నరేంద్ర మోడీ 1950 సెప్టెంబరు 17న జన్మించారు. నరేంద్ర మోడీతండ్రి ఒక చిన్న టీ కొట్టు నడిపేవారు. తల్లి చిన్న గానుగ నడిపేది. మోడీ ఆరో ఏటనుండి ఉదయం తండ్రికి సహాయం చేసి పాటాశాలకు వెళ్ళేవాడు.
నరేంద్ర మోడీ ఎనిమిదవ ఏట రాష్ట్రీయ స్వాయంసేవక్ సంఘములో చేరారు. ఉదయం తండ్రికి టీ కొట్టు నడపడంలో సహాయం చేయడం, స్కూలికి వెళ్ళడం సాయంత్రం ఆర్.యస్.యస్ కి వెళ్ళడం మోడీ దినచర్యగా ఉండేది.
18 ఏళ్ల వయసులో మోడీ సంన్యాసం తీసుకుంటాను అని ఇంట్లోనుంచి వెళ్ళిపోయారు. రెండు ఏళ్ల తర్వాత ఆయన తిరిగి వచ్చి అహ్మదాబాదులో ఆయన మామయ్య యొక్క బస్సు స్టాండ్ లోని టీ కొట్టు లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా ఒక టీబండి ద్వారా టీ అమ్మడం ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాక ఆయన రాష్ట్ర కార్యాలయములో ఒక పనివాడిగా చేరారు. కార్యాలయములో అందరికి ఉదయం టీ, టిఫిన్ తయారు చెయ్యడం తర్వాత కార్యాలయము శుభ్రం చెయ్యడం ఆయన పనిగా ఉండేది.
1971 లో మోడి ఆర్.యస్.యస్ శిక్షణ శిబిరానికి నెల రోజులు వెళ్లారు. శిక్షణ తరువాత ఆయనను ఆర్.యస్.యస్ వాళ్ళు అఖిల భారత విధ్యార్ధి పరిషద్ గుజరాత్ శాఖ వ్యవహారమును చూడమని నియమించారు.
నరేంద్ర మోడీ ఎనిమిదవ ఏట రాష్ట్రీయ స్వాయంసేవక్ సంఘములో చేరారు. ఉదయం తండ్రికి టీ కొట్టు నడపడంలో సహాయం చేయడం, స్కూలికి వెళ్ళడం సాయంత్రం ఆర్.యస్.యస్ కి వెళ్ళడం మోడీ దినచర్యగా ఉండేది.
18 ఏళ్ల వయసులో మోడీ సంన్యాసం తీసుకుంటాను అని ఇంట్లోనుంచి వెళ్ళిపోయారు. రెండు ఏళ్ల తర్వాత ఆయన తిరిగి వచ్చి అహ్మదాబాదులో ఆయన మామయ్య యొక్క బస్సు స్టాండ్ లోని టీ కొట్టు లో పనికి చేరారు. కొన్ని రోజుల తర్వాత స్వయంగా ఒక టీబండి ద్వారా టీ అమ్మడం ప్రారంభించారు. కొన్ని రోజులు గడిచాక ఆయన రాష్ట్ర కార్యాలయములో ఒక పనివాడిగా చేరారు. కార్యాలయములో అందరికి ఉదయం టీ, టిఫిన్ తయారు చెయ్యడం తర్వాత కార్యాలయము శుభ్రం చెయ్యడం ఆయన పనిగా ఉండేది.
1971 లో మోడి ఆర్.యస్.యస్ శిక్షణ శిబిరానికి నెల రోజులు వెళ్లారు. శిక్షణ తరువాత ఆయనను ఆర్.యస్.యస్ వాళ్ళు అఖిల భారత విధ్యార్ధి పరిషద్ గుజరాత్ శాఖ వ్యవహారమును చూడమని నియమించారు.
1974 లో మోడి నవనిర్మాన్ ఆందోళన లో పాల్గొన్నారు. 1975లో కేంద్ర పభుత్వము అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆర్.యస్.యస్ వాళ్ళని జైలుకి పంపించిది. మోడీ పోలీసులకు దొరకకుండా రహస్యంగా పని చేశారు.
ముఖ్యమంత్రి: సామాన్య మానవుడు
దక్షిణ గుజరాత్‌లోని మెహసానా అనే జిల్లాలోని వాద్ నగర్ అనే చిన్న పట్టణంలో సెప్టెంబర్ 1950న శ్రీ నరేంద్ర మోడీ జన్మించారు. పుట్టుకతోనే ఒక సంస్కృతిలో పెరిగిన శ్రీ నరేంద్ర మోడిలో దాతృత్వం, దయ, సామాజిక సేవా గుణాలను అలవర్చుకున్నారు. 1960లో భారత్-పాక్ మధ్య జరిగిన యుద్దం సమయంలో కుర్రాడిగా శ్రీ నరేంద్ర మోడీ సైనికులకు వాలంటరీగా పని చేశారు. 1967వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం మొత్తం వరదలతో అతలాకుతలమైనప్పుడు బాధితులకు తన వంతు సేవలను అందించారు. గుజరాత్‌లో అఖిల భారతీయ విద్యార్ది పరిషత్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక రాజకీయ ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.తన బాల్యం నుంచే శ్రీ నరేంద్ర మోడీ అనేక అసమానతలను, అడ్డంకులను అధిగమించారు. వ్యక్తిత్వ బలంతో, ధైర్యంతో అవకాశాలను సవాళ్లుగా మార్చుకున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం కాలేజీ, యూనివర్సిటీలో చేరినప్పుడు కఠినమైన పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ జీవన సమరంలోఆయన ఎల్లప్పుడూ ఒక నిజమైన సైనికుడుగా ప్రవర్తించారు. అడుగు ముందుకు వేసిన తర్వాతా మళ్లీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదా ఓడిపోవడానికి నిరాకరించాడు. ఇదే ఆయనను రాజకీయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు విధించుకున్న కట్టుబాటు. భారతదేశ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం స్దాపించిన సామాజిక సాంస్కృతిక సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో ఆయన పయనం మొదలైంది. దేశం పట్ల నిస్వార్ధ సేవ, సామాజిక బాధ్యత, అంకితభావం, జాతీయతా స్ఫూర్తిని పెంపొందించుకోవడానికి ఇది దోహదపడింది.
