Friday, 28 February 2014

చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ద్థంతి నేడు!!



భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు.

భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా (భాబ్ గా) గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.

1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.

విచారణ సందర్భంగా కోర్టులో "నీ పేరేంటి?" అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో "ఆజాద్" అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై (వందేమాతరం) అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.

సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారారు.

1928వ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన 'పంజాబ్ కేసరీ లాలాలజపతిరాయ్ మృతికి ప్రతికారంగా రాజ్ గురు, భగత్ సింగ్, బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్ ను కాల్చి చంపగా, సాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టబులు రాండ్ ను అజాద్ కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్ ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. అతనిని ప్రాణాలతో తీసుకువచ్చినా లేక చంపి తెచ్చినా 30 వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు. అ రోజు 1931, ఫిబ్రవరి 27, శుక్రవారం అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.

Thursday, 27 February 2014

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర.............


పరాయి పాలకుల అణచివేతపై తిరుగుబాటు జరిపి మాతృభూమిస్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించడానికిసైతం వెనుకాడకుండా భారతవీరులు పోరాటం ప్రారంభించిన కాలఘట్టం అది. వ్యాపారం కోసమని వచ్చిన ఆంగ్లేయులు తమ ఈస్‌‌ట ఇండియూ కంపెనీ ద్వారా దేశాన్ని వశపరచుకోవడం ప్రారంభించారు. అది 1857వ సంవత్సరం.
 అంతవరకు లోలోపల రగులుతూన్న తిరుగుబాటు జ్వాల ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలయింది. దురాక్రమణదారులు స్థానిక సంస్థానాలను ఏదో ఒక నెపం మీద ఆక్రమించుకోసాగారు. అలా వాళ్ళు ఝాన్సీ మీద దాడిని ప్రారంభించారు. అప్పుడు ఝాన్సీ కోట బురుజులపై నుంచి ఒక కంఠస్వరం ఉరుములా ఉరిమింది: ‘‘ఝాన్సీని వదులుకోవడమా? అసంభవం! ఎన్నటికీ సాధ్యపడదు. దమ్ములున్న వాడు ప్రయత్నించనీ!'' అలాంటి దృఢనిర్ణయంతో గర్జించింది ఏ రాజో కాదు.పట్టుమని ఇరవైయేళ్ళు కూడా నిండని ఝాన్సీరాణి లక్ష్మీబాయి






ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19 1828 – జూన్ 17 1858) , మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకొన్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారత దేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.



బాల్య జీవితం:-
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు 19 న మహారాష్ట్ర కు చెందిన సతర లో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసి లో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది.
ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండు గా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావు కు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్ వెంట మనూబాయి దుసుకొని పోయేది.






వివాహం:-

లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842 లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21వ తేదీన గంగాధరరావు మరణించాడు.


ఆక్రమణ


వివాహం తరువాత ఆమె పేరు లక్ష్మిబాయిగా మార్చబడినది. సభలో ఆమె తండ్రికున్న ప్రాభల్యం వలన, మిగిలినిన యువతులు, ఎవరైతే జెనన కి నిర్భంధం చేయబడి ఉంటారో, వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఈమెకు వుండేది.ఆమె సాయుధ దళం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది, అంతే కాకుండా తన స్నేహితురాల్లందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారుచేసింది.
1851 లో రాణి లక్ష్మిబాయి తన కుమారుడికి జన్మనిచ్చింది, కాని అతను తన నాలుగు నెలల వయస్సులోనే చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయిన తరువాత , ఝాన్సీ యొక్క రాజు మరియు రాణి దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకొన్నారు. కాని రాజు అయిన ఆమె భర్త తన కుమారుడి మరణం నుంచి తేరుకోలేక , 21 నవంబర్ 1853 లో పగిలిన హృదయముతో చాలా బాధ పడుతూ చనిపోయాడని చెప్పబడింది. వీరు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదర్ రావు రాజా కు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున, ఈస్ట్ ఇండియా కంపనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డెల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.




గొప్ప తిరుగుబాటు:-


రాణి ఝాన్సీ ని ఇవ్వకూడదని నిశ్చయించుకొన్నది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి మరియు తమకు తాముగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సేనను తయారుచేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడినది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్ , దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భు బక్షి, మోతీ బాయి , సుందర్-ముందర్ , ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు.
1857 స్వాతంత్ర్య పోరాటం:-




                              అప్పటి వరకు, బ్రిటిష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సంశయించిన కాని,జూన్ 8 1857 జోఖన్ బాఘ్ లో బ్రిటిష్ HEIC అధికారుల, వాళ్ళ భార్య, పిల్లల "జన సంహారం" లో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదము గానే నిలిచిపోయింది.చివరికి మార్చి 23 1858 లో బ్రిటిష్ బలగాలు సర్ హుఘ్ రోజ్వశములో ఝాన్సీ ని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది. ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగ కూడదని ఆమె నిర్ణయించుకొంది. యుద్ధము సుమారు రెండు వారాలు జరిగింది. ఝాన్సీ నిర్మూలన చాలా భయంకరమైనది. ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు తిను భండరములను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.


