Tuesday, 29 July 2014

విప్లవాత్మక యోగి కబీరు




కబీరు 15 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ విప్లవాత్మక యోగి. ఆధ్యాత్మిక సిద్ధ పురుషుడు, ఆనాడు తీవ్ర మత వైషమ్యాల వల్ల, పరస్పర విరోధాల వల్ల హిందూ, మహమ్మదీయుల మధ్య ఏర్పడిన అగాథానికి గొప్ప సేతువు వంటి కబీరు ఉపదేశాలు రెండు మతాల సామరస్యానికి అధికంగా సహకరించాయి అనడంలో సందేహం లేదు.

నిరాడంబరమైన సహజ భావనలతో, ఆధ్యాత్మిక తత్త్వముతో బ్రహ్మానందదాయకమైన వీరిపాటలు, వీరికి అఖండ కీర్తిని గడించాయి. భారతీయ యోగులలో సుప్రసిద్ధుడని ఘనత వహించిన కారణ జన్ముడు.

క్రీ.పూ. 1440 లో జననమొందిన కబీరు బాల్యం ఒక విచిత్ర గాధ. తండ్రిలేని కబీరుని ఇతని తల్లి పరిహరించినది. ఆనాధుడైన కబీరు కాశీ పరిసర ప్రాంతాలలో లహర్‌తోలో అనే సరస్సులో పడి మునిగి పోవుచుండగా నిరు, నిమా అనే ముస్లిం దంపతులు రక్షించి ఇంటికి తీసుకుపోయారు. పుత్ర సంతతికి నోచుకోని ఈ ముస్లిం దంపతులు తమకు దొరికిన ఈ బాలుని అత్యంత ఆదరాబిమానాలతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మహమ్మదీయుల ఇంట మహమ్మదీయ సంప్రదాయలతో వర్ధిలుతున్న కబీరు హైందవ ఆచారాలను ఆదరిస్తూ ఉండేవాడు. ఇది ఆ మహమ్మదీయ దంపతులకే కాదు ఇరుగు పొరుగు వారి అగ్రహానికి కూడా ముఖ్య కారణమైంది.

చిన్ననాటి నుండి కబీరు ఆధ్యాత్మిక జీవనాన్ని అభిలషిస్తూ ఉండే వాడేగాని ప్రత్యేకంగా ఒక హిందూ మతాభిమానాన్ని గానీ, మహమ్మదీయ మతాభిమానాన్ని గానీ ప్రకటించలేదు. గురువు లేక ఎటువంటి గుణవంతునకైనను జ్ఞాన సాధన సాధ్యం కాదని తలచి, సద్గురువు ఆవశ్యకతను గ్రహించి, అట్టి గురువుకోసం తహతహపడ్డాడు. ఆ సమయంలో కాశీలో నివసిస్తూ ఉన్న రామానందులను గురించి విని వారి సాన్నిధ్యంలో వారి సేవకు ఎంతో కుతూహలం పొందాడు. కాని హీన జాతిలో పెరిగిన తనను రామానందుడు అనుగ్రహించి శుశ్రూషకు అంగీకరించునో లేదో అనే సంశయంతో భాధ పడ్డాడు. చివరకు ఒకనాడు రామనందుడు గంగానదిలో స్నానముచేయు రేవువద్ద కబీరు మెట్లపై మునుగు కప్పి పడుకున్నాడు.తెల్లవారు జామున స్తానానికి వచ్చిన రామానందుడు మేట్లపై పరుండిన బాలుని చీకటిలో గమనించక కాలితో తొక్కిన అపచారమునకు ' రామ రామ ' అని రామనామస్మరణం చేశాడు. వెంటనే కబీరు ఆ రామ నామమే తనకు మహామంత్రమని నిశ్చయించుకుని ఆ నాటి నుండి తాను రామానందుల శిష్యుడని రామానందునితో చెప్పి శ్రుశ్రూషకు ప్రాధేయపడ్డాడు. కబీరు గొప్పదనాన్నీ, అభిలాషనూ గ్రహించి వెంటనే రామానందులు అతన్ని తన శిష్యునిగా అంగీకరించాడు. నాటినుండి కబీరు రామ నామ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.

రామానందులు సామాన్యులు కారు. కఠినుడు. కబీరు అనేక సంవత్సరాలపాటు శుశ్రూష చేసి వారి వలన నిర్గుణోపాసనచే దైవము సర్వ మతములకు సమ్మతమైన పరమాత్మ తత్వమనియు ఏదో ఒక రూపము చేతను, పేరు చేతను నిర్దేశింపదగినవడు కాడని తెలుసుకున్నాడు. కుల మత వ్యవస్థలతో చెల్లాచెదురైన మానవాళిలో రేగుతున్న ద్వేష వైషమ్యాలకు మిక్కిలి చింతించి, మహమ్మదీయ మత గురువులతో, హైందవ యోగులతో కలసి మెలసి ఉండుటకు ప్రారంభించాడు. దీని వలన కబీరు ప్రజాదరణ పొందలేకపోయాడు.

కబీరు శిష్టాచార సంప్రదాయాలను నిరాకరించి, విగ్రహారాధనను విమర్శించాడు. ఫలితంగా అనేక మందితో విరోధాన్ని తెచ్చిపెట్టుకున్నా, తన గురువు ఉపదేశాలను దేశం నలుమూలలా ప్రకటించాడు. కబీరు ఉపదేశామృతం అతని మృదు మధుర వాక్కులలోను, పాటలలోనూ, పద్యాలలోనూ తొణికిసలాడుతుంటాయి. భక్తులు ఆ పాటలను పాడుతూ కబీరు కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారు.

కబీరు మరణించినపుడు అతడి హిందు, మహమ్మదీయ భక్తులు అతడి మృతదేహ ఖనన విషయంలో కొట్లాడుకున్నారు. మహమ్మదీయులు దేహాన్ని భూస్థాపితం చేయాలని, హిందువులు దహన క్రియలు చేయాలని వాదులాడుకున్నారు. వాదోపవాదాలతొ మృత దేహంపైని వస్త్రాన్ని తొలగించగా ఆయన కళేబరానికి బదులు అక్కడ పుష్ప రాశి ఉండడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కబీరు రచించిన బిజక్‌లోని ఉపదేశాలనుంచి, సందేశాలనుంచి మనం ఎంతైనా తెలుసుకోవచ్చు.

కబీరు మానవాళికి అందించిన కొన్ని అమూల్య ప్రవచనాలు (సాఖీలు) :


ఏది చేసినా నువ్వే. నాది ఇసుమంతయూ లేదు. నేనేదైనా చేసినన్నచో నాలోనున్నవాడవు నీవే చేసితివి.
హరినెందుకు ప్రేమింతువు? హరిజనులను ప్రేమించుము.హరి నీకు సంపదనిచ్చును, హరిజనుడు నీకు హరినే ఇచ్చును.
ఆకలి కుక్కవంటిది. అది భజనకు భంగం చేయును. దానికి ముక్కబడవేయుము. జంకు విడిచి స్మరియింపుము.
విరహం లేని హృదయం వల్లకాడువంటిది.
సాఖీలు వల్లిస్తే ఉపయోగం లేదు. వాటి సారాన్ని గ్రహించాలి.
గోవిందుడికన్నా గురువెక్కువ.
పళ్ళెమును నీటిలో నానబెడితే ఉపయోగం ఏముంది? దుర్జనుడూ అంతే. వాడి హృదయం మెత్తబడదు.
ఎత్తైన మేడలు చూసి గర్వించకు. రేపు నేలబొర్లెదవు. మీద గడ్డి ఒలుచును.
అడుగుటకన్నా చచ్చుట మేలు.
మనసు గజరాజు. అంకుశంతో దానిని అణుచుము.
రామ నామము నాల్గు వేదములకు మూలము.

పరమేశ్వరుని ఆరాధన


సృష్టి మొత్తం ఒక నియమ పూర్వకమైన సువ్యవస్తతకు లోబడి నడుస్తోంది. గ్రహాలు, నక్షత్రాలు తమ తమ కక్ష్యలలో ఇరుసుమీద ఈమాత్రం అటూఇటూ దారి తప్పకుండా పరిభ్రమిస్తాయి. దివారాత్రులు, ఋతువులు మొదలగు వాటిలో ఒక నియమం ఏర్పడి ఉన్నది. కర్మ ఫలాలు ఒక దైవవ్యవస్తకు సంబంధించినవే. పాలు పెరుగుగా మారటానికి, విత్తనం మొక్కగామారటానికీ కొంతసమయం పడుతుంది. అదే విధంగా కర్మలననుసరించి మంచిచెడుల ఫలితం కొంతసమయం వెనుకా ముందుగానైనా నిశ్చితరూపంలో అందుతుంది. అలాకాని పక్షంలో ప్రపంచమంతా ఆటవిక న్యాయం రాజ్యమేలేది. నోరున్నవాడిమాటే చెల్లుబాటవుతూ, బలమున్నవాడిమాటే సాగుతూ వుండేది. కానీ అలాజరగటంలేదు.

విధ్వాంసులు, ధనవంతులు కళాకారులూ పహిల్వానులు కాగలగాలి అనుకొంటే కృషిసాధన చేసి తీరాలి. కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. ఏజాతి విత్తనాలు నాటుతామో ఆ జాతి పంటనే కోరుకుంటాము. మధ్యం తాగినవాడికే నిషా తలకెక్కుతుంది. విషంతాగినవాడు ప్రాణాలు పోగొట్టుకొంటాడు. ఇదే కర్మఫలం యొక్క సునిశ్చిత వ్యవస్తకు ప్రత్యక్ష ప్రమాణం.

ఏపనికైనా తాత్కాలంలోనే ఫలితం కనబడుతూ ఉంటే - అనగా దొంగతనం చేసిన వారి చేతులు చచ్చుపడి పోతుంటే, వ్యభిచారం చేసినవారి చేతులు చచ్చుపడి పోతుంటే - ఈ ధర్మాలు, కట్టుబాట్లు అవసరం అయ్యేవి కావు . భగవంతుని సాక్ష్యం పెట్టుకోవలసిన పనీ ఉండదు. మరి అటువంటప్పుడు ఈ అవకాశం మనిషికి ఎందుకు లభించింది? అతడు తన బుధ్ధి కుశలతను ఉపయోగించి వ్యవహరించాలని, తన గౌరవ గరిమను దృష్టిలో ఉంచుకొని సదాశ్యాన్ని కనపరుస్తూ, దుష్యర్మలకు దూరంగా ఉండాలని, కానీ జరిగేదంతా దానికి వ్యతిరేకం. మనిషి తప్పులమీద తప్పులు చేస్తూనే ఉంటాడు. మతి మరుపు అనే గుణం, నిర్లక్ష్య ధోరణి మనిషికి అనేక ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్పరిణామాలను అనుభవిస్తున్న వారిని చూస్తూ కూడా, జంకులేకుండా ఆ వ్యసనాలకు తాను కూడా బానిస అవుతుంటాడు మనిషి. ఏది మనిషి తెలిసి చేస్తున్న గొప్ప పొరపాటు.

ఆత్మ వికాసం అంతగా జరగక పోవడంతో - మనిషి ఉచితానుచితాలను తేడాను పట్టించుకోకుండా, వెనుకా ముందూ చూడకుండా మనసుకు ఏది తోస్తే అది చేయడమనే మరో పెద్ద తప్పు జరుగుతున్నది. స్వేచ్చాచరణ ఉదృత అహంకారానికి ప్రతిరూపం. పొగరుబోతు వ్యక్తి నియమాలను, ఆంక్షలను ఉపేక్షించి సంకుచిత స్వార్ధభావనా ప్రేరితుడై, ఏది చేయకూడదో అదే చేస్తుంటాడు. ప్రగతికి కావలసిన సమస్త సదుపాయాలు, సమస్త సంపదలు ఉన్నప్పటికీ జనులు వ్యధలలో, కష్టాలలో మునిగి తేలుతూ ఉండటానికి కారణం ఇదే. ఇతర ప్రాణులు హాయిగా సుఖజీవితాన్ని గడుపుతుండగా, మనిషిమాత్రం ప్రతినిమిషం సమస్యలతో , ఉద్విఘ్నతతో బ్రతక వలసి వస్తున్నది. ఈ స్వేచ్చారణ ఎలా ఆగుతుంది? వ్యక్తి సభ్యతతో అనుబంధితుడై ఎలా ఉండాలి? సమాజంలో పరస్పర సహకారం, సత్భావన ప్రసారం ఎలా ఉండాలి? ఏ ప్రశ్నలన్నింటికీ కలిపి ఒకే సమాధానం వస్తుంది. ఒక నియామక సత్తా యొక్క అస్తిత్వాన్ని నిజాయితీగా అనుభవం లోనికి తెచ్చుకోవడం, దానిని సర్వవ్యాపకమైనదిగా, సర్వ దర్శిగా భావించి, దాని న్యాయ నిష్టలపై స్తిరమైన విస్వాసముంచడం, వీటితోపాటు ఆసత్తాకు భగవంతునిగా పూజనీయతం ఇవ్వడం - ఇదే నిజమైన ఆస్తికత.

భగవంతుని ఉనికిని అంగీకరించేవారు, అతడిని ఆరాధించేవారు అసంక్యాకంగా ఉన్నారు. అయితే, వారి పూజలు భ్రాంతులతో నిండి ఉంటాయి. అందువల్ల వాటికి సజ్జనత, ఉదారత మొదలైన రూపాలలో రావలసిన ఫలితాలు తగినంతగా రావడం లేదు.

భగవంతుణ్ణి మానవులకుండె అన్ని దుర్భలతలు కలిగిన వ్యక్తిగా సామాన్యంగా మనుషులంతా ఊహించుకొంటారు, ప్రలోభాలతో ఆయనను ఉబ్బేయవచ్చని ఏమార్చవచ్చని భావిస్తారు. తధ్వారా తమ కోర్కెలు తీర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతుంటారు. స్తోత్రపాటాలు చదువుతూ పూజ పేరుతో పూలు, పళ్ళు, కానుకలూ వంటివి అర్పిస్తుంటారు. అతడు తమవంటి గుణాలున్న వాడిని నమ్ముతారు కనుక - లంచాలకు లొంగుతాడని, పొగడ్తలకు పొంగిపోతాడని, తమకోర్కెలు తప్పక తీరుతాయని ఊహించుకొంటారు. ఒకపక్క పూజలు చేస్తున్నా, మరోపక్క మనసులో భగవంతుని ఉనికివల్ల అపనమ్మకం ఉండటం వల్లనే ఇన్నిరకాలు పూజా విధానాలు, మూఢాచారాలు ఏర్పడ్డాయి. ఎటుపోయి ఎటువచ్చినా కనీసం చెడు జరగకుండా వివత్తులేవీ మీదపడకుండాయఅయినా ఉంటాయని వాటిని పాటిస్తుంటాయని వాటిని పాటిస్తుంటారు తప్ప నిజమైనవిశ్వాసంతోకాదు. ఒకవేళ ఏదైనా మంచి జరిగితే, అదివారి భక్తి ప్రదర్శనకు ప్రతిఫలంగా భగవంతుడిచ్చిన వరదానమని అనుకోరాదు. ఎందుకంటే - భగవంతుని వద్ద అన్యాయానికి తావు లేదు. ఆయనవద్ద ఉన్నతులాదండం కచ్చితమైన న్యాయ సూత్రాలను అమలుచేస్తుంది. ప్రతిపనికీ నిస్పక్షపాతంగా ఫలితాలను నిర్ణయిస్తుంది కనుక వీరితప్పుల తడక వ్యవహారాలను, దురాలోచనలును ఆయన పట్టించుకోడు. పూజలకు ఆయన పొంగిపోడు.

