Wednesday, 25 June 2014

పాతకాలంలో ఇప్పుడున్న దేవాలయాలు....అరుదైన ఫోటొలు

Mahabodhi Temple of Bodh Gaya - Bihar 1935
 
 
Great Temples of Tanjore (Thanjavur, Tamil Nadu) - 1880's-90's
 
 
Decorative Temple at Tanjore (1880's)
 
 
Temples from Distance
 
 
Gateway of Temple
 
 
Temple with Mythological Sculptures
 
 
The Peruvudaiyar Kovil,Temple Decorated with Terracotta Designs - Circa 1900's
 
 
Martand Sun Temple - Kashmir 1900's
 
 
Photograph of a Temple in Trichinopoly (Tiruchirappalli) Tamil Nadu - 1890's
 
 
Various Photograhs of Jagannath Temple, Puri - 1890's
 
 
Temple of Tooth - Ceylon (Sri Lanka) - 1890's
 

తెలంగాణా రాష్ట్ర పర్యటన

నిజాముల పాలనలో తెలంగాణా  ప్రాంతం , మెదక్ మరియు వరంగల్ డివిజన్ లు కల  హైదరా బాద్ రాష్ట్రానికి చెందినదిగా వుండేది. తర్వాత అది ఆంద్ర ప్రదేశ్ లో ఒక భాగం అయ్యింది. జూన్ 2 వ తేదీ 2014 సంవత్సరం నాడు  తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భ వించింది. హైదరాబాద్ నగరం తెలంగాణాకు రాజధానిగా కొనసాగుతోంది. 




తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు ఉత్తరం మరియు వాయువ్య దిశలలో మహారాష్ట్ర తోను ఈశాన్యంలో చత్తీస్ ఘర్ రాష్ట్రంతోను, పడమర లో కర్నాటక తోను, తూర్పు వైపు ఓడిశా తోను పంచుకుంటాయి.  ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చించి ? తెలంగాణా అనే పేరు, రాష్ట్రంలో విస్తృతంగా మాట్లాడే తెలుగు భాష నుండి ఏర్పడి నట్లు భావిస్తారు. మాజీ హైదరాబాద్ రాష్ట్రం లో మిగిలిన భాగంలో మరాఠి మాట్లాడు ప్రజలు వుండి  తెలంగాణా కు ఒక ప్రత్యేకతను కల్పించారు. వీరి సంస్కృతి ఎలా ? తెలంగాణ ప్రజలు భారత దేశపు వివిధ సంప్రదాయాలతో పాటు ఇతర దేశాలైన పర్షియా సంస్క్రతి ప్రభావాలు కూడా కనపడతాయి. ఈ రాష్ట్రం వివిధ సంస్కృతుల ప్రభావం కలిగి వుండటం ఒక ప్రత్యేకత. తెలంగాణా దక్షినాది రాష్ట్రం అయినప్పటికీ, ఉత్తర భారత దేశపు  హోలీ వంటి కొన్ని పండుగలు ఇక్కడ ఘనంగా  జరుప బడతాయి.

తెలంగాణ - సాంస్కృతిక రంగం

బమ్మెర పోతన (శ్రీమద్ భాగవత తెలుగు అనువాదకులు) వంటి ప్రసిద్ధ రచయితలు, కవులు, ఇతర కళాకారులు ఈ రాష్ట్రానికి పేరు తెచ్చారు.  తెలంగాణా లో కల కొన్ని ప్రాంతీయ పండుగలలో బోనాలు, బతుకమ్మ మరియు సమ్మక్క సారాలమ్మ జాతర వంటివి ప్రసిద్ధి.  దసరా, గణేష్ చతుర్ధి, ఉగాది వంటి పండుగలు కూడా ఇక్కడి ప్రజలు వైభవోపేతంగా ఆచరిస్తారు.  రాష్ట్రంలోని ఆహారాలు ఏమిటి? తెలంగాణా లో రెండు రకాల ఆహారాలు కలవు. తెలుగు వంటకాలు మరియు హైదరాబాద్ వంటకాలు.

