు ముట్టని నీళ్లు, కుమ్మరి చేయని కుండలో, దూసవారి వడ్ల(విత్తనాలు చల్లకున్నా అవే రాలి.. అవే మొలిచే సువాసన గల ఉత్తమ వడ్ల)తో నాకు నైవేద్యం పెట్టాలని కోరాడు. దీంతో కుంతీదేవి తన ఛాతిపై మట్టి కుండను చేసి చేపలు, కప్పలు ముట్టని నీళ్ల కోసం తిరిగి అవి ఎక్కడా కనపడకపోవడంతో అలిసిపోయి సొమ్మసిల్లిపోయింది. ఆమె సత్యనిష్ఠకు మెచ్చిన శంకరుడు ఆ కొండలపై నుంచి నీళ్లను కురిపించాడు. అప్పుడు ఆ నీటితో, కుమ్మరి చేయని కుండలో నైవేద్యం వండి శంకరుడికి పెడుతుంది ఆ తల్లి. శంకరుడు ఆమెకు ఐదుగురు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. వారే పాండవులు. అందులో పెద్దవాడైన ధర్మరాజు పెద్దయ్యగా, భీముడు చిన్నయ్యగా ఇక్కడ వెలుస్తారని స్థానికులు చెబుతుంటారు. ఆనాటి నుంచి చిన్నయ్య దేవుని సమీపంలో ఉన్న కొండలను మంచుకొండలని పిలుస్తున్నారు.
ఇక్కడి మహిమలు ఎన్నో...

చిన్నయ్య దేవుని దగ్గర్నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మంచుకొండలు ఉంటాయి. ఆ కొండల వద్దకు వెళ్లిన భక్తులు చప్పట్లు కొడుతూ అలజడి చేస్తే పై నుంచి నీళ్లు పడతాయి. ఇవి చల్లగా ఎంతో తియ్యగా ఉంటాయి. ఎంత ఎక్కువ మంది చప్పట్లు కొడితే అంత దొడ్డుధారతో నీళ్లుపడతాయన్నమాట. ఈ నీటిని చిన్నయ్య దేవుడి వద్ద ఉంటే పసుపు, కుంకుమలతో కలిపి చల్లితే పంటలకు చీడపీడ ఉండదని స్థానికుల విశ్వాసం.

చాలా మంది అలాగే చేస్తారు కూడా. అదేవిధంగా చిన్నయ్య గుహలకు అత్యంత సమీపంలో మండు వేసవిలో కూడా భూమిలో నుంచి నిరంతర సహజ నీటి బుగ్గ ఉబికి వస్తుంటుంది భయంకర కరువు కాలంలో సైతం ఈ నీటి బుగ్గ ఎండిపోలేదని స్థానిక గిరిజనులు చెబుతుంటారు. ఈ దేవుడి దగ్గరుండే అల్లుబండకు కూడా ఎంతో ప్రాశస్థ్యం ఉంది. మనసులో కోరికలు కోరుకుని ఈ అల్లుబండను ఎత్తితే అది తేలికగా వస్తే అనుకున్నది కాదని, అది కదలకుండా అలాగే ఉండిపోతే పని సులువుగా అయిపోతుందని చెబుతుంటారు. ఇక్కడ మొలిచే ఒక తీగజాతికి చెందిన మొక్కతో తీసే మందు ఎంతటి తలనొప్పినైనా తీవ్రమైన పార్శ్యపు నొప్పినైనా నివారిస్తుంది. ఆ తీగను గుర్తించడం స్థానిక గోండులు, నాయక్‌పోడ్ తెగకు చెందిన వారికి మాత్రమే తెలుసు.

ఏ ధాన్యం పండించాలో చెప్పే పూజారి...

పెద్దయ్య దేవుడి దగ్గరుండే పూజారి స్థానికులకు ఏ ధాన్యం పండించాలో చెబుతాడు. ఆయన చెప్పిన పంటనే ఇక్కడి ప్రజలు వేసుకుంటారు. మొదట పూజారి పెద్దయ్య దేవుడికి దండం పెట్టుకుని పూనకంతో నిట్టనిలువుగా ఉన్న పెద్దయ్యగుట్టను అవలీలగా ఎక్కుతాడు. దాదాపు వెయ్యి అడుగుల ఎత్తున్న ఈ గుట్టను కేవలం పది నిమిషాల్లో ఎక్కుతాడు. అది కూడా మనకు రెండు మూడు చోట్ల మాత్రమే కనిపిస్తాడు.

