Tuesday 10 June 2014

వరంగల్‌



వరంగల్‌లో ఉన్న భద్రకాళి ఆలయం, మన రాష్ట్రంలోనే గాక మన దేశంలోనే వున్న అతి పురాతనమైన ఆలయాలలో ఒకటి. చాణక్య చక్రవర్తి రెండవ పులకేశి క్రీ.శ.625 వ సం||లో ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకున్నట్లు ఈ ఆలయంలోనం ఉన్న ఒక శాసనంలో ఉంది. అంటే అప్పటికే ఇక్కడ ప్రసిద్ధంగా ఉందన్నమాట. ఇక వెయ్యి స్తంభాల గుడి అసలు పేరు రుద్రేశ్వర ఆలయం. ఈ ప్రాంగణంలోనే, ఈ ఆలయాన్ని ఆనుకునే వెయ్యి స్తంభాలు ఉన్న ఒక కళ్యాణ మండపం ఉంది. అందువల్ల అసలు గుడినే వెయ్యి స్తంభాల గుడి అని వ్యవహరించడం సధారణమై పోయింది. పదవ శతాబ్దంలో నిర్మింపబడిన ఈ రుద్రేశ్వరాలయం తెలుగు వారందరూ తల ఎత్తి గర్వంగా చెప్పుకోవలసిన కట్టడం. దీనిని గూర్చి వర్ణించడం ఇక్కడ కుదరదు. ఇక వరంగల్‌ కోట అనబడే చోట ఉన్నవి కూడా శిధిలమైన శిల్పాల ముక్కలు చుట్టూ ఉన్న ప్రాకారపు గోడ పూర్తిగా శిధిలమైపోయి, అక్కడొకముక్క, ఇక్కడొక ముక్క వుండి, ఇక్కడొక కోట ఉండేదని మాత్రమే తెలుస్తుంది. కోట లోపల భాగమంతా ఇప్పుడు పెద్ద మైదానం లాగ వుండి, తుప్పులు, పొదలతో నిండి పోయింది. ఈ కోట లోపల చాలా ఆలయాలు, అద్భుతమైన కట్టడాలు వుండేవట. శిధిలమైపోయిన ఆ కట్టడాలలో దొరికిన కొన్ని ముక్కలను ఒక చోట చేర్చి చిన్న మ్యూజియం ఏర్పాటు చేశారు. అప్పుడున్న కోటకు నాలుగు వైపులా నాలుగు ద్వార తోరణాలు ఉండేవి. వాటిని మాత్రం జాగ్రత్తగా పదిలపరిచి ఈ మైదానం లోపల నిలబెట్టి ఉంచారు

No comments:

Post a Comment