సత్యజిత్ రే (మే 2 1921–ఏప్రిల్ 23 1992) ఒక భారత చలనచిత్ర నిర్మాత. ఆతను ప్రపంచములో నే గొప్ప 20వ శతాబ్దపు సినీ దర్శకుని గా ఖ్యాతి సంపాదించారు. కలకత్తా లో బెంగాలీ కళాకారులు పత్రకారుల కుటుంబము లో జన్మించిన సత్యజిత్ రే ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా లో మరియు రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోని విశ్వభారతి విద్యాలయము లో చదివారు. కమర్షియల్ కళాకారునిగా కెరీర్ ప్రారంబించిన రే, లండన్ లో ఫ్రెంచి నిర్మాత జాన్ రెన్వా ను కలిసి ఇటాలియన్ నియోరియలిజమ్ సినిమా బైసికిల్ థీవ్స్ తరువాత సినిమాల వైపుకి తిరిగారు.
రే సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తము ముప్పై ఏడు విత్రాలకు దర్శకత్వము వహించారు. రే మొదటి సినిమా పథేర్ పాంచాలీ, కేన్స్ చలనిచిత్రోత్సవము లో 11 అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. సినిమాల లో రే స్క్రీన్ ప్లే (కథాగమనము), కేస్టింగ్ (నట సారథ్యము), సంగీతము, సినిమెటోగ్రాఫీ, కళా దర్శకత్వము, కూర్పు , తన ప్రచార సాధనాలను డిజైన్ చేసుకోవడము కూడా చేసేవారు. సినిమాలు తియ్యడమే కాకుండా రే ఫిక్షన్ రచయత, ప్రచురణ కర్త కూడా. అనేక అవార్డులు పుచ్చుకున్న రే 1992 లో ఆస్కార్ కూడా అందుకున్నారు.
రే తాత ఉపేంద్రకిషోర్ రే చౌదరి, ఒక రచయత, తత్త్వవేత్త, ప్రచురణకర్త మరియు బ్రహ్మ సమాజం నాయకుడు. ఉపేంద్రకిషోర్ కొడుకు సుకుమార్ బెంగాలీ లో నాన్సెన్స్ కవిత్వము (అంటే యతి ప్రాసలు లేకుండా వింతగా ఉండి, నవ్వు పుట్టించే కవిత్వము), బాల సాహిత్యవేత్త మరియు విమర్శకుడు. రే సుకుమార్, సుప్రభ దంపతులకు జన్మించాడు. రే కు 3 సంవత్సరములు ఉన్నపుడు సుకుమార్ చనిపోగా సుప్రభ చిన్న ఆదాయము తో రేని పెంచింది.రే కళల పై ఆసక్తి ఉన్నపటికీ ప్రెసిడెన్సీ కాలేజీ లో అర్థశాస్త్రము చదివాడు. శాంతినికేతన్ పై చిన్న చూపు ఉన్నపటికీ తల్లి ప్రోద్బలము తో టేగోర్ కుటుంబము పై గౌరవము తో విశ్వభారతికి వెళ్ళాడు. అక్కడ ప్రాచ్య కళలు (ఓరియంటల్ ఆర్ట్) లను ఆభ్యసించాడు. ప్రముఖ పెయింటర్లు నందలాల్ బోస్ వినోద్ బిహారీ ముఖర్జీ నుంచి నేర్చుకున్నాడు , అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు దర్శించి భారతీయ కళల పై మక్కువ పెంచుకున్నాడు. సత్యజిత్ రే మరణానంతరం భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆయన పై ఓ స్టాంపును విడుదల చేసింది.ఆయన భార్య విజయా రే (బిజొయా రే).
రచయితగా సత్యజిత్ రే:
ప్రపంచానికి సత్యజిత్ రే ఒక దర్శకుడిగా మాత్రమే తెలిసినా కూడా సత్యజిత్ రే బెంగాలీ లో ఎన్నో రచనలు ఛేసారు. తన తాత ప్రారంబించిన "సందేశ్" పత్రిక మధ్యలో ఆగిపోతే సత్యజిత్ రే తిరిగి ప్రారంభించారు. ఇది చిన్న పిల్లల కోసం ప్రారంభింపబడిన పత్రిక. ఇందులోనే సత్యజిత్ రే పిల్లల కోసం "ఫెలూదా" అన్న డిటెక్టివ్ ని సృష్టించారు. 1965 మొదలుకుని 1994 దాకా 35 ఫెలూదా నవలలు రాసారు. ఇందులో ఫెలూదా, అతని కజిన్ తపేష్ మరియు జటాయు అని పిలువబడు లాల్ మోహన్ గంగూలీ ప్రధాన పాత్రలు. వీరు ముగ్గురు కలిసి పరిష్కరించే సమస్యల సంకలనమే ఫెలూదా కథలు.
ఇది కాక సత్యజిత్ రే ప్రొఫెసర్ శొంకు అన్న మరో పాత్ర ని కూడా సృష్టించి నవలలు రాసారు. బెంగాలీ పిల్లల సాహిత్యం లో ఈ రెండు పాత్రలకి ఓ విశిష్ట స్థానం ఉంది.
సత్యజిత్ రే కథా రచయిత కూడా. ఆయన రాసిన కథలు ఆయనకు వివిధ రంగాలలో ఉన్న విశేష పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఆయన రచనల్లో చాలా వరకు గోపా మజుందార్ ఆంగ్లానువాదం చేసారు. సత్యజిత్ రే పిల్లల నవల - "ఫతిక్ చంద్" తెలుగు లోకి కూడా అనువదితమైంది.
ఆయన కథా సంకలనాలలో కొన్ని:
1. 20 short stories
2. Stranger and other stories (20 short stories above + Fotik chand)
3. The Best of Satyajit Ray
- ఆయన కథలన్నీ మొదట పన్నెండు కథల సంకలనాలుగా వచ్చాయి. పన్నెండు కి రకరకాల నామాంతరాలతో విడుదల కావడం వాటి ప్రత్యేకత. ఉదాహరణ కు "డజన్", "టూ ఆన్ టాప్ ఆఫ్ టెన్" వగైరా. ఆయన ఫెలూదా కథల జాబితా ని ఇక్కడ చూడవచ్చు.
No comments:
Post a Comment