ఆర్ఎఎస్ఎస్‌లో చేస్తూ, శ్రీ నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో, ముఖ్యంగా 1974 నవనిర్మాణ్ అవినీతి వ్యతిరేక ఆందోళనలో, 19 నెలల అత్యవసర పరిస్థితిలో (జనవరి 1977 జూన్ 1975) భారత పౌరుల ప్రాథమిక హక్కులను గొంతునులిమినప్పుడు సాగిన పోరాటంలో ఆయన కీలకమైన పాత్రలను పోషించారు. మోడీ అజ్ఝాతవాసానికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ చర్యలకు వ్యతిరేక స్ఫూర్తిదాయకమైన పోరాటం చేసి ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి కృషి సలిపారు.
1987లో భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం ఒక్క సంవత్సర కాల వ్యవధిలోనే గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ సమయానికే శ్రీ నరేంద్ర మోడీ అత్యంత సమర్థవంతమైన నిర్వాహకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసే సవాలును స్వీకరించారు. భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పెద్ద శక్తిగా ఎదిగి ఏప్రిల్ 1990లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ భాగస్వామ్యం కొన్ని నెలలకే పరిమితమైనప్పటికీ.. భారతీయ జనతా పార్టీ 1995 లో గుజరాత్ లో సొంతంగా ఒక రెండు వంతుల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ పాలన ప్రారంభమైంది.
1988, 1995 మధ్య గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవడంలో శ్రీ నరేంద్ర మోడీ చేసిన క్షేత్రస్థాయిలో చేసిన కృషి పనిచేసింది. దాంతో శ్రీ నరేంద్ర మోడీని ప్రతిభావంతమైన వ్యూహాకర్తగా పార్టీ గుర్తించింది. ఈ కాలంలో శ్రీ నరేంద్ర మోడీకి రెండు కీలక జాతీయ కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. ఎల్‌కె ఆద్వానీ సోమనాథ్ నుండి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర ఒకటి కాగా, కన్యాకుమారి (భారతదేశం దక్షిణ భాగం) నుండి కాశ్మీర్ వరకూ చేపట్టిన యాత్ర రెండోది. శ్రీ నరేంద్ర మోడీ నిర్వహించిన ఈ రెండు అత్యంత విజయవంతమైన కార్యక్రమాలతో 1998లో బిజెపి ఢిల్లీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
1995లో శ్రీ నరేంద్ర మోడీని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించి, ఆయనకు భారతదేశంలోని ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. ఒక యువ నాయకుడుగా శ్రీ నరేంద్ర మోడీకి దక్కిన అరుదైన గౌరవం ఇది. 1998లో ఆయనకు జాతీయ కార్యదర్శి (ఆర్గనైజేషన్) గా పదోన్నతి లభించింది. ఈ పదవిలో ఈయన అక్టోబర్ 2001 వరకు ఉన్నారు. ఆ తర్వాత భారతదేశంలోని అత్యంత సంపన్న, ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన పదవీబాధ్యతలు చేపట్టారు. జాతీయ స్థాయిలో ఉన్న సమయంలో, శ్రీ నరేంద్ర మోడీకి సున్నితమైన, కీలకమైన జమ్మూ కాశ్మీర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల శాఖలను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించారు. ఆ రకంగా ఆయన పలు రాష్ట్రాల్లో పార్టీని పునరుద్ధరించే బాధ్యతను తీసుకున్నారు. పార్టీ జాతీయ స్థాయిలో వ్యవహారాల్లో శ్రీ నరేంద్ర మోడీ కీలకమైన నేతగా ముందుకు రావడమే కాకుండా పలు ముఖ్యమైన సందర్భాల్లో కీలక పాత్ర పోషించారు.
ఈ కాలంలో, శ్రీ నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి, పలు దేశాల ప్రముఖ నాయకులను కలుసుకున్నారు. ఈ అనుభవాలను ఆయనకు ఒక ప్రాపంచిక దృక్పథాన్ని అందించడమేకాకుండా దేశానికి సేవ చేయాలని, దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఆసక్తిని ఇనుమడింపజేసింది.