                           ఝాన్సీ లో ఇవన్నీ జరుగుతున్నపుడు, మే 10,1857 లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసినా కాని,వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి ,ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంప బడిన వాళ్ళలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొన్నారు.


                                                          ఇంతలో, మే 1857, లో భారత దేశం లో కలవరం ప్రాకడం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో ,బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించవలసినదిగా నిర్భందం రావడంతో ,ఝాన్సీ ని లక్ష్మిబాయి పరిపాలించవలసిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ తన సమర్థత కారణం వలన లక్ష్మిబాయి మధ్య కాలంలో వచ్చిన సామ్రాట్ల కలవర సమయములో కూడా ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

                                        ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీ కి స్వేచ్చ కలిగించి లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది. మార్చి 31 లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర లెక్కకి 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నాకాని , "ఏ శిక్షణ లేని వాళ్ళ కంటే" వీళ్ళు చాలా శిక్షణ పొందినవాళ్ళు, మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో ,బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది,ఆ రక్షకులలో చాలా మంది తన మహిళా సైన్యం నుండి ఉన్నవారే.

1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబర్ మరియు అక్టోబర్ 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా మరియు ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.
                                  
                                     జనవరి 1858 లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకునితాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.
ఆమె, చిన్నవాడు అయిన దామోదర్ రావు, మరియు తన బలగాలతో కల్పి కి పారిపోయి తాత్యా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి మరియు తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. కాని,17 జూన్ 1858 , లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది.ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.


“ తనతో పాటు ఆమెను తీసుకు వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెన ను తెమ్మని పురమాయించింది. దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి వామి పైకి ఎక్కి దాన్ని తగుల బెట్టమని చెప్పింది. ఆమె అనుచరులు అలాగే చేశారు. ఇది ఫూల్ భాగ్ వద్దనున్న గుసైన్ బాగ్ వద్ద జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూశాను. ”


తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.



మరణం:-

ఆమె 18 జూన్ , 1858 లో గ్వాలియర్ తో యుద్ధ సమయములో తన ఎనిమిదొవ యుద్ధ గుర్రంతో మరణించింది, అది గ్వాలియర్లోని ఫూల్ బాఘ్ దగ్గర కోతః-కి-సేరి లో జరిగింది. ఆమె యుద్ధ వీరులకు యుద్ధ బట్టలు తొడిగించి గ్వాలియర్ కోటను రక్షించటానికి యుద్ధానికి తీసుకెళ్ళింది,ఇది ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లోఉండే లక్నోకి పడమరగా 120 మైళ్ళ దూరంలో ఉంది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు గ్వాలియర్ ను ఆక్రమించుకొన్నారు. గ్వాలియర్ యుద్ధ నివేదిక ప్రకారం , గెనరల్ సర్ హుఘ్ రోస్ ఆమెని "చాలా చెప్పుకోదగిన అందమైనది,తెలివైనది, మరియు పట్టుదల కలది"అని "తిరుగుబాటు నాయకులలో కెల్లా అతి భయంకరమైనది" అని విర్శించారు.
కాని , కొరతగా ఉన్న శవాన్ని గుర్తించి, అది రాణి అని నమ్మించారని " పరాక్రమ" పటాలముగా చెప్పబడే ఆమె గ్వాలియర్ యుద్ధంలో చనిపోలేదని కెప్టన్ రీస్ నమ్మబడి , "[ది] ఝాన్సీ మహారాణి బ్రతికే ఉంది!" అని బహిరంగంగా ప్రకటించాడు. ఆమె ఎక్కడైతే మరణిచిందో అక్కడే అదే రోజు ఆమెకు అంత్య క్రియలు జరిగాయని నమ్మకం. ఆమె పరిచారికలలో ఒకరు అంత్యక్రియల సన్నాహాలకు సహాయపడింది.
ఆమెకున్న ధైర్యము, పరాక్రమము, మరియు వివేకము, భారత దేశంలో 19 వ శతాబ్దములో మహిళలకున్న అధికారం పై ఆమెకున్న ముందుచూపు , మరియు ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపింది. ఝాన్సీ మరియు గ్వాలియర్ లలో ఆమె గుర్తుగా కంచువిగ్రహాలను స్థాపించారు,రెండింటిలోను ఆమె గుర్రం పైన కూర్చున్నట్టుగా చిత్రీకరించారు.

