Thursday 12 June 2014

షేఖావతి – సాహసికులైన స్థానికులు, పురాతన కట్టడాల ప్రదేశం





రాజస్థాన్ లోని ఈశాన్య భాగం లోని ఎడారి ప్రాంతం లో వున్న షేఖావతి భారతీయులకు చాల చారిత్రిక ప్రాధాన్యం వున్న పట్టణం. మహాభారతం లో షేఖావతి ప్రస్తావన చాలా సార్లు వచ్చింది, హిందువుల పవిత్ర గ్రంధాలు, వేదాలు ఈ ప్రాంతం లోనే రాయబడ్డాయని అంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన షెఖావత్ రాజపుత్రుల పేరిట ఈ ఊరికి ఆ పేరు వచ్చింది.

ఖావతి లో ఏమి చూడాలి ?‘రాజస్థాన్ కళా బహిరంగ ప్రదర్శన’ గా పిలువబడే షేఖావతి రంగుల ప్రాసాదాలు, కోతలు, ఇతర చారిత్రిక కట్టడాలకు ప్రసిద్ది చెందింది. ఇక్కడి ప్రసిద్ధ ప్రాసాదాల్లో నదిన్ ప్రిన్స్ హవేలీ, మొరార్కా హవేలీ మ్యూజియం, డాక్టర్ రామనాథ్ ఎ పొద్దార్ హవేలీ మ్యూజియం, జగన్నాథ్ సింఘానియా హవేలీ, ఖేత్రీ మహల్ కొన్ని.1802 లో నిర్మించిన హవేలీ నదిన్ ప్రిన్స్ భవనాన్ని ఫ్రెంచ్ కళాకారుడు, ప్రస్తుత యజమాని దాన్ని కళాకేంద్రం గా, సాంస్కృతిక కేంద్రంగా మార్చివేశాడు.

డాక్టర్ రామనాధ్ ఎ పొద్దార్ హవేలీ మ్యూజియం లో రాజస్థానీ సంస్కృతికి సంబంధించిన చాలా ప్రదర్శనా కేంద్రాలు ఉన్నాయి. 250 ఏళ్ళ నాటి పాత కోట కు మొరార్కా హవేలీ మ్యూజియం ప్రసిద్ది చెందగా, 1770 లో నిర్మించిన అధునాతన ఖేత్రీ మహల్ పాత కాలపు నిర్మాణ వైదుష్యాన్ని కళ్ళకు కడుతుంది.ఈ ప్రాంతపు కోటల్లో మాండ్వా కోట, ముకుంద్ ఘర్ కోట, డుండ్ లార్డ్ కోట, చాల ప్రముఖ స్థానాన్ని కలిగి వున్నాయి. మాండ్వా కోటను ఇప్పుడు వారసత్వ హోటల్ గా మార్చి వేయగా, డుండ్ లార్డ్ కోట యూరోపియన్ చిత్రాల ప్రసిద్ధ కళా కేంద్రంగా ఉంది. 8000 చ.మీ ల మేర విస్తరించిన ముకుంద్ ఘర్ కోట లోపల చాలా సభా భవనాలు, వసారాలు, బాల్కనీలు వున్నాయి.ఇక్కడి కొన్ని ప్రత్యెక మసీదులు, జింకల అభాయరణ్యం చూడదగ్గ ప్రదేశాలు.

ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఒంటెల సవారీ చేస్తూ ఎడారిని సందర్శించడాన్ని ఇష్ట పడతారు. ఈ ప్రాంతం లోని చాలా భవనాలు ఇప్పటికే వారసత్వ హోటళ్ళు గా మారి సందర్శకులకు మంత్రముగ్దుల్ని చేసే అనుభవాన్ని ఇస్తున్నాయి.ఉత్సవాలు, పండుగలు & సరదాలు ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరిగే షేఖావతి ఉత్సవం సందర్భంగా జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అనేక మందిని ఆకర్షిస్తాయి. ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ, సికార్, చురు, ఝుంఝును జిల్లాల యంత్రాగాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి.ఈ ప్రాంతపు ప్రజల గ్రామీణ జీవన శైలిని కళ్ళకు కట్టే ఈ షేఖావతి ఉత్సవంలో ఒంటెలు, జీపుల సవారీలు ప్రధాన భాగం.

నవల్ ఘర్, ఝుంఝును, సికార్, చురు అనే నాలుగు ప్రదేశాల్లో జరిగే వివిధ గ్రామీణ క్రీడలు, భవన పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్షేత్ర పర్యటన, టపాసులు ఈ ఉత్సవం లోని ప్రధాన ఆకర్షణలు. షేఖావతి ప్రధానంగా జరిగే నవల్ ఘర్, జైపూర్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో వుండి, రైలు, రోడ్డు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడి వుంది.షేఖావతి ఎప్పుడు చూడాలి ?నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలల మధ్య వాతావరణం చల్లగా వుండడం వల్ల ఆ సమయంలో షేఖావతి ని సందర్శించడం ఉత్తమం. వేసవి లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల దాకా వుండి విపరీతమైన వేడిగా వుంటుంది కనుక ఆ సమయం ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైనది కాదు.

షేఖావతి చేరుకోవడంషేఖావతి జైపూర్, బికనేర్ ల నుంచి రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి వుంది. ఈ నగరాల నుంచి షేఖావతి కి లోకల్ రైళ్ళు కూడా నడుస్తాయి.రాజస్తానీలు, మార్వాడీలు ప్రధానంగా వుండే ఈ ప్రాంతంలో రాజస్థానీ స్థానిక భాష.

No comments:

Post a Comment