అక్టోబర్ 2001 లో, పార్టీ ద్వారా శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపును అందుకున్నాడు. శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అక్టోబర్ 7, 2001న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, జనవరి 2001 లో వచ్చిన భారీ భూకంపాలు మరియు అనేక ప్రకృతి వైపరీత్యాలు, దుష్ప్రభావాల కారణంగా గుజరాత్ ఆర్థిక వ్యవస్థ క్రిందకి దిగజారింది. అయితే జాతీయ మరియు అంతర్జాతీయ అనుభవం ద్వారా శ్రీ నరేంద్ర మోడీ ఒక మాస్టర్ వ్యూహాకర్తగా మంచి నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యమంత్రి పదవిని గుజరాత్ ప్రభుత్వాన్ని నడిపించాలని శ్రీ నరేంద్ర మోడీని ఆదేశించింది. మోడీ 2001 అక్టోబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి గుజరాత్ 2001 జనవరిలోని భారీ భూకంపంతో పాటు పలు ప్రకృతి వైపరీత్యాల తాకిడితో విలవిలలాడుతోంది. జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను ప్రోది చేసుకున్న శ్రీ మోడీ వాటిని సమర్థంగా ఎదుర్కున్నారు.
2001 జనవరి భూకంప తాకిడి ప్రాంతాల్లో పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు సవాల్‌గా నిలిచాయి. భూకంపానికి భుజ్ తీవ్రంగా దెబ్బ తిన్నది. వేలాది మంది మౌలకి సదుపాయాలు లేని పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. దయనీయమైన స్థితిని సంపూర్ణ అభివృద్ధి కిందికి ఎలా మార్చారో నేడు భుజ్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగిస్తూ శ్రీ నరేంద్ర మోడీ అతిపెద్ద దృశ్యానికి సంబంధిచంచిన దృష్టికోణాన్ని కలిగి ఉన్నారు. సమీకృత సామాజిక, ఆర్థిక ప్రగతికి శ్రీ నరేంద్ర మోడీ సామాజిక రంగాలపై దృష్టి సారించి అసమతౌల్యాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ఆయన పంచామృత యోజన అనే పంచముఖ వ్యూహాన్ని రూపొందించారు.
ఆయన నాయకత్వంలో గుజరాత్ విద్య, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధరంగాల్లో భారీ మార్పులను చూసింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తనదైన స్పష్టమైన దృష్టికోణంతో విధానపరమైన సంస్కరణా కార్యక్రమాలను ప్రారంభించారు, ప్రభుత్వ పాలనా వ్యవస్థను తీర్చిదిద్దారు. తద్వారా గుజరాత్‌ను సంపన్నమార్గంలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపలే ఆయన లక్ష్యాలకు, సమర్థతకు గుర్తింపు లభించింది. మోడీ పాలనా సమర్థత, స్పష్టమైన దృక్పథం, వ్యక్తిత్వ పరిపూర్ణత లకు ఆయన నైపుణ్యం తోడై 2002 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టాయి. 182 అసెంబ్లీ స్దానాలున్న గుజరాత్ శాసనసభలో 128 స్దానాలను శ్రీ నరేంద్రమోడీ కైవసం చేసుకున్నారు. ఇదే విజయ పరంపర 2007 ఎన్నికల్లో పునరావృతమై మళ్లీ గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది.
శ్రీ నరేంద్ర మోడీ 2012 సెప్టెంబర్ 17న గుజరాత్ ప్రజలు సేవలో 4000 రోజులు రికార్డును పూర్తి చేశారు. మూడు వరుస ఎన్నికల్లో నరేంద్ర మోడీని గుజరాత్ ప్రజలు ఆశీర్వదించి, అధికారాన్ని కట్టబెట్టారు. 2002, 2007 ఎన్నికల్లో(117 సీట్లు) గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించిన శ్రీ నరేంద్ర మోడీ, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(115 సీట్లు) తన జోరును కొనసాగించారు. డిసెంబర్ 26, 2012వ తారీఖున వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగాప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రజా ఆకాంక్షలు అంచనాలకు మించి నెరవేరాయి. ఇ-పాలన, పెట్టుబడులు, పేదరిక నిర్మూలన, శక్తి, సెజ్‌లు, రహదారి అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ తదితర రంగాల్లో గుజరాత్ దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. అభివృద్ధి ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదు. మూడు రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు) అభివృద్ధి చెందాయి. గుజరాత్ అనూహ్యమైన అభివృద్ధి వెనక సబ్‌కా సాథ్ (అందరితో పాటు), సబ్‌కా వికాస్ (అందరి అభివృద్ధి) అనే మోడీ మంత్రమే కాకుండా ప్రజానుకూల, రాష్ట్ర ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేసిన క్రియాశీల ఉత్తమ పాలన (పి2జి2)లకు ఇచ్చిన ప్రాధాన్యం ఉన్నాయి.
ఆటంకాలకు ఎదురొడ్డి నర్మదా ఆనకట్టను 121.9 మీటర్లకు పెంచారు. దానికి ఆటంకాలు కల్పిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష కూడా చేపట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత గుజరాత్‌లో నీటి వనరుల గ్రిడ్ సృష్టించడానికి "సుజలాం సుఫలాం" పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. శ్రీ నరేంద్ర మోడీ నీటి సంరక్షణ మరియు తగిన వినియోగం వైపు తీసుకున్న మరొక నూతన అడుగు ఇది. వీటితో పాటు గుజరాత్‌లోని సామాన్య ప్రజల కోసం ఆరోగ్య కార్డులు, రోమింగ్ రేషన్ కార్డులు, రోమింగ్ స్కూల్ కార్డులను అందించారు. గుజరాత్ బహుముఖ ప్రగతికి కృషి మహోత్సవ్, చిరంజీవి యోజన, మాతృ వందన, బేటీ బచావో క్యాంపెయిన్ (బాలికలను రక్షించండి), జ్యోతిగ్రామ్ యోజన, కర్మయోగి అభియాన్, ఈ-మమత, ఇఎ పవర్, స్కోప్, ఐక్రియట్ లాంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించే నాయకులు ఉన్న ప్రస్తుత తరుణంలో శ్రీ నరేంద్ర మోడీ భవిష్యత్తు తరాల కోసం ఆలోచించే దార్శనికత, దృక్పథం, నిర్ణీత కాలపరిమితిలో అమలు చేసే కార్యాచరణ వంటిద్వారా నిజమైన పాలనాదక్షుడిగా నిలిచారు.