ఝాన్సీ అధికారం పోయిన కొన్ని రోజులకే ఆమె తండ్రి అయిన, మోరోపంత్ తమ్బేని పట్టుకొని ఉరితీసారు. .తన దత్త పుత్రుడైన దామోదర్ రావు , బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భరణం ఇవ్వబడ్డాడు , కాని అతనెప్పుడు తమ పిత్రార్జితాన్ని అందుకోలేదు.

Wednesday, 26 February 2014

16-Aug-1947 First News of Independent INDIA from the newspaper hindustan times... A Very Rare Photo...


సంతు మీరాబాయి చరిత్ర.......


రాజపుత్ర యువరాణి మీరాబాయి వాయువ్య భారతదేశపు రాజస్థాన్లోని ప్రస్తుతం నాగపూర్ జిల్లాలో ఉన్న మెర్టా దగ్గరి చిన్న పల్లెటూరు కుడ్కీ (కుర్కీ) లో జన్మించింది. ఆమె తండ్రి రతన్ సింగ్ రాథోడ్.
మీరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సాధువుని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన కృష్ణుడి విగ్రహాన్ని ఘాడంగా మోహించింది, దీనిని ఆమె జీవితాంతం ఆమె దగ్గరే ఉంచుకుంది. ఆమె తల్లి ఆమె ఆధ్యాత్మిక భావనలకు మద్ధతునిచ్చేది కానీ ఆమె త్వరగా చనిపోయారు.

మీరా వివాహం ఆమె చిన్న వయస్సులోనే చిత్తోడ్ రాణా సంగా పెద్ద కొడుకు భోజ్ రాజ్ యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది. కాని తనని తానూ శ్రీ కృష్ణుని భార్యగా భావించుకునే మీరాకు ఈ వివాహం సంతోషం కలిగించలేదు. ఆమె కృష్ణుణ్ణి మాత్రమే నిజంగా పెళ్ళి చేసుకున్నానన్న భావనలో ఉండేది. ఆమె తననితాను కృష్ణుడి ప్రేమలో పిచ్చిదైన 'గోపిక లలిత' పునర్జన్మగా భావించేది.
మిరాబాయికి ప్రాపంచిక సుఖాలమీద విరక్తి కలిగింది. శ్రీకృష్ణునిపై విశ్వాసం, భక్తి స్థిరపడిపోయింది. తరచు దివ్యోన్మాదంతో తన్మయం పొందుతూండేది. దేవాలయంలో శ్రీకృష్ణుని దివ్య విగ్రహహం ముందు కూర్చుని కూర్చి పాడుతూండేది. ఈమెపాడే పాటలకు ముగ్ధులై అనేక మంది భక్తులు చేరేవారు. ఏమే పారమార్థిక జీవితం ఉపద్రవకరంగా ఉందని రాజవంశీయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోడానికి ఈమెను హత్యచేయడానికి ప్రయత్నించారు.
ఒక బుట్టలో పామును పెట్టి పూవులదండ అని చెప్పి ఆమె ఆ పామును పూలమాలగా కంఠంలో ధరించింది.మరొకసారి ఒక చిన్న బంగారుగిన్నెలో విషం కలిపిన పాలు ఇచ్చారు. నిర్భయంగా ఆ పాలను త్రాగింది.

 

ఒకానొక సమయంలో మీరా కృష్ణాయిజానికి కేంద్రమైన బృందావనానికి వెళ్ళిపోయింది. ఇందులో ఒకచోట ఆమె ఆ సమయంలో బృందావనంలో గురు సాధువు చైతన్య ప్రత్యక్ష అనుయాయి రూపా గోస్వామితో ఆధ్యాత్మిక విషయాలను గురించిన చర్చ జరపాలన్న కోరిక వెలిబుచ్చింది, ఘోటక బ్రహ్మచారి అయిన ఆయన ఒక స్త్రీని కలవడానికి నిరాకరించారు. దీనికి మీరా ఈ విశ్వంలో నిజమైన పురుషుడు కేవలం కృష్ణుడు మాత్రమే అని బదులిచ్చింది. ఆమె తన తీర్థయాత్రను కొనసాగిస్తూ "ఒక గ్రామంనుంచి ఇంకొక గ్రామానికి నాట్యం చేస్తూ వెళుతూ దాదాపు మొత్తం ఉత్తర భారతాన్నంతా చుట్టింది". ఆమె తన జీవిత చరమాంకాన్ని భక్తురాలిగా గుజరాత్ లోని ద్వారకలో గడిపింది.
కృష్ణుడితో కలయికకై ఆమె పడే తపన ఆమె కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె "నీలపు రంగు కావాలని" (కృష్ణుడి రంగు) కోరుకొనేది. ద్వారకలో మీరా శ్రీకృష్ణ విగ్రహం ముందు నిలిచి వెళ్ళడానికి అనుజ్ఞ ఇమ్మని వేడుకుంది. నాట్యంచేసి శ్రీకృష్ణునిపై రచించిన భక్తి పాటలు పాడింది. శ్రీకృష్ణ విగ్రహం పాదాలపై బడి పాదాలను కళ్ళకు అద్దుకుంది. చూస్తూండగానే శ్రీ కృష్ణ విగ్రహంతో ఐక్యమైపోయింది.