తెలంగాణ - ఆహారాలు

తెలుగు వంటలు వివిధ సుగంధ ద్రవ్యాల ఘాటైన  రుచుల వంటలు కాగా, హైదరాబాద్ వంటకాలు లో తెలుగు మరియు ఇతర దేశాలు అంటే అరబ్, టర్కిష్, మరియు మొగలాయీ వంటకాల సమ్మేళనం రుచులు కలిగి వుంటాయి.  తెలంగాణ లో టూరిజం దక్షిణ భారత దేశంలో తరచుగా పర్యటించే ప్రదేశాలు తెలంగాణా లో కలవు. హైదరాబాద్ లోని చార్మినార్, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ మరియు  కుంతల వాటర్ ఫాల్స్ , వరంగల్ లోని యాదగిరి గుట్ట, బాసర లోని సరస్వతీ దేవాలయం వంటివి వాటిలో కొన్ని.  ఈ రాష్ట్రంలో ఇంకనూ భద్రాచలం టెంపుల్, వేయి స్తంభాల టెంపుల్, శ్రీ రాజ రాజేశ్వర స్వామీ టెంపుల్ వంటివి కూడా కలవు. 

తెలంగాణ - రవాణా సదుపాయాలు

రాష్ట్రం లో రవాణా వ్యవస్థ ఎలా వుంటుంది?  రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ పర్యాటకులకు సౌకర్యవంతంగా వుండి ఇండియా లోని ఇతర రాష్ట్రాల నుండే కాక, ఇతర దేశాల వారు కూడా తేలికగా పర్యటనలు చేసేది గా వుంటుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దేశంలోని ఇతర రాష్ట్రాల పర్యాట కులకే కాక, ఇతర దేశాల విమాన సర్వీస్ లకు కలుపబడి వుంది.  రైల్వే  మరియు రోడ్డు మార్గాలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలు పర్యటించేందుకు అనుకూలంగా వుంటాయి.

అహోబిలం - అంతు పట్టని రహస్యం

 
 
అహో... అంటే ఒక గొప్ప ప్రశంశ. బిలం అంటే బలం అని చెప్తారు. కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి. పురాణాల మేరకు శ్రీ మహా విష్ణువు రాక్షసుల రాజు అయిన హిరణ్య కశిపుడిని సంహరించేందుకు సగం మనిషి గాను, సగం సింహ రూపంలో అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెపుతారు. విష్ణువు యొక్క ఈ భయంకర రూపం చూసిన సకల దేవతలు ఆయనను గురించి " అహో ...ఎంత బలవంతుడు " అని కీర్తిన్చారట. జయ జయ ధ్వానాలు చేశారట. (ఒక అంతు లేని శక్తి అని అర్ధం) . అందుకని ఈ ప్రదేశానికి కాల క్రమేనా అహోబిలం / అహోబలం అనే పేరు వచ్చింది.
 
ప్రస్తుత అహోబిలం క్షేత్రం సీమాంధ్ర లోని కర్నూల్ జిల్లాలో , ఆళ్ళ గడ్డ మండలం లో కలదు.
ఈ పుణ్య క్షేత్రానికి వెళ్ళాలంటే, కర్నూల్, నంద్యాల్ మరియు హైదరాబాద్ నగరాల నుండి బస్సు లు లభిస్తాయి. ఈ ప్రదేశానికి రైలు మార్గం లేదు. సమీప రైలు స్టేషన్ నంద్యాల్ లో కలదు. ఇది బెంగుళూరు - వైజాగ్ రైలు మార్గంలో తగులుతుంది.
 
ఒక పురాణ గాధ మేరకు ఈ పుణ్య ప్రదేశం లో విష్ణుమూర్తి అవతారమైన నరసింహ స్వామీ రాక్షసుల రాజైన హిరణ్యకసిపుడిని వధించి అతని కుమారుడైన ప్రహ్లాదుడిని ఆశీర్వదించాడు.
 
పురాణాలలో అహో బిలం గురించిన కీర్తనలు ఈ విధంగా సాగినవి. అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహు పరాక్రమం , నరసింహ పరమ దైవం, అహో బలం ....
 
