Tuesday 17 June 2014

హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయన్న విషయంపై చేసిన సర్వేలోని కొన్ని వివరాలు.




400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాద్ లో పలు ప్రాంతాల పేర్లు విచిత్రంగా ఉంటాయి. అయితే ఆ పేర్లు ఎలా వచ్చాయన్న విషయంపై చేసిన సర్వేలోని కొన్ని వివరాలు.


 హైదరాబాద్: హైదరాబాద్ నగరం ఒకప్పుడు లెక్క లేనన్ని పూదోటలతో విలసిల్లేది..బషీర్ భాగ్, అమిన్ భాగ్, భీర్ బన్ భాగ్, హరిద్కార్ భాగ్, భాగ్ లింగంపల్లి, జాం భాగ్ లాంటి గార్డెన్స్ తో సిటీ ఆఫ్ గార్డెన్స్, భాగ్ నగర్ గా పేరు తెచ్చుకుంది. మరో కథ మేరకు కులీ కుతుబ్ షా ప్రేమించి స్థానిక బంజారా యువతి భాగ్ మతి పేరుతో భాగ్యనగరం ఆపై ఆ యువతి ఇస్లాం మత సాంప్రదాయాల మేరకు తన మతం మార్చుకోవడంతో బాటుగా పేరును కూడా హైదర్ గా మార్చుకుంది. ఆపై నగరం ద సిటీ ఆఫ్ హైదర్ గానూ చివరకు హైదరాబాద్ గానూ మారింది...


శంషాబాద్: నిద్రలో జోగుతున్నట్టుగా ఉండే శివారు ప్రాంతపు గ్రామం షాంస్ ఉల్ ఉమ్రా పేరు కాస్త శంషాబాద్ గా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబడి ఇప్పుడు చాలా పాపులర్ పేరుగా మారింది.
సికిందరాబాద్: 1806 కాలంలో నిజాం రాజు సికిందర్ జా పాలించిన గ్రామం పేరు సికిందరాబాద్ గా స్థిరపడింది.
నాంపల్లి: నిజాం రాష్ట్రంలో 1670 AD సమయంలో దివాన్ ఆఫ్ నిజాం గా పనిచేసిన రజా అలీ ఖాన్ కు రాసిచ్చిన జాగీర్ పై ఆయన పేరు నేక్ నామ్ ఖాన్ అని ఉంది. చివరాకరుకు ఆ పేరు నేక్ నాంపల్లిగా, చివరకు నాంపల్లిగా స్థిరపడింది.



ఖైరతాబాద్: ఇబ్రహీం కుతుబ్ షా తన కుమార్తె ఖైరున్నీసా బేగంకు ఇచ్చిన జాగీరు కాలక్రమేణా ఖైరతాబాద్ గా మారింది.



బేగం బజార్: హైదరాబాద్ వ్యాపారులపై ఎందుక దయ కలిగిందో కానీ నిజాం గారి సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది...దాని పేరు బేగం బజారుగా నిలిచిపోయింది.


 

సుల్తాన్ బజార్: 1933లో రెసిడెన్సీ బజార్ పేరుతో కొనసాగుతున్న ఆసియాలోనే అతిపెద్ద బజార్ సుల్తాన్ బజార్ గా మారింది.

 

అఫ్జల్ గంజ్: అయిదవ నిజాం అఫ్జలుద్ దౌలా ధాన్యం గింజల వ్యాపారులకు బహుమతిగా ఇచ్చిన భూమి కాలక్రమేణా అఫ్జల్ గంజ్ గా మారింది.

 

హిమాయత్ నగర్: ఏడవ నిజామ్ పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ పేరుతో హిమాయత్ నగర్ గా స్థిరపడింది.
 


హైదర్ గుాడా: మొదటి తాలుఖ్ దార్( జిల్లా కలెక్టర్) హైదర్ అలీ పేరుతో హైదర్ గుడా
భషీర్ బాగ్: సర్ ఉస్మాన్ జా, భషీర్ ఉద్దులా పైగా నోబుల్ పేర్లపై ఉన్న ఓ గార్డెన్ పేరుతో బషీర్ భాగ్ పేరు పుట్టుకువచ్చింది.


 

సోమాజి గుాడా: సోమాజీ అనే నిజాం కాలం రెవెన్యూ విభాగం ఉద్యోగి హైదరాబాద్ ప్రాంతపు గూడెంలో నివసించేవాడు...ఆయన పేరుతో ఆ గూడెం కాస్తా సోమాజిగుడా గా మారింది.


మలక్ పేట్: గొోల్కొండ రాజు అబ్దుల్లా కుతుబ్ షా వద్ద పనిచేసే మాలిక్ యాకూబ్ ఇంటి పరిసరాలు ఆయన పేరుతో మలక్ పేట్ గా మారింది.

No comments:

Post a Comment