ఇతరులు ఎవరూ ఈ గుట్టను ఎక్కలేరు. గుట్టపై నుంచి పూజారి పసుపు, కుంకుమలు, సీజన్‌లో పండే పంట గొలుకలను తీసుకువస్తాడు. గుట్టదిగి ఇల్లారి(దేవుని గుడి)కి వచ్చాక రైతులకు ఆ సీజన్‌లో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో చెప్తాడు. వర్షాల స్థితిగతులు, ఏ పంటలకు ఏ వ్యాధులు ఎక్కువగా సోకుతాయో కూడా జోస్యం చెప్పి పొలాలపై చల్లుకోమని వారికి పసుపు, కుంకుమలను పంచిపెడతాడు. ఇక్కడికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో, విత్తనాలు విత్తుకునేప్పుడు, పంట కోతలప్పుడు జనం ఎక్కువగా వస్తుంటారు.

చిన్నయ్య వరద పాసెం...

వర్షాలు లేక కరువు వచ్చినప్పుడు ఇక్కడి వాళ్లంతా చిన్నయ్య దేవుణ్ణే ఆశ్రయించేవారట. శనివారం రాత్రి స్నానం చేసిన భక్తులు రాత్రి ఏడు గంటలకు భజన ప్రారంభించి తెల్లవారి ఉదయం ఏడు గంటల వరకూ చేస్తారు. మళ్లీ స్నానం చేసి చిన్నయ్యదేవుడి దగ్గర పాశం(పాయసం) వండి ఆయనకు నైవేద్యం పెడతారు. అనంతరం ఆ పాశంను గొర్రు బండలపై పోస్తారు. ప్రజలు, రైతులు ఆ పాయసాన్ని నాకుతారు. దీన్నే వరద పాశం అంటారు. అట్లా పాశాన్ని గొర్రుబండలపైపోసి ఇంటికి వచ్చేసరికి వర్షం పడుతుందని స్థానికుల విశ్వాసం. అదేవిధంగా ఇక్కడ కుంతీ, భీముడికి సంబంధించిన అనేక ఆనవాళ్లు కనిపిస్తాయి.

ఇక్కడే పుట్టిన భీముడికి(చిన్నయ్య) కుంతీ దేవి కాళ్లు చాపుకుని స్నానం పోసిన కాళ్ల కొల్లు గుంటల (శిశువు స్నానపు నీళ్ల గుంట) గుర్తులు బండపై దర్శనమిస్తాయి. భీముడు నడిచిన అడుగు జాడలు, అంబాడిన మోకాలి ముద్రలు విశాలమైన పరుపు బండపై కనిపిస్తాయి. భీముడు గోండుల ఆడపడుచు హిడింబిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రదేశం ఇప్పుడు పెండ్లి మడుగుగా ప్రసిద్ధికెక్కింది. ఇది పెద్దయ్యగుట్టకు వెళ్లే దారిలో అడవి ప్రారంభమైన చోటే ఉంటుంది. దానికి కొద్దిపాటి దూరంలో భీముని ఇల్లారి ఉంది. ఈ ఇల్లారికి పడమరన ఫర్లాంగు దూరంలో అర్జుగూడ ఉంది. అర్జుగూడ అంటే భీముడి తమ్ముడు అర్జునుడి పేరిట వెలిసిన గిరిజన గూడెం. దీనికి దక్షిణాన సామ్‌గూడ ఉంది. నిజానికి అది సామ్‌గూడ కాదు సహగూడ అంటే సహదేవుడి పేరిట వెలిసిందన్నమాట.


పట్టించుకోని పాలకులు...

ఇంత ప్రాశస్థ్యం, ఎంతో ప్రకతి రమణీయతలకు నెలవైన చిన్నయ్య, పెద్దయ్య దేవుడి గుట్టలను ఆంధ్రాపాలకులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో పర్యాటక అభివద్ధిలో అడ్రస్‌లేని ప్రాంతంగా ఉండిపోయింది. ప్రజలు ఇక్కడికి ఎంతో ప్రయాసపడి వస్తుంటారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడకసాగించాల్సిందే. కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చిన్న గుహలను అభివద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ విద్యుత్‌ను ఏర్పాటు చేసి మంచినీరు, సరైన వసతి కల్పించాలని కోరుతున్నారు.

ఏసీసీ, ర్యాలీగఢ్‌పూర్, దేవాపూర్, తిర్యాణి రోడ్డును చెల్లయ్యపేట చిన్నయ్య దేవుడి రోడ్డును కలుపుతూ ఉన్న రహదారిని లక్సెట్టిపేటకు కలిపితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చిన్నయ్య గుహలు, మంచుకొండలు, జలపాతం మీద దష్టిపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అభివద్ధి చెందితే ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారని తద్వారా పర్యాటకంగా కూడా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం లభిస్తుందని వారు చెబుతున్నారు.

చమురు ప్రపంచాన్ని ఎలా నడిపించిందో తెలుసుకోండి....