అహోబిలం క్షేత్రంలో నారసింహ దేవుడికి నిర్మించిన దేవాలయాలు వివిధ దిక్కులలో తొమ్మిది వరకూ నిర్మించినట్లు చెపుతారు. నల్లమల అడవులలో నిర్మించిన ఈ దేవాలయాలు అద్భుత శిల్ప శైలి కలిగి వున్నాయి.
 
ఇక్కడి కొన్ని దేవాలయాలు గుహలలో వుంటే మరి కొన్నిటికి ట్రెక్కింగ్ చేసి కొండలు ఎక్కాలి. మార్గంలో అనేక సుందర దృశ్యాలు చూడవచ్చు. ట్రెక్కింగ్ కఠినం గా వుంటుంది సుమా !
 
మనిషి జీవితాన్ని నిర్ధారించే ఈ 9 గుహలను అత్యంత భక్తి శ్రద్ధలతో తమ శత్రు సంహారం కొరకు పూజించాలని నమ్ముతారు.

ఈ ప్రదేశంలోని చుట్టూ కల నలమల కొండలను శ్రీ మహా విష్ణువు ఆసనమైన శేష పాన్పు తో పోలుస్తారు. తిరుపతి తిరుమల ప్రదేశ కొండలను ఆది శేషుని పడగ గాను, నల్లమల కొండలను ఆది శేషుడి మధ్య భాగంగాను, శ్రీశైల కొండలను ఆదిశేషుడి చివరి తోక గాను అభివర్ణిస్తారు.

సగం మనిషి, సగం సింహం ఆకారం గల విష్ణువు స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన వెంటనే, దేవతలు 'అహో బిలం ...అహో బలం' అంటూ జయ జయ ధ్వనులు చేసారు. శ్రీ మహా విష్ణువు చీల్చు కొని వచ్చిన స్థంభం ఉక్కు అంత ద్రుడ మైనది అని భావిస్తారు.

అహోబిలం ను కింద అహోబిలం, పై అహోబిలం అని రెండు భాగాలుగా చెపుతారు. పైన నరసింహుడు ఉగ్ర రూపి గాను , కింద నరసింహుడు శాంత స్వరూపిగాను ఉంటాడని చెపుతారు.

పురాణ గాఢ మేరకు శ్రీనివాసుడు తన కళ్యాణ సమయంలో స్వయంగా వచ్చి ఉగ్ర నరసిమ్హుడిని
దర్శనం చేసాడని, ఉగ్రమూర్తి ని చూసి సామాన్యులు భయపడుతున్నారని భావించి, ఆయనే స్వయంగా కొండ కింది భాగంలో శాంత నరసిమ్హుడిని ప్రతిష్టించాడని చెపుతారు.

సాంప్రదాయం మేరకు భక్తులు ముందుగా కొండ కింది భాగంలో కల శాంత స్వరూపుడైన నరసింహ ను దర్శించి , ఆ తరువాత ఇక్కడ నుండి 8 కి. మీ. ల దూరం లో కల కొండపై కల ఉగ్ర నరసిమ్హుడిని దర్శిస్తారు.

