దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక , ప్రధానమంత్రి నెహ్రూ గారి అధ్యక్షతన దేశ భద్రత విషయం లో వొక ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది .. భారత సేనాధ్యక్షుడి ఎంపిక విషయమై తీవ్ర మైన చర్చ జరుగుతోంది . కొందరు మంత్రులు ,కాంగ్రెస్ నేతలు, సైనికాధికారుల తో నెహ్రూ గారు భారతీయ సేన బాధ్యతలు ఎవరికీ అప్పగించాలనే విషయమై సమాలోచనలు జరుపుతున్నారు . సమావేశం మధ్యలో నెహ్రూ గారు జోక్యం చేసుకుంటూ వో ప్రతిపాదన చేశారిలా - " వొక బ్రిటిష్ అధికారినే మన భారతీయ సేనకు ఆర్మీ జనరల్ గా నియమిస్తే బావుంటుందేమో ! ఎందుకంటే మన వద్ద సైన్యాన్ని లీడ్ చేసే అనుభవశాలి ఎవరూ కనపడటం లేదు ... ఏమంటారు ?"అని . సమావేశం లో పాల్గొన్న మంత్రులూ , కాంగ్రెస్ నేతలు నెహ్రూ గారి ప్రతిపాదన ను సమర్థించటం మొదలెట్టారు , ఎంచేతంటే ఆయన ప్రధానమంత్రి హోదా లో వున్న ప్రముఖుడాయే ..
ఐతే ఇదే సమయాన సైనికాధికారుల వరుస లో నుండి "ప్రధాన మంత్రి గారూ నాదో సూచన ... నా దేశ ఆత్మగౌరవానికి సంబంధించినది ఈ సూచన " అనే మాటలు వినబడ్డాయి . దాంతో నెహ్రూ సహా సమావేశం లో పాల్గొన్న వారంతా అటు వేపు తలలు తిప్పారు , కొద్ది క్షణాల సేపు ఆ సమావేశం లో మౌనం ... !!
ఆ తర్వాత ప్రధానమంత్రి " చెప్పండి మిత్రమా , నిర్మొహమాటం గా- నిర్భయం గా చెప్పండి మీ సూచన ఏంటో ?" అన్నారు . ఆ సైనికాధికారి మెల్లగా -దృఢమైన గొంతుక తో చెప్పడం
మొదలెట్టారిలా " సర్ , మన దేశం సర్వ స్వతంత్రమైన దేశం , దేశ సార్వభౌమత్వానికి ప్రతీక గా నిలిచే ఏ ముఖ్యమైన పదవి లో నయినా మన భారతీయులే వుండా లనేది నా కచ్చితమైన అభిప్రాయం . అనుభవం లేదని చెప్పేసి ప్రధానమంత్రి పదవి లో కూడా వొక బ్రిటిష్ వాడిని కూర్చోబెడదామా ? చెప్పండి ". నెహ్రూ గారు ఖంగు తిన్నారు , ఆనక ఆయన్నే అడిగారు -"మీరు చెప్పింది నిజమే , అంగీకరిస్తాను .. మరి సైన్యాధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు మన వద్ద యోగ్యులెవరున్నారు ?". దాంతో ఆ అధికారి జవాబిస్తూ అన్నారిలా - "ప్రధానమంత్రి గారూ - యోగ్యులు ,నిజాయితీపరులు మరియు గుణ సంపన్నులైన వారెందరో మన వద్ద వున్నారు , అంతెందుకు -నా సీనియర్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ కరియప్ప... ఇక్కడే -మన మధ్యనే వున్నారు , సేనాధ్యక్షుడిగా , సైన్యాధిపతి గా ఆయన అన్ని విధాలా యోగ్యుడైన వ్యక్తి . ". ఆ అధికారి సూచన ను నెహ్రూ గారు వెంటనే ఆమోదించేశారు .
ఇంతకూ నెహ్రూ నే ఖంగు తినిపించి దేశ ఆత్మ గౌరవాన్ని ప్రబోధించిన ఆ సైనికాధికారి ఎవరో తెలుసా ? భారతీయ ఆర్మీ కి మొదటి లెఫ్టినెంట్ జనరల్ గా వ్యవహరించిన లెఫ్టినెంట్ జనరల్ నథూ సింగ్ రాథోడ్ .
No comments:
Post a Comment