వినూత్నమైన ఆలోచనల ద్వారా యవ్వనోత్తేజ, శక్తివంతమైన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన శ్రీ మోడీ గుజరాత్ ప్రజలకు తన దృక్పథాన్ని అర్థం చేయించడంలో విజయం సాధించారు. ఆరు కోట్ల గుజరాత్ రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని, ఆశను ప్రోదిచేసి పెట్టారు. తన అపారమైన జ్ఝాపకశక్తితో లక్షలాది మందిని, సామాన్యులను కూడా వారి మొదటి పేర్లతో సంబోధించే గుణం ఆయనను ప్రజా నాయకుడిగా నిలిపింది. ఆధ్యాత్మిక గురువుల పట్ల ఉన్న అపారమైన గౌరవభావం మతాల మధ్య సంబంధాలను పెంపొందించడానికి పనికి వచ్చింది. ఆదాయ గ్రూపులకు, మతాలకు, రాజకీయ అనుబంధాలకు అతీతంగా విభిన్నమైన సామాజిక శ్రేణులు శ్రీ నరేంద్ర మోడీని తమ జీవితాలను పారదర్శకంగా, విశ్వసనీయమైన రీతిలో మెరుగుపరిచే దార్శక నేతగా అభిమానిస్తాయి. నైపుణ్యం గల వక్త, తెలివిగల సంధానకర్త కావడంతో శ్రీ నరేంద్ర మోడీని నగర, గ్రామీణ ప్రజలు ఒకే రీతిలో ప్రేమిస్తారు. సమాజంలోని ప్రతి విశ్వాసానికి, ప్రతి మతానికి, ప్రతి ఆర్థిక స్థితికి చెందిన ప్రజలను ఆయనకు అనుచురులు ఏర్పడ్డారు.
శ్రీ నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గుజరాత్ అనేక అవార్డులను సొంతం చేసుకుంది. వీటిలో ముఖ్యమైనవి విపత్తు తగ్గింపు విభాగంలో యునైడెట్ నేషన్స్ ససకావా అవార్డు, పరిపాలనలో నూతన ఒరవడి సృష్టించినందుకు కామన్‌వెల్త్ అసోసియేషన్ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ (CAPAM) అవార్డు, యునెస్కో అవార్డు, ఈ-గవర్నెన్స్ విభాగంలో సీఎస్ఐ అవార్డు మొదలైనవి. ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రుల్లో శ్రీ నరేంద్ర మోడీ వరుసగా మూడు సంవత్సరాలు మొదటి స్దానంలో నిలిచారు. ప్రపంచ చిత్రపటంలో గుజరాత్‌కు స్పష్టమైన స్దానాన్ని కల్పించడం కోసం నిర్వహించిన క్యాంపెయిన్ 'వైబ్రెంట్ గుజరాత్'. 2013 వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 120 దేశాలు పాల్గోన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
చాలా ఏళ్లుగా గుజరాత్ రాష్ట్రం రెండంకెల వృద్ది రేటుని నమోదు చేస్తోంది. గుజరాత్ పెరుగుదల, అభివృద్ధి పథంలో వేగాన్ని పెంచుకుంటూ కాలం అడుగుజాడలను వదులుతూ, మైలురాయిని మరో మైలురాయిగా మలుచుకుంటూ, అడుగడుగు ముందుకు వేస్తూ తన ప్రయాణాన్ని అలసట లేకుండా సాగిస్తోంది.
రాజకీయాల్లో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన ప్రయాణాన్ని విహంగావలోకనం చేస్తే నాయకుడిగా నరేంద్రమోడీ వ్యక్తిత్వ వికాసం గురించి అధ్యాయాల కొద్ది చెబుతుంది.
శ్రీ నరేంద్ర మోడీ ఆలోచనలు, ఆదర్శాల నాయకత్వం కారణంగా యువత ఆయనను ఒక క్లాసిక్ రోల్ మోడల్‌గా భావిస్తుంది. మోడీ వ్యక్తిత్వ బలం, సాహసం, అంకితభావం, దార్శనికత సృజనాత్మక నాయకత్వం ఎలా వికసిస్తుందో తెలియజేస్తుంది. ప్రజా జీవితంలో విశేషమైన సేవాతత్పరత, ప్రయోజనకరమైన ఆచరణ గల, తాను ప్రేమించే ప్రజల ప్రేమను పొందగలిగిన ఇలాంటి నాయకుడు ప్రజాజీవితంలో కనిపించడం అరుదు.
ఆచరణాత్మక స్వాప్నికుడు
శ్రీ నరేంద్ర మోడీ కలలను వాస్తవం చేసే గొప్ప సామర్ధ్యం కలిగిన మహా స్వాప్నికుడు. గుజరాత్ పునరుత్తేజం, మార్పిడి, అదే సమయంలో మాతృభూమి భారత్ అభివృద్ధి చెందిన, శక్తిమంతమైన దేశంగా ఆవిర్భవించడం ఆయన అత్యున్నత స్వప్నం. ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ పరిశోధన, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ది ఆయన భారత్ కోసం కనే కల. సంక్షిప్తంగా చెప్పాలంటే, అంతం లేని జీవన వేడకను వినోదించే ఆనందదాయకమైన, కొత్త సమాజం ఆయన స్వప్నం. కఠిన లక్ష్యాల సాధనకు, కఠిన క్రమశిక్షణకు పేరు పొందిన శ్రీ మోడీలో శక్తి, దయాగుణం నిబిడీకృతమై ఉన్నాయి.