Tuesday, 24 June 2014

సోక్రటీస్





గ్రీస్‌లొ నగర రాజ్యమైన ఏథెన్స్ పౌరుడైన సోక్రటీస్ 470 బి.సి.లో జన్మించాడు. కొంతకాలం తన తండ్రి వృత్తిని చేపట్టాడు. కాని ఇతర ఆశలు అతనికి ఉన్నందువల్ల సైన్యంలో చేరాడు. ఏథెన్స్‌కు తిరిగివచ్చిన తర్వాత తన కాలాన్ని మానవ జీవిత ప్రవర్తనపై అధ్యయానికి వినియోగించి ప్రజా సమస్యలను గురించి ప్రజలకు హెచ్చరిక చేసేవాడు. 406 బి.సి.లో 500 మందితో కూడిన సెనేట్‌లో సభ్యుడయ్యాడు. ఇతర గౌరవాలు కూడా పొందాడు. తన ప్రజాహిత కార్యాలకు తోడు ఒకటి తరువాత ఒకటిగా తన బోధనా వృత్తిని కొనసాగించేవడు. సోఫిస్ట్స్ అని పిలువబడే పాఠశాల ఉపాధ్యాయుల వేదాంత చర్చలను - అతని కాలంనాటి - ఏథెన్స్ వాసులు ఆదరించేవారు. సోఫిస్టులు ధనవంతుల వద్ద డబ్బు తీసుకొని వారి పిల్లలకు - వాదన, ఉపన్యాస విధానం నేర్పేవారు. పాపాన్ని (చెడు) మంచిదాన్నిగా, మంచిదాన్ని పాపంగా రూపొందించేవారు. హృదయపూర్వకంగా, నేర్పుకల వారుగా ఉండేవారు. సన్మార్గం (నీతి)పై మనుషుల విశ్వాసాన్ని బలహీనపర్చే విధంగా వారి బోధనల ప్రభావం ఉండేది. అందరి చేత గౌరవించబడే ఒకే సత్యం, నీతి అనేవి లేవని సోఫిస్టులు చెప్పేవారు. ఒకరికి నీతిగా కనిపించేది మరొకరికి అవినీతి అవుతుంది.

సోఫిస్టులు వ్యతిరేకించినా సత్యం, నీతి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నిలబెట్టాలని సోక్రటీస్ కృతనిశ్చయుడయ్యాడు. అతడు జ్ఞానంతొ సత్ప్రవర్తనను సమత్వం చేశాడు. ప్రజల్ని మంచివారిని చేసేందుకు జ్ఞానానికి శక్తి కలదని నమ్మాడు. ప్రజలకు విషయాలు స్పష్టంగా అర్ధమయ్యేందుకు తార్కికమైన నిర్వచనాలను అతడు అవలంబించాడు. సోక్రటీస్ పేదవాడైనా ఎన్నడూ ధనం వెంటపడలేదు. ఒక చింతనాపరుడుగా జీవితాన్ని గడపాలని కోరుకున్నాడు. సంపద, కీర్తి, అధికారం మరియు పదవిపట్ల పూర్తి వైముఖ్యాన్ని ప్రదర్శించాడు. జీవితం చివరి దశలో అతడు జ్ఞాంతిప్పి అనే ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. కుటుంబం పట్ల సోక్రటీస్  భేద వైఖరికి కోపంతో ఒకసారి ఆమె ఒక కుండెడు పేడ నీళ్ళు అతని తలపైన క్రుమ్మరించిందని చెబుతారు. ఈ ఉత్సాహం కల్గించే స్నానం తరువాత అతడు ఇలా గట్టిగా అరిచాడు "ఉరుముల (పిడుగుల) తరువాతే వర్షం వస్తుంది". తమకు పరిచయమైన అభిప్రాయాలను మనుషులు పరీక్షించి, వాస్తవాలను వెలికితీసి, దానిలోని సారాంశమైన సత్యాన్ని అంగీకరించాలని సోక్రటీస్ విశ్వసించేవాడు. నిజానికి జ్ఞానం లేకుండానే జ్ఞానికి సంబంధించి మాట్లాడే ప్రజలను అతడు ఎట్టి ద్వేషం లేకుండా నిలదీసేవాడు. సత్యాన్ని తీవ్రంగా ప్రేమించే అతడు కపటాన్ని ద్వేషించేవాడు.

