నెత్తురు రంగు లేక ఎర్ర రంగు కలిగిన నీరున్న మర్మమైన చెఱువు(పచ్చ నీటి చెరువు మరియూ పసుపు నీటి చెరువు లను కూడా చూడండి).....
ఉత్తర చిలి దేశంలోని కెమినా నగరానికి 147 కిలోమీటర్ల దూరంలో సముద్ర
మట్టానికి 3,700 ఎత్తులో ఉన్న మర్మమైన ఈ చెరువు లోని నీరు నెత్తుటి గంగు
లేక ఎర్ర రంగు నీటితో నిండి ఉంటుంది. ఏ మ్యాపులోనూ చూపబడని ఈ చెరువు
అక్కడున్న నివాసకులకు మాత్రమే ఉందని తెలుసు. 2009 వరకు చిలి దేశ పర్యాటక
సంఘానికి కూడా ఈ చెరువున్న సంగతి తెలియలేదు.
పూర్వం ఇక్కడ అయమరా జాతి సంస్కృతి వారు నివసించేవారు. వీరు వారి
సంస్కృతి గురించి, దేశ ఆచారాల గురించి, దేశ పెద్దల గురించిన రహస్యాలను
కాపాడేవారట. ఈ విషయం గూడా ఈ మధ్యే తెలుసుకోగలిగేరు. ఈజిప్ట్ పిరమిడ్ సమాధుల
శాపాల గురించిన మర్మం ఎలా రహస్యంగా ఉంచబడ్డయో ఈ చెరువు గురించిన శాపాం
గూడా అంతే రహస్యంగా ఉంచబడింది. అందువలనే ఈ చెరువు ప్రపంచానికి తెలియరాలేదట.
ఈ చెరువులోని నీటిని ముట్టుకుంటే, లేక ఈ చెరువు దగ్గరకు ఎవరు వెళ్లినా
వారు శాపానికి గురౌతారట. అందువలనే ఈ చెరువు గురించి ఎవరికీ చెప్పలేదట.
అందువలనేఅ ఈ చెరువు ఏ మ్యాపులోనూ కనబడలేదు. ఈ చెరువు నీరు తాగినందువలనే
అయమరా జాతి సంస్కృతి వారిలో అనేక మంది చనిపోయేరని చెబుతారు. ఈ ఎర్ర చెరువు
ను చుట్టి ఒక పచ్చ నీటి చెరువు మరియూ పసుపు నీటి చెరువూ ఉన్నాయట. ఇ
చెరువుల దగ్గరకు ఎవరైనా వెడితే ఆ చెరువుల లోని నీరు బుడగలతో పైకి
ఎగతన్నుకుని వస్తుందట. అందువలన ఈ చెరువులు దెయ్యాలకు సొంతమని అక్కడి ప్రజల
విశ్వాశం.
పచ్చ నీటి చెరువు
పసుపు నీటి చెరువు
No comments:
Post a Comment