అంతర్గత మానవ వికాసానికి, అంధకారం, చీకటి, పేదరికాలకు దూరంగా సమాజ ప్రగతికి పనిముట్టుగా విద్యపై శ్రీ నరేంద్ర మోడీకి ఆపారమైన విశ్వాసం. విద్యా బోధనను విస్తరించడం గురించి, ముఖ్యంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బాలికలకు విద్యను అందించాల్సిన అవసరం గురించి ఆయన నొక్కి వక్కాణిస్తూ వచ్చారు. ఉపాధ్యాయుల పట్ల గౌరవం, పునాది స్థాయిలో సాధికారత హక్కును, చైతన్యాన్ని పెంపొందించే తనకు ప్రీతిపాత్రమైన కన్య కేలవాని యోజన శ్రీ నరేంద్ర మోడీకి విద్య పట్ల గల అనురాగాన్ని తెలియజేస్తాయి. కూతుళ్లను బడికి పంపాలని తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి వేడిలో, దుమ్ములో మారుమూల గ్రామాల్లో ప్రచారం సాగించిన ముఖ్యమంత్రి మనకు కనిపిస్తారా?
శాస్త్ర, సాంకేతిక రంగాలపై అపారమైన మక్కువ గల శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్‌ను ఇ పరిపాలన రాష్ట్రంగా తీర్చిదిద్దారు, టెక్నాలజీలో వినూత్నమైన అప్లికేషన్స్‌ను ప్రవేశపెట్టారు. స్వాగత్ ఆన్‌లైన్, టెలీ ఫరియాద్ ఈ పారదర్శకతను సంతరించిపెట్టాయి, పౌరులకు పాలనాయంత్రాంగంలోని అత్యున్నత కార్యాలయంతో ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పాయి. ప్రజా సమస్యలను శ్రద్ధగా విని, నిర్ణీత కాలవ్యవధిలో అవి పరిష్కరమయ్యేలా చూసే ఇటువంటి ముఖ్యమంత్రిని అరుదుగా చూస్తాం.
ప్రజలపై అమితమైన విశ్వాసం గల శ్రీ నరేంద్ర మోడీ, కర్మయోగి మహా అభియాన్ అనే నిరంతర అభ్యాస పథకం కిందికి తెచ్చి ఐదు లక్షల మంది ప్రభుత్వోద్యోగులను క్రియాశీలక శ్రమ సంస్కృతి గొడుగు కిందికి తెచ్చారు. సర్కారీ కర్మచారీలను (ప్రభుత్వ ఉద్యోగులను) అసర్ కారీ కర్మచారీ (సమర్థమైన ఉద్యోగులు)గా తీర్చిదిద్దే అంశంపై పట్టింపు ఉన్న ముఖ్యమంత్రిని గుజరాత్ చూసింది. విశేషమైన ఆశావాది అయిన శ్రీనరేంద్ర మోడీ ఏకకాలంలో యదార్థవాది, ఆదర్శవాది. వైఫల్యం కాదు, చిన్నపాటి లక్ష్యాన్ని కలిగి ఉండడం నేరంగా పరిగణించే ఆలోచనాశక్తి ఆయన సొంతం. దృక్పథంలో స్పష్టతకు, ప్రయోజనకరమైన భావన, శ్రద్ధతో కూడిన పట్టుదల జీవితంలోని ఏ మార్గంలోనైనా విజయం సాధించడానికి కావాల్సిన అవసరాలని ఆయన గుర్తిస్తారు.
ఈరోజు గుజరాత్ ప్రజల ఆకాంక్షలు అంచనాలకు మించి సాకారం అయ్యాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్ ఈ-గవర్నెన్స్, పెట్టుబడులు, పవర్, సెజ్, రోడ్ డెవలప్‌మెంట్, విత్త క్రమశిక్షణన, పేదరికం నిర్మూలన లాంటి రంగాల్లో ముందంజలో ఉంది. గుజరాత్ రాష్ట్రం అభివృద్ది అనేది కేవలం ఒక్క రంగానికే పరిమితం కాకుండా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు విస్తరించింది. ఈ అభివృద్ది వెనుక శ్రీ నరేంద్ర మోడీ సబ్కా సాత్, సబ్కా వికాస్ మరియు ప్రజలపై తన దృష్టి, అనుకూల చురుకైన మంచి పాలనతో పాటు ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేయడమేనని అంటున్నారు.
ఆటంకాలకు ఎదురొడ్డి నర్మదా ఆనకట్ట ఎత్తును 121.9 మీటర్లకు పెంచాడు. ఆనకట్ట నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన శక్తులకు వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష కూడా చేపట్టారు.గుజరాత్‌లో నీటి వనరుల గ్రిడ్ సృష్టించడానికి "సుజలాం సుఫలాం" పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. నీటి సంరక్షణకు, తగిన వినియోగానికి గుజరాత్ వేసిన ముందడుగు ఇది.