న్యాయం, మంచితనం, స్వేచవంటి పదాలను ప్రయోగించే ఏథెన్స్ నాయకులను, పురుషులను సోక్రటీస్ పరీక్షించి, వారి అవివేకాన్ని ఖండించేవాడు. సోఫిస్టులు మరియు ప్రభుత్వపక్ష నాయకులు అసంతృప్తి చెంది సోక్రటీస్ పట్ల క్రోధంతో ఉండేవారు. అతణ్ణి ఎలాగైనా తొలగించాలని వారు కోరుకున్నారు. అతని 70వ ఏట, సోక్రటీస్‌పై అభియోగం మోపి విచారణకు తెచ్చారు. ఆ దేశం విశ్వసించే దేవుళ్ళను సోక్రటీస్ నమ్మటంలేదనీ, యువతను అవినీతికి పురికొల్పుతున్నాడనీ నేరారోపణ చేశ్డారు. విచారణలో తన వాదనలతో జూరీని అంగీకరింపచేయగలనని భావించాడు సోక్రటీస్. ఆత్మన్యూనతా భావాన్ని వెలిబుచ్చి దయ చూపమనే విజ్ఞప్తి కానీ, న్యాయమూర్తుల ఎదుటకు తన శోక సంతప్తులైన సంతానాన్ని తీసుకురావటం కానీ ఆయన చేయలేదు. తన సందేశం ఏమిటో దాన్ని గురించి చెప్పాడు. తన అంతరాత్మ ఆదేశాలకు నిబద్ధత ప్రకటించాడు. తన హేతువులోని ధర్మతత్పరతకే అంటుకుపోయాడు.

దేశానికి తను చేసిన సేవలకుగాను ప్రజాధనంతో నగర ప్రధాన చావిడిలో తనను సన్మానించాలని సోక్రటీస్ సూచించాడు. ఇది జూరీ (పంచాతీదారుల సభ)కు కోపం తెప్పించింది. అతనికి మరణ శిక్ష విధించారు. ఎప్పటికీ గొప్పతనం కలిగిన మాటలతో అతడు న్యాయస్థానాన్ని విడిచిపెట్టాడు. అతను చెప్పిన మాటలివి ... "నిష్క్రమించే గంట వచ్చింది. మనం మన దారిన వెళ్ళిపోతాము. నేని మరణించబోతున్నాను. మీరి జీవించబోతున్నారు. ఏది మంచిదో దేవుడు ఒక్కడికే తెలుసు".

సోక్రటీస్‌ను జైలుకు తీసుకుపోయారు. తన భార్యాబిడ్డల్ని చెరసాలకు తీసుకురావద్దని అతడు తన మిత్రులతో చెప్పాడు. దానివల అందరి ఎదుట ఒక దృశ్యం సృష్టించబడుతుందని చెప్పి అతడు నిరాకరించాడు. మృత్యువును కలుసుకునేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు. మరణానికి సిద్ధంగా ఉన్న అతను స్టెషికోరోస్ అనే కవి రచించిన అతి కష్టసాధ్యమైన పాటను ఎవరో పాడుతుండగా విని ఆ పాటను తనకు నేర్పించమని ఆ గాయకుడిని అడిగాడు. అందుకా గాయకుడు "మరణానికి సిద్ధంగా ఉన్న నువ్వు ఈ  పాట నేరుచుకోని ఏం సాధిస్తావు?" అనడిగాడు. అందుకు సోక్రటీస్ "ఇంకో విషయం నేర్చుకోని మరణించాలని ఉంది" అని సమాధానమిచ్చాడు. ఆ తాత్వికుని సమాధానానికి అబ్బురపడిన ఆ గాయకుడు ఆ పాటను అతనికి నేర్పించాడు. ఆ పాట నేర్చుకున్న తరువాతే సోక్రటీస్‌ ప్రశాంతంగా విష పానీయాన్ని త్రాగాడు. ఆ మందు పనిచేసేందుకు కొద్దిగా నడిచాడు. కొంచెంసేపైన తరువాత మరణించాడు.  ప్రపంచంలో మేధావంతుడే ఆత్మబలిదానం చేసిన మొదటి మృతవీరుడు సోక్రటీస్. అతడు తత్వ శాస్త్రాన్ని స్వర్గం నుంచి విపణి వీధికి తీసుకువచ్చాడు. అత్యంత ప్రయాస భరితమైన సమయాల్లో కూడా కడదాకా న్యాయపంధాలోనే నడిచాడు.