Tuesday, 25 February 2014

మన చరిత్ర...మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని బయటి ప్రపంచానికి చాటి చెప్పింది........

192 కిలోమీటర్ల పొడవు...

192 కిలోమీటర్ల వెడల్పు..

36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..

బారులు తీరిన వీధులు..

వీధుల వెంట బారులు తీరిన చెట్లు..

రాయల్‌ ప్యాలెస్‌లు..

రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..

కమర్షియల్‌ మాల్స్‌..

కమ్యూనిటీ హాల్స్‌..

క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే

అపూర్వ మహానగరం..

రత్నస్తంభాలు..

వజ్ర తోరణాలు..

సాటిలేని ఆర్కిటెక్చర్‌..

సముద్రం మధ్యలో మహా నిర్మాణం..

జగన్నాథుడి జగదేక సృష్టి..

క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి

లెజెండ్‌ సిటీ...

ద్వారక..

ఇప్పుడు సాగర గర్భంలో..

మన నాగరికత..

మన సంస్కృతి..

మన ప్రతిభకు పట్టం కట్టిన

నాటి కాస్మోపాలిటన్‌ సిటీ..


ద్వారక
----------------------------
అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం.. వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్‌ నిజం.. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్‌ నిజం.. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా..

1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..

ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది..

మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్‌ ఏస్‌.ఆర్‌. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..
శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి... మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు.. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు..

శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది..

-------------------
ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్‌ నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్‌ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.

ఈ నిర్మాణం కూడా అలాంటిలాంటి సెユ్టల్‌ కాదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి..

పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..
నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్‌ యుటిలిటీస్‌, భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి..

బ్యూటీకే.. బ్యూటీ... అందమైన గార్డెన్‌లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు.

----------------------------
రామాయణ కాలంలో రావణుడి ఎయిర్‌పోర్ట్‌లను కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది.. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది..

న్యూయార్క్‌ సిటీ, వాషింగ్టన్‌ డిసి, లండన్‌, మాస్కో, బీజింగ్‌, టోక్యో, ముంబయి.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే మహానగరాలు.. మెట్రో పాలిటన్‌ సిటీలు.. కాస్మో పాలిటన్‌ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు..

ఈ మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల రెట్లు అడ్వాన్స్‌డ్‌ అభివృద్ధితో అపురూప నగర నిర్మాణం ఆనాడే జరిగింది. అదే ద్వారక.. ఇక్కడ కేవలం కమర్షియల్‌ జోన్లు ఏర్పాటు చేయటమే కాదు. సాగర తీరంలో గొప్ప హార్బర్‌ను కూడా యాదవ రాజులు సక్సెస్‌గా నిర్వహించారు. గ్రీకు, ఇతర దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.

ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ఎస్‌ఆర్‌ రావు పరిశోధనల్లో ద్వారక ఆరు ప్రధాన రంగాల్లో ద్వారక అభివృద్ధిని సాధించిందని ధృవీకరించారు. ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి గా పిలిచేవారని కూడా తేల్చారు..
క్రీస్తుపూర్వం 3138లో మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు.. ఆ తరువాత యాదవ రాజుల మధ్య పరస్పరం గొడవలతో ఒకరికొకరు చంపుకున్నారు.. ఆ తరువాత కొంతకాలానికే శ్రీకృష్ణుడు దేహ పరిత్యాగం చేసి భూమిని విడిచివెళ్లిపోయాడు..ఈ భూమిపై కృష్ణుడు నివసించింది 120 సంవత్సరాలు. కృష్ణ నిర్యాణానంతరం ద్వారకను సముద్రం ముంచివేసింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను ప్రత్యక్షంగా చూసినట్లు అర్జునుడు మహాభారతంలో చెప్తాడు..

సాగర గర్భంలో మునిగిపోయింది మునిగిపోగా.. తీరం వెంట కూడా ద్వారకకు సంబంధించిన, కృష్ణుడి రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం కనిపించే ద్వారకాధీశ్‌ ఆలయం కూడా కృష్ణుడి మనవడు వజ్రనాభుడే నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది...అసాధారణ భారతీయ ప్రతిభకు, నాగరికతకు, సంస్కృతికి ఎవరెస్ట్‌ శిఖరమంత కీర్తి