Friday 11 July 2014

ఇందిరా గాంధీ మరణం వెనుక 1984 జూన్ 6వ తేదీ


1984 జూన్ 6వ తేదీన ఏం జరిగిందంటే, పంజాబులోని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై భారత సైనిక దళాలు దాడి చేశాయి. ఈ సందర్భంగా ఆధునిక ఆయుధాలు, రాకెట్ లాంచర్లతో సైన్యం జరిపిన దాడులలో దాదాపు 300 మంది సిక్కు ప్రజలు మరణించారు.

రెండు రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో 250 మంది సిక్కులు, 48 సైనికులు మరణించగా, 450 సిక్కులు పట్టుబడ్డారు. అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడులను "ఆపరేషన్ బ్లూ స్టార్"గా పిలుస్తారు. స్వర్ణ దేవాలయంపై జరిగిన ఈ దాడిలో సిక్కు నాయకుడు సంత్ జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలేను సైన్యం హతమార్చింది.


ఈ దాడుల నేపథ్యం ఏంటంటే... జూన్‌ 25, 1975న దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఆ
తరువాత, 1977లో ఎన్నికల ద్వారా మళ్ళీ ఒకసారి జమ్ము కాశ్మీరు ముఖ్యమంత్రి అయిన షేక్ అబ్దుల్లా మరణించడంతో, ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా 1982లో ఆ పదవికి ఎంపికయ్యాడు. 1983 ఏప్రిల్ 3వ తేదీ అకాలీదళ్ 'రాస్తారోకో' పిలుపు నివ్వడంతో పంజాబులో అలజడులు ఆరంభమయ్యాయి.

తమ పోరాటాన్ని ఉధృతం చేయడానికి 100,000 మందితో 'సైన్యం' ఏర్పాటు చేయగలమని దళ్
ప్రకటించింది. జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలే అనే తీవ్రవాది రెండు మతాల వారికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టాడు. అమృత్ సర్ లోని 'స్వర్ణ దేవాలయం' లో స్థావరం ఏర్పరుచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కాని అకాలీదళ్ అధ్యక్షుడు హర్ చంద్ సింగ్ లోంగోవాల్ తిరస్కరించాడు.

ఈ సందర్భంగా, భారత సైన్యం సిక్కు ప్రజానీకంపై దాడులు జరిపి చాలా మందిని చంపివేసింది. అదే విధంగా సిక్కు మిలిటెంట్లను లొంగదీసుకోవడంలో భాగంగా.. ఇందిరా గాంధీ స్వర్ణ దేవాలయంపై "ఆపరేషన్ బ్లూ స్టార్" పేరుతో సైనిక చర్యను నిర్వహించింది. ముందుగా ఆలయాన్ని చుట్టిముట్టిన సైన్యం, ఒక్కొక్కరిగా తీవ్రవాదులను హతమార్చి, మిగిలినవారిని బందీలుగా పట్టుకుని ఆలయాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంది.

అయితే... స్వర్ణ దేవాలయంలో జరిగిన 'ఆపరేషన్ బ్లూ స్టార్' ప్రయోగంతో సిక్కు‌లు చలించిపోయారు. దీనికి కారణమైన ఇందిరాగాంధీపై పగబట్టిన వారు, 1984 అక్టోబర్ 31వ తేదీన ఆమె స్వంత అంగరక్షకుల చేతనే కాల్పులు జరిపించి హతమార్చారు.

No comments:

Post a Comment