Tuesday, 8 July 2014

20 వ శతాబ్ధంలో మాయమైపోయిన దేశాలు.....

East Germany, 1949-1990

 
 
రెండవ ప్రపంచ యుద్దం తరువాత జెర్మనీ దేశాన్ని రెండుగా విభజించినప్పుడు ఏర్పడినదే ఈస్ట్ జర్మనీ. కమ్యూనిజం పడిపోయిన తరువాత ఈస్ట్ జెర్మనీ, వెస్ట్ జర్మనీతో కలిసిపోయి ఇప్పుడు జర్మనీగా ఉన్నది.

Czechoslovakia, 1918-1992

 
 
1939లో జర్మనీచే ఆక్రమించబడి, ఆ తరువాత 1991 వరకు సోవియట్ రష్యా వారి చే ఆక్రమించబడి, ఆ తరువాత రెండుగా విడిపోయింది. ఇప్పుడు Czech Republic దేశం గానూ, Slovakia దేశంగానూ ఉన్నది.

Yugoslavia, 1918-1992

 
 
ఒకప్పుడు హంగేరీ సామ్రాజ్యముగా ఉన్న ఈ దేశం మొదటి ప్రపంచ యుద్దం తరువాత అందులోనుండి విడిపోయి హంగేరీ మరియూ సెర్బియా అని రెండు దేశాలుగా ఏర్పడింది. 1941 నుండి 1945 వరకు నాజీ జెర్మనీ చే ఆక్రమించబడి వారి పరిపాలనలో ఉన్నది. 1945 లో నాజీ జెర్మనీ పతనం తరువాత మార్షల్ జోసఫ్ టీటో అధికారంలో సర్వధికార దేశంగా ఉండిపోయింది. సోవియట్ రష్యా ఆక్రమన ప్రయత్నాలను తిప్పికొట్టింది. 1992 వరకు స్వతంత్రదేశముగా ఉన్న యుగస్లొవియా 1992 లో అంతర్యుద్దం వలన 6 దేశాలుగా విడిపోయింది.ఇప్పుడు అది Slovenia, Croatia, Bosnia, Serbia, Macedonia, and Montenegro దేశాలుగా మారింది.
 

Austro-Hungary, 1867-1918

 
 
ఎన్నో దేశాలు మొదటి ప్రపంచ యుద్దం తరువాత అర్ధీకంగా దెబ్బ తిని, విడిపోయో లేక వేరొకరి పాలనలోకి వెల్లిపోయినా ఈ దేశం మాత్రం కట్టుబడి ఒక్కటిగానే యున్నది. అయితే ఎన్నో మతాలూ, వేరు వేరు జాతి మనుష్యులూ ఉండటంతో తాముగా సామ్రాజ్యాన్ని రద్దుచేసుకుని తరువాత Austria, Hungary, Czechoslovakia, and Yugoslavia,, కొంత భాగం Italy, Poland, and Romania గా మారినై.
 

Tibet, 1913-1951

 
టిబెట్ అనేది 1000 సంవత్సరాలకు పైగా ఉన్నా, 1913 లో డలైలామాలచే ప్రత్యేక దేశంగా అవతరించింది. 1951లో మావో అధికారంలోని కమ్యూనిస్ట్ చైనా టిబెట్ ను ఆక్రమించుకుని, అది తమదేశంలోని భాగమేనని ప్రకటించింది.

South Vietnam, 1955-1975

 
1954లో ఫ్రెంచ్ పరిపాలనలో ఉన్నఇండో-చైనాని బలవంతాన విడదీసినప్పుడు వియత్నాం ను రెండు దేశాలుగా విభజించేరు. ఒకటి కమ్యూనిస్టుల అధికారంతోనూ, ఇంకొకటి ప్రజా పరిపాలనా దేశంగానూ. ఇది సరిగ్గా రాలేదు. నార్త్ వియత్నాం, సౌత్ వియత్నాం పై ఎప్పుడూ దాడులు జరిపేది. సౌత్ వియత్నాం కు అమెరికా సహాయపడింది. నార్త్ వియత్నం కు సోవియట్ రష్యా సహాయపడింది. అమెరికా ప్రభావం పనిచేయలేదు. యుద్దానికి అత్యధిక సొమ్ము ఖర్చుచేయవలసివచ్చినందువల్ల, అమెరికాలోని ప్రజలే అమెరికా ప్రభుత్వాని ఒత్తిడి తీసుకురావడంతో సౌత్ వియత్నాం నుండి 1973లో అమెరికా తప్పుకుంది. దీనితో సౌత్ వియత్నాం తాముగా పోరాడవలసి వచ్చింది. సోవియట్ రష్యా సహయంతో యుద్దం చేస్తున్న నార్త్ వియత్నాం సౌత్ వియత్నాం ను పూర్తిగా ఆక్రమించి యుద్దం ను ముగింపుకు తెచ్చింది.ఆ తరువాత సౌత్ వియత్నాం పేరును సైగాన్ గా మార్చింది. అప్పటి నుండి సొషియల్ ఉటోపియాగా పిలువబడితోంది.

United Arab Republic, 1958-1971

 
 
అప్పటి ఈజిప్ట్ ప్రెశిడెంట్ Gamel Abdel Nasser కు ఇజ్రేల్ ను ఎదిరించటానికి ఐక్య అరబ్ దేశం పేరుతో అరబ్ దేశాలను ఒకటిగా చేర్చాలని సిరియాతో ఒప్పందంచేసుకుని కొన్ని సంవత్సరాలు పనిచేసేరు. అయితే ఇది మొదటి నుండే అరబ్ దేశాలలో అమోదం పొందలేదు.1971 లో ఆలోచన మానుకున్నారు.

Ottoman Empire, 1299-1922

 
 
1922 వరకు ఒక అతిపెద్ద సామ్రాజ్యంగా ఉన్న ఈ సామ్రాజ్యం మత, జాతుల వలన విడిపోయింది.

Sikkim, 8th century CE-1975

 
 
1974 వరకు ప్రత్యేక దేశంగా ఉన్న సిక్కిం ఇక అలా ఉండలేమని 1975 న భారతదేశంలో కలిసిపోయింది

Union of Soviet Socialist Republic (Soviet Union), 1922-1991

 
 
20 వ శతాబ్ధములో అందరినీ భయానికి గురిచేసిన ఈ దేశం చివరికి 1991 లో పతనమైపోయింది. హిట్లర్ ను ఎవరూ ఆపలేమనుకున్నప్పుడు ఈ దేశం హిట్లర్ను ఆపగలిగింది. 1918 వరకు ఆస్ట్రో హంగేరీ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉన్న ఈ దేసం 1918 లో రిపబ్లిక్ రష్యా అన్న పేరుతో విడిపోయింది. ఆ తరువాత 1922 లో సోవియట్ యూనియంగా మారింది. 1950 కొరియా యుద్దం, 1962 లో క్యూబా అమెరికా పై దాడికి దిగడానికి ఈ దేశమే కారణం.

No comments:

Post a Comment