Sunday, 13 July 2014

ఈ కుట్ర వాదాలు ఎంతవరకు నిజం.....

ప్రిన్సస్ డయానా.....డోడీ ఫయడ్ తో డయానా ఏర్పరచుకున్న కొత్త సంభందం, బ్రిటీష్ రాజ కుటుంబీకులకు అవమానం తీసుకు వచ్చిందని, డయానా బ్రతికుంటే ఆ అవమానం మరింత కుంగదీస్తుందని, బ్రిటీష్ రాజ కుటుంబీకులే ఆమెను హత్య చేయించేరు.కొందరు భావిస్తున్నారు. 
 

 
దంత రక్షణ కోసం తాగునీటిలో ఫ్లోరైడ్ కలుపుతారనేది సాధారణమైన నిజం. ఫ్లోరైడ్ వలన కలిగే ఇతర హానికలిగించే నష్టాలను మందుల కంపెనీలకోసం దాచిపెట్టేరని కొంతమంది భావిస్తున్నారు.
 

 
ఫిలిడాల్ఫియా పైశోధన: రెండవ ప్రపంచ యుద్దం సమయంలో అమెరికా తమ యుద్ద నౌకలను ఇతరుల కళ్లకు కనిపించకుండా చేయడానికి పరిశోధనలు జరిపేరని వదంతులు పుట్టాయి. వదంతులను అమెరికా ఖండించింది. కానీ అక్టోబర్ 1943 లో అమెరికా యూ.ఎస్.ఎస్ ఎల్రిడ్జ్ అనే యుద్ద నౌకను కాంతి తిప్పుడు పరికరాలతో అమర్చుకుందట.
 

 
హెచ్.ఐ.వి: ప్రపంచ జనాబాను తగ్గించటానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ HIV వైరస్ ను తమ పరిశోధనా కేంద్రములో సృష్టించిందని కొందరు భావిస్తున్నారు.
 

 
పేర్ల్ హార్బర్ పై దాడి: అప్పటి అమెరికా ప్రెశిడెంట్ రూస్ వెల్ట్ కు దాడి జరగబోతోందని ముందే తెలుసు. కానీ అమెరికా రెండవ ప్రపంచ యుద్దంలో పాల్గొనడానికి దాడే కారణమని అమెరికా ప్రజలను నమ్మించడానికి ఊరికే ఉన్నారట.
 
 
ప్రపంచ ట్రేడ్ సెంటర్ పై దాడి: అమెరికా ప్రభుత్వ అధికారులకు ముందే హెచ్చరిక అందినా దాడిన కావాలనే ఆపలేదని కొందరు భావిస్తున్నారు.
 


 
చంద్రుడి పై మనిషి: 1969 లో చంద్రుని పై మనిషి నడిచేడని చెప్పటం కూడా కొందరు నమ్మటంలేదు. అప్పట్లో అమెరికా-రష్యాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం గెలవడానికే అమెరికా అలా ఉపాయం పన్నిందట.
 

 
కొత్త ప్రపంచ ఆజ్ఞ: ప్రపంచములోని అత్యంత పలుకుబడి కలిగిన వారి సమాజం ఇది. ప్రపంచ జనాభాను తగ్గించడానికే ఈ ఏర్పాటు చేసేరని కొందరు భావిస్తున్నారు.
 

No comments:

Post a Comment