ఓరుగల్లుకు లక్కవరం

ప్రకృతి ప్రేమగా చెక్కిన అందం...
నలుకొండల ఒడిలో..
గలగలాపారుతున్న సెలయేటి ప్రవాహంతో..
పక్షుల కిలకిలారావాలతో..
ప్రతీ హృదయం స్పందించే స్థలం..
కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి మెచ్చుతునక..
లెక్కలేని అందాలు ఇముడ్చుకున్న ఒక అద్భుతం.. లక్నవరం!

zindagi2 
వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఏటూర్‌నాగారం రహదారిలో ఉన్న బుస్సాపూర్ గ్రామపరిధిలో లక్నవరం సరస్సు కనువిందు చేస్తుంది. బుస్సాపూర్ గ్రామం నుంచి సుమారు 5 కిలోమీటర్లు ఘాట్‌రోడ్‌లో ప్రయాణించి లక్నవరం చేరుకోవచ్చు. మెలికలు తిరిగిన దారిగుండా ప్రయాణిస్తూ మట్టికోటలాంటి నిర్మాణానికి చేరుకోగానే సరస్సు ఒక్కసారిగా కనిపించడం ఇక్కడ ప్రత్యేకత! ఒకరకంగా చెప్పాలంటే దీన్ని ‘రహస్య చెరువు’గా చెప్పుకోవచ్చు. పచ్చటిదుప్పటి కప్పుకున్న కొండల నడుమ తొమ్మిది ద్వీపసమూహాలతో నయనానందకరంగా కనిపిస్తుంది. నగర కాలుష్యానికి అలవాటు పడిన ప్రతి ఒక్కరినీ ఇక్కడి వాతావరణం మరోలోకానికి తీసుకుపోతుంది. నిశ్చలంగా ఉన్న నీటిని, నిర్మలమైన పరిసరాలను ఆస్వాదించడమొక్కటే మనం చేయాల్సిన పని!

జీవధార...

zindagi4 
లక్నవరం చెరువు నిర్మాణం కాకతీయులకాలం నాటిదే. వారి శిల్పకళానైపుణ్యమే కాదు వ్యవసాయం కూడా ఘనమైనదే! అనువైనచోట నిర్మాణాలు చేపట్టడంలో కాకతీయులది అందెవేసిన చెయ్యి. తటాకాల నిర్మాణానికి సృజనాత్మకశక్తిని నమ్ముకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఎత్తైన కొండల్ని ఆసరాగా చేసుకొని లక్నవరం చెరువును తవ్వించారు. కాకతీయుల వంశపాలకులు గణపతిదేవుడు చేపట్టిన ఈ నిర్మాణం వల్ల అప్పటి ప్రజలకు లక్నవరం జీవధారగా మారింది. ఇప్పటికే వేలాది హెక్టార్లకు సాగునీరు అందిస్తూనే ఉంది. లక్నవరం మేడారం జాతరకు వచ్చే భక్తులను పునీతం చేస్తున్నది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే అతిపెద్ద గిరిజన జాతర కోసం జంపన్నవాగు ద్వారా ప్రవహించే నీటితో భక్తులు పవివూతస్నానం చేయడం ఆనవాయితీ. ఆ జంపన్నవాగుకు జీవాధారం లక్నవరమే!

తరగని పర్యాటక సంపద...

zindagi5 
ఇక్కడి పర్యాటక సంపదను చూసిన రాష్ట్రపర్యాటక శాఖ మూడు కోట్లరూపాయలతో పలు నిర్మాణాలు చేపట్టింది. తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్దబడ్జెట్‌తో నిర్మాణాలు చేయడం తొలిసారి. స్థానిక, స్థానికేతరులు అధికంగా సందర్శిస్తున్న ప్రాంతం కూడా ఇదే కావడం వల్ల లక్నవరానికి పర్యాటక కళ రోజురోజుకూ పెరుగుతున్నది. లక్నవరం సరస్సుకు చిన్నచిన్న ద్వీపాల్లాంటి సమూహాలు ప్రత్యేక ఆకర్షణ! ఒక్కో ద్వీపవూపాంతం ఒక కి.మీ నుంచి 3కి.మీ. చుట్టుకొలత కలిగి రమణీయంగా కనిపిస్తుంది. పర్యాటకశాఖవారు నడుపుతున్న బోటులో విహరిస్తుంటే మలేషియాదీవుల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. నిశబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చే చల్లనిగాలి స్పర్శ గిలిగింతలు పెడుతుంది. బోటులో వెళుతుంటే ఒక్కో ద్వీపం ఒక్కో ఆకారంలో కనిపిస్తుంది. వీటిలో ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని వనమూలికలతో ఆయుర్వేద వైద్యశాల నిర్మించుకోచ్చు. ప్రకృతివైద్యానికి ఇది అనువైన ప్రాంతంగా ఉంటుందని పర్యాటకశాఖ సైతం భావిస్తున్నది.

