డబ్బులు తిన్న కీటకాలు....2011 లో లక్నో లో ఉన్న ఒక బ్యాంకులోని స్టీల్
లాకర్లో ఉంచిన 10 మిల్లియన్ రూపాయలను చదలు తినేసినయట. ఈ సంఘటనను విచారించిన
అధికారులకు చదలు ఎలా స్టీలు లాకర్లఒకి వెళ్లినయో అంతుబట్టలేదట.
2009 లో హాలండ్ దేశంలో ఒక కారుపై గొంగళి పురుగులు దాడి చేసి, కారు చుట్టూ సాలె పట్టు/గూడు తో కప్పేసినై.
2014 లో న్యూ మెక్సికో నగరంలో మిడతల దాడి జరిగింది. ఎన్ని మిడతలుంటాయంటే లెక్క కట్టలేరు గానీ, వాతి సంచారం రాడార్లలో కనబడ్డయంటే ఎన్నో ఊహించుకోవచ్చు.
అమెరికాలోని లోవా అనే రాష్ట్రంలో 2011 లో జలసంబంధ కీటకాలు ఒక్క సారిగా దాడిచేసినై. మొక్కజొన్న పంటలకు ప్రసిద్ది చిందిన ఈ రాష్ట్రంలో మొక్క జొన్న పంటకు పెద్దగా నష్టం జరగకపోయినా కీటకాలను తొలగించటానికి ఖర్చు ఎక్కువైందట.
ఆస్ట్రేలియా నగమలోని ఈస్ట్ కొస్ట్ నగర సముద్రతీరాన 2011 లో పేడపురుగుల దాడి జరిగింది. దురద్రుష్ట వసాత్తూ అటుగా మోటర్ సైకిల్ పై వెడుతున్న ఒక వ్యక్తి వాటి దాటికి తట్టుకోలేక మోటర్ సైకిల్తో సహా పడిపోయేడు. శరీరంలోని చాలాచోట్ల బొమికలు విరిగి 6 నెలలపాటూ ఆసుపత్రిలో గడిపి కోలుకుంటున్నాడు.
1902 లో ఫ్రాన్స్ దేశంలోని అగ్నిపర్వత పేలుడు వలన కీటకాలూ, పాములూ అగ్నిపర్వతానికి దగ్గరలో ఉన్న గ్రామములోకి వచ్చి ఎంతో ప్రాణ నష్టానికి కారణమయ్యేయట.
అమెరికా నగరమైన హోస్టన్ ఎర్ర చీమల దాడికి గురికాబడింది. దీని వలన ఆనగరంలో అప్పుడప్పుడు కరెంటు పోతోందట. చీమలు కరెంటు తీగలను తినడంవలన షార్ట్ సర్క్యూట్ ఏర్పడి చాలా ఇబ్బందులకు గురౌతున్నారట.
7 ఏళ్లకొకసారి యిలకోడి యనే పురుగులు అమెరిక ఈస్ట్ కొస్ట్ ప్రాంతాన్ని దాడిచేస్తాయట. సహజంగా ఈ పురుగులు భూమి క్రిందే ఉంటాయట. భూమి వేడెక్కినప్పుడు బయటకు వస్తాయట.
No comments:
Post a Comment