భగవంతునికి కొందరి యందు ప్రేమా మరి కొందరి యందు ద్వేషమూ ఉండదు. కొందరిని ఆశీర్వదిస్తూ మరి కొందరిని శపించదు.ఆయన విధించిన నియమాలను పాటించేవారు సుఖ సంతోషాలతో ఉంటారు. భగవంతుడు వారి యందు ప్రసన్నత కలిగి ఉన్నడన్నదానికి గుర్తు అదే. ఆయన పెట్టిన కట్టుబాట్లను ఉల్లంగించినవారు, చెడుమార్గం పట్టినవారు తమకర్మల దుష్పలితాలను అనుభవిస్తున్నారు, దీనిని భగవంతుని అప్రసన్నతగా భావించాలి. నిజానికి భగవంతుడు సర్వమునూ సర్వులనూ నియమిత అనుసాసనంలో బందించాడు. ఇతర ప్రాణులన్నీ ఈ అనుశాసనాన్ని సహజ సిధ్ధంగా పాలిస్తున్నాయి. మనిషిమాత్రమే వక్రమార్గం పట్టి అశాంతికి లోనవుతున్నాడు. భగవంతుడు ఎవరితోనూ ఖటినంగా వుండడు, మృదువుగానూ వ్యవహరించడు. కానుకలు మొక్కుబడులు ఇచ్చి ఆయనను పక్షపాత ధోరణిలో వ్యవహరింపచేయలేరు. అందుచేత ఆస్తికులైన వారి కర్తవ్యమేమిటంటే - భగవంతుని సర్వవ్యాపకునిగా న్యాయ నిర్ణేతగా అంగీకరించి, తమ అలోచనలు, సీలం విచ్చలవిడిగా ఉండకుండా, ఇతరులను విశృంఖలంగా నడుచుకొన నివ్వకుండా చూచుకోవాలి.

భగవంతుని సామర్ధ్యాలు అనంతములు, ఆయన విభిన్న ప్రయోజనాల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. వాటిలో మనిషి అంతరంగాన్ని ప్రభావితం చేసే ధార సజ్జనత, సదాశయత. దానిని సత్ప్రవృత్తుల సముచ్ఛయిని అని చెప్పవచ్చు. సూర్యుని వెలుగు, వేడి సోకుతూనే కమలములు వికసిస్తాయి. అదేవిధంగా పరబ్రహ్మయొక్క సాన్నిధ్యంకలగగానే మనిషి గుణ, కర్మ, స్వభాలు ఉత్కృష్టత అనే పరిమళం సోకి సుగంధభరిత మవుతుంది. భక్తి అంటే భావావేశం కాదు. అందులో భగవంతునికి చేరువకావాలన్న, ప్రగాఢమైన ఆకాంక్ష నిండి ఉండాలి. సర్వవ్యాపకమైన, అణువణువునా నిండి ఉన్న ఆ శక్తి సహజంగా తన వద్ద కూడా ఉంటుంది. వెలుపలి వాతావరణంలోనూ, అంతరంగంలోపలా కూడా నిండిఉన్నది. ఆఙ్ఞానం వల్ల ఆ శక్తి ఎక్కడో తమకు దూరాన ఉన్నట్లు భావించుకున్నారు. వివేకం, విఙ్ఞానం మేల్కొనగానే అది సర్వత్రా దృష్టిగోచరం అవుతూ ఉంటుంది.

సర్వవ్యాపక సత్తా యొక్క వాస్తవిక రోపం నిరాకారమే అయినప్పటికీ, ధ్యాస ధారణ అనే ఆధ్యాత్మిక సాధన పూర్తి కోసం ఏదో ఒక రూపం ఉండక తప్పదు. మనిషి కల్పన దైవమును కూడా తనలాంటి అవయవాలు గలవిగా ఊహించుకొన్నది. అనేక సాంప్రదాయాలలో భగవంతుడు అనుయాయూల భక్తికి ప్రతిరూపంగా సృజింపబడ్డాడు. అందుకనే "ఏకం సధ్ విప్రా: బహుదావదంతి" అన్నట్లు- ఏకము అనేక రూపాలుగా దృష్టి గోచరమయ్యేది అని చెప్పబడినది. ఈ జగత్ భగవంతుని విరాట్ దృశ్యమాన స్వరూపం. అర్జుననకు, యశోదకూ, కౌసల్యకూ ఈరూపంలోనే భగధర్శనమయినది. భర్మ చక్షులతో ఈ రూపాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చూడవచ్చు. ఈ విరాట్ బ్రహ్మ పూజను స్వచ్చత, ప్రగతి, అలంకరణ రూపములలో చేయవలసి ఉంటుంది. అనగా ఈవిశ్వంలోని పరిసరాలను అందంగా రూపొందించడం, పంచభూతాలను (భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, జలం) కాలుష్య రహితంగా పరిశుభ్రంగా కాపాడుకోవడం, మానవులలో సమత, మమత, మానవతలను పెంపొందించడం మొదలైనవి భగవంతునికి ప్రీతికరమైన ఆరాధనలు - పూజలు.

ఇప్పటికన్నా రాబోయే కాలం మరింత సమృధంగా, సమున్నతంగా, ప్రగతి శీలంగా, సుసంస్కృతంగా ఉంటుంది. అటువంటి కాలంకోసం అందరూ కలసి కృషిచేయాలి. అటువంటి భావనాశీల ప్రపంచాన్ని భగవంతుని ఉధ్యానవనంగా భావించి, తాను కర్తవ్య పరాయణుడైన తోటమాలిగా మారి, దాని ఉత్కర్షలో, అభ్యుదయలో తన కాలాన్ని, శ్రమను ఏకాగ్రతను, సాధనను వినియోగించాలి. దీనినే కర్మయోగమని అంటారు. గీతలో దీనిగురించి ప్రత్యేకంగా చెప్పబడినది.

ఆస్తికతా భావన మనిషి విశృంఖలత మీద అంకుశంవలే పనిచేస్తుంది. ఒంటెను ముక్కుతాడుతో, గుఱాన్ని కళ్ళెంతో, ఏనుగును అంకుశంతో అదుపు చేస్తారు. సర్కసులోని జంతువులను రింగుమాస్టారు కొరడాతో భయపెట్టి కావలసిన పనులను నేర్పుతాడు. చెప్పినట్లు వినేలా చేసుకొంటాడు. అదేవిధంగా భగవంతుని యందున్న నమ్మకం మనిషిని చెడుమార్గాన నడవకుండా అదుపుచేస్తుంది. దేవుడు శిక్షిస్తాడన్న భయంతో మనుషులు తప్పుచేయడానికి జంకుతారు. సన్మార్గాన్ని ఎంచుకుంటారు. దానివలన సమాజపు వ్యవస్త సుస్తిరంగా ఉంటుంది.

Monday, 28 July 2014

కొండల నగరం ...!


కొండల రాజ్యం, దుంగార్పూర్ రాజస్తాన్ రాష్ట్రం లోని దక్షిణ భాగం లో వుంది. ఈ పట్టణం దున్గార్పూర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం గా వుంది. చారిత్రిక పత్రాల ప్రకారం ఇది ఇంతకు పూర్వం దుంగార్పూర్ రాజ్యానికి రాజధాని. ఈ జిల్లా లోని భిల్ జాతి వారు ఇక్కడి ప్రధాన, పురాతన నివాసులు, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారు. భిల్ జాతి ముఖ్య నాయకుడి నుంచి దుంగార్పూర్ ను వీర్ సింగ్ మహారాజు చేజిక్కించుకున్నాడు.

బొమ్మల తయారీ & చిత్రాలకు పటాలు కట్టడం – వికసించిన సృజనాత్మకత


ఇక్కడి దేశవాళీ బొమ్మల తయారీ కేంద్రం గురించి ప్రస్తావించక పొతే ఈ ప్రాంత వర్ణన అసంపూర్ణంగా వుంది పోతుంది. చెక్క నుంచి తయారయ్యే అందమైన బొమ్మలకు మెరుపులు అద్దడానికి లక్క ఉపయోగిస్తారు. అధిక భాగం బొమ్మలు మనుష్యులను జంతువులను పోలి వుంటాయి. వివిధ పండుగలు, సందర్భాల్లో ఈ బొమ్మలను విరివిగా ప్రదర్శిస్తారు. బొమ్మల తయారీకే కాక, దుంగార్పూర్ కంసాలి వారు తయారు చేసే చిత్ర పటాలకు కూడా ప్రసిద్ది.

దుంగార్పూర్ పట్టణం విస్తృత స్థాయి వారి సాగుకి, టేకు, మామిడి, ఖర్జూరాల ఉత్పత్తికి కూడా ప్రసిద్ది పొందింది. దుంగార్పూర్ లోని దట్టమైన అడవుల్లో పర్యాటకులు పర్వతారోహణ చేస్తూ – తోడేళ్ళు, అడవి పిల్లులు, నక్కలు, ముళ్ళ పందులు, ముంగిసలు లాంటి జంతు జాతులను కూడా చూడవచ్చు.


పండుగలూ – పర్వదినాలు – ఆనంద ప్రదర్శన !


దుంగార్పూర్ లోని బనేశ్వర్ దేవాలయం లో నిర్వహించే గిరిజనుల ప్రసిద్ధ పండుగ బనేశ్వర్ ఉత్సవం. ఫిబ్రవరి లో వచ్చే పౌర్ణమి లేదా మాఘ శుక్ల పౌర్ణమి నాడు జరిగే ఈ ఉత్సవం చూడడానికి ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు వస్తారు. ఈ పవిత్ర సమయంలో, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ ల నుంచి మహి, సోమ నదుల సంగమంలో స్నానం చేయడానికి ఇక్కడికి భిల్లులు వస్తారు. తాంత్రిక వినాయకుడు, జింక చర్మ దారి అయిన బ్రహ్మ, వీణ చేపట్టిన శివుడు, పద్మిని, పద్మపాణి యక్షుడు, గరుడారూడ అయిన వైష్ణవి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు. ఈ పండుగలో ఈ ప్రాంతపు నృత్య రీతులు, సంగీతం రుచి చూడవచ్చు. హిందువుల ప్రసిద్ధ పండుగ హోలీ ని ఇక్కడ గిరిజన నృత్యాలతో జరుపుకుంటారు. దీపాల పండుగ దీపావళిని, దీపావళి తర్వాత జరిగే బార్ బ్రిజ్ ఉత్సవం ఈ ప్రాంతపు ప్రధాన పండుగలు.

అద్భుత నిర్మాణాలు – రాతి మీద వర్ణనలు


ఆకర్షణీయమైన బొమ్మలు, పండుగలు, వన్యప్రాణులకే కాక దుంగార్పూర్ రాజ ప్రాసాదాలకు, పురాతన ఆలయాలకు, మ్యూజియం లకు, సరస్సులకు కూడా ప్రసిద్ది చెంది౦ది. రాజపుత్ర నిర్మాణ శైలికి ప్రసిద్ది చెందింది ఉదయ విలాస్ భవనం. ఈ పెద్ద భవనాన్ని – రాణీవాసం, ఉదయ విలాసం, కృష్ణ ప్రకాశం లేదా ఏక్ తంబియా మహల్ అనే మూడు విభాగాలుగా విభజించారు.

క్లిష్టమైన రీతిలో చెక్కిన వసారాలు, తోరణాలు, కిటికీలకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాసాదం ఇప్పుడు ఒక వారసత్వ హోటల్ గా మారిపోయింది. గాజు, అద్దాల పనికి ప్రసిద్ది చెందిన జునా మహల్ ను కూడా పర్యాటకులు ఇక్కడ చూడవచ్చు. దుంగార్పూర్ లో మరో అద్భుత భవనం బాదల్ మహల్. గాయిబ్ సాగర్ సరస్సు ఒడ్డున వున్న ఈ భవనం విస్తారమైన నమూనాలకు, రాజపుత్ర, ముఘలాయి నిర్మాణ శైలుల మిశ్రమ శైలికి ప్రసిద్ది పొందింది.

దుంగార్పూర్ అనేక హిందూ, జైన ఆలయాలకు ప్రసిద్ది చెందింది. పర్యాటకులు ఈ ప్రాంతంలో ఉన్నపుడు వనేశ్వర్ ఆలయం, భువనేశ్వర్, సూర్పూర్ ఆలయం, దేవ్ సోమనాథ్ ఆలయం, విజయ్ రాజరాజేశ్వర్ ఆలయం, శ్రీనాథ్ జి ఆలయం చూడవచ్చు. దాని ఒడ్డున వున్న అనేక దేవాలయాలు, ప్రాసాదాల వల్ల గాయిబ్ సాగర్ సరస్సు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ గా మారింది. దుంగార్పూర్ వెళ్లాలనుకునే యాత్రికులు రాజమాతా దేవేంద్ర కున్వర్ ప్రభుత్వ మ్యూజియం, నాగ ఫణ జీ, గలియా కోట్, ఫతే ఘరీ కూడా చూడాలి.


దుంగార్పూర్ చేరుకోవడం


దుంగార్పూర్ జిల్లా వాయు, రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానించబడి ఉ౦ది. ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా దబోక్, దుంగార్పూర్ కి సమీప విమానాశ్రయం. విదేశీ పర్యాటకులు న్యూ డిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) నుండి దుంగార్పూర్ చేరుకుంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రత్లాంలోని రైల్వే స్టేషన్ దుంగార్పూర్ కి సమీప రైల్వే స్టేషన్. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ రెండిటి నుండి కాబ్స్ ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. పర్యాటకులు ఉదయపూర్, ఇతర సమీప నగరాల నుండి బస్సులలో ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు.

