Monday 2 June 2014

నేల రాలిన మందారం.. నింగికెగసిన అరుణతార.. కిషన్ జీ అమరం..



వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది
వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది


ఆ తల్లి గుండె విలవిల్లాడింది... కన్నపేగు కదిలిపోయింది... వెళ్లొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన కొడుకు ముప్పై ఏళ్ల తరువాత శవమై తిరిగొచ్చాడు.... నిలువెల్లా కంపించిపోయిన ఆ తల్లి గుండె చెరువయింది.. కొడుకు రాకకై కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆ తల్లి రోదనకు అంతులేదు.. పోలీస్ ఎన్‌కౌంటర్ లో మరణించిన కిషన్ జీ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న తల్లిని చూసి కంట తడి పెట్టని వారు లేరు.. 
 
సరిగ్గా ముప్పై సంవత్సరాల కితం వెళ్లొస్తానమ్మా అన్న కొడుకు.. కన్నతల్లి చేయి విడిచి అడవి తల్లి ఒడిలోకి చేరాడు. ఉద్దరిస్తాడనుకున్న కొడుకు లోకోద్దారకుడుగా మారుతానని వెళ్లాడు. ఆ తల్లికి ఇవేవీ తెలియవు.. కానీ ఏ రోజు కన్నదిరినా దిన పత్రిక చూసేది.. ఏ అపశకునం కనిపించినా కన్న పేగు కదిలేది. కంటిచెమ్మ తడిమేది.. దినదినం పీడకలతో.. నిద్రలో ఉలిక్కి పడ్డ రాత్రులెన్నో.. కన్న కొడుకు ఎక్కడ దూరమై పోతాడో అని ఆవేదన చెందిన రోజులెన్నో.. కొడుకు గుర్తొచ్చి కంచం పై నుంచి లేచిన రోజులెన్నో.. ఏదో ఒకరోజు ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లి భయపడుతూనే ఉంది.. కానీ ఆ రోజు రాకూడదనే కోటి దేవుళ్లకు మొక్కుకుంది.. కానీ.. ఆ బిడ్డ పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు చిందించక తప్పలేదు.. ముప్పై ఏళ్లతరువాత.. గుర్తుపట్టలేని గురుతులతో ఊరుఒడిని చేరుకున్న కిషన్‌జీని చూసి ఊరు ఊరంతా అమ్మయింది.. ఆ అమ్మ కళ్లు సముద్రాలయ్యాయి...

(వెనకొచ్చే ఆవుల్లారా పాట)మొదటి చరణం.. కళ్లల్లో కదిలే కొడుకు కనబడక పోయే... దగ్గర్నుంచి వేయాలి
ఈ తల్లి ఆవేదనను తీర్చేదెవరు.. ఈ కంటిచెమ్మను తుడిచేదెవరు.. పొగిలి పొగిలి ఏడ్చే ఈ తల్లి ఆవేదనను ఎవరు తీర్చగలరు. కన్నకొడుకు జాతి మరువని అమరుడయ్యాడని గర్వించాలో.. ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లలో ఒదిగిపోతున్నాడని బాధపడాలో తెలియని అమాయకత్వం... ఆఖరి గడియల్లో.. తన కన్న పేగు కానరాని లోకాలకు తరిలిపోతుందన్న ఆవేదనను ఎవరు తీర్చగలరు.. ఆదుకుంటాడనుకున్న కొడుకు అమరుడయ్యాడని తెలిసిన క్షణం ఆ తల్లి గుండెలో మోగిన పిరంగులెన్ని. ఆ పెద్దగుండె ఎంత కలత చెందిందో..

(వెనకొచ్చే ఆవుల్లారా పాట)రెండవ చరణం..తండ్రి పొయిన కాణ్నుంచి... దగ్గర్నుంచి వేయాలి
ఈ తల్లి శోకం తీరనిది.. ఈ గుండె గాయం మాననిది.. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన ఆశ అడియాసే అయింది. కొడుకు గుండెను బుల్లెట్ చీల్చిందన్న వార్త తెలసినప్పటినుంచీ ఈ తల్లి గుండె వేయి వక్కలయింది.. పెద్దగుండెలు అవిసేలా ఏడుస్తూనే ఉంది. అఖరి పలుకులు ఎండమావులే అయ్యాయి.


నేల రాలిన మందారం.. నింగికెగసిన అరుణతార.. కిషన్ జీ అమరం..

.... ఓన్లీ న్యూస్... విశ్లేషణ కాదు...


కిషన్జీ మృతి 
బెంగాల్అడవుల్లో ఎన్కౌంటర్
జంగల్మహల్లో లభించిన మృతదేహం
కిషన్జీదేనని అనుమానం 
మావోయిస్ట్అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్కిషన్జీ మృతి చెందారు... పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్అడవుల్లో జరిగిన ఎన్‌‌కౌంటర్లో ఆయన చనిపోయారు... భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కిషన్జీ మృతి చెందారని బెంగాల్ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. జంగల్మహల్లో మృతదేహం దొరికిందని, అది కిషన్జీ దేనని ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి... అయితే కిషన్‌‌జీ మృతిని మావోయిస్టు పార్టీ ఇంకా ధ్రువీకరించడం లేదు... హోంశాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.
మమత బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక బెంగాల్లో జరిగిన మొదటి ఎన్కౌంటర్ఇది... కిషన్జీ కోసం బెంగాల్భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కుషుబోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి... నిన్నటికి నిన్న కిషన్జీ త్రుటిలో ఎన్కౌంటర్నుంచి తప్పించుకున్నారనే వార్తలు వచ్చాయి
బెంగాల్లోని సంయుక్త దళాలు జరిపిన జాయింట్ఆపరేషన్లో కిషన్జీ మృతి చెందారు. దాదాపు అరగంటసేపు ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. కాల్పుల్లో కిషన్జీతో పాటు మరో ముగ్గురు కూడా మరణించారు... కిషన్జీదిగా భావిస్తున్న మృతదేహం పక్కనే ఏకే 47 గన్ లభ్యమైనట్టు సమాచారం
కిషన్జీతో పాటు, ఆయన సహచరి సుచిత్ర మహతో కోసం భద్రతా బలగాలు గత కొద్ది రోజులుగా గాలిస్తున్నాయి.. జంగిల్మహల్లో మూడు రోజులుగా కూంబింగ్నిర్వహిస్తున్నారు. కిషన్జీ, సుచిత్ర కుష్బని అడవుల్లో తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్ని అణువణువు గాలించాయి. అయిదుగురు మావోయిస్టులను అరెస్ట్్ చేశాయి.. అయినప్పటికీ అగ్రనేత సమాచారం అందలేదు... తర్వాత జార్ఖండ్‌, బెంగాల్పోలీసులు సంయుక్తంగా జరిగిన ఆపరేషన్తో కిషన్జీ మృతి చెందినట్టు తెలుస్తోంది. సుచిత్ర కోసం ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయి.
రెండేళ్ల క్రితం కూడా కిషన్జీ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి.. కానీ తర్వాత ఆయన తప్పించుకున్నారని తెలిసింది.


No comments:

Post a Comment