త్వరగా అనుగ్రహించే దైవం పేరేమిటో మీకు తెలుసా.. గణపతి 'క్షిప్ర ప్రసాది' అంటే త్వరగా కరుణించే దైవం. "గ" అంటే బుద్ధి, "ణ" అంటే జ్ఞానం - గణాధిపతి అయిన వినాయకుడు 'బుద్ది'ని ప్రసాదిస్తే, సిద్ధి తనకు తానుగా ప్రాప్తించగలదు.
త్రిపురాసురుని సంహరించిన శివుడు, మహిషాసురుని మర్దించిన పార్వతీదేవి, వినాయకుని సేవించి విజయాన్ని పొందిన వారేనని పండితులు చెబుతున్నారు. శ్రీరాముడు, కృష్టుడు గణనాథుని ఆరాధించి తమ పనులను నిరాటంకంగా సాధించుకున్నారు.
అలాగే దేవతా సమూహంలో గణపతికి విశిష్ట స్థానం ఉంది. అందుతేత భక్తులు 11, 16, 21, 27, 32 మంగళవారాల పాటు స్వామి దర్శం చేసుకుని ప్రదక్షిణలు చేయడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా శ్వేతార్కమూలగణపతిని ఆరాధించడం వల్ల విశిష్టమైన ఫలితాలు ఏర్పడతాయని వారు చెబుతున్నారు.
No comments:
Post a Comment