పెనుకొండ కోట... ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు కోట (పెనుగొండ)




చనిన నాళుల తెనుగు కత్తులు సానవెట్టిన బండ, ఈ పెనుగొండ కొండ రంధ్రముల ప్రహరించు శత్రుల, రక్తధారల త్రావి త్రేచిన ఆంధ్ర, కన్నడ రాజ్యలక్ష్ముల, కరితి నీలపు దండ, ఈ పెనుగొండ కొండ వెరపులెరుగని బిరుదు నడకల, విజయనగరపు రాచకొడుకులు పొరలబోయగ కరడుకట్టిన పచ్చినెత్తురు కొండ, ఈ పెనుగొండ కొండ తిరుమలేంద్రుని కీర్తి తేనెలు, బెరసి దించిన కాపుకవనపు నిరుపమ ద్రాక్షారసంబులు నిండి తొలికెడు కుండ, ఈ పెనుగొండ కొండ

ఈ కోటను మొదటగా హోయసలలు పాలించారు. వారు జైన మతస్తులు ఐనందున అక్కడ జైన మతము బాగా అభివృద్ధి చెందినది. ఆకాలంలో పెనుగొండలో అనేక జైన దేవాలయాలు అభివృద్ధి చెందాయి. ఇప్పటికి ఈ ప్రాంతము జైన మతస్తులకు అత్యంత ప్రాదాన్యమైనది. ఆ తర్వాతి కాలంలో చాలుక్యలు, విజయనగర రాసులు, నవాబులు, టిప్పుసుల్తాను కూడ పరిపాలించాచు. చివరగా బ్రిటిష్ వారి వశమైనది. కృష్ణ దేవ రాయల కాలంలో పెనుగొండ వారి రాజ్యానికి రెండవ రాజధానిగా వర్థిల్లినది. అదేవిదంగా వారికి ఇది వేసవి విడిదిగా కూడ సేవ లందించింది. విజయ నగర సామ్రాజ్యం కృష్ణ దేవరాయల తర్వాత వెంకట పతి రాయలు ఈ కోటను తన ఆదీనములోనికి తెచ్చుకొన్నాడు. అతడు రాయ దలవాయి కోనేటి నాయుడు ని ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించాడు. వారి వంశస్తులైన కోనేటి నాయుడు పెనుగొండతోబాటు రాయదుర్గ, కుందుర్పి కోటలను కూడ సుమారు 17 సంవత్సరాల పాటు పరి పాలించాడు. అతని తరువాత వెంకటపతి నాయుడు, పెద తిమ్ంప్ప నాయుడు, వెంకతపతి నాయుడు, కోనేతి నాయుడు, రాజగొపల నాయుడు మరియు తిమ్మప్ప నాయుడు మొదలగు వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.


సంపద....


విజయ నగర రాజ్య పతనానంతరము విజయనగరం నుండు ఆనేక ఏనుగులు, గుర్రాల పై విజయ నగర సంపదను తరలించి పెనుగొండలోను, చిత్తూరు జిల్లాలోని చంద్ర గిరి కోటలో దాచారని చారిత్రిక ఆదారాలున్నాని. అందుచేత పెనుగొండ కోటలో ముష్కరులు గుప్త నిధులకొరకు అనేక సార్లు త్రవ్వకాలు నిధిని తస్కరించారని కథనాలున్నాయి. ఇటీ వలి కాలంలోను ఇటు వంటి సంఘటనలు జరిగినట్టు వార్థలు వచ్చాయి.


విశేషాలు...


పెనుకొండ కోట బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాశనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి. యెర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారట. పెనుకొండ లొ 365 దేవాలయాలు కలవు. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించాడు.

ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు.......

.
ఇతరమతాల బారినుండి హిందూ మత సంరక్షణకు కన్యాకుమారి నుండి కటకము వరకు రాయలసీమలో తెలుగుజాతి వీరులను నిల్పిన విజయనగర సామ్రాజ్యపు పట్టుకొమ్మలు కంచి, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి రాయదుర్గము, పంపానగర విజయనగరము. ''కంచి'' ఐక్యమత్య విధానంతో శివకంచి విష్ణు కంచి, వేగవతీ నది తీరాన నిల్పిన పుణ్య భూమి.

శ్రీ కృష్ణదేవరాయలు తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు, తిమ్మరుసు గోవింద రాజులు చంద్రగిరిలో జన్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానము పెనుగొండ. అన్ని విద్యలూ పెనుగొండ, చంద్రగిరి, విజయనగరాలలో అభ్యసించారు.

శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు పూర్వీకులు తెలుగుగడ్డలో పుట్టి తెలుగుతల్లి పాలు తాగిన వీరులు. తిమ్మరుసు, తండ్రి రాచిరాజు. తాత వేమరాజు. వీరు కొండవీడు, ఉదయగిరి సామంతరాజు. బహమనీ సుల్తాన్లు గజపతులు తాల్రాజును హతమార్చి నందువలన తిమ్మరుసు తండ్రి రాచిరాజు 1460లో చంద్రగిరి చేరారు. అందుకే తిమ్మరుసు పగపట్టిన కొండవీటి సింహం. గజపతులతో 7 సంవత్సరాలు యుద్ధం జరిపి పగతీర్చుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయలను గజపతుల అల్లునిగా జేసారు. కాని గజపతులు వ్లుెచ్ఛాబ్ధి కుంభోద్బవులు. తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అంత్య దశలో కుట్రలు పన్నారు. కాని తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయల అనుబంధము విడదీయరానిది. వారు చివరి వరకూ ఆత్మీయులే. శ్రీకృష్ణదేవరాయలుకు, తిమ్మరుసు 67 సంవత్సరముల వయస్సులో సాధారణ మరణము సంభవించినది. (వసుంధరా పిహ్లెట్‌-ఫ్రాన్స్‌ -విజయనగర్‌-నేషన్‌ బుక్‌ ట్రస్ట్‌).

వరాహపురాణములో తెలుగు ఆది జంటకవులు ఘంటసింగయ్య, నంది మల్లయ్య, శ్రీకృష్ణ దేవరాయల

పూర్వీకులు కంచి, అరణి దగ్గర దేవకీపుర దుర్గాధీశులు అని వివరించారు. ఆనాటికి ఈనాటికి కంచి పరిసర ప్రాంతాలలో తెలుగు మాతృభాషగా గల బ్రాహ్మణులు, వైశ్య, కాపు బలిజలు, చేనేత వర్గాలు, బలహీనవర్గాలు, దళితులు, ముస్లిములు ఎక్కువగా యున్నారు. ఆనాటి రాయలకొలువులో రాజకీయ ప్రాబల్యము వీరిదే.

తిమ్మరాజు శ్రీకృష్ణ దేవరాయలు ముత్తాత. భార్య దేవకి పేరున కంచి దగ్గర దేవకీపురము నిర్మించారు. తిమ్మరాజు కుమారుడు ఈశ్వరాయలు, భార్య బుక్కాంబ. క్రీ.శ. 1456 సంవత్సరము నాటికే ఈశ్వరరాయలు విజయనగర రాజప్రతినిధిగా సాళ్వనరసింహరాయలు సేనాధిపతిగా చంద్రగిరి నారాయణ వనములో ఉన్నారు. ఈశ్వరరాయలు సాళ్వనరసింహరాయలు కుడి భుజంగా కన్నడ ప్రాంతాలైన ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నము, పశ్చిమ తెలుగు ప్రాంతాలు జయించారు. 1481 మార్చినెలలో బహమనీ సుల్తాన్‌ మహమ్మద్‌ షా కంచి దేవాలయము దోపిడీ సొమ్మును కందుకూరు వద్ద అడ్డగించిసొమ్ముతో సహా శిబిరము దోచుకొన్నాడు. శ్రీకృష్ణ దేవరాయల తండ్రి నరసరాయలు సాళ్వనరసింహరాయల సేనాధిపతిగా, బహమనీ సైన్యాధ్యక్షుడు ఆదిఖాన్‌ ఫకాషి ఉల్ముల్కును పెనుకొండ వద్ద ఓడించాడు.

చివరి సంగమరాజు ప్రౌఢదేవరాయలు బలహీనుడు. ఈ సమయంలో నరసరాయలు పెనుకొండ నుండి సైన్యము సమీకరించుకొని విజయనగరము ప్రవేశించాడు. విజయనగరము అవలీలగా స్వాధీనమైనది. సాళ్వనరసింహరాజు సింహాసనము అధిష్టించాడు (1485).

శ్రీకృష్ణ దేవరాయల తాత ఈశ్వరరాయలు, తండ్రి నరసరాయలు యిరువురూ సాళ్వనరసింగరాయలు వద్ద చంద్రగిరి నారాయణవనములో సేనాధిపతులు, కార్యకర్తలు, విశ్వాసపాత్రులుగా వున్నారు. చంద్రగిరి నారాయణ వనములో జన్మించిన నరసరాయలు చంద్రగిరి , పెనుకొండ, గుత్తి ప్రాంత విజయనగర రాజప్రతినిధిగా ఎక్కువ కాలమున్నాడు.

ఈ కాలములో తిమ్మరుసు చంద్రగిరి నారాయణవనంలో ఉంటూ తమ్ముడు గోవిందరాజులు, నరసరాయలు పెనుకొండ యందు ఎక్కువ కాలము (1485 నుండి 1490) ఉండేవిధంగా ప్రయత్నించారు. ఈ సమయములో 1489లో శ్రీకృష్ణ దేవరాయలు సాగివంశపు రాజకుమారి నాగులాదేవికి పెనుకొండ యందు జన్మించినాడు.

''తిప్పాజీ నాగలాదేవ్యో: కౌసల్య సుమిత్రాయో'' వీరనరసింహ రాయల శాసనము ప్రకారము నాగలాదేవి నరసరాయకుని కుల వధువని దేలుచున్నది. (డా|| నేలటూరి వెంకటరమణయ్య) శ్రీకృష్ణ దేవరాయల తల్లి సాగివంశపు రాజకుమారి అని-శ్రీరాజాదాట్ల వేంకట సింహాద్రి జగపతిరాజు సమర్పించిన తామ్రశాసనము వివరించింది. విజయనగర చరిత్ర-నూతలపాటి పేరరాజు) శ్రీకృష్ణదేవరాయలు జన్మస్థానము చంద్రగిరి నారాయణవనము అనడానికి తక్కువ ఆధారాలు వున్నాయి. అచ్యుత దేవరాయలు, శ్రీరంగరాయలు జన్మస్థానాలు పెనుకొండ. పెనుకొండ సమీపాన స్మార్తసమన్వయ శివకేశవుల దేవాలయాలు 32 ప్రాకారాలు గల చోళ సముద్రం లేపాక్షి శిల్ప, చిత్ర, సంగీత, నాట్య కళల విశిష్ఠ దేవాలయము విరుపన్న నాయకుని సోదరుడు విరుపన్న చేత అచ్యుత దేవరాయలు నిర్మింపజేశాడు. అచ్యుతాపురము, తల్లి ఓ బుళాపురము, తమ్ముడు శ్రీరంగనాయకులు పేరున ఉక్కడం శ్రీరంగాపురం నిర్మించారు.

శ్రీకృష్ణ దేవరాయలు యింటి పేరు సంపెటవారు అని పెద్దన వల్ల తెలుస్తోంది. పెద్దన గారి చాటువు- ''సంపెట నరపాల సార్వభౌముడు''

రాయరావుతుగండ రాచయేనుగు వచ్చి- యార్లకోట గోరాడునాడు- ''సంపెట నరపాల సార్వభౌముడు'' వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు.

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణా చార్యులు- మా పెనుకొండ గ్రంథము- పేజీ నెం.59.

పొరపాట్లు చరిత్రలో అనేకం జరుగుతుంటాయి. ''రాయల సీమలో ఒక వింత అలవాటుంది. వంశం పేరు వేరుగా ఉంటుంది. రాయలవంశం తుళువంశం వారి యింటి పేరు సంపెట వారు. నేటికీ అనంతపురం జిల్లాలో సంపెట అని యింటిపేరు గల బలిజలు చాలామంది ఉన్నారు. పెనుకొండలో అనేక యుద్ధాలు జరిగాయి. విజయనగర ప్రారంభదినాల్లో పెనుకొండ ప్రధాననగరము. తర్వాత రాజధానిగా మారింది. పెనుకొండ శాపం వల్ల శిలగా మారిన ఒక అప్సరస.

అల్లసాని పెద్దన మనుచరిత్రలో చంద్రవంశపు యయాతి రాజు కుమారుడు తుర్వసుని కీర్తి స్ఫూర్తి వలన రాజవంశము పేరు తుళువాన్వయ మైయ్యిందని (పద్యము 21-22 యందు) వివరించారు. తెలుగు వ్యాకరణం ప్రకారము ''ర'' ''ళ''గా వ్యవహరింపబడి తుర్వసులు-తుళువసులుగా మారింది.

కర్ణాటకము భాషాపదము కాదు. విశాల దక్షిణాపథములో ఒక భాగం, ఒక రాగం, ఒక కర్నాటక సంగీతం. విజయనగర సామ్రాజ్యము దక్షిణాపథ సామ్రాజ్యము. కన్యాకుమారి నుండి కటకము వరకు గల రాయల సామ్రాజ్యము రాయలసీమ.

