Thursday, 29 May 2014

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా


  •     ద గ్రేట్ చైనా వాల్‌ను 2500 ఏళ్ళ క్రితం నిర్మించారు.
  •     చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హుయాంగ్టి మొదటి గోడను కట్టించారు.
  •     చైనా భాషలో దీనిని వాన్ లీ క్వాంగ్ క్వెంగ్ అంటారు. అంటే పొడవాటి గోడ అని అర్ధం.
  •     గ్రేట్ వాల్ పొడవు 4వేల మైళ్ళ వరకు ఉంది.
  •     ఉత్తర చైనాలోని పర్వతాల మీద నుండి రాజధాని బీజింగ్ ఉత్తర దిక్కు, నైరుతి దిక్కు వరకు ఈ గోడ విస్తరించి ఉంది.
  •     గోడలు 15 నుండి 30 అడుగుల మందాన, 25 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.
  •     చైనా గ్రేట్ వాల్ ప్రపంచంలో మానవ నిర్మితమైన అతి పొడవాటి కట్టడం.
  •     విదేశీయుల దండయాత్రల నుండి దేశాన్ని కాపాడుకోవడం కోసం సరిహద్దుల్లో రాజులు గ్రేట్ వాల్‌ను నిర్మించడానికి ముందు నిర్మించిన గోడలకు కేవలం చిన్న చిన్న ఆయుధాలను తట్టుకోగల సామర్ధ్యం మాత్రమే వుండేది.
  •     క్విన్ చక్రవర్తి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఉత్తర భాగాన్ని కలుపుతూ కొత్త గోడలు నిర్మించాలని నిర్ణయించారు.
  •     గ్రేట్ వాల్ నిర్మాణం కోసం భారీ ఎత్తున నిర్మాణ సామాగ్రిని తరలించడం కష్టం కాబట్టి స్థానికంగా లభ్యమైన వనరులనే వాడుకున్నారు.
  •     పర్వతాల నుండి రాళ్ళను, మట్టిని చెక్కను నిర్మాణంలో ఉపయోగించుకున్నారు.
  •     కొన్ని చోట్ల చైనా వాల్ మెట్లు ఏటవాలుగా చాలా ఎత్తుగా ఉంటాయి.
  •     గోడలో వాల్ టవర్స్, రక్షక భటులు ఉండడానికి ఆయుధాల నిల్వలు చేయ్డానికి గదులు ఉన్నాయి.
  •     స్మోక్ సిగ్నల్స్, శత్రువుల కదలికలను తెలిపే సిగ్నల్ టవర్స్ కూడా ఉన్నాయి.
  •     చైనా వాల్ చంద్రుడి మీద నుండి కనిపిస్తుందని అంటారు. కానీ అది యదార్ధం కాదు.
  •     చైనా మహా కుడ్యాన్ని పలువురు చక్రవర్తులు వివిధ కాలాల్లో కట్టించారు.
  •     చైనా మొదటి గోడను క్రీస్తు పూర్వం 22-207 మధ్య క్విన్ వంశానికి చెందిన ద్విన్ షి హుయాలగ్డి చక్రవర్తి నిర్మించారు.
  •     హుయాంగ్డి ఐక్య చైనాను నిర్మించి, ఉత్తరం వైపు నుండి శత్రువుల దాడిని నిరోధించడానికి గోడ నిర్మాణం ప్రారంభించారు.
  •     మొదటి వాల్ నిర్మాణానికి నాలుగేళ్ళు పట్టింది.
  •     మొత్తం ఎనిమిది లక్షల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
  •     తర్వాత క్రీస్తు పూర్వం 206లో అధికారంలోకి వచ్చిన హాన్ వంశం చక్రవర్తి టైజాంగ్ రెండవ గోడను నిర్మించారు.
  •     అయినా శత్రువుల దాడులు ఆగలేదు. ఫలితంగా పలుచోట్ల ఈ గ్రేట్ వాల్ దెబ్బతింది.
  •     130 బిసిలో వూడి చక్రవర్తి గ్రేట్ వాల్ పునర్మిర్మాణం, గోడ పొడవును పెంచడం చేపట్టారు.
  •     వూడి హయాంలో గోడ పొడవునా అవుట్ పోస్ట్లు ఏర్పాటు చేశారు.
  •     తర్వాత హాన్ వంశం మూడుగా చీలిపోయింది. వీటిలో ఒకటైన వెయ్ వంశం చక్రవర్తి ఈ మహాకట్టడాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకున్నారు.