భూ పరీక్షా కార్డులు, రోమింగ్ రేషన్ కార్డులు, రోమింగ్ స్కూల్ కార్డుల వంటి వినూత్న ఆలోచనలతో కూడిన పథకాలు శ్రీ నరేంద్ర మోడీకి సామాన్య ప్రజల పట్ల గల పట్టింపును తెలియజేస్తాయి. గుజరాత్ బహుముఖ ప్రగతికి కృషి మహోత్సవ్, చిరంజీవి యోజన, మాతృ వందన, బేటీ బచావో కాంపెయిన్ (బాలికలను రక్షించండి), జ్యోతిగ్రామ్ యోజన, కర్మయోగి అభియాన్, ఈ మమత, ఈఎంపవర్, స్కోప్, ఈ క్రియేట్ తదితర పథకాలను ప్రవేశపెట్టారు. వచ్చే ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించే నాయకులున్న ప్రస్తుత తరుణంలో దృక్పథం, భావన, పథకాలను నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేసే కార్యాచరణ భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే గొప్ప రాజనీతిజ్ఝుడు శ్రీ నరేంద్ర మోడీ.
అవార్డులు- జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు
ముఖ్యమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ దశాబ్ద కాలం పాటు గుజరాత్‌ను అభివృద్ధిలో నడిపించినందుకు పలు అవార్జులు పొందారు. అభివృద్ది పథంలో నడిపించినందుకు శ్రీ నరేంద్ర మోడీ అవార్డులు సాధించడంతో పాటు ఆయన స్ఫూర్తిదాయకమైన నాయకత్వం వల్ల ప్రతి కార్యక్రమాన్ని, పథకాన్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు కూడా అవార్డులు దక్కించుకున్నాయి.జాతీయ, అంతర్జాతీయ కీర్తి
ఇండియా టుడే నిర్వహించిన ఓపినియన్ పోల్‌లో వరుసగా ఐదేళ్లు శ్రీ నరేంద్ర మోడీ దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఈ పోల్ ద్వారా శ్రీ నరేంద్ర మోడీ ప్రజాదరణ గుజరాత్‌కే పరిమితం కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు పాకింది. మోడీ 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' అభివృద్ధి మంత్రం యావత్ ప్రపంచానికి తెలిసింది.
శ్రీ నరేంద్ర మోడీ ఎలక్ట్రానిక్ మీడియా దృష్టిని ఆకర్షించారు. 2012 ప్రారంభంలో భారత వాణిజ్య రంగంలో చేసిన కృషికిగాను శ్రీ మోడీ సిఎన్‌బిసి టీవి 18 అవార్డు పొందారు. 'వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్' విజయవంతం కావడం, గుజరాత్ పెట్టబడులకు అనుకూలంగా మారడం, గుజరాత్‌కు రికార్డు స్థాయిలో పెట్టుబడులు రాడం వల్ల శ్రీ నరేంద్ర మోడీ ఈ అవార్డుకు తగిన ప్రజా నేతగా ముందుకు వచ్చారు.
ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పు తెచ్చినందుకు గాను కంప్యూటర్ సోసైటీ ఆఫ్ ఇండియా నవంబర్, 2001న శ్రీ నరేంద్ర మోడీకి 'ఈ రత్న' అవార్డుని అందజేసింది. CSI Nihilent e-Governance Awards 2011 అవార్డుల కార్యక్రమంలో ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ICT) సంస్ద 2011 సంవత్సరానికి గాను ముఖ్యమంత్రి కార్యాలయానికి ‘Award of Excellence- Departmental Level’ అవార్డుని ప్రకటించింది. దీనితో పాటు ఈఇండియా సమ్మిట్‌లో ముఖ్యమంత్రి ఆఫీసు ‘Best Government to Citizen Initiative of the Year Award’ను కైవసం చేసుకుంది. సాంకేతిక పరిజ్ఝానం శక్తిని ఉపయోగించి ప్రజలకు అత్యంత వేగంగా, సులభంగా సేవలు అందించడంలో శ్రీ మోడీ విజయం సాధించారు.
శ్రీ నరేంద్ర మోడీ విజయాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన స్వాగత్ (State Wide Attention of Grievances by Application of Technology) ఓ మైలురాయి. ఇది ఇతర కార్యక్రమాల ప్రారంభానికి మార్గం చూపింది.2003లో ప్రారంభించిన ఈ స్వాగత్ సమస్యల పరిష్కారాన్ని విప్లవీకరించి, ముఖ్యమంత్రితో సహా రాష్ట్రంలోని అత్యున్నత అధికార కార్యాలయాలను నేరుగా గుజరాత్ ప్రజలు సంప్రదించే అవకాశాన్ని కల్పించింది. ప్రజా సేవలో గణనీయమైన మార్పు తెచ్చినందుకుగాను స్వాగత్‌కి ప్రతిష్టాత్మక ఐక్య రాజ్య సమితి ప్రజాసేవ అవార్డు లభించింది. ప్రజా సేవలను మెరుగుపరిచినందుకు ఇటీవల CXO Award 2011 కూడా లభించింది. గతంలో నేషనన్ ఈ గవర్నెన్స్ అవార్డును కూడా పొందింది.
గుజరాత్ సాధిస్తున్న అద్భుతమైన అవార్డులు, సాధించిన విజయాల జాబితా ఇక్కడితో ఆగిపోలేదు. ఆరోగ్యం నుండి మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక రంగం నుండి పంచాయితీరాజ్ వరకూ గుజరాత్ ప్రభుత్వ విభాగాలు అద్భుతంగా పనిచేసి, అవార్డులను అందుకున్నాయి.
