Tuesday 4 February 2014

భారతరత్నము "సచిన్ టెండూల్కర్"........కి శుభాకాంక్షలు

రిటైర్ అయినా…. అభిమానుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ మాస్టర్ బ్లాస్టర్…. హృదయాల్లో ఎప్పటికీ నాటౌటే…. అందుకే ఇంతింతై సచినింతై పద్మవిభూషనుడై, భారతరత్నమయ్యాడు…. 





సచిన్ టెండూల్కర్ ముమ్మాటికీ భారతర్నమే. క్రీడా జీవిత ఆరంభం నుంచి వీడ్కోలు పలికే వరకు వివాదాలకు దూరంలో క్రికెట్ రంగంలో అన్ని విధాలుగా రికార్డులు సృష్టించి క్రీడా జ్యోతి...............                                 

        ‘సచిన్ టెండూల్కర్’…. కొన్ని దశాబ్ధాలు అదొక తారక మాత్రంలా వెన్నంటే ఉన్న పేరు, తన జ్ఞాపకాలనే మరిపిస్తూ మురిపిస్తూ ఉన్న పేరు…. పసిపిల్లల నుంచీ పండుముదుసలుల వరకూ అందరికీ తెలిసిన పేరు... ఇంకా చెప్పాలంటే, అసలు పరిచయమే అక్కర్లేని పేరు… క్రీడ కన్నా ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకున్న పేరు….
చిన్నప్పుడు క్రికెట్ చూడటం అలవాటైనప్పటి నుంచి వదలని పేరు సచిన్…. 
నాలాంటి చాలా మంది సగటు అభిమానులకు అసలు క్రికెట్ అంటే ఇష్టం పెరిగింది, చూడటం పెరిగింది కేవలం సచిన్ వల్లనే అంటే అతిశయోక్తి కాదేమో…. రెండు దశాబ్ధాల నుంచి ఉన్న ఈ అభిమానం, మన పక్కింటి కుర్రాడు లా, సచిన్ ‘గాడు’ ఎంత కొట్టాడ్రా?, సచిన్ ‘గాడు’ ఉన్నాడా లేడా? అయ్యో సచిన్ ‘గాడు’ ఔటా? అనటం నుంచి సచిన్ మా క్రికెట్ ‘గాడ్’ అని అనిపించేలా చేసింది.. కాదు కాదు ఆరాధించేలా చేసింది….
సచిన్ ని మరింత ఉన్నత స్థాయికి నిలబెట్టింది తన వ్యక్తిత్వం…. అతడు మాట్లాడడు…. ఆడతాడు…. ఎందరో ఎన్నో సార్లు మైదానం లోపలా బయటా గొంతు చించుకున్నా, ప్రతీసారి తన ఆట తోనే సమాధానం చెప్పాడు…. ఎప్పుడు తన నోరు మాత్రం జార లేదు…. బ్రెట్ లీ, మెగ్ గ్రాత్ లాంటి వాళ్ళు ఎన్నో సార్లు రెచ్చగొట్టినా, వకార్ లాంటి బౌలర్స్ రక్తం వచ్చేలా గాయం చేసినా…. ఎన్నో మేటి మేగజైన్స్ సచిన్ పని అయిపోయిందా అని ఎన్ని సార్లు పెద్ద ఆర్టికల్స్ రాసినా అన్నిటికి తన ఆటతోను, బాట్ తోనే సమాధానం చెప్పాడు గాని ఎన్నడూ తన వ్యక్తిత్వానికి మాత్రం మచ్చ తెచ్చుకోలేదు ఈ సచ్చీలుడు....
సచిన్ ని పరుగులతో కొలవటం జనాలు ఎప్పుడో మరచిపోయారు, కాదు కాదు విడిచిపెట్టేసారు…. ప్రతీ మ్యాచ్ లోనూ తనదైన ముద్ర వేస్తూ, సగటు ప్రజల ఉద్వేగాల్లో ఉత్సాహం నింపుతూ అలసట ఎరుగని పయనం సాగించాడు…. కాని సచిన్ అభిమానించింది కేవలం అతని ఆటని చూసి మాత్రమే కాదు, ఎన్ని చేస్తున్నా తనని తాను మలచుకున్న తీరు, మచ్చ లేకుండా చెక్కుకున్న తన వ్యక్తిత్వం,  పెరగటమే గాని తగ్గని వినయం…. అందుకే యావత్ భారతదేశం తనతో, తన ఆటతో తాదాత్మ్యం చెందిది, తన కోసం ప్రార్థించింది…. దేవుడు అనేటంతటి స్థాయికి తీసుకెళ్ళింది….


సచిన్ తుఫాను తడి ఇంకా మనసు నుంచి పోనేలేదు, కళ్ళు చేదిరే స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్ లు ఇంకా కళ్ళను వీడనే లేదు… కానీ ఇంతలోనే క్రికెట్ ప్రపంచం నుంచి సచిన్ విరమణ….    ఒక సగటు అభిమాని కలలో కూడా ఊహించని ఆ క్షణం….కాని అది ఆటగాడిగా మాత్రమే విరమణ, సచిన్ కి కాదు, అతని ప్రభావానికి అంతకంటే కాదు…. సచిన్ పంచిన జ్ఞాపకాలు, అనుభూతులు, ఆఖరికి తన చివరి స్పీచ్ ఎప్పటికీ పదిలం మా గుండెల్లోనే….


ఐకాన్ ఆఫ్ క్రికెట్ అతడు 
ఆల్ టైం రికార్డ్ బుక్ అతడు
రిలీజియన్ ఆఫ్ స్పోర్ట్స్ గాడ్ అతడు
స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అతడు
ఆటలకే మరి, వన్నె తెచ్చాడతడు
అందరికీ స్ఫూర్తియై నిలిచాడతడు
అందని వాడిగా ఎదిగాడతడు
అందరి వాడిగా నిలిచాడతడు
అతడు.. అతడు.. అతడే..
మాస్టర్.. బ్లాస్టర్.. మరి అతడే ..
జయహో..
  జయ జయహో సచిన్ టెండూల్కర్

















No comments:

Post a Comment