విజయనగరము పంపానగరమని, అనాది నుండీ పేరుగల తెలుగు తల్లి పార్వతీ పరమేశ్వురుల
పుణ్యస్థలము. తెలుగువారు ఆదిశివగణము నాగులయక్షుల ప్రతిబింబాలు. అందరూ నేడు చాళుక్యుల ప్రాంతము హిరణ్యరాష్ట్రమని అంగీకరిస్తున్నారు. చాళుక్య నందరాజు వారసుడు విజయద్వజుడు క్రీ.శ.1150లో విజయనగరము నిర్మించినారు. ఆ పుణ్యఫలము చేత చాళుక్యుల వారసుడు ఆరవీటి సోమదేవ రాజు కుంజరకోన (ఆనెగొంది)లో మాలిక్‌ నెబిని ఓడించాడు (క్రీ.శ.1334). ఆనెగొంది స్వాధీనం చేసుకొన్నాడు. ఆర్వీటి పిన్నమరాజు, రాఘవుడు కంపిలి రాయలను ఓడించారు. ఆనాడే తెలుగు తేజము కాకతీయుల రాజ్యం శంఖం పూరించి ''తేషాం శిరోభూషణమేవ దేశ త్రిలింగ నామా జగదేక సీమా'' అని తెలుగువారి యందు ఏకతా భావం కలిగించారు. విశాల విజయనగర సామ్రాజ్యానికి తెలుగు రాజులు పునాదులు వేశారు. ముస్లిములు ఆనాడే విభజించి పాలించే విధానాలు ప్రారంభించారు. హరహరరాయులు, బుక్కరాయలు తెలుగువారు కాకతీయుల బంధువులు. విధివశాన ముస్లిము రాజుల చేతిలో బందీలైనారు. ముస్లిము సుల్తాన్‌ పంటపండింది. ముస్లింల సైన్యసహకారంతో ఆనెగొంది, కంపిలి ప్రాంతాల స్వాధీనానికి సహకరించినారు. ప్రారంభంలో హరిహరరాయలు, బుక్కరాయలు ఆరవీటి వారిని వీరబల్లాలుని ఎదురించలేక గుత్తి, పెనుకొండ ప్రాంతాలలో మొదట స్థావరాలు ఏర్పరచుకొని క్రమంగా ఆనెగొంది స్వాధీనపరచుకొన్నారు. కావున విజయనగర స్థపనకు ఆదిస్థానం తెలుగు నేల స్మార్తసమన్వయ బ్రాహ్మణ మత విద్యారణ్య స్వామి అండదండలతో విజయనగర సామ్రాజ్యము అభివృద్ధి చెందింది. విద్యారణ్యస్వామి వారు తెలుగువారు. ఆనాటికి ఈనాటికి విజయనగర సామ్రాజ్యము తెలుగువారి సామ్రాజ్యము. విజయనగర సామ్రాజ్యము కుంజరకోన (ఆనెగొంది) పంపానగరము (హంపి) నేడు కన్నడ రాష్ట్రములో వున్నా తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. విజయనగర సామ్రాజ్యములో మొదటి నుండి చివర వరకు తెలుగు, తమిళ, మళయాళ భాషా ప్రాంతాలు 80 శాతము కన్నడ ప్రాంతాలు కేవలము 20 శాతము! కన్నడ ప్రాంత రాజులు ఉమ్మత్తూరు, శ్రీరంగ పట్నం నిరంతరం స్వతంత్రించేవారు.

విజయనగర సామ్రాజ్యము తల, మొండెము, కాళ్లు, చేతులు కంచి, చంద్రగిరి, పెనుకొండ, గుత్తి పంపానగరము విజయనగరము. విజయనగర సామ్రాజ్య స్థాపన కాలము నుండి చివరి వరకు -యువరాజులు లేక కాబోవు విజయనగర రాజులు ఈ ప్రాంతాల రాజప్రతినిధులుగా ఉన్నారు.

శ్రీకృష్ణ దేవరాయలు రెండవ రాజధాని విజయనగరం వలే ఏడు కోటలు గల పెనుకొండ, వేసవి విడిది, వసంతోత్సవాలు స్థావరంగా ఎక్కువ కాలము గడిపేవారు. వ్యాసరాయలు కృష్ణరాయలు ఏకాంతంగా రాజకీయాలు పెనుకొండలో చర్చించుకొనేవారు. నాగలాపురము, నాగసముద్రము గ్రామాలు పెనుకొండ సమీపంలో వున్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు జన్మస్థానమో? విద్యాస్థానమో? రణరంగ విద్యాబుద్ధులు అప్పాజీ, గోవిందరాజులు నేర్పించిన స్థానమో? చారిత్రక పరిశోదనలు అవసరము. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, రాజకవి, కవిపోషకుడు. భువనవిజయంలో అశువుగా కవిత్వం చెప్పగల మేథావి. యాంధ్రులతో గుడిమాడి జీవనము సల్పియాంధ్రమున గ్రంథరచనము చేసి యాంధ్రకవుల నాదరించి పోషించి యాంధ్రవాజ్ఞయమును పెంపొందించిన తుళువరాజులు ఆంధ్రులనడంలో సందేహం లేదు. -డాక్టర్‌ నేలటూరి వెంకటరమణయ్య.

దేవకి, తిప్పాంబ, నగలాదేవి, ఓబాంబ, తిరుమలమ్మ, వరదరాజమ్మ తెలుగు రాజ పుత్రికలను వివాహమాడిన విజయనగర రాజులు తెలుగువారే.

శ్రీకృష్ణదేవరాయలు శ్రీవేంకటేశ్వరుని నిరంతర భక్తుడు. తిరుమలాంబ, చిన్నాదేవి విగ్రహాలు తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయప్రాంగణంలో ఆనాడు కొలువు తీరి వుండేవి. మరి ఈనాడో?

చివరికి మిగిలేది? శ్రీకృష్ణదేవరాయల అమరగాథ తెలుగువారి అందరి కథ. చిటికన వేలు కొనగోటితో దక్షణాపథము సంరక్షించిన తిమ్మరుసు తమ్ముడు గోవిందరాజు స్మృతి చిహ్నాలు పెనుకొండలో నిదిరిస్తున్నవి. ఆ స్మృతి చిహ్నాలను శ్రీకృష్ణదేవరాయలు రాయలసీమ రాజసం, తేజంతో ఉట్టి పడేలా నిర్మించారు. ఆనాడుబానిసలం. తిమ్మరుసు వర్దంతి ఉత్సవాలు సమాధుల వద్ద జరుపలేదు.

Sunday, 27 July 2014

కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి



• కోహినూరు వజ్రము తెలుగువారి అమూల్య సంపదకూ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి.

• పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతము.

• ఆంధ్రదేశము లోని గోల్కొండ రాజ్యములో ఇది లభించింది.

• కోహినూరు వజ్రము ప్రపంచములోకెల్లా అతిపెద్ద వజ్రముగా పరిగణించబడే 105 కారట్ల (21.6 గ్రాములు)వజ్రము.

• ఈ వజ్రము చరిత్రలో పలువివాదాలకు కారణమై, హిందూదేశ పారశీక రాజుల మధ్య యుద్ధములకు దారితీసి చివరకు బ్రిటిష్ వారికి దక్కినది.

• 1877లో విక్టోరియా మహారాణి హిందూదేశ మహారాణిగా పట్టాభిషిక్తురాలయినపుడు ఆమె కిరీటములో ప్రధానమైన వజ్రముగా పొదగబడింది.

• గోల్కొండ రాజ్యములోని ఓ అసాధారణ వజ్రం కోహినూరు.

• కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్ తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.

• ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ కోహినూర్ వజ్రం మహబూబ్ నగర్ ప్రాంతంలో దొరికినట్లు చెబుతారు.

• ఈ అసాధారణ వజ్రం ఎన్నో రాజ్యాలను కూల్చింది.

• ఎందరో రాజులను మార్చింది.

• చివరికి బ్రిటిష్‌ రాణి తల మీద చోటు సంపాదించింది.

• ఇంత ఘన చరిత్ర కలిగిన ఆ వజ్రం పేరు ‘కోహినూర్‌’.

• బాబర్‌ నామాలో మొఘల్‌ చక్రవర్తి బాబర్‌ కోహినూర్‌ ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ “ఇది ఎంత విలువైనదంటే దీని వెల యావత్‌ ప్రపంచం ఒక రోజు చేసే ఖర్చులో సగం ఉంటుంది’ అన్నాడు.

• మాల్వా రాజు మహలక్ ‌దేవ్‌ దీని తొలి యజమానిగా చరిత్రకెక్కాడు.

• తర్వాత మాల్వాను జయించిన ఢిల్లీ పాలకుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ దీన్ని సొంతం చేసుకున్నాడు.

• 1626వ సంవత్సరంలో కాంతులీనే ఈ అపురూప వజ్రం బాబర్‌ వశమై ‘బాబర్‌ వజ్రం’గా పేరు పొందింది.

• క్రీ. శ. 1913వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్‌ రాజుల నుంచి పంజాబ్‌పాలకుడు మహారాజా రంజిత్‌ సింగ్‌దీన్ని సొంతం చేసుకున్నాడు.

• చివరికి చిన్నవయసులో పట్టాభిషిక్తుడైన దులీప్‌సింగ్‌ ద్వారా బ్రిటిష్‌ గవర్నర్‌ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు.

• రాణి దానికి మళ్లీ సాన బెట్టించింది.

• సానపెడితే దాని కాంతి పెరగకపోగా నాణ్యత నూటా ఎనబై ఆరు క్యారెట్ల నుంచి నూటా తొమ్మిది క్యారెట్లకు తగ్గింది.

• దీన్ని కిరీటంలో తాపడం చేయించి ఆమె ధరించింది.

• తర్వాత అలెగ్జాండ్రా, మేరీ, ఎలిజబెత్‌ రాణులు దీన్ని ధరించారు.

• ప్రపంచంలోని వజ్రాలలోకెల్లా కాంతివంతమైన కోహినూర్‌ను తిరిగి ఇవ్వాల్సిందిగా 1947 మరియు 1953వ సంవత్సరంలలో భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు.

హై-ఫైవ్(high-five) అనే సంకేతం ఏవరు కనుగొన్నది.....?

హై-ఫైవ్ అనే సంకేతం ఇప్పుడు ఎంతో ప్రభలమైపోయింది. ఒక దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విజయానికీ, ఆనందానికి ఈ సంకేతం వాడుతున్నారు. చిన్న, పెద్దా అందరూ ఈ సంకేతాన్ని పూర్తిగా అంగీకరించినట్లే. అయితే ఈ హై-ఫైవ్ అనే సంకేతం ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు ఇది ప్రసిద్దిచెందింది?

 
విజయానికి సంకేతంగా ఈ హై-ఫైవ్ ఎప్పుడు మొదలయ్యింది అని అడిగితే 3200 BC లో ఈజిప్ట్ దేశంలో అక్షరాలు కనుగొనని కాలంలో సైగలతో మాట్లాడే విధానంలో విజయానికి, ఆనందానికి అభినయ భాష సంకేతంగా ఉపయోగించేరని చెప్పవచ్చు. కానీ ఆ తరువాత ఈ అభినయ భాషలో మార్పు వచ్చింది. రెండు చేతులూ క్రిందకు దించి ఒకరి చేయిని ఒకరు తాకడం "అందరం కలిసే ఉన్నాం" అనే సంకేతాన్ని పురాతణ యుద్దాలలో వాడేవారట.
 
 
అయితే అక్టోబర్-2, 1977 లో అమెరికాలో ప్రసిద్ది చెందిన బేస్ బాల్ వీరుడు గ్లెన్ బుర్కే ఒక ముఖ్యమైన బేస్ బాల్ ఆటలో విజయం సాధించినప్పుడు తన చేతులు ఎత్తి తన తోటి ఆటగానితో హై-ఫైవ్ చెప్పేడు. అప్పటి నుండి ఇది విజయాలలో, ఆనందాలలో ఒక అతిపెద్ద సంకేతంగా మారింది. ఇప్పుడు ప్రతి దేశంలోనూ, ప్రతి విజయ, ఆనంద తరుణాలలోనూ వాడబడుతోంది.
 
 
Burke (left) going in for one of his infamous high fives
 

Friday, 25 July 2014

108 సంఖ్యకి ఎందుకంత ప్రాముఖ్యం?


అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ 108 అనే సంఖ్యకు వారు చాలా ప్రాముఖ్యత నిచ్చారు. దేవున్ని / దేవతలను మంత్ర పుష్పాలతో పూజిస్తూ 108 పవిత్ర పూసలు గల జపమాలను గణిస్తూ జపం చేసేవారు.

108 సంఖ్య యొక్క ప్రాముఖ్యతను భారతదేశంలో హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులువంటి వారందరూ గుర్తించారు. తనలోని దైవత్వాన్ని గ్రహించటానికి ఆత్మ 108 మెట్లు దాటాలని వీరి నమ్మకం. ఈ సంఖ్య భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధాన కారకమని భారతీయుల నమ్మకం.

వేద ఋషులు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గణనలో..
భూమికి, చంద్రునికి మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.. భూమికి, సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.. సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు అనీ నిర్థారించారు.

ఈ వేదగణన ఆధునిక సాంకేతిక విశ్వగణనలో లభించిన భూమికీ, చంద్రునికీ, చంద్రునికీ సూర్యునికీ ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది.

ఆయుర్వేదం మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలను గుర్తించింది. 108 అనే మర్మాల గొలుసులో 107 గ్రంధులు శరీరంలో ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇవి జీవచైతన్యం మానవ శరీరంలో మిళితమయ్యే కేంద్ర స్థానాలు. ఈ మర్మస్థానాల ద్వారా ప్రాణశక్తి జీవిని చైతన్యపరుస్తుంది. భారతీయ యోధునికి పైన చెప్పిన మర్మస్థానాలు తెలిసే ఉంటాయి. అతడు యుద్ధం చేసే సమయంలో శత్రువును ఆ మర్మ స్థానాలపై దాడి చేసి సంహరిస్తాడు.

అలాగే పవిత్రమైన శ్రీ చక్రయంత్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. వీటి మొత్తం 108.

జ్యోతిష్య శాస్త్రం ః మానవ ప్రవృత్తికి సంబంధంఇచి బ్రహ్మాండాన్ని 27 చంద్ర సూచికలైన నక్షత్రాలతో, ఒక్కో నక్షత్రం తిరిగి 4 పాదాలతో ఉంటుందని గుర్తించింది. ఇది 27 X 4 = 108 పాదాలయింది. అవే 108 ప్రాథమిక మానవ ప్రవృత్తులు. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడో, దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో, వృత్తిలో, ఆనందంలో, కుటుంబంలో, చివరకు మోక్షమార్గాలలోనూ ప్రతిఫలిస్తుంది.

- భారతీయ జ్యోతిష్యంలో 12 రాశులు, 9 గ్రహాలుంటాయి. 12 x 9 = 108.

- మానవుడు సగటున ప్రతిరోజు 21,600 సార్లు శ్వాస తీస్తాడు. అందులో 10,800 సూర్యాంశ, 10,800 చంద్రాంశ.. 108ని 00తో గుణిస్తే.. 10,800 వస్తుంది. దీనిని 2తో గుణిస్తే.. 21,600 వస్తుంది అని తంత్ర శాస్త్రం చెబుతుంది.

- భరతుడు - తన నాట్యశాస్త్రంలో చేతులు, కాళ్లు కలిపి చేసే నాట్యభంగిమల మొత్తం సంఖ్య 108గా గుర్తించాడు. వీనిని కరణములంటారు.

- 18 పురాణాలు, 108 ఉపనిషత్లుఉ, భగవద్గీతలో 18 అధ్యాయాలు, ఎన్నో ప్రముఖ సంస్కృత గ్రంథాలలో 108 శ్లోకాలు ఉంటాయి. లిహందువులు నిత్యమూ పూజ చేసే విధానంలో అష్టోత్తర పూజ, అష్టోత్తర శత నామావళి వంటివి ఉంటాయి. చాలామంది సిద్ధులు తమ తమ పేర్లకు ముందు 108గానీ, 1008గానీ ఉంచుకునే సాంప్రదాయం ఉంది.

- సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటికి శివ, శక్తి తత్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. అనగా 54 X 2 = 108.

భారతీయ కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒక రోజు అంటే 4 యుగాలు కలిసి 43,20,000 సంవత్సరాలు. ఇది 108 అనే సంఖ్యతో భాగించబడుతుంది.
సంఖ్యా శాస్త్రంలో 108ని 1+0+8=9గా రాస్తారు. ఒక సంఖ్యను 9తో గణించి వచ్చిన సంఖ్యను కూడగా తిరిగి 9 వస్తుంది.

అందుకే ఇంతటి వైశిష్ట్యం గల 108 సంఖ్య ఎంతో దివ్యమైనదని చాలామంది నమ్ముతుంటారు. అది సృష్టికర్తకు, సృష్టికి అనుసంధానం కలిగించేది. అందుకే మన రుషులు, పురాణాలు, వేదాలు, భారతీయ సంస్కృతి 108కి ఇంతటి పవిత్రత ఇస్తున్నది.

కూతాండవర్‌ ఆలయం... హిజ్రాల పండుగ



హిజ్రాలు... ఆడామగా కాని మూడోవర్గం వాళ్లయినా... వాళ్లను పంచముల్లా చూస్తారు చాలామంది. అంతేకాదు, వాళ్లను ఎవ్వరూ చేరదీయరు. ఏడాది పొడవునా ఎన్నో అవమానాలు భరించే హిజ్రాలు... ఆ ఉత్సవంలో ఆనందోత్సాహాలతో గడుపుతారు. చెప్పాలంటే... ఆ ఉత్సవం కోసమే ఏడాదంతా ఎదురుచూస్తుంటారు. అదే హిజ్రాల పండుగ.

ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి ముఖ్యమైన వేడుక. కానీ, హిజ్రాలకు ఆ అదృష్టం ఉండదు. కానీ, ఆ ఉత్సవాల్లో వాళ్లు పెళ్లికూతుళ్లవుతారు. అది ఆ పండుగ వాళ్లకిచ్చిన బహుమతి.
ఏడాదంతా బాధలను దిగమింగుకు బతికినవాళ్లకు... ఆ మూడురోజులూ సంతోషం అంబరాన్నంటుతుంది. అది ఆ పండుగ తెచ్చిన సంబరం. అదే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని ఉలుందూరుపేటై తాలూకాలోని 'కూవగం' గ్రామంలో 'కూతాండవర్‌' దేవాలయం హిజ్రాలకు ఆరాధ్య దైవం. ఏప్రిల్‌, మే మాసంలో వచ్చే చిత్రైలో వేడుకలు జరుపుతారు. వారు ఆ దైవాన్ని పెళ్లి చేసుకుంటారు. ఇలావారు పెళ్లిచేసుకుంటే కూతాండవర్‌ మరణిస్తాడు. మరురోజు స్త్రీ వేషంలోని వారు రోదిస్తూ గాజులు పగలగొట్టుకొని, కొలనులో స్నానాలు ఆచరిస్తారు.

దీనికో పురాణ గాథ వుంది.--పురాణగాథ :


ఓసారి హిజ్రా కృష్ణుడిని, తాను పొందుకావాలని వరం కోరుకుంటాడు. అలా చేస్తే, ఆ పురుషుడు


మరురోజే మరణిస్తాడంటాడు. అయినా ఫరవాలేదంటుంది. దీనికి ప్రతిఫలంగా కురుక్షేత్ర సంగ్రామంతో పాండవుల తరఫున యుద్ధం చేస్తానంటాడు. కృష్ణుడు మోహినీ అవతారం దాల్చుతాడు. మోహినీ బాహువులలో బంధించబడతాడు. యుద్ధంలో 18 రోజులు యితోధికంగా సాయపడి విజయం చేకూర్చి మరణిస్తాడు.

ఇప్పటికీ కూవగంలో 18 రోజులు ఉత్సవాలు చేస్తారు. వారు శ్రీకృష్ణుని అవతారంగా భావించి కూతాండవర్‌ను ఆరాధిస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగలసూత్రాన్ని, గాజులను, పువ్వులను తీసివేసి రోదిస్తారు.



ఇరావంతుడితో పెళ్లి


కూవాగం... లో మామూలు రోజుల్లో పెద్ద హడావుడి కనిపించని ఈ ఊళ్ళో తమిళ చైత్రమాస పౌర్ణమి వచ్చిందంటే వూరంతా జనసంద్రమైపోతుంది. కొన్ని వేలమంది హిజ్రాలు వస్తారు. ఇక్కడే ఉంది కూతాండవర్‌ ఆలయం. ఈ కూతాండవర్‌ మరెవరో కాదు... అర్జునుడి కొడుకైన ఇరావంతుడు. హిజ్రాల కథనం ప్రకారం... కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప వీరుడి బలిదానం జరగాలట. అలాంటి వీరుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచిస్తాడు. అప్పుడు... అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తుకొస్తాడు. అసలు విషయాన్ని ఇరావంతుడికి చెప్పి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, యుద్ధంలో బలయ్యే ముందురోజు తనకు వివాహం చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు గత్యంతరంలేక కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు. ఆనాడు ఇరావంతుడు, మోహినిల పరిణయానికి సూచికగా... ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్‌ ఆలయ ఉత్సవం. ఇది ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు హిజ్రాలు. ఇందుకోసం రెండునెలల ముందుగానే షాపింగ్‌ మొదలుపెడతారు. ఈ ఉత్సవాలకు హాజరవ్వాలనుకునే హిజ్రాలు జిల్లా కేంద్రమైన విల్లుపురానికి వారంరోజులముందే చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లో హిజ్రాలు... అందం, అలంకరణల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యమిస్తారు. పూటకో విధంగా అలంకరించుకుని విల్లుపురం వీధుల్లో తిరుగుతారు. ఈ వేడుకలో హిజ్రాలే కాదు... వింత ఆసక్తికొద్దీ ఆడవేషం ధరించాలనుకునే మగాళ్లూ భారీగా పాల్గొంటారు. ఉత్సవంలో భాగంగా విల్లుపురంలో హిజ్రాలకు నృత్యాలూ అందాల పోటీలూ జరుగుతాయి.

కల్యాణం... వైధవ్యం...


తరవాత హిజ్రాలంతా కూవాగం చేరుకుంటారు. వీళ్లను గ్రామస్థులు తమ ఇళ్లకు ఆహ్వానించడం విశేషం.
ఈ ఉత్సవంలో అతిముఖ్యమైన ఘట్టం కల్యాణోత్సవం. ఇందుకోసం హిజ్రాలంతా కూవాగం ఆలయంలో వెలసిన ఇరావంతుణ్ణి భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని వధువుల్లా మారతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు.

ఆలయ నియమానుసారం మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చట. అందుకే, సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు ఆచారానికోసమన్నట్టు... చేతికి రెండుమూడు గాజులు ధరించి, మల్లెపూలు మెడకు చుట్టుకుని పూజారులతో తాళికట్టించుకుంటారు. అంతేకాదు, చిన్నవాళ్త్లెన మగపిల్లలకు తాళికట్టించుకుని తీసుకెళతారు తల్లిదండ్రులు. ఇక్కడ తాళి కట్టించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. మహిళలు దైవదర్శనం చేసుకోవచ్చుగానీ తాళి కట్టించుకోవడానికి అనర్హులట.


తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు. చెక్కలతో ఇరావంతుని విగ్రహం చేసి వూరంతా వూరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకంగా చెక్కవిగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు... ఇరావంతుని బలి జరిగిందని తెలుసుకుని ఏడవడం మొదలుపెడతారు. గుండెలు బాదుకుని, జుట్టు విరబోసుకుని హాహాకారాలు చేస్తారు. వాళ్లు తెంపిపడేసిన పూలూ పసుపుతాళ్లూ, పగులగొట్టిన గాజులూ పెద్దపెద్ద గుట్టలుగా పేరుకుపోతాయి. అనంతరం హిజ్రాలు స్నానంచేసి వైధవ్యానికి సూచికగా తెల్లచీర, రవికె కట్టుకుని మౌనంగా వూరువిడిచి తమతమ స్వస్థలాలకు బయలుదేరతారు. అలా ఈ ఉత్సవం ముగుస్తుంది. మళ్లీ చైత్రపౌర్ణమి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తారు.




కొసమెరుపు: ఈ ఉత్సవం హిజ్రాల సమస్యల పరిష్కారానికీ ఒక వేదికగా ఉపయోగపడుతోంది. గత ఉత్సవాల్లో హిజ్రాలకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నెలకు వెయ్యిరూపాయలు పింఛను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

Thursday, 24 July 2014

నెత్తురు రంగు లేక ఎర్ర రంగు కలిగిన నీరున్న మర్మమైన చెఱువు(పచ్చ నీటి చెరువు మరియూ పసుపు నీటి చెరువు లను కూడా చూడండి).....

ఉత్తర చిలి దేశంలోని కెమినా నగరానికి 147 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3,700 ఎత్తులో ఉన్న మర్మమైన ఈ చెరువు లోని నీరు నెత్తుటి గంగు లేక ఎర్ర రంగు నీటితో నిండి ఉంటుంది. ఏ మ్యాపులోనూ చూపబడని ఈ చెరువు అక్కడున్న నివాసకులకు మాత్రమే ఉందని తెలుసు. 2009 వరకు చిలి దేశ పర్యాటక సంఘానికి కూడా ఈ చెరువున్న సంగతి తెలియలేదు.

పూర్వం ఇక్కడ అయమరా జాతి సంస్కృతి వారు నివసించేవారు. వీరు వారి సంస్కృతి గురించి, దేశ ఆచారాల గురించి, దేశ పెద్దల గురించిన రహస్యాలను కాపాడేవారట. ఈ విషయం గూడా ఈ మధ్యే తెలుసుకోగలిగేరు. ఈజిప్ట్ పిరమిడ్ సమాధుల శాపాల గురించిన మర్మం ఎలా రహస్యంగా ఉంచబడ్డయో ఈ చెరువు గురించిన శాపాం గూడా అంతే రహస్యంగా ఉంచబడింది. అందువలనే ఈ చెరువు ప్రపంచానికి తెలియరాలేదట. ఈ చెరువులోని నీటిని ముట్టుకుంటే, లేక ఈ చెరువు దగ్గరకు ఎవరు వెళ్లినా వారు శాపానికి గురౌతారట. అందువలనే ఈ చెరువు గురించి ఎవరికీ చెప్పలేదట. అందువలనేఅ ఈ చెరువు ఏ మ్యాపులోనూ కనబడలేదు. ఈ చెరువు నీరు తాగినందువలనే అయమరా జాతి సంస్కృతి వారిలో అనేక మంది చనిపోయేరని చెబుతారు. ఈ ఎర్ర చెరువు ను చుట్టి ఒక పచ్చ నీటి చెరువు మరియూ పసుపు నీటి చెరువూ ఉన్నాయట. ఇ చెరువుల దగ్గరకు ఎవరైనా వెడితే ఆ చెరువుల లోని నీరు బుడగలతో పైకి ఎగతన్నుకుని వస్తుందట. అందువలన ఈ చెరువులు దెయ్యాలకు సొంతమని అక్కడి ప్రజల విశ్వాశం.

 
పచ్చ నీటి చెరువు
 
 
పసుపు నీటి చెరువు
 

పెంచలకోన.....


దక్షిన భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. భక్తుల కొంగు బంగారంగా శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి విశేష పూజలందుకొంటున్నారు. ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోన్నవారి పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. ఓంతో పాశస్ధ్యంగల శ్రీ లక్ష్మీ సమేత పెనుశిల లక్ష్మీనారసింహస్వామి భక్తుల ఇలవేల్పుగా మారారు. చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా పురాణాలు చెపుతున్నాయి. పుణ్యక్షేత్రాలలో ప్రసిద్దిగాంచిన మాత్రా స్దలం ఆనాటి చత్రవటి నరసింహక్షేత్రం నేటి శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం.స్వామి వారికి వెండిగొడుగుల వాడని మరో పేరుంది. పెంచలకోన సమీపంలోని భైరవకోనకు స్వామి వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు మునులు స్వామి వారికి గోడుగులు పట్టేవారని అందువల్ల ఇప్పటికి ప్రతి వైశాఖ మాసంలో తెల్లటి వెండి గొడుగులు దర్శనిమిస్తాయని భక్తుల నమ్మకం. అందుకనే ఈ క్షేత్రాన్ని ఛత్రవటి క్షేత్రమని పిలుస్తారు. అందువల్ల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామి వారికి మొక్కుబడిగా గొడుగులు సమర్పించుకుంటారు. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు నడుమ ఆకర్షణియంగా దేవస్ధానం వెలసి వుంది. జిలా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున వున్న కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగోందుతుంది.
.
తూర్పుకనుమల మధ్య పర్వత ప్రాంతాలల్లో నెల్లూరు-కడప జిల్లాల మద్య ఈ క్షేత్రం వుంది. ఈ క్షేత్రం

దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు.దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేయు శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మీ మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడి పోయినట్లు చరిత్ర చెపుతుంది. దీంతో ఆమే
.
ధైర్య సాహసాలు,అందచందాలకు ముగ్ధుడైన స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చెచుకోని ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పూరాణ కధనం. దీంతోనే స్వామి వారిని పెనుశిల లక్ష్మీనసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మీని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కధనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్ధానం నిర్మించారు. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే
పెరిగారని ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కనే వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకధనం. పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గోర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడువులలోకి వెళ్లగా ఒక రోజు ఆయనకు స్వామి వృద్ధుని రూపంలో కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని వారికి తెలిపాలని వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కోద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో శిలగా మారినట్లు ఈప్రాంత వాసులు చెపుతుంటారు.


విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది.1959లో ఈ దేవస్ధానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చేందుతూ వుంది.

Wednesday, 23 July 2014

వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?


పునర్జన్మ (పునర్+ జన్మ) అనే పదానికి మరల పుట్టుక అనే కాని మరల మరల పుట్టుక అని మాత్రం కాదు. మనషికి ఒకేసారి పుట్టుక వుంది. ఆ తర్వాత మరణం ఉంది. ఆ తరువాత ప్రళయం రోజున మరణించి శిధిలమైన మానవుణ్ణి అల్లాహ్ తిరిగి పుట్టిస్తాడు( సమాధుల నుండి బ్రతికించి లేపుతాడు). ఆ తరువాత అతని దగ్గర తనజీవితంలో చేసిన కర్మల లేక్కతీసుకుంటాడు. (నిజంగా జన్మచక్రము అనేది వుంటే గ్రంధాలలో చెప్పబడిన శాశ్వతస్వర్గము, శాశ్వతనరకము, అనే పదాలకు అర్ధం లెధు.) ఆ తర్వాత అతని జీవితం లో చేసిన కర్మల లెక్క తీసుకుంటాడు. అతని కర్మల ప్రకారం అతనికి శాశ్వతస్వర్గము, లేదా శాశ్వత నరకాన్ని నిర్ణయిస్తాడు.