ఊయల వంతెన...

zindagi3లక్నవరంలో మానవనిర్మిత ఊయల వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి) ప్రత్యేక ఆకర్షణ! భారతదేశంలో అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జిలో ఒకటిగా దీన్ని నిర్మించారు. 180మీటర్ల పొడవుతో కాకరకాయల బోడుగా పిలుపుచుకునే దీవి వరకు ఇది ఉంటుంది. 2006లో పర్యాటక శాఖ 40లక్షల రూపాయలతో ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. కేరళకు చెందిన వంతెన నిర్మాణ నిపుణుడు భరద్వాజ్ పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. ఈ ఊయల వంతెనపై నడవడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి! ఏకకాలంలో వందల మంది నడిచినా లయబద్దంగా ఊగే ఈ వంతెనపై పదేపదే నడవడాన్ని పిల్లలు, పెద్దలు ఆస్వాదిస్తారు. కాకరకాయల బోడులోని పర్యాటకశాఖ కాటేజీలను చేరుకోవాలంటే ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్లాలి.

ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో ఉండే బ్రిడ్జి మధ్యలో ‘వ్యూ పాయింట్’ ఉంది. అక్కడి నుంచి సరస్సు అందాలు చూస్తూ తమను తాము ఫోటోల ద్వారా బంధించుకోవడం పర్యాటకుల నిత్యకృత్యం. మీదగ్గర కెమెరా లేకున్నా ఐదు నిమిషాలలో ఫోటో అందించే ఫోటోక్షిగాఫర్లూ ఇక్కడే ఉంటారు. కాకరకాయల బోడుపై పర్యాటకసంస్థ నిర్వహిస్తున్న హరిత హోటల్ ఉంది. 7రూమ్‌లు, ఒక రెస్టాంట్ ఉందక్కడ! ఒక్కో గదికి ఒక రోజుకు రూ.1470 ఛార్జీ చేస్తారు. సాధారణ పర్యాటకులకు అల్పాహారం, భోజనం కూడా లభిస్తాయి. సరస్సు మధ్యలో అద్దాల గదిలో ఉండే రెస్టాంట్‌లో భోజనప్రియులు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భోజనం ఆరగించొచ్చు. దూరంగా ఉన్న మరో ప్రాంతంలో రెండు ప్రత్యేక కాటేజీలు నిర్మించారు. పూర్తిగా విదేశీ(మలేషియా) గడ్డితో నిర్మించిన కాటేజీలు ప్రత్యేకంగా ఉంటాయి. పైకప్పుకు ప్రత్యేకమైన గడ్డి ఉండడం వల్ల గ్రామీణ వాతావరణంలా అనిపిస్తుంది. పైగా అనేక ఏళ్లు చెక్కుచెదరకుండా ఉంటుందట. లక్నవరం గదుల బుకింగ్ కోసం ఏపీటీడీసీ వారి వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. బోటింగ్ మాత్రం నిత్యం ఉంటుంది. ఊయల వంతెనపైకి రావాలంటే పెద్దలకైతే రూ.10, పిల్లలకు రూ.5 చెల్లించాలి.


అమృతానుభవం...


