Wednesday 4 June 2014

ఎస్‌.పి. బాల సుబ్రహ్మణ్యం బర్త్ డే



పాట ఆనందాన్ని ఇస్తుంది.. పాట ఆహ్లాదాన్ని ఇస్తుంది, పాట హాయినిస్తుంది, కాని కొన్ని గొంతుల నుండి వచ్చిన పాటలు మాత్రం అమృతంలా అనిపిస్తాయి.. అలాంటి అరుదైన సుమధుర స్వరం గాన గంధర్వుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యంది..

తన గొంతుతో పాటకు ప్రాణం పోయగల విలక్షణ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం. ఎస్‌ పి బి గుర్తింపు తెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యం అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఈ మహాగాయకుడు1946 జూన్ 4 న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు.


పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా బాలసుబ్రహ్మణ్యం తన చిన్న వయసునుంచే గాయకుడిగా గుర్తింపు తెచ్చకున్నారు.. తండ్రి వారసత్వంగా వచ్చిన స్వర జ్ఞానానికి తన కృషితో మెరుగులు దిద్దుకున్నాడు.. తండ్రి హరి కథలు చెప్పేవాడు, చిన్నతనంలో తండ్రితో పాటు బాలు కూడా ప్రదర్శనలు ఇస్తూ… పాటలు పాడేవారు.


కాని చిన్నతనంలో ఎప్పుడు గాయకుడు కావాలని మాత్రం అనుకోలేదు.. తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్‌ పూర్తి చేసి మంచి ఉద్యొగంలో స్థిరపడాలనుకున్నాడు.. కాని వెండితెర మీద సున్నాత స్థానం సంపాదించాల్సిన ఆయన అలా నాలుగు గోడల మధ్య ఆగిపోవటానికి సినీ కళామతల్లి అంగీకరించలేదు అందుకే శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాలో గాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు బాలు..


ఘంటసాట, పిబి శ్రీనివాస్‌, రామకృష్ణ లాంటి మహామహులు ఉన్న సమయంలో గాయకునిగా అవకాశం దక్కటమే కష్టం అలాంటి సమయంలో గాయకుడిగా తనకంటూ గుర్తింపఉ తెచ్చుకోవటమే కాదు తనకంటూ సమున్నత స్థానం సంపాదించకున్నాడు బాలు..


చిత్ర పరిశ్రమలో స్వర రారాజుగా వెలుగుతున్న  మన బాల సుబ్రహ్మణ్యం, 40 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించి, 11 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డును సృష్టించారు. బాలు గానామృతానికి  4 బాషలలో 6 సార్లు నేషనల్ అవార్డులు లభించాయి. లతామంగేష్కర్ అవార్డుతో పాటు, మన రాష్ట్ర ప్రభుత్వం అందించే 25 నంది పురష్కారాలను కూడా  స్వంతం చేసుకున్నారు.


గాయకునిగా ఎన్నో అద్బుతమైన పాటలు పాడిన బాలు,  మన్మద లీలలు సినిమా తో  డబ్బింగ్ ఆర్టిస్టుగా తన  ప్రస్థానాన్ని ప్రారంభించారు, కమల్ హసన్, రజినికాంత్ లాంటి ఎంతో మంది అగ్రకథానాయలకు తన గాత్రాన్ని అందించారు. ముఖ్యంగా దేవుళ్ల పాత్రకు పాటలు పాడాలన్నా. డబ్బింగ్‌ చెప్పాలన్నా బాలు తప్ప మరువరు లేరు అనేలా శ్రీరామదాసు, అన్నమయ్య సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు..

     
  తెర వెనుకనే కాదు తెర మీద కూడా బాలు తనను తాను నిరూపించుకున్నాడు.. నటునిగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించాడు.. అభినయం, హస్యంతో ఆకట్టుకుంటూ మంచి నటుడు గా కూడా  గుర్తింపు పొందాడు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా..  దేవాలయం, మిథునం లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో అవార్డులను సైతం అందుకున్నాడు..

      
బాలు స్వర ప్రస్ధానం వెండితెర మీదే కాదు బుల్లి తెర మీద కూడా కొనసాగింది.. ఎన్నో సీరియల్స్‌కు టైటిల్‌ సాంగ్స్‌ పాడిన బాలు.. పలు కార్యక్రమాలకు వ్యాఖ్యతగా కూడా వ్యవహారించారు.. పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలతో ఎన్నో మంది గాయకులను పోత్సహిస్తూ తనకు ఆ స్థాయిని కల్సించిన కళామతల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు బాలు..

       
ఇలా ఎన్నో రంగాల్లో తనదైన బాణీలో దూసుకుపోతున్న బాలసుబ్రమణ్యం గారు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఇంకా ఎన్నో వేల పాటలతో మనల్ని అలరించాలని ఆశిస్తూ ఈ గాన ప్రవాహానికి మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

No comments:

Post a Comment