పరలోకాన్ని వ్యతిరేకించే కొందరి నమ్మకాల్లో ఓ నమ్మకం "పునర్జన్మ" సిద్ధాంతం.ఈ విశ్వాసం లేక సిద్ధాంతం ప్రకారం మనిషి తన కర్మల సత్ఫలితాలను, దుష్ఫలితాలను అనుభవించడానికి ఈ లోకంలోనే పదే పదే జన్మిస్తాడని,తన కర్మల ఫలితంగా ఒకప్పుడు మనిషిగా జన్మిస్తే మరొక్కప్పుడు ఏదో ఒక జంతువుగానో,కీటకంగానో లేక చెట్టు చేమల రూపంలోనో జన్మించి మరల,మరల ఈ లోకంలోకే వస్తాడు అన్నది.ఈ సిద్ధాంతం ఓ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.గ్రీకు,రోమన్లు ఈ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు.ఈజిఫ్ట్ ప్రాచీన చరిత్రలోను ఈ విశ్వాసం కానవస్తుంది.వీటి ప్రభావంగా ఓ కాలంలో యూదుల్లోను ఈ నమ్మకం వ్రేళ్లూనుకుంది.మన భారతదేశంలోని హిందువుల్లోను,జైనుల్లోను,
బౌద్ధుల్లోను దీనికి మంచి ప్రాచుర్యం లభించింది.ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటినీ, ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.ఈ సిద్ధాంతాన్ని మనం విజ్ఞానం,తర్కం వెలుగులో సమీక్షిస్తే ఇది కేవలం ఓ అసత్యమైన నమ్మకం లేక సిద్ధాంతం అని చెప్పడంలో సందేహం ఏమాత్రం ఉండదు.


వేదాల్లో ఇలా ఉంది:

"వారు పరలోకాన్ని మరచి,బుద్ధీజ్ఞానాలను వదిలేసి మాచే నిర్ణయించబడ్డ హద్దులను దాటే ప్రయత్నం చేస్తున్నారు.ఋగ్వేదం
"గుర్రానికి ప్రతిదినం గడ్డి ఎలా కేటాయించబడుతుందో ఓ అగ్నీ!ధనాన్ని [కూడగట్టి]భద్రపరిచే వారి నుండి అంతిమ దినం నాడు నేను లెఖ్ఖ గైకొంటాను" [యజుర్వేదం

అల్లాహ్ ప్రళయ దినాన మిమ్మల్నందిరిని సమీకరిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహానికి తావు లేదు. కాని తమను తాము నష్టం లో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
(ఖుర్ ఆన్ 6:12)

సమస్త ప్రాణి కోటి ప్రళయ కాలమున ప్రకృతిని జేరి అందు అణిగిఉండును. తిరిగి సృష్టి కాలమున వారిని మరల నేను సృజించుచున్నాను.
(భగవద్గీత 9:7)

దీనికి ఆశ్చర్యపడకుడి! ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాదులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుద్ధానమునకు, కీడు చేసినవారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చుదురు. (యోహాను 5:28, 29)

చిదంబరం లేక చిత్తంబళము


తమిళనాడులోని ద్రావిడ రీతుల్లో నిర్మించబడిన దేవాలయాల్లో చిదంబరం ఒక మణిపూస. చిదంబరం అంటే విజ్ఞానాంబరము అని అర్ధము. దక్షిణ ఆర్కాట్‌లోని చిదంబరంకు ముఖ్యకేంద్రం. 13 హెక్టార్ల చదరంలో పరచుకొని ఉన్న ఈ ఆలయ సమూహము అతి పురాతనమైనదిగా ప్రసిద్ధి. అందులో ప్రళయతాండవం చేస్తున్న పరమశివుని విగ్రహం కలదు చాలా పెద్ధది. నలువైపులా 4 గోపురాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణ గోపురాలు 49 మీ. ఎత్తున ఉన్నాయి. మిగతా 2 గోపురాల మీదా తాండవ నృత్యమాడే నటరాజస్వామి శాస్త్రీయ భంగిమలు 108 చెక్కించబడి ఉన్నాయి. ఆలయంలో విశేషంగా చెప్పుకోదగినవి నృత్యమందిరం. ఒక చిత్ర రధాకృతిలో నున్న పెద్ద సభా భవనంలో మధ్య ఒక చిన్న మందిరంలో నటరాజ స్వామి విగ్రహం ఉండి అంతా తానై వెలసి ఉన్న భావం గోచరిస్తుంది. మరొకటి ముఖ్యమైనది వేయి స్థంబాల మంటపం. ఆలయ ప్రాంగణంలోని పార్వతీ దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలతో పాటు శ్రీ మహావిష్ణువుకు అంకితమైన మరో ఆలయం ఉంది. శివకేశవులకు అభేదత్వమును కల్పిస్తూ శివుని దర్శించడానికి వెళ్ళిన వానికి విష్ణువు, విష్ణువును దర్శించడానికి వెళ్ళినవానికి శివుడు కనపడుతూ సర్వజగత్తుకు భగవంతుడు ఒక్కడే అనే భావం మన మనస్సులో మెదిలేట్టు చేస్తుంది. అసలు చిదంబర రహస్యం అనే నానుడి ఎప్పట్నుంచో వాడుకలో ఉంది. అంతూ, దరి తెలియని విషయాన్ని చిదంబర రహస్యం అనడం పరిపాటి. ఇక్కడ ఈ ఆలయంలో కూడా పంచ లింగాల్లో ఒకటైనటువంటి ఆకాశలింగమును చూడటానికి రుసుం చెల్లించి లోపలికి వెళ్ళినపుడు ఇది మనకి అనువైకవేద్యమవుతుంది. ఆకాశలింగం అంటేనే దీనికి ఆకారం ఉండదు. ఆలయపు గోడలో బంగారు రేకుమీద యంత్రంతో బిగించబడి ఉంటుంది. దాని ఎదుట ఒక తెరవేసి ఉంటుంది. లోపలకు వచ్చిన తరువాత ఆ తెర తీసి చూపిస్తారు. అంటే మనకు కనపడనిది చిదంబర రహస్యం అనుకోవాలి.

ఈ చిదంబరం 907 నుండి 1310 వరకూ చోళరాజుల రాజధాని. వీరచోళరాజ కాలంలో నటరాజ ఆలయం వ్యవస్థీకరించబడినట్లుగా ఉన్నత పాఠాలు చెప్తున్నాయి. వీరచోళరాజు కాలం క్రీ.శ. 927 నుండి 997 వరకు ఆలయ పట్టణం మధ్య నుండి 5 ప్రాకారాలు కలిగి ఉన్నది. మొదటి ప్రాకారంలోనే 4 సింహ ద్వారాల మీద గోపురములు ముందు చెప్పిన 4 గోపురాలు ఇవే. చిదంబరం నటరాజస్వామి వారి ఆలయంలో వేంచేసియున్న శ్రీ నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దది ఒకటియున్నది. దాని యెదయందు గంటలు, దానిపై జీను వగయిరాలు చూస్తే రాతితో చెక్కబడినది కాదు సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హిందూ దేశాల్లో నంది వాహనాలు అన్నింటిలోకంటే పెద్దది. శివగంగ వేయి స్తంభముల మంటపమునకు పడమటగా అమరి యున్నది కోనేరు. దీనికి సువర్ణ కోనేరు అనే పేరు ఉన్నది. చక్కగా చెక్కిన రాతితో మెట్లున్నవి. పూర్వం ఒకానొకప్పుడు వర్మచక్రుడనే రాజు స్నానం చేస్తే అతన్ని భాదిస్తున్న కుష్ఠురోగం పోయిందని చెప్తారు. ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చూడదగినది- పెద్ద నెమలి విగ్రహం, స్వామి వారి మయూర వాహనం, వినాయక దేవాలయంలోని వినాయకుని విగ్రహం, హిందూ దేశం మొత్తం మీదనే చాలా పెద్దది అంటారు. శిల్పులు ప్రతి అంగుళంలోనూ చూపిన నిపుణత్వం కౌశల్యము మనకు ఆశ్చర్యము, ఆనందాన్ని కలిగిస్తాయి. చిదంబర నటరాజస్వామి పుండరీ పురంలోని పాండురంగని వలె అనేక మంది భక్తులను, కవులను కాపాడి తనలో ఐక్యం చేసికొన్న భక్తసులభుడు. ఈయన లీలలను తిరువాచకమనే గ్రంధం పేర మణికవచుడు అనే ఆయన వ్రాశాడు. స్వామి అనుగ్రహంతో ఇలా ఎంతో మంది మహాగ్రంధకర్తలు స్వామి అనుగ్రహాన్ని పొంది తరించారు. అనపాయచోరుడు అనే రాజు వైరాగ్యము పొందిన పిదప తన జీవిత శేషాన్ని ఆలయ ప్రాంగణంలోనే నడిపాడు. ఆయన గౌరవార్ధం "జ్ఞానవాసి" అనే చిరు దేవాలయం కూడా ఉంది. ఇంకా చిదంబరంలో చూడదగినవి తిల్లైఅమ్మన్ దేవస్థానము శ్రీరాజ అన్నామలై చిట్టియార్‌ గారి పరిపోషణలో రూపుదిద్ధుకొన్న అణ్ణామలై విశ్వవిద్యాలయము చూడదగినది. చిదంబరంలోని శివాలయంలో ఉన్న తిరుచ్చిత్రకూటము ఒక దివ్యదేశంగా పరిగణించబడుతుంది. శ్రీ గోవిందరాజస్వామి పెరుమాళ్ళు, పుండరీకవల్లీ తాయారు, కుల, తిరుమంగయాళ్‌వార్ల మగయాళ్‌శాస్త్రం వైష్ణవులకు పవిత్రమైన క్షేత్రం.

పేదరాశి పెద్దమ్మ కథ


అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను - అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.

చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని - అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని - అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.

బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు - అనుకుంది. "బానా బానా దొర్లు,దొర్లు" అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను - అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని - అంది పెద్దమ్మ. పులి "సరే" అని వదిలి పెట్టింది.

పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం.

Tuesday, 22 July 2014

బ్రిటీష్‌ సైనిక బలగాలను సవాల్‌ చేసిన యోధురాలు బేగం హజరత్‌ మహాల్‌..




మాతృభూమి కోసం ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటీష్‌ సైనిక బల గాలతో తలపడిన రాణులు స్వాతంత్రోద్యమ చరిత్రలో అరు దుగా కన్పిస్తారు. ఆ అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్‌ మహాల్‌. ప్రథన స్వాతంత్య్రసంగ్రామం తొలిద శలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకు లతో రాజీబేరాలు కుదు ర్చుకునే ప్రయత్నాలు చేసి, అవి విఫలమై చివరకు మార్గాంతరం లేక పోరు మార్గం ఎంచుకున్న రాణుల్లా కాకుండా, ఆది నుండి కంపెనీ పాలకులను శత్రువులుగా పరిగణిం చి, మాతృదేశ పరిర క్షణార్థం, ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయుధం పట్టక తప్పదని ప్రకటించి, అత్యంత ధైర్య సాహసాలతో రణభూమి కి నడిచిన వీరనారీమణి బేగం హజరత్‌ మహాల్‌.

ఆమె ఉత్తర భారతదేశంలోని అత్యంత సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం అధినేత నవాబ్‌ వాజిద్‌ అలీషా సతీమణి. ఆమె స్వస్థలం మాత్రం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌. ఆమె స్వస్థలం మాత్రం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌. ఆమె చిన్నప్పటి పేరు ముహ మ్మద్‌ ఖానం. ఆమె అందచందాలకు గురించి విన్న నవాబు వాజిద్‌ అలీ షా అమెను కోరి మరీ విహహమాడాడు. వివాహం తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు. వివాహం తరువాత ఆమెకు ఇఫ్తికారున్నీసా (నారీమణి) అని పేరుపెట్టాడు భర్త. ఆమెను సుగంధ కన్య అని బిరుదు కూడా ఇచ్చాడాయన.


ఆమెను ఇఫ్తికారున్నీసా ఖానం సాహెబా కూడా పిలుచుకున్నాడు. ఆ దంపతులకు విూర్జా బిర్జిస్‌ ఖదిర్‌ బహుద్దూర్‌ అను కుమారుడు కలిగాడు. ఆ తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు.
అవధ్‌ రాజ్యం రాజధాని లక్నో. అది మొగల్‌ రాజ్యంలో ఒక భాగం కాగా, ఆ ప్రభువుల బలాధిక్యత క్షీణిస్తున్న సమయంలో స్వతంత్య్రరా జ్యంగా ప్రకటితమైంది. 1801లో అవధ్‌ రాజు నవాబు సాదత్‌ అలీ బ్రిటీష్‌ పాలకులతో సంధి చేసుకుని, అవధ్‌ రాజ్యాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీకి అప్పగించాడు. అవధ్‌ మిద అధికారం కంపెనీ పాలకులది కాగా, నవాబు నామమాత్రమయ్యాడు.ఆ అవధ్‌ రాజ్యా నికి చివరి నవాబు అయినటువంటి వాజిద్‌ అలీషా 1847లో సింహాసనం అధిష్టించాడు.


ఆ సంవత్సరం గవర్నర్‌ జనరల్‌గా డల్హౌసీ భారతదేశం విచ్చేశాడు. రాజ్యవిస్తరణ కాంక్షతో ఇండియాలోని ఒక్కొక్క రాజ్యాన్ని అక్రమం గా ఆక్రమించుకుంటున్న అతని చూపు సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం మీద పడింది. ఫలితంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన గవర్నర్‌ జనరల్‌ లక్నోలోని ఒక బ్రిటీష్‌ అధికారి ద్వారా లొంగుబా టు పత్రాన్ని తమారు చేయించి నవాబ్‌ వాజిద్‌ అలీషాకు పంపి, ఆ పత్రం మీద సంతకం చేయమని ఆదేశించాడు. ఆ సంత కం చేయ నట్లయితే కంపెనీ సేనలు అవధ్‌ రాజ్యంతో పాటుగా అం తపురాన్ని కూడా స్వాధీనం చేసుకోగలవన్నాడు. ఆ బెదిరింపు లకు భయపడిన నవాబు అవధ్‌ను కంపెనీపరం చేయడా నికి సిద్ధప డ్డాడు.


భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అవధ్‌ పతాకాన్ని విను వీధుల్లో ఎగరవేసిన బేగం హజరత్‌ మహాల్‌ ఆ సమయంలో రంగ ప్రవేశం చేశారు. ఆ లొంగుబాటు పత్రం మీద సంతకాలు చేయడ మంటే అవధ్‌ రాజ్యాన్ని పూర్తిగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి దాసో హం చేయటమేనని భావించిన ఆమె గవర్నర్‌ జనరల్‌ ఆదేశాలను నిరసించారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన కంపెనీ పాలకులు సవాబ్‌ అలీషాను 1856 ఫిబ్రవరి 13న నిర్బంధంలోకి తీసుకుని, మార్చి 13న కలకత్తా పంపారు. ఆ పరిణామాలకు భయపడిన నవాబు పరివారంలోని అత్యధికులు నవాబుతో పాటుగా కలకత్తా వెళ్ళి పోయారు. బేగం హజరత్‌ మహాల్‌ మరికొందరు మాత్రం, స్వంత గడ్డను పరులపరం చేసి కలకత్తా వెళ్ళటం ఇష్టం లేక లక్నోలోని కౌసర్‌ బాగ్‌లో ఉండిపోయారు.


ఆంగ్లేయుల ఈ చర్య వలన ప్రజలలో అసంతృప్తి రగులుకుంది. అవధ్‌ చుట్టు ప్రక్కల గల స్వదేశీ పాలకులు, స్వదేశీ యోధులు కంపెనీ పాలకుల దుశ్ఛర్యల పట్ల తీవ్రంగా ప్రభావతులయ్యారు. కుతకుతలాడుతున్న హృదయాలతో ఆంగ్లేయుల చర్యల పట్ల మండి పడసాగారు. ఆ సమయంలో ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం ఆరంభ మైంది. కంపెనీ చర్యల పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్న అవధ్‌లోని ప్రజలు, సైనికులు స్వదేశీయుల పాలన కోసం కంపెనీ పాలకుల ఆధిపత్యాన్ని నిరాకరిస్తూ తిరుగుబాటు ప్రకటిం చారు. 1857 మే 31న లక్నోలోని ఛావనీలో తిరుగుబాటు ఫిరంగు లు పేలాయి. ఆంగ్లేయాధికారులను, ఈస్ట్‌ ప్రాంతాల నుండి తరిమి వేశారు. అవధ్‌ రాజ్యంలోని అత్యధిక ప్రాంతాలు తిరుగుబాటు వీరుల అధిపత్యంలోకి వచ్చాయి. కంపెనీ పాలనాధికారం అనవాళ్ళు కూడా కన్పించకుండా తుడుచుకు పోయింది.


ఆ పరిస్థితులతో హడాలిపోయిన ఆంగ్లేయులు బేగంతో కాళ్ళ బేరానికి వచ్చారు ఆమె కనుక కంపెనీకి సైనిక సహాయం అందజేస్తే వాజిద్‌ అలీషా పూర్వీకుడు షుజా ఉద్దౌలా కాలంలో అవథ్‌ పాలన క్రింద ఉన్న అన్ని ప్రాంతాలను తిరిగి ఆమెకు అప్పగిస్తామని , తద్వారా అవధ్‌ రాజ్యం విస్తరించగలదని రాయబారినికి దిగారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే కంపెనీ రాజ్యవిస్తరణ కాంక్షకు తాను తొడ్పాటు అందించినట్టు కాగలదు కనుక, స్వేచ్ఛా-స్వాతంత్య్రకాంక్ష గల స్వదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆంగ్లేయుల పక్షాన నలివటం ఏమాత్రం సహించని బేగం హజరత్‌ మహాల్‌ ఆ ప్రతిపాదనను నిర్వందంగా తిరస్కరించారు.
నవాబు వాజిద్‌ అలీషా వంశస్థుల కోసం అన్వేషణ ప్రారంబ óమైంది. బ్రిటీష్‌ పాలకులంటే ఏర్పడిన భయం వలన అక్నోలో ఉంటున్న నవాబు భార్యను కొందరు తమ బిడ్డలకు, కలకత్తాలో ఉన్న భర్త బంధువులకు ఎటువంటి ప్రమాదం సంభవించగలదోనని భయపడి కంపెనీ పాలకుల ఆగ్రహానికి తమను బలి చేయవద్దంటూ ప్రాధేయ పడుతూ నాయకత్వం స్వీకరణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్లిష్ట సమయంలో హజరత్‌ మహాల్‌ కంటకప్రాయమైన మార్గంలో కూడా చారిత్రక పాత్ర నిర్వహించేందుకు ఎంతో సాహసంతో ముందుకొచ్చారు. ప్రజల అభియిష్టం మేరకు బిడ్డడు బిర్జిన్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకటించేందుకు అంగీకరించారు. ఆ సందర్భంలో బేగం నిర్వహించిన పాత్ర, ఆమె త్యాగనిరతీ, ఆత్మబలి దానం చిట్టచివరి వరకు శత్రువుకు లొంగని దీరత్వం చరిత్రలో ఆమెకు ప్రత్యేకస్థానం సంతరించి పెట్టాయి.
ఆ సమయంలో అవధ్‌ రాజ్యంలోని ఫైజాబాద్‌లో కంపెనీ పాలకుల బందీగానున్న తిరుగుబాటు యోధుల నేత మౌల్వీ అహమ్మదుల్లా షాను, తిరుగుబాటు యెధులు విడుదల చేయించి ఆయనను తమ నాయకునిగా స్వీకరించారు. మౌల్వీ తన బలగాలతో అక్నో చేరుకు ని కంపెనీ పాలకులను ఎదుర్కోన్నారు ఆ సందర్భంగా బేగం హజరత్‌ మహాల్‌ బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా మరింత చొరవ తీసుకున్నారు. ఆ కారణంగా తిరుగుబాటు మరింత ప్రజ్వరిల్లింది. పది రోజుల్లో లక్నో అంతా పూర్తిగా తిరుగుబాటు సేనల పరమైంది.


బేగం హజరత్‌ మహాల్‌ తన బిడ్డ బిర్జిస్‌ ఖదీర్‌ను 1857 జూలై 5న అవథ్‌ నవాబుగా ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు బలపర్చారు. తిరుగుబాటు యోధులలో ఆనందం విల్లి విరిసింది. బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ పాలన ప్రారంభమైంది. ఆమె అధికారపగ్గాలను చేపట్టగానే పాలనా పరమె ౖన చర్యలను చేపట్టారు.అన్ని సాంఘిక జనకసముదాయాలకు పాలనాధికారంలో భాగం కలిగించే విధంగా సైనికాధికారులకు, తిరుగుబాటు వీరులకు, స్వదేశీ భక్తులకు ప్రతిభా సామర్థ్యాల ఆధారంగా పలు విభాగాల బాధ్యతలను అప్పగించారు.


మతం, కులం, ప్రాంతాల ప్రసక్తి లేకుండా, పౌర-సౌనికాధికార ప్రముఖులైన ముమ్మూఖాన్‌, మహారాజ బాలకృష్ట, బాబూ పూర్ణచంద్‌, మున్షీ గులాం హజరత్‌, మహమ్మద్‌ ఇబ్రహీం ఖాన్‌, రాజా లాలా సింహ్‌, రాణా జిజియా లాల్‌, రాజా మాన్‌సింగ్‌, రాజా దేశిబక్ష్‌ సింగ్‌, రాజా బేణిప్రసాద్‌ లాంటి వారితో ఉన్నాతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటి ప్రతి రోజు సమావేశమ య్యేది. ప్రతి అంశాన్ని సభ్యుల ఎదుట పెట్టి, చర్చించి ప్రజాస్వామ్య బద్దంగా నిర్ణయాలు తీసుకొని వాటి అమలును బేగం పర్యవేక్షిం చారు. ఆనాటి రాజరికపు రోజుల్లో ఆ విధంగా ప్రజాస్వామికంగా వ్యవహరించటం బేగం హజరత్‌ మహాల్‌ బుద్దికుశలతకు నిదర్శ నం. అన్ని రంగాలు పూర్తిగా ఆమె ఆధీనంలోకి వచ్చాక అవధ్‌ నవాబు బిర్జిస్‌ ఖధిర్‌ పేరిట వెలువడిన ప్రకటనలు అవథ్‌ రాజ్యంలో ఆంగ్లేయుల పాలన అంతటితో అంతమైందని ఆ ప్రకటనలు స్పష్టం చేశాయి. అంతటితో ఆమె మిన్నకుండి పోలేదు. స్వయంగా గుర్రం మీద, ఏనుగు మీద సవారి చేస్తూ ప్రజలను, ప్రముఖులను కలుస్తు ఆమె రాజ్యమంతా తిరిగి అందర్ని ఏకతాటి మీదకు తెచ్చేందుకు విజయవంతంగా ప్రయత్నించారు.


బేగం హజరత్‌ మహాల్‌ ఎటువంటి ప్రగతిశీల, సామరస్యపూర్వక విధానాలు చేపట్టినా, ఆమె శక్తిసామర్థ్యాల పట్ల విశ్వాసం కలుగని కొందరు స్వదేశీ పాలకులు, జమీందారులు ఆమె నాయకత్వాని& తొలుత ఆమోదించలేదు. అవధ్‌ అంతటా అస్తవ్యస్థ పరిస్థితి, క్రమ శిక్షణారాహిత్యం, వ్యక్తిగత స్వార్థంతో కంపెనీ పాలకులవవైపు మొగ్గు చూపుతున్న విద్రోహుల బెడద, బేగం శక్తి సామర్థ్యాలను శంకించే జమీందారులు రగడ, స్వదేశీ పాలకుల, అధికారుల సమస్యలు ఒకవైపు, అవమాన భారంతో రగిలిపోతున్న కంపెనీ పాలకుల కుయుక్తులు మరొకవైపు బేగం హజరత్‌ మహాల్‌ను చుట్టుముట్టాయి.
ఆ పరిస్థితులలో కూడా ఆమె ఏమాత్రం ఆధైర్యపడలేదు. ప్రజలను ఆకట్టుకుంటూ, స్వదేశీ పాలకులకు, తాలూకాదారులకు పలు రాయితీలు ప్రకటించారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి జనరల్‌ హ్యాప్‌లాక్‌ తనకు లభించిన రెండు విజయాల తరువాత కూడా అవధ్‌ నుండి నిష్క్రమించటంతో బేగం శక్తిసామర్ధ్యాల మీద నమ్మ కం కుదిరిన స్వదేశీ పాలకులు, జమీందారులు తిన్నగా బేగం నాయకత్వం స్వీకరించి, నజరానాలు సమర్పించుకోవటం ఆరంభిం చారు. ఢిల్లీలోని మొగల్‌ చక్రవర్తి బహద్దూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ తనను తాను ప్రకటించుకున్నారు. ఆయన ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ అవధ్‌ పాలకునిగా పాలనను చేపట్టారు. కంపెనీ అధికారుల చర్యలతో నష్టపోయి కంపెనీ పాలకుల పట్ల ఆగ్రహంగా ఉన్న స్వదేశీయులు ఆయనను అవధ్‌ పాలకునిగా అంగీకరిం చారు. ఈ మేరకు అవసరమగు లాంఛనాలన్నీ పూర్తయ్యాయి.


ఆ అనుకూల వాతావరణంలో ప్రజల అవసరాలను తీర్చుతూ, శత్రువు దాడుల నుండి ప్రజలను కాపాడేందుకు లక్నో కోటను పటిష్ట పర్చే కార్యక్రమాలను బేగం చేపట్టా రు. ఆమె స్వయంగా తన లక్షలాది రూపాయలను వ్యయం చేసి కోటగోడలను పనర్మించారు. ప్రతి విషయాన్ని హజరత్‌ మహాల్‌ స్వయంగా పర్యవేక్షించసాగారు. ఆమె ఏనుగెక్కి పనులు సాగుతున్న ప్రదేశాలకు చేరుకుని స్వయంగా పర్యవేక్షించటంలో ప్రజలు- సైని కులు ఉత్సాహభరితులయ్యేవారు.

అఘోరాలు




హిమాలయ పర్వతశ్రేణులు.. మంచు కొండల మధ్యన ఆశ్రమాలు.. అఖారాలు... ఆశ్రమాల్లో సాధు సంతులు.. నిస్సంగులు.. గడ్డ కట్టే చలిలో ఆవాసాలు.. దొరికితేనే తిండి.. దొరక్కపోతే గాలే భోజనం.. బట్టలూ అంతంత మాత్రమే.. దిగంబరులకైతే ఆ వసా్తల్ర బాధా లేదు.. మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుష్షు ఎంతో తెలుసా? మినిమమ్‌ హండ్రెడ్‌ ఇయర్‌‌స.. ఇంకా ముందుకు వెళ్తే 150 ఏళు్ల .. 250 ఏళ్ల పాటు జీవించిన వాళూ్ల ఉన్నారంటే నము్మతారా? నమ్మాల్సిందే మరి.. 


1
150 ఏళు్ల.. వినిడానికి వింతగానే ఉంది కదా? ఇన్నేళు్ల జీవించటం మానవ మాత్రుడికి సాధ్యమేనా? యెస్‌.. సాధ్యమే.. హిమాలయాల్లో మనకు కనిపించే సిద్ధపురుషులు చాలా మంది వందేళ్లకు పైగా వయసున్న వాళ్లే.. వారిలో ఒకరిద్దరు 250 సంవత్సరాలు కూడా జీవించిన వారున్నారు.... ప్రతికూల వాతావరణంలో, నియమిత ఆహారం లేని చోట అంతకాలం ఎలా జీవించి ఉంటున్నారు.. మరి మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం..పట్టణాల్లో ఉండే జనం 50 ఏళ్లకే ఎందుకు బాల్చీ తన్నేస్తున్నాడు..? వాట్‌ ఈజ్‌ ది మిస్టరీ...