ఆస్వాదించాలే గానీ ఇక్కడి అందాలకు కొదవలేదు! ఏటా ఆగస్టు నుంచి జనవరి వరకు లక్నవరంలో ప్రతీ ఉదయం, సాయంవూతాలు పర్యాటకులకు అమృతానుభవాలే. వర్షాకాలం నిండుకుండలా ఉండే జలాశయం. కొండలపై నుంచి జారిన ప్రతీ నీటి చుక్క సరస్సుకు చేరుకున్న ఆనవాళ్లు కొత్తగా కనిస్తాయి. ప్రత్యేకించి డిసెంబర్ నెలలో మంచుపొగల్ని చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయం చలిలో రోమాంచితుల్ని చేస్తుంది. పరిచయమే లేని కొత్త దేశతీరాల్లో ఉన్నామనే భ్రమని కల్పిస్తుంది. బ్రహ్మ ఎంతో ప్రేమగా సృష్టించిన ప్రాంతం ఇదే కావచ్చు అనే అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సరస్సు మత్తడి అందాలు పర్యాటకులు కేరింతలు కొట్టేలా చేస్తాయి. ఊయల వంతెన నుంచి అరకి.మీ. దూరంలో మత్తడి నిర్మాణం, అక్కడి నుంచి మరో అర కిలోమీటరుదూరంలో తూము నిర్మాణాలు ఉన్నాయి. చెరువు నిండినప్పుడు తూము ద్వారా, మత్తడి ద్వారా ప్రవహించే నీరు పంటపొలాలకు చేరుకునేలా కాకతీయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

చారివూతక ఆనవాళ్లు..


కాకతీయులు చెరువులు నిర్మించిన ప్రతీచోట ఆలయ నిర్మాణాలు చేపట్టారు. కానీ లక్నవరం, పాఖాల సరస్సులను మాత్రం వ్యవసాయ కేంద్రాలుగానే భావించారని తెలుస్తున్నది. బుస్సాపూర్ గ్రామంలో, లక్నవరం అడవుల్లో చిన్న చిన్న గుడులు నిర్మించారు. కులదైవం రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన ఆనవాళ్లు అక్కడ కనబడతాయి. కొన్ని శిథిలం కాగా, బుస్సాపూర్ ఆలయం మాత్రం పునర్నిర్మాణానికి అనువుగా ఉంది. పాడిపంటలు సమృద్ధిగా పండాలని కాకతీయులు కులదైవాన్ని కొలిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. శిథిలమైపోతున్న ఆలయాలను పునరుద్ధరిస్తే లక్నవరానికి నిత్యం జలకళ ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

పర్యాటక సందడి...

zindagi6లక్నవరానికి వారాంతంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. వరంగల్ ప్రజలకు మంచి పిక్నిక్ స్పాట్! పాఠశాలలు, కళాశాలలు, కుటుంబాలు ప్రత్యేకంగా లక్నవరాన్ని సందర్శిస్తుంటాయి! గత ఏడాది జిల్లా నుంచి లక్నవరాన్ని 40 లక్షల మంది సందర్శించినట్లు పర్యాటకశాఖ లెక్కలు స్పష్టంచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడారం జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో లక్నవరాన్ని ఫిబ్రవరిలో 30 లక్షల పర్యాటకులు సందర్శిస్తారని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. లక్నవరం అతిపెద్ద పర్యాటక కేంద్రం అయినా సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు. జంగాలపల్లి, పస్రా రహదారిలో బుస్సాపూర్ గ్రామానికి మట్టిరోడ్డు మాత్రమే ఉంది. వర్షాలకు గుంతలు పడిపోవడంవల్ల ఈ దారిలో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ప్రచారలోపం వల్ల ఎక్కువమందికి లక్నవరం ప్రత్యేకతలు తెలియడంలేదు! రాష్ట్రస్థాయిలో పర్యాటకుల్ని ఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనివల్ల అక్కడి యువతకు, కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా లక్నవరంలో ప్రతీఏటా పదుల సంఖ్యలో సినిమా షూటింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. మరిన్ని వసతులు కల్పిస్తే సినిమాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.