Wednesday, 9 July 2014

అజంతా, ఎల్లోరా గుహలు....

అజంతా గుహలు:

మహారాష్ట్ర లోని అజంతా గుహలు రాతి శిల్పకళ ను కలిగిన గుహ నిర్మాణాలు. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దము నకు చెందినవి. ఇక్కడి శిల్ప చిత్ర కళలు బౌద్దమత కళకు చెందినవి. మరియు 'విశ్వజనీయ చిత్రకళలు'.ఔరంగాబాద్ జిల్లా లోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న అజంతా గుహలు మనకు వారసత్వంగా అందిన అపురూపమైన చారిత్రక సంపద. ఇవి సుమారుగా క్రీ.పూ. రెండవ శతాబ్దం నాటివని చెబుతారు. ఇక్కడ కనబడుతున్న చిత్రకళలో ఎక్కువ భాగం బౌద్ధ మతానికి చెందినవి. గుహల లోపల అద్భుతమైన నిర్మాణ సౌందర్యం కనబడుతుంది. అజంతా గ్రామము బైట ఉన్న ఈ గుహలు 1983 నుండి యునెస్కో (ఊణేశ్ఛో) వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా పరిగణించబడుతున్నాయి. ఔరంగాబాద్‌ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల ఈ గుహలు ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండపై ఇవి నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి.

ఎల్లోరా:


గ్రామము మహారాష్ట్ర లో ఔరంగాబాద్ కు 30 కి.మి. (18.6 మైళ్ళు) దూరము లో ఉన్నది. మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ది చెందిన ఎల్లోరా ప్రపంచ వారసత్వ సంపద. ఎల్లోరా భారతీయ రాతి శిల్పకళను ప్రతిబింబిస్తుంది. [1] చరణధారీ కొండల నుండి తవ్వబడిన ఈ గుహలు హిందూ, బౌద్ద, జైన దేవాలయాలు మరియు సన్యాసాశ్రమాలు. 5వ శతాబ్దము నుండి 10వ శతాబ్దము మధ్యలో నిర్మించబడ్డవి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. (12బౌద్ద గుహలు - నిర్మాణం -600-800 బి.సి.), 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక థల ను తెలుపుతాయి.(17 హిందూ గుహలు -నిర్మాణం - 600-900 బి.సి.), 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. (5 జైన్ గుహలు - నిర్మాణం - 800-1000 బి.సి.) పక్క పక్కన ఉండి ఆ కాలపు పరమత సహానాన్ని చూపిస్తున్నాయి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కి.మీ. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టింది. ఇవి యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి.

ఇందులో భౌద్ద ఛైత్యాలు, ప్రార్థనా మందిరాలు, విహారాలు, ఆరామాలు, హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. మూడు మతాల భావ సంగమం ఇది. ఎల్లోరా ని అక్కడి స్థానికులు వేరులిని అని పిలుస్తారు.

No comments:

Post a Comment