 

2
ఒకరి వయసు 120 ఏళు్ల
మరొకరు 150 ఏళు్ల
ఇంకొకరికి ఏకంగా 250 ఏళు్ల
కలా? నిజమా?
ఇంతకాలం జీవించిందెవరు?
పురాణాల్లో దేవతలు కారు..
మన కళ్ల ముందున్న సాధువులు
హిమాలయాల్లో ని సంతులు
మంచు కొండల నడుమ ఉండే సిద్ధులు
ప్రతికూల వాతావరణంలో జీవించే సన్యాసులు

దేవ్హ్‌బ్రాబా... ఈయన ఉత్తరప్రదేశ్‌ నుంచి హిమాలయాలకు వచ్చారు... అక్కడే ఉంటున్నారు.. ఈయన ఫోటోను ఇంటర్నెట్‌లో చూడవచ్చు కూడా.. ఈయన వయస్సు మాత్రం 250 సంవత్సరాలు..ఈయన పుట్టింది 1772 మార్చిలో.. చిన్నప్పుడే హిమాలయాలకు వచ్చి అక్కడే స్థిరపడిపోయారు.. ఈశ్వరుడి ఉపాసనలో జీవితం గడపుతున్నారు.. హిమాలయాల్లో చాలా క్లిష్టమైన ప్రాంతంలో ఆయన ఆశ్రమం ఉంది. ఈయన ఇక్కడే ఉన్నా చాలా కాలం పాటు ఎవరికీ దర్శనమిచ్చేవారు కారు.. ఈయన పాదస్పర్శతో అన్ని కోరికలూ తీరుతాయని ప్రజల విశ్వాసం..
ఈయన ఇంతకాలం జీవించి ఉండటం విదేశీ మీడియాకూ మిస్టరీగా మారింది.. దీనిపై తెగ రీసర్‌‌చ చేసింది.. పాపం ఆ జర్నలిస్టులు సైతం ఆయన పాదాల్ని శిరసుపై ఉంచుకుని వెళ్లిపోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు...

 

3
కోరుకున్నప్పుడు మరణించటం సాధ్యమేనా?
మామూలు మనుషులకు సాధ్యం కానిది
సాధు సంతులకు ఎలా సాధ్యపడింది?
వందేళ్లకు పైగా ఎలా జీవించి ఉండగలుగుతున్నారు?
సైన్‌‌సకు సైతం అంతుపట్టని మృత్యురహస్యం
చావును జయించిన సాధువులు

వాళు్ల ఉండే మంచుకొండల నడుమ మామూలు మనుషులు క్షణం కూడా ఉండలేరు.. అక్కడికి వెళ్లాలంటే కట్టుదిట్టంగా తయారవుతారు.. ఒళ్లంతా ఉన్నితో కప్పుకుని కానీ కదలలేరు. సన్యాసులు ఏళ్ల తరబడి ఎలా జీవనం గడుపుతున్నారు.. అంతే కాదు.. వారి జీవన విధానం కూడా పూర్తి డిఫరెంట్‌గా ఉంటుంది.. అలాంటి ప్రతికూల వాతావరణంలో వాళు్ల వందల సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు, మనకు ఎందుకు సాధ్యం కావటం లేదు?

 

4
మనం ఎన్నేళు్ల బతుకుతాం? మహా అయితే 50 ఏళు్ల.. కాకుంటే అరవై ఏళు్ల.. అంతకన్నా ఆశ

లేదు లెండి... ఇప్పటికే ఎక్కువ కాలం బతికేశాం.. ఇంకేం బతుకుతాం చాల్లెద్దూ.. ఇవాళ ప్రతి ఒక్కరి నోటా సహజంగా వినిపించే మాటే ఇది.. ఎక్కువకాలం బతకటం.. ఒకరిపై ఆధారపడటం దేనికి? హాయిగా యాభై ఏళు్ల బతికితే చాలనే వాళ్ల సంఖ్యే ఎక్కువ.. మరి ఎలాంటి కోరికలు లేని సాధువులు మాత్రం ఆయుష్షు మాత్రం ఎక్కువగా కోరుకుంటున్నారు.. కోరుకుంటున్నట్లే ఉండగలుగుతున్నారు.. ఎందుకు? ఎలా?
హిమాలయాలు.. ఆధ్యాత్మిక ప్రపంచం యావత్తూ పవిత్రంగా భావించే ప్రాంతం.. హిందువులకు హిమాలయాలు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానం.. కైలాస్‌, మానస సరోవర్‌, గంగ, యమున, సరస్వతి, కేదార్‌నాథ్‌, హరిద్వార్‌, రుషికేష్‌, బద్రీనాథ్‌.. ఒకటా రెండా.. వందల సంఖ్యలో ఆధ్యాత్మిక పవిత్ర ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. భక్తి శిఖరాలు హిమాలయాలు..వెండి కొండల్లో వేలుపుల వెలుగులు..ముక్కోటి దేవతల అలవాలం..సాధుసంతుల పాలిటి కల్పతరువులు.
హిమాలయాల్లోని ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలన్నింటిలోనూ మనకు ఎక్కువగా కనిపించేది సాధు సంతులే.. సిద్ధపురుషులే.. ఈశ్వరోపాసనలో తలమునకలై కనిపిస్తారు. భక్తులు వస్తే ఆశీర్వదిస్తారు.. విభూతి ఇస్తారు.
లోకాన్ని పట్టించుకోరు
తమనూ పట్టించుకోరు
శరీరంపై మమకారం లేదు
కోరికలు లేని జీవన విధానం
ఉపాసనలోనే జీవితం
అందులోనే ఆనందం అనుభవిస్తారు.
సాధారణంగా కనిపించే సాధువులు అందరితోనూ మమేకమవుతారు.. మంచి చెడులు చెప్తారు. ఆశీర్వదిస్తారు.. కానీ, ఈ పర్వత శ్రేణుల్లోనే ఎవరికీ పట్టని సాధుపురుషులు ఉన్నారు.. వీళ్లకు లోకం పట్టదు.. లోకానికి వీళు్ల పట్టరు.. వీళు్ల ఎవరినీ తమ దగ్గరకు రానివ్వరు.. వీళ్ల దగ్గరకు వెళ్లేందుకు అంతా భయపడతారు.. హిమాలయ సానువుల్లో అత్యంత ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్లే.. తమ వయసు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు.
హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు.. మంచు కరిగిన స్వచ్చమైన నీటిని తాగుతారు.. ఒంటి నిండా విభూతే అలంకారంగా రాసుకుంటారు. దొరికింది తింటారు.. దేనిపైనా మోజు ఉండదు.. అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు.. ఎక్కడైనా కుంభమేళాలు జరిగినప్పుడు మాత్రం బయటి ప్రపంచంలోకి వస్తారు...పవిత్రస్నానాలు చేసి మౌనంగా తిరిగి వెళ్లిపోతారు..
 

5
మిగతా మనుషులకూ, హిమాలయాల్లో ఉండే సాధువులకు మధ్య తేడా ఏమిటి? వాళు్ల సుదీర్ఘ కాలం ఎలా జీవించగలుగుతున్నారు.. కేవలం ఈశ్వరుని ఉపాసించటమే వారి ఆరోగ్య రహస్యమా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? ప్రతికూల వాతావరణం, శరీరం గడ్డకట్టే చలి, అన్నింటినీ తట్టుకునే శక్తి ఎక్కడిది? అతీంద్రియ శక్తులు ఉన్నాయా? సిద్ధులు లభించాయా?
సాధువుల ఆరోగ్య రహస్యం ఏమిటి?
ఇది నిజంగా అంతుపట్టని విషయం.. సైన్‌‌స పరిశోధనలు ఎన్ని చేసినా తేలని వాస్తవం.. హిమాలయాల్లో సాధువులు నిజంగా సిద్ధ పురుషులనే చెప్పాలి.. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన వాళు్ల.. తాము కోరుకున్నప్పుడు మృత్యువు దరి చేరే సామర్థా్యన్ని సాధించిన వాళు్ల. అందుకే ఎన్నేళ్లయినా వారి శరీరం క్షీణించదు.. రోగాలు దగ్గరకు రావు.
హిమాలయాల్లో సాధువుల దీర్ఘాయుష్షుకు వారు పాటించే కఠోరమైన నియమాలే కాదు.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం కారణం. సృష్టి కర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు.. ఈ లోకాన్ని సృష్టించింది.. నడిపిస్తున్నది.. నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నము్మతారు.. శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం. దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్య అనే వారు భావిస్తారు..తాము భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లుగా అనుభూతి చెందుతారు.
తమ ఆయుష్షుపై నమ్మకం ఉండటం రెండో కారణం. తాము కోరుకుంటే తమ జీవిత కాలాన్ని కోరుకున్నంత కాలం పెంచుకోగలమని వారు గట్టిగా నము్మతారు.. కేవలం కోరుకుంటే జరిగిపోతుందా అని ఆశ్చర్యపోవద్దు.. ఇది వాస్తవం.. మన మైండ్‌ను పూర్తిగా మన అదుపులో ఉంచుకోగలిగితే ఏదైనా సాధించవచ్చన్న అంశం మిలియన్ల కొద్దీ సందర్భాల్లో రుజువైన సంగతే. విల్‌పవర్‌ అన్నది అందరికీ తెలిసిన సంగతే.. ఆ విల్‌ పవరే.. మనల్ని మన లక్ష్యానికి చేరువ చేస్తుంది. సాధుపురుషులు సాధించింది ఇదే.
తమ జీవితంపై తమకు పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ ఉండటం మూడో విషయం.. మనలో చాలామందికి కరవైంది ఇదే. ఈ పాజిటివ్‌నెస్సే తగ్గిపోయింది. యూత్‌ సైతం లైఫ్‌లో అంతా అయిపోయినట్లు విరక్తితో మాట్లాడటం మామూలే.. కానీ, హిమాలయాల్లో సాధువులు అలా కాదు.. సృష్టికర్త తమకు ఇచ్చిన ఈ శరీరం, జీవితం ఆయనకు మాత్రమే చెందిందని నము్మతారు.. జీవితాన్ని ముగించేయాలనుకోవటమో.. ముగించటమో లాంటి హక్కు తమకు లేదని నము్మతారు.. తమపై తమకు పూర్తి అనుకూలత అనేది ఎంత బలాన్నిస్తుందనేది హిమాలయ సాధువులను చూసి తెలుసుకోవచ్చు.
అన్నింటికంటే ముఖ్యమైంది సాధువుల్లో అంతర్గతంగా కనిపించే శక్తి.. ఆహారం, వ్యాయామాలకంటే మించిన అంతర్గత శక్తి మనిషిని అన్ని రోగాల నుంచి దూరం చేస్తుంది. శరీరంలో ఇంటర్నల్‌గా ఉండే వివిధ ఎనర్జీ సెంటర్లను పూర్తి స్థాయిలో ఆక్టివ్‌గా ఉంచటం. హిమాలయాల్లో సాధువులు మెడిటేషన్‌ ద్వారా దీన్ని పూర్తిగా సాధిస్తారు.. కొన్ని గంటల పాటు సమాధి స్థితిలోకి వెళ్లిపోతారు.. ఇది శరీరాన్ని పూర్తిగా వారి స్వాధీనంలోకి తీసుకువస్తుంది.

 

6
ఒక ప్రత్యేక జీవన శైలి... మామూలు ప్రపంచానికి అర్థం కానిది.. మనకు.. అంటే సాధారణ ప్రజలు అవలంబించలేని జీవన విధానం... అందుకే వారు కోరుకున్నట్లుగా ఉంటున్నారు. కోరుకున్నేళు్ల జీవిస్తున్నారు.. కేవలం హిమాలయాల్లోనే కాదు.. ప్రపంచంలో అక్కడక్కడా, అడపా దడపా నూరేళ్ల పైచిలుకు జీవించిన వారి వివరాలు తెలుసుకున్నా ఇంచుమించు వాళ్ల లైఫ్‌లోనూ ఇలాంటి ఆసక్తికర కథనాలే కనిపిస్తాయి..
హిమాలయాల్లో సిద్ధపురుషులు నియమిత జీవితం అసాధారణమైంది. మామూలు ప్రజలు కనీసం ఊహల్లోనైనా ఆలోచించలేనిది. వాళు్ల చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు.. కొందరు దిగంబరంగా ఉంటారు.. కొందరు స్మశానంలో తిరుగుతారు.. ఆహారం విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు. దొరికింది తింటారు.. దొరక్కపోతే మానుకుంటారు. పచ్చి ఆకులు తింటారు. పచ్చి మాంసమూ తింటారు.
సాధువులంతా శాకాహారులే అనుకుంటే పొరపాటే.. నాగా సాధువులు అతి తీవ్రంగా ఉంటారు. మద్యం సేవిస్తారు.. హుక్కా పీలుస్తారు.. ఒళ్లంతా విభూతి రాసుకుని ఉంటారు.. వీళ్లకు ఎలాంటి ఆహార నియమాలు ఉండవు. అలాగని ఇష్టం వచ్చిన సమయంలో ఇష్టం వచ్చినట్లుగా తినరు.. పరిమిత ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు.. నాగాలు కాకుండా మామూలు సాధువులైతే శాకాహారానికే ప్రిఫరెన్‌‌స ఇస్తారు..
అన్నింటికీ మించి సాధువులు చేసే యోగ సాధన వారిని మృత్యుంజయులను చేస్తోంది. భారతీయ యోగ

శాస్త్రంలో చెప్పిన అనేక విధానాలు, ఆసనాలు సాధు సంతుల నిత్యకృత్యాలు.. యోగా ద్వారా మనిషి శరీరంలోని కుండలినీ శక్తిని చైతన్యం చేయవచ్చని ఇప్పటికే ప్రపంచం విశ్వసిస్తోంది.. ఈ యోగాను మన సాధువులు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్నారు.. వారు చేసే యోగాను చూస్తే ఇది ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకోక తప్పదు.
ఉపాసన, సాధనల ద్వారా హిమాలయాల్లో సాధువులు ఇచ్ఛామరణాన్ని సాధించారు. దేవ్హ్‌ బాబా ఇందుకు ఒక్క ఉదాహరణే... ఈయన్ను దర్శించుకోవటానికి ఆనాడు ఇందిరాగాంధే స్వయంగా వచ్చారు... ఈ సాధువులే కాదు.. ప్రపంచంలో చాలా చోట్ల అక్కడక్కడా మనకు వందేళ్లకు పైగా జీవించిన వాళు్ల మనకు తారసపడతారు. బంగ్లాదేశ్‌లో 150 ఏళ్లు జీవించిన వ్యక్తి, చైనాలో అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించిన మనుషులను చూడవచ్చు.
నియమిత పద్ధతిలో ప్రకృతి సహజసిద్ధమైన జీవిత విధానాన్ని అనుసరించే వాళు్ల కోరుకున్నన్ని రోజులు జీవించవచ్చు. సో బి పాజిటివ్‌ ఆబౌట్‌ యువర్‌ లైఫ్‌.. అండ్‌ బి ఏ పాజిటివ్‌ ఆటిట్యూడ్‌.. ట్రైటు లాంగ్‌లైఫ్‌ యువర్‌ సెల్‌‌ఫ... మీ విల్‌ పవరే మిమ్మల్ని సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుందన్న వాస్తవాన్ని గ్రహించండి...