చమురు ప్రతి చోటా ఉన్నది. అంటే మనం ఉపయోగించుకుంటున్న వస్తువులతో కలిపి. ఈ రోజు సంఘం దీనిమీదే ఆధారపడి ఉందటే ఆశ్చర్యపోనక్కరలేదు. మరి అలాంటి చమురు గురించిన చరిత్రను తెలుసుకోవటం మనకు ఎంతైన అవసరం ఉంది. తెలుసుకుందాం.

చైనా 3 వ AD శతాబ్ధములో:....ఎప్పుడూ చెప్పినట్లే 2000 సంవత్సరాలకు మునుపు చైనాలో లోతుగా తవ్వే అలవాటు ఉండేది. అలా తవ్వుతున్నప్పుడు బయటకోచ్చే నీరు కొంత చమురుతో కూడుకుని ఉండేది. అ నీటిని వారు కాలే నీరు అనే వారు. చైనా వారూ మరియూ జపానీయులూ ఈ నీటిని మంటలు పెట్టుకోవడానికీ మరియూ వేడిచేసుకోవడానికీ వాడుకున్నారు.



పెర్సియా, 9 వ AD శతాబ్ధములో:.....రజీ అనే పెరిషియన్ శాస్త్రవేత్త ఈ నీటిలో నుండి చమురును వేరు చేసి "కిరోసిన్" అని పేరు పెట్టి దీపాలు వెలిగించుకునేలా చేసేడు. అయితే 1854లో కెనడాకు చెందిన ఆబ్రహం జెన్సర్ అనే శాస్త్రవేత్త కిరోసిన్ ను డిస్టిల్ చేసి వ్యాపారం చేయించేడు. అప్పుడు ఈ కిరోసిన్ ను ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోగలిగేరు.
 

1854 యలే విశ్వవిద్యాలయం:....ఒక పక్క జెన్సర్ కిరొసిన్ దీపాల అమ్మకం మొదలు పెట్టి డబ్బు గడిస్తుంటే, యలే విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త బెంజమిన్ సిల్లి మాన్ ఆ నీటిలో నుండి క్రూడ్ ఆయిల్ కనుగొని చమురు ప్రపంచములో మరో విప్లవం తెచ్చేరు.
 

ఆధునిక ప్రపంచం: ప్రస్తుత ప్రపంచములో చమురు ఒక ముఖ్య శక్తి. అది అమూల్యమైనది. అందుకే దీనిని నల్ల బంగారం అంటారు. ఈ రోజు 90 శాతం వాహనాలు ఈ శక్తితోనే నడుస్తున్నాయి. అంతే కాదు, ఇది ఎన్నో రసాయన వస్తువులకు, ఉదాహరణ: రసాయనాలు,మందులు,ఎరువులు, ప్లాస్టిక్ ఇలా ఎన్నో వస్తువులకు ముడి సరకుగా ఉంటోంది.

 


వస్తువులలో ముఖ్యమైనది క్యాసెట్లు: ప్రపంచ చమురులో 5 శాతం వీటి తాయారుకు పోతోంది.
 

అతికింపదగిన బంక: దీనికి కూడా చమురే ముడి సరకు.

 


షాంపూ


ప్లాస్టిక్

 




మందులు: ముఖ్యముగా ఆస్ప్రిన్: నొప్పి అంటే మనకు గుర్తుకు వచ్చేది ఆస్ప్రిన్. ఎన్నో రకాల నొప్పులను తగ్గించే ఈ ఆస్ప్రిన్ ఫినాయిల్(దీని ముడి సరకు కూడా చమురే) తో కలిపి తయారుచేయబడిందే.
 

Wednesday, 25 June 2014

తెలంగాణ కాలరేఖ



1948 నుండి
1948     సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది.
1948     ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది.
1950
1953     ఆగస్టు 25 న తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు.
1956     ఫిబ్రవరి 20 న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.
1956     నవంబరు 1 న తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది.
1960
1961     ఫిబ్రవరి 6 న తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు.
1969     ఫిబ్రవరి 28 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు.
1969     మార్చి 29 న ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
1970
1970     జూలై 24 న తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు.
1976     మార్చి 31 న ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు.
1978     ఆగస్టు 15 న హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది.
1990
1990     జూన్ 21 న తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు.
2000
2007     ఏప్రిల్ 16 న హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు"(హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది.
2009     నవంబరు 29 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది.
2009     డిసెంబరు 9 న భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు.
2010
2011     మార్చి 10 న ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ ఉద్యమం నిర్వహించబడింది.
2013     జూలై 30 న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది.
2013     అక్టోబరు 3 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
2013     డిసెంబరు 5 న తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది.
2014     జనవరి 7 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
2014     ఫిబ్రవరి 13 న తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడినది.
2014     ఫిబ్రవరి 18 న లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది.
2014     ఫిబ్రవరి 20 న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
2014     మార్చి 1 న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది.
2014     మార్చి 4 న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
2014     జూన్ 2 న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
2014     జూన్ 2 న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం.