భారత మా జీ ప్రధాని స్వర్గీయ పి. వి.నరసింహారావు గా రు 28-6-1921న కరీంనగర్ జిల్లా వంగ ర గ్రామంలో జన్మించా రు. భారత ప్రధానమం త్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాది వాడు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు. పీవీగా ప్రసిద్ధుడైన ఆయ న బహుభాషావేత్త, రచయిత.
అపర చాణక్యు డిగా పేరుపొందిన ఆయన భారత ఆర్ధిక వ్య వస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కిం చిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరం భించిన పీవీ రాష్టమ్రంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్ర వేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయనకే చెల్లింది. రాజకీయవేత్త గానే కాకుండా మంచి కవిగా కూడా పేరుప్ర ఖ్యాతులున్న ఆయన డిసెంబర్ 23, 2004లో మరణించారు.
No comments:
Post a Comment