అంతర్జాతీయం - ప్రపంచ వేదికపై
శ్రీ నరేంద్ర మోడి ప్రాచుర్యం భారతదేశ సరిహద్దులు దాటి విస్తరించింది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా, చైనా నుంచి యూరప్ వరకు ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారి వ్యక్తిత్వానికి, పనితీరుకు బౌల్డ్ అయిన వారే. వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్స్ విజయం నరేంద్ర మోడి అంతర్జాతీయ స్థాయిని ప్రతిభింభిపజేస్తుంది. ఈ సదస్సులో వందలాది దేశాలు పాల్గొన్నాయి. ఈ దేశాలన్నీ కూడా గుజరాత్‌లో పెట్టుబడులు పెట్టి, ఆర్థికవృద్ధిని సాధించి పెట్టాయి. ప్రతి ప్రవాస భారతీయ దినోత్సవంలో శ్రీ మోడి అత్యంత ఆసక్తికర వక్తగా నిలవటం విశేషం. ఈయన ఆస్ట్రేలియా, చైనా, జపాన్, మారిషస్, థాయ్‌లాండ్, ఉగాండా వంటి అనేక దేశాల్లో విస్తృత పర్యటనలు చేశారు.అక్టోబర్ 2001లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒక్క నెలలోపే శ్రీ నరేంద్ర మోడి, అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో రష్యా పర్యటన జరిపిన అధికారిక బృందంలో చోటు పొందారు. ఈయన గవర్నర్ ఆఫ్ ఆస్ట్రాంకా ప్రావీన్స్‌తో ఓ చారిత్రకం ఒప్పందంపై సంతకాలు చేశారు.
ముఖ్యమంత్రి మోడి రష్యాకు వెళ్లిన వివిధ అధికారిక పర్యటనల ద్వారా, అలాగే విద్యుత్ విషయంలో పరస్పర సహకారం వలన రష్యాకు, గుజరాత్‌కు మధ్య సంబంధబాంధవ్యాలు ఏడాదికేడాది వృద్ధి చెందుతూ వస్తున్నాయి.
ఇజ్రాయిల్ పర్యటన జరిపిన భారత ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంలో మోడీ ఉన్నారు. మానవవనరులు, వ్యవసాయం, నీరు, విద్యుత్, భద్రత వంటి అంశాల్లో ఇజ్రాయిల్ పటిష్ట భాగస్వామ్యంతో నేడు గుజరాత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
ఆగ్నేయాసియా, భారత్ మధ్య సహకారం నేటికి పటిష్టంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీ నరేంద్ర అనేకసార్లు ఆగ్నేయ ఆసియా దేశాల్లో పర్యటించారు. హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్ దేశాలు ఈయనను ఆహ్వానించాయి. ఈ దేశాలు ఇప్పుడు గుజరాత్‌లో జరిగే వార్షిక అంతర్జాతీయ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్‌తో పాటు అనే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయి.
ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడి చైనా దేశంతో సన్నిహిత ఆర్థిక సంబంధాలను నెలకొల్పుకోవడం ద్వారా అనేక అవకాశాలకు తలుపులు తెరచారు. నవంబర్ 2011 నుంచి ఆయన మూడు సార్లు అధికారికంగా చైనాలో పర్యటించారు. ఆ పర్యటన సమయంలో శ్రీ నరేంద్ర మోడిని బీజింగ్‌లోని ఉన్నత నాయకత్వ బృందాలు సాదరంగా ఆహ్వానించి, సత్కరించాయి. చైనాకు చెందిన హువాయ్ కంపెనీ సాయంతో గుజరాత్‌లో ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిచువాన్ ప్రావీన్స్‌తో కుదుర్చుకున్న సహకార ఒప్పందంతో పాటుగా, గుజరాత్ అనేక సంస్థలు పెట్టుబడి పెట్టేలా ఆకర్షించేందు ఈ పర్యటనలు ఎంతగానో తోడ్పడ్డాయి.
2011లో చైనా అగ్రనేతతో శ్రీ నరేంద్ర మోడీ
సంప్రదింపుల పర్వం ఓరియెంట్‌తో అయిపోలేదు. గుజరాత్‌లో జపాన్ ప్రముఖ ఆర్థిక
భాగస్వామి. వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌లో కూడా ఆ దేశ మద్ధతు కీలకంగా ఉంది.
గుజరాత్ ఆర్థిక భూస్వారూప్యాన్ని మార్చడంలో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్
కారిడార్‌కు జపాన్ చేసిన సాయం, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం
చేసింది. జపాన్‌తో పాటుగా, ముఖ్యమంత్రి నరేంద్ర మోడి దక్షిణ కొరియాలో కూడా
పర్యటించి గుజరాత్ వృద్ధి ఇరు దేశాల మధ్య ఫలవంతమైన ఆర్థిక, సాంస్కృతిక
సంబంధాలను మెరుగుపరిచారు.
చాల సందర్భాల్లో శ్రీ నరేంద్ర మోడి విదేశీ పర్యటనలు అనేక మంది భారతీయులకుసంతోషాన్ని తెచ్చిపెట్టాయి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ శ్యాంజీ క్రిష్ణ వర్మ చితాభస్మాన్ని స్విట్జర్లాండ్ నుంచి తిరిగి తీసుకువస్తానని చెప్పిన ఆయన వ్యక్తిగతంగా జెనీవాను సందర్శించి చితాభస్మాన్ని 50 ఏళ్ల తర్వాత తిరిగి తీసుకువచ్చారు.
