Thursday 10 July 2014

ఆధ్యాత్మిక శక్తులు కలిగిన మన ఇండియన్ ట్రీస్

భారతదేశం మొత్తం పలు మతాలు మరియు సంస్కృతు విస్తృతంగా వ్యాపించి ఉన్నారు. భారతదేశం ఆధ్యాత్మికతకు ఒక భూమి అంటారు.అటువంటి ఆధ్యాత్మికత కోసం ప్రపంచంలోని అన్ని మూలల నుండి వచ్చి సందర్శిస్తుంటారు. మన దేశంలో పురాతన శిల్పకలలు, దేవాలయాలు, మతాలు మరియు ఆధ్యాత్మికత యొక్క సారాంశంను ప్రతి రాష్ట్రంలోనూ కనుగొనవచ్చు. కొన్ని చెట్టు, పవిత్ర ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉన్నాయని మరియు కొన్ని సమయాల్లో దేవుల్లుగా పూజించేవారని చెప్పబడింది. అటువంటి ఆధ్యాత్మిక చెట్లలో, రాగి, కొబ్బరి చెట్టు, భాంగ్ మరియు గంధపు చెట్లు ఇండియాలో వివిధ రాష్ట్రాలలో పూజింపబడుతూ, హిందూ మతంలో వీటి మీద ఎక్కువ నమ్మకం కలిగి ఉన్నారు. మరో ముఖ్యమైనటువంటి ప్రముక చెట్టు కల్ప వ్రుక్షం . ఈ చెట్టుకు పూజలు చేయడం మాత్రమే కాదు, ఈ చెట్టులో కొన్ని వైద్యపరమైన ప్రయోజనాలు కూడా అధికంగా ఉన్నాయి. మన ఇండియాలో అటువంటి సూపర్ నేచురల్ పవర్ కలిగిన చెట్లు ....

బేల్ చెట్టు: 


బేల్ చెట్టు: బేల్ చెట్టు, దీన్ని బిల్ పత్రి ' చెట్టు అంటారు , ఇది శివుని యొక్క పవిత్ర మొక్కగా భావిస్తారు. ఈ చెట్టు యొక్క ఆకులు చాలా మంచిదని చెబుతారు . మూడు ముఖాలు గల ఈ ఆకులు సృష్టి , సంరక్షణ, వినాశనాన్ని ప్రతీకగా దేవుడు పనితీరుపై చిహ్నంగా భావిస్తారు

రావి చెట్టు :


రావి చెట్టు మూలమునందు, శాఖలయందు, స్కంధమునందు,ఫలములందు సర్వత్రా అచ్యుతుడు సమస్త దేవతలలో కూడి వున్నాడని స్కందపురాణం చెబుతోంది. రావి చెట్టును విష్ణు రూపం గా చెబుతారు కనుకనే రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి ఒకే పాదులో వేప చెట్టును, రావి చెట్టును పెంచి పెండ్లి చేస్తారు.ఇలా చేసి సాక్షాత్ లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినట్టుగా భావిస్తారు.రావి చెట్టు ఇంతటి మహిమతో కూడుకొని వుంది కనుకనే దీని పుల్లలను పవిత్రమైన యజ్ఞ యాగాదులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇతర విధాలుగా ఉపయోగించరు.

వెదురు చెట్టు:


బ్యాంబు (వెదురు)చెట్టు: బ్యాంబు ట్రీని శ్రీ కృష్ణుడుకి యొక్క పవిత్రమైన చెట్టుగా సంబంధం కలిగి ఉందంటారు. పురాణాల్లో శ్రీకృష్ణుని వేణువును వెదురుతో తయారుచేసిందే అని చెబుతారు. అందువల్ల వెదురు చెట్టుకు శ్రీకృష్ణుడికి ఇచ్చినంత ప్రాతినిధ్యం నిస్తారు. ఇది మన నవగ్రహాలలో బుథ గ్రహానికి చెందినది.ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దిన దినాభివృథ్ధి చెందుతుంది.(చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది.వ్యాపార సంస్థలలో నరథిష్టికి ' ఆకర్షణకు ,వ్యాపారభివృథ్థికి చాలా మంచిది .

గంధం చెట్టు:


గంధం చెట్టు, కేవలం ఈ చెట్టు యొక్క వాసన మరియు బ్యూటీ వెనిఫిట్స్ మాత్రమే కాదు, ఇది సుపర్ పవర్ కలిగి ఉంటుంది. ఈ చెట్టు పార్వతీ దేవి సంబంధించిన చెట్టుగా భావించి ఆరాధిస్తారు. గంధం పేస్ట్ తోనే గణేషుడిని స్రుష్టించడం జరిగిందని భావిస్తారు. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. అందుకే అందరు దేవతలకు, దేవుళ్లకు గంధంను విస్తృతంగా దేవతల ఆరాధనకు ఉపయోగిస్తారు .


భాంగ్ ట్రీ:


భాంగ్ ట్రీ: శివుని దేవాలయాలున్న ఏప్రదేశానికి మీరు సందర్శించినా, ఆ ప్రదేశంలో సాధువులు భంగ్ కొట్టడం మీరు కనుగొంటారు. . అందువల్ల , భంగ్ చెట్టు, నిజంగా సంపద మరియు శ్రేయస్సును తీసుకొస్తుందని చెప్పబడుతున్నాయి. మహాశివరాత్రి పండుగ సమయంలో శివును పూజింపుటకు ఎక్కువగా భంగ్ చెట్టు ఆకులను ఉపయోగించడం లేదా పూజకు పెట్టడం మీరు గమనించే ఉంటారు. అంతే కాదు, ఈఆకులతో ప్రసాధం కూడా తయారుచేస్తారు.

కొబ్బరి చెట్టు 


కొబ్బరి చెట్టు: ఇండియాలో కొబ్బరి చెట్టును తొలగించడం దుశ్శకునంగా పరిగణించబడుతుంది. కొబ్బరి చెట్టును కూడా కల్ప వ్రుక్షం అంటుంటారు. మరియు ప్రతి యొక్క శుభకార్యాలకు, పూజలకు కొబ్బరి కాయలను ఉపయోగిస్తుంటారు . ఈ చెట్టు కూడా శివుడికి సూచిస్తుంది.

No comments:

Post a Comment