  •     రూరన్ అనే జాతుల దాడుల్లో గ్రేట్ వాల్ దెబ్బతింది.
  •     తర్వాత వివిధ రాజవంశాల వారు ఈ గోడ వెలుపల లోపల కూడా అదనంగా గోడలు నిర్మించారు.
  •     కొత్త గోడలు శత్రువుల దాడులను ఆపలేకపోయాయి.
  •     క్రీస్తు శకం 1115లో జిన్ రాజ వంశం అధికారం చేపట్టి మూడవదైన గ్రేట్ వాల్‌ను నిర్మించింది.
  •     మూడవ వాల్ హీలాంగ్ జియాంగ్ అనే రాష్ట్రంలోను, మంగోలియా అంతర్భాగం వరకు విస్తరించి ఉంది.
  •     తర్వాత 1276లో మంగోలులు జిన్‌లను కూలదోసి యువాన్ వంశపాలనను ప్రవేశపెట్టారు. వీరి హయాంలో గ్రేట్ వాల్‌ను పట్టించుకోలేదు.
  •     ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మింగ్ రాజులు చైనాను శతృవుల బారి నుండి రక్షించడానికి, గ్రేట్ వాల్ పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకున్నారు.
  •     మింగ్ వంశ తొలి చక్రవర్తి హొంగ్వూ గ్రేట్ వాల్ పొడవునా రక్షక భటులను ఏర్పాటు చేశారు.
  •     వాల్‌కు రక్షణగా అదనపు గోడలు, కోటలు, ఆయుధాగారాలను నిర్మించారు.
  •     1569-1583 మధ్యలో గ్రేట్ వాల్‌లో కీలకమైనదిగా చెప్పుకునే నాలుగవ వాల్‌ను చక్రవర్తి హొంగ్వూ నిర్మించారు.
  •     నాలుగవ వాల్ వలన చైనాకు మంగోలుల బెడద తప్పింది.
  •     1644 నుండి గ్రేట్ వాల్ నెమ్మదిగా దెబ్బతినడం ప్రారంభమయింది.
  •     ఆ కాలంలో అధికారంలో ఉన్న క్వింగ్ చక్రవర్తులు గ్రేట్ వాల్‌ను పట్టించుకోలేదు.
  •     చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చిన తర్వాత వాల్ పతనం మరింత మొదలయింది. ఈ గోడ నుండి రాళ్ళు, పెద్ద పెద్ద బండలను తీసి ప్రాజెక్టుల నిర్మాణానికి వాడుకున్నారు.
  •     1984లో అప్పటి అధ్యక్షుడు డెంగ్. జీయావో పింగ్ గ్రేట్ వాల్ పరిరక్షణకు, మరమ్మతులకు చర్యలు తీసుకున్నారు.
  •     1987లో బీజింగ్‌కు దగ్గరగా ఉన్న బదాలింగ్‌లో ఉన్న గ్రేట్ వాల్ను యునెస్కో ప్రపంచ సాంస్కృతిక సంపదగా ప్రకటించింది.
  •     ఉత్తర చైనాలోని పర్వతాలు, మైదానాలు ఎడారులు, మీదగా చైనా వాల్ విస్తరించి ఉంది. ఈ గ్రేట్ వాల్ ఎక్కువ భాగం ఎడారి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.
  •     బీజింగ్, హెబీ ప్రాంతాల వైపు ఉన్న గోడనే ప్రజలు ఎక్కువగా సందర్శిస్తుంటారు.
  •     బీజింగ్ నుండి మొదలుపెట్టి ఒక్కరోజులో చైనావాల్‌ను చూడాలంటే బదాలింగ్, జుయోంగ్వాన్ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ
  •     గ్రేట్ వాల్ టూరిస్ట్లకు పెద్ద ఎట్రాక్షన్.
  •     ఇక హెబి ప్రాంతం వైపున గ్రేట్ వాల్‌ను చూడాలంటే షాంహైగ్వాన్ నుండి మొదలు పెట్టాలి. గ్రేట్ వాల్ ఓల్డ్ డ్రాగన్ హెడ్ నుండి మొదలవుతుంది. ఇక్కడ సముద్రం లోపలి వరకు వాల్ ఉంటుంది.
  •     హువాంగ్వాగ్వాన్ వద్ద గ్రేట్ వాల్‌లో ఇప్పటికే స్ట్రాంగ్‌గా నిలిచి ఉన్న టవర్లు, నీటి సరఫరా వ్యవస్థను చూడవచ్చు.
  •     ఇవీ ప్రపంచ నెంబర్ వన్ వింత ది గ్రేట్ చైనా వాల్ విశేషాలు.


No comments:

Post a Comment