చైనా జైళ్లలో మగ్గుతున్న భారతీయ వజ్ర వ్యాపారుల కేసును వేగవంతం చేయాలని మోడీ నిరుడు చైనీస్ అధికారులకు చేసిన విజ్ఝప్తి వల్ల కొందరు వర్తకులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు.
దక్షిణాసియాలో కూడా శ్రీ నరేంద్ర మోడి ప్రాచుర్యానికి కొదవ లేదు. నిరుడు చివర్లో, కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి మోడిని ఆహ్వానించి, గుజరాత్ అభివృద్ధి గురించి ప్రసంగించాల్సిందిగా కోరింది. 1934లో మహాత్మా గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన కెసిసిఐ భవంతి నమూనాను కూడా ఈ సందర్భంగా మోడికి ప్రదానం చేశారు. ఈ ఏడాది ఆరంభంలో, శ్రీలంక మాజీ ప్రధానమంత్రి, శ్రీలంక యునైటెడ్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ రనిల్ విక్రమసింఘే శ్రీ మోడిని ఆహ్వానించి, గుజరాత్ అభివృద్ధి గురించి ప్రసంగించాల్సిందిగా కోరారు. అట్లాంటింక్ నుంచి కూడా శ్రీ నరేంద్ర మోడి పనితీరుకు ప్రశంసలు లభించాయి. సెప్టెంబర్ 2011లో శ్రీ మోడికి యూఎస్ఏ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ‘కింగ్ ఆఫ్ గవర్నెన్స్’గా కితాబిచ్చింది. ముఖ్యమంత్రి మోడి ఆధ్వర్యంలో గుజరాత్ అత్యుత్తమ పరిపాలానా విధానాలు కలిగిన,భారతదేశ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కూడా వారు పేర్కొన్నారు. లంచగొండితనాన్ని నివారించడంలోను, సమర్థవంతమైన ఆర్థిక విధానంలో శ్రీ మోడి ప్రశంసలు అందుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రముఖ మ్యాగజైన్లలో ఒకటైన టైమ్ మ్యాగజైన్ మార్చ్ 26, 2012 సంచికలో, శ్రీ నరేంద్ర మోడి ఫొటోను ముఖచిత్రంపై ప్రచురించి, ‘మోడి అంటే వ్యాపరం’ అనే పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది. టైమ్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఇతర భారతీయ ప్రముఖులలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, లాల్ బహుదూర్ శాస్త్రి, ఆచార్య వినోబా భావేఉన్నారు. గడచిన దశాబ్ధ కాలంలో గుజరాత్‌లో జరిగిన వృద్ధిని టైమ్ కొనియాడి, శ్రీ మోడినికీర్తించింది.
ప్రముఖ వాణిజ్య వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించిన ‘గుజరాత్‌ను ఫాస్ట్ ట్రాక్‌పై పెట్టిన మోడి’ అనే ఓ కథనంలో గుజరాత్ అభివృద్ధిని కొనియాడారు. గుజరాత్‌ను రెండంకెల వార్షిక వృద్ధి రేటుతో భారతదేశంలో కెల్లా అత్యంత పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కలిగిన రాష్ట్రంగా ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. గుజరాత్‌లో దశాబ్ధం కాలంగా కొనసాగుతున్న శాంతిని కూడా ఆ కథనంలో ప్రధానంగా కొనియాడారు.
మే 20, 2012 ఉదయం, అమెరికాలోని 12 నగరాలకు చెందిన ప్రవాసభారతీయులు గుజరాత్ దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో సమావేశం కాగా శ్రీ నరేంద్ర మోడి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో ముచ్చటించి, ఆ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా శ్రీ మోడి ప్రసంగిస్తూ, గుజరాత్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, గుజరాత్‌లో వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలోని మూడు రంగాల గురించి ప్రస్తావించారు. ఈ ప్రసంగాన్ని ఎన్ఆర్ఐలు చక్కగా ఆకళింపు చేసుకున్నారు. శాటిలైట్, టెలివిజన్, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజలు ఈ ప్రసంగాన్ని వీక్షించారు.
ఇతర అమెరికా దేశాలు కూడా గుజరాత్ విజయానికి ఆకర్షితులయ్యాయి. జులై 2012లో శ్రీ మోడి 7 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలతో కూడిన ప్రతినిధుల బృందంలో ఒకరిగా చేరారు. ఈ దేశాలలో బ్రెజిల్, మెక్సికో, పెరు, డొమినికన్ రిపబ్లిక్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్రతినిధి బృందం గుజరాత్ అభివృద్ధిని కొనియాడటమే కాకుండా, గుజరాత్‌కు, ప్రాతినిధ్య దేశాలకు మధ్య సహకార సంబంధాలను ప్రస్తావించింది. గుజరాత్‌లో ట్రేడ్ సెంటర్లు, వుడ్, టింబర్, మార్బుల్ కోసం సెజ్‌లను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై శ్రీ మోడి ప్రసంగించారు.
విదేశీ ప్రతినిధుల బృందంతో జరిపిన ఈ సంప్రదింపులు, లభించిన ప్రశంసలు భారతదేశం లోపల, వెలుపల ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడిని ఓ ఆదర్శ నమూనా నిలిపాయి. వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలు, ప్రపంచ నేతలు ప్రతిఒక్కరూ కూడా శ్రీ నరేంద్ర మోడితో కలిసి పనిచేసి గుజరాత్ రాష్ట్రాన్ని భారతదేశం వృద్ధి యంత్రంగా మార్చాలని కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment