Thursday, 20 February 2014

నియోజకవర్గాల సమాచారం

కూకట్‌పల్లి

నియోజకవర్గం: కూకట్‌పల్లి
ఆవిర్భావం : 2009
ఎమ్మెల్యే : జయప్రకాష్‌ నారాయణ (లోక్‌సత్తా) చారిత్రాత్మక నేపథ్యం

కూకట్‌పల్లిలో నిజాంకాలం నాటి బురుజులు, కమాన్లు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఒకప్పుడు కేపీహెచ్‌బీకాలనీలోకి రావాలంటే ప్రజలు భయపడేవారు. దోపిడీలు.. హత్యలు జరగడమే దీనికి కారణం. ఇటువంటి కాలనీ తర్వాత గణనీయమైన అభివృద్ధి చెంది ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా ఆవిర్భవించింది. అతిపెద్ద హౌసింగ్‌ ప్రాజెక్టులు మలేషియా టౌన్‌షిప్‌, ఇందూ ప్రాజెక్ట్సు తదితరాలు ఈ కాలనీకి మణిపూసల్లాంటివి. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ జేఎన్‌టీయూ ఇక్కడే కొలువై ఉంది.

రాజకీయ నేపథ్యం
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన ఖైరతాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న కూకట్‌పల్లి ప్రాంతం... పునర్విభజనలో 2009లో అసెంబ్లీ నియోజకర్గంగా ఆవిర్భవించింది. ఇక్కడ నుంచి లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెదేపా పోటీలో లేకపోవడం లోక్‌సత్తాకు లాభించింది. కూకట్‌పల్లి తెదేపాకు కంచుకోటగా చెప్పుకోవచ్చు. గ్రేటర్‌ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 6 డివిజన్లలో నాలుగింటిని తెదేపా, ఒకటి ప్రరాపా, ఒకటి కాంగ్రెస్‌ దక్కించుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలూ ఇక్కడ నివాసముంటున్నారు.
భౌగోళిక పరిస్థితులు
కూకట్‌పల్లిలో అంతర్భాగమైన ముఖ్య ప్రాంతాలు శేరిలింగంపల్లిలో కలిశాయి. సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌కు అనుబంధంగా ఉంటే పాత బోయిన్‌పల్లి, హస్మత్‌పేట ప్రాంతాలతో పాటు బేగంపేటలోని కొంత భాగాన్ని ఈ నియోజకవర్గంలో కలిపారు.
రహదారులు
ముంబయి జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌9) కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల మీదుగా వెళుతుంది. బాలానగర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆర్‌ అండ్‌ బి రహదారులు ఉన్నాయి. అధికశాతం రహదారులన్నీ కూకట్‌పల్లి సర్కిల్‌ నిర్వహణలో ఉన్నాయి.

మేడ్చల్‌ నియోజకవర్గం


ఎమ్మెల్యే : కె.లక్ష్మారెడ్డి
ఓటర్ల సంఖ్య : 3,21,860
పురుష ఓటర్లు : 1,66,608
మహిళా ఓటర్లు : 1,55,252

మండలాలు:  
మేడ్చల్‌ నియోజకవర్గం మేడ్చల్‌, శామీర్‌పేట, ఘట్కేసర్‌, కీసర మండలాల పరిధితో ఏర్పాటయింది. మేడ్చల్‌ నియోజకవర్గంలోని కీసర మండలంలో శ్రీ రామలింగేశ్వరస్వామిఆలయం(కీసరగుట్ట) పర్యాటక ప్రాధాన్యం కల్గిన దేవాలయం.
సహజవనరులు: 
మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఘట్కేసర్‌, మేడ్చల్‌, శామీర్‌పేట, కీసర మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకర రాయి, ఇసుక, ఇటుకమట్టి, ఆర్డినరీ క్లే తదితర సహజవనరులు లభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: 
మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలో మేడ్చల్‌, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, డబ్లిపూర్‌, చర్లపల్లి, ఘట్కేసర్‌లలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

మల్కాజిగిరి

నియోజకవర్గ ఆవిర్భావం: 2009
ప్రస్తుత శాసనసభ్యుడు : ఆకుల రాజేందర్‌(కాంగ్రెస్‌)
పార్లమెంట్‌ నియోజకవర్గ ఆవిర్భావం: 2009
అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల వివరాలు: మొత్తం ఓటర్లు: 3,36,883 (పురుషులు : 1,71,367, మహిళలు : 1,62,121)
నియోజకవర్గ విస్తీర్ణం : 15,400 కిలోమీటర్లు

నియోజకవర్గపరిధిలోని మండలాలు: ఒక్కటి (మల్కాజిగిరి)
సర్కిళ్లు : మల్కాజిగిరి, అల్వాల్‌
నేపథ్యం: మల్కాజిగిరి నియోజకవర్గం ఏర్పడక ముందు ఈ ప్రాంతం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉండేది. పూర్వకాలంలో ఇక్కడ మల్లికార్జునస్వామి దేవాలయం ఉండేది. దాంతో ఈ ప్రాంతాన్ని మల్లికార్జున గిరిగా పిలిచేవారు. కాలక్రమంలో మల్కాజిగిరిగా మారిపోయింది. రంగారెడ్డి జిల్లాలో గ్రామంగా ఉండేది. కాలక్రమంలో నగరీకరణ వల్ల ఈ ప్రాంతం 1981లో మున్సిపాలిటీగా అవతరించింది. నాలుగేళ్ల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో విలీనమయింది. మల్కాజిగిరిలో రామకృష్ణాపురం, సఫిల్‌గూడ చెరువు, బండ్లచెరువు, అల్వాల్‌లో చెరువులు లు ప్రసిద్ధిచెందాయి. సఫిల్‌గూడ చెరువు ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. కేంద్ర రక్షణ శాఖకు చెందిన 'ఏఓసీ' సెంటర్‌ సగం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ సైనిక శిక్షణ, యుద్ధంలో ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు.


కుత్బుల్లాపూర్‌

నియోజకవర్గ ఆవిర్భావం: 2009
అంతకముందు: మేడ్చల్‌ నియోజకవర్గంలో అంతర్భాగం
ఎమ్మెల్యే: కూన శ్రీశైలంగౌడ్‌(కాంగ్రెస్‌)
మండలాలు: కుత్బుల్లాపూర్‌

చారిత్రక నేపథ్యం: నైజాం ప్రభుత్వం 1897లో జీడిమెట్లలో ఫాక్స్‌సాగర్‌ నిర్మించింది. ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్ద పారిశ్రామిక వాడ జీడిమెట్లలో ఆవిర్భవించింది. దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమినీ ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రాంతం మేడ్చల్‌ అసెంబ్లీ, సిద్ధిపేట పార్లమెంటు నియోజకవర్గాల్లో అంతర్భాగం. పునర్విభజనలో తాజాగా ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇది మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది.
రాజకీయ నేపథ్యం: ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ పట్టుంది. తెదేపా ఆవిర్భవించాక క్రమంగా ఆ పార్టీ అటు మండలంలో, ఇటు మున్సిపాలిటీలో పాగా వేస్తూ వచ్చింది. నియోజకవర్గం ఏర్పాటయ్యాక 2009లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌ తెదేపా ఆధిపత్యానికి అడ్డుకట్టవేశారు.
భౌగోళిక పరిస్థితులు: 1500 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వ్‌డ్‌ ఫారెస్టు, 200 ఎకరాల్లో క్వారీ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఉత్తరం దిక్కున దుండిగల్‌ ఏయిర్‌ఫోర్స్‌ అకాడమీ, దుండిగల్‌, బౌరంపేట, మల్లంపేట, బాచుపల్లి గ్రామాల సరిహద్దులో మెదక్‌ జిల్లాలోని అన్నారం, జిన్నారం, ఖాజిపల్లి, ఐడీఎ బొల్లారం ఉండగా, తూర్పున మేడ్చల్‌, అల్వాల్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని, కాలనీలు, దక్షిణానా బాలానగర్‌ ప్రాంతంలోని కాలనీలు, పశ్చిమాన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాలనీలు విస్తరించి ఉన్నాయి.

రహదారులు:  
7వ నెంబరు జాతీయ రహదారి సుచిత్రా చౌరస్తా నుంచి కొంపల్లి వరకు మూడు కిలోమీర్ల మేర విస్తరించి ఉంది. 25 కిలోమీటర్ల మేర నర్సాపూర్‌ అర్‌అండ్‌బీ రాష్ట్ర రహదారి ఉంది.

ఉప్పల్‌

ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలో ఉప్పల్‌ మండలం ఉంది. ఇక్కడ 3,71,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,97,786 మంది పురుషులు కాగా 1,73,493 మంది స్త్రీలు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

ఎమ్మెల్యే: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఓటర్ల సంఖ్య : 2,05,596
పురుష ఓటర్లు : 1,06,393
మహిళా ఓటర్లు : 99,203

ప్రత్యేకత: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని హయత్‌నగర్‌ మండలంలో ఉంది. యాచారం మండలంలోని నందివనపర్తిలో చారిత్రక ప్రాధాన్యమున్న నంది ఉంది.
మండలాలు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హయత్‌నగర్‌, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలతో ఏర్పాటయింది.
సహజవనరులు: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్‌ మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇటుక మట్టి, ఇసుక పుష్కలంగా లభిస్తున్నాయి.
ఈ నియోజకవర్గ పరిధిలో రైల్వే స్టేషన్లు లేవు.


ఎల్బీనగర్‌



ఆవిర్భావం: 2009
ఎమ్మెల్యే: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(కాంగ్రెస్‌)
జనాభా: 8 లక్షలు
ఓటర్లు: 4,12,724. (పురుషులు 2,17,954, స్త్రీలు 1,94,770)
పోలింగ్‌ బూత్‌లు: 345

డివిజన్లు: 8. (కొత్తపేట, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, కర్మన్‌ఘాట్‌, చంపాపేట, గడ్డిఅన్నారం, పీఅండ్‌టీకాలనీ).
మండలాలు: సరూర్‌నగర్‌, ఉప్పల్‌. (గ్రామాలు- కొత్తపేట, బండ్లగూడ, నాగోలు, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, సాహెబ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, బైరామల్‌గూడ, చంపాపేట, గడ్డిఅన్నారం).
నియోజకవర్గ విస్తీర్ణం: 86 చ.కి.మీ.
మున్సిపాలిటీ: ఎల్‌.బి.నగర్‌, గడ్డిఅన్నారం మున్సిపాలిటీలుగా ఉండేవి. రెండున్నరేళ్ల క్రితం గ్రేటర్‌లో విలీనమయ్యాయి. ఎల్‌.బి.నగర్‌ సర్కిల్‌గా కొనసాగుతోంది.)
ప్రాధాన్యాలు: రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం.
నియోజకవర్గంలో సచివాలయంలో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. అసియాలోనే అతిపెద్ద కాలనీ వనస్థలిపురం ఇక్కడే ఉంది.
పరిశోధన సంస్థలు: దక్షిణ భారతదేశంలోని ఖనిజ వనరులు, భూగర్భవనరులు, మ్యాపింగ్‌, గనుల గుర్తింపు, శిలాజాలు, పురాతన అంశాలపై విశేషంగా కృషి చేసే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ బండ్లగూడలో సువిశాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 200 ఎకరాల స్థలంలో జీఎస్‌ఐ ఆవరించి ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంగా పని చేస్తోంది. పరిశోధనలు, శిక్షణలు, జలవనరులను కూడా గుర్తించే పనులు నిర్వహిస్తోంది. సుమారు 2 వేల మంది శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు, సిబ్బంది దీంట్లో పని చేస్తున్నారు.
నగరానికి తలమానికమైన సరూర్‌నగర్‌ ఇండోర్‌స్టేడియం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు వేదిక. జిమ్నాస్టిక్స్‌, రన్నింగ్‌, హాకీ, షటిల్‌, చదరంగం వంటి అనేక ఆటల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శాప్‌ ఆధ్వర్యంలో స్టేడియం నడుస్తోంది.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచివివిధ రకాల పండ్లు దిగుమతి అవుతాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ ఇది.
మన్సూరాబాద్‌ సహారా ఎస్టేట్స్‌లో దాదాపు 10 రాష్ట్రాలకు చెందిన ప్రజలు కలిసి నివసిస్తున్నారు. భిన్న సంస్కృతులకు వేదికగా నిలుస్తోంది.
చారిత్రక నేపథ్యం: కొత్తపేట, నాగోలు, బండ్లగూడ, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, సాహెబ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట, బహదూర్‌గూడ, గడ్డిఅన్నారం, సరూర్‌నగర్‌ పంచాయతీలతో మొదట మున్సిపాలిటీ ఏర్పడింది. ఆ తర్వాత నియోజకవర్గ పునర్విభజనతో సరూర్‌నగర్‌ మినహా మిగతా గ్రామ పంచాయతీ పరిధి కలిసి నియోజకవర్గంగా మారింది. బహదూర్‌గూడ చౌరస్తాకే లాల్‌బహదూర్‌ చౌరస్తాగా నామకరణం చేశారు. తరవాత అక్కడ కొత్తగా ఏర్పడిన కాలనీకి లాల్‌బహదూర్‌నగర్‌ (ఎల్‌.బి.నగర్‌)గా పేరొచ్చింది. అదే పేరు మొదట మున్సిపాలిటీకి, ఆ తర్వాత నియోజకవర్గానికి వచ్చింది.
రాజకీయ నేపథ్యం: మలక్‌పేట నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మల్‌రెడ్డి రంగారెడ్డి చక్రం తిప్పేవారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో ఎల్‌.బి.నగర్‌ ఏర్పడింది. ఎన్నికల్లో మల్‌రెడ్డికి టిక్కెట్టు రాకపోవడంతో డి.సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 8 డివిజన్లలో ఏడు తెదేపా గెలుచుకుంది. గడ్డిఅన్నారంలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. కార్పొరేటర్లు కొత్తపేట-వజీర్‌ ప్రకాష్‌గౌడ్‌, మన్సూరాబాద్‌-కొప్పుల లత, హయత్‌నగర్‌-సామ రంగారెడ్డి, వనస్థలిపురం-జిట్టా రాజశేఖర్‌రెడ్డి, కర్మన్‌ఘాట్‌-గజ్జెల సుష్మ, చంపాపేట-సామరమణారెడ్డి, పీఅండ్‌టీకాలనీ-ధనలక్ష్మీ లోకేంద్రనాథ్‌, గడ్డిఅన్నారం-బి.సుభాషిణి.
భౌగోళిక స్థితి: నియోజకవర్గం జాతీయ రహదారులు 7, 9ల మధ్య ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ఎన్‌హెచ్‌-9, డీఆర్‌డీఎల్‌ చౌరస్తా నుంచి నాగోలు వరకు ఎన్‌హెచ్‌-7
ఉంది.



మహేశ్వరం నియోజకవర్గం

ఎమ్మెల్యే : పి.సబితా ఇంద్రారెడ్డి (హోం మంత్రి)
ఓటర్ల సంఖ్య : 3,09,025
పురుష ఓటర్లు : 1,59,780
మహిళా ఓటర్లు : 1,49,245
మండలాలు:
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు, సరూర్‌నగర్‌, మహేశ్వరం మండలాల పరిధితో ఏర్పాటైంది.
సహజవనరులు: మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం, సరూర్‌నగర్‌, కందుకూరు మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇటుకమట్టి, క్వార్ట్జ్‌, ఫీల్డ్‌ స్పార్‌ తదితర ఖనిజాలు లభిస్తున్నాయి.
రైల్వేస్టేషన్లు లేవు.

రాజేంద్రనగర్‌
నియోజకవర్గం: రాజేంద్రనగర్‌
ఆవిర్భావం : 2009
ఎమ్మెల్యే : టి.ప్రకాష్‌గౌడ్‌( తెలుగుదేశం)
జనాభా: 3లక్షలు
ఓటర్లు: 1,95,000 (మహిళలు: 99,000, పురుషులు: 96,000)
డివిజన్‌లు: 4 మున్సిపల్‌ డివిజన్‌లు రెండు మండలాలున్నాయి.
గ్రామాలు: 38. మేజర్‌ గ్రామపంచాయతీ:శంషాబాద్‌
నియోజకవర్గం విస్తీర్ణం:

మున్సిపాలిటీలు: రెండేళ్లక్రితం వరకు రాజేంద్రనగర్‌ మున్సిపాలిటీగా ఉండేది. ప్రస్థుతం సర్కిల్‌గా మారి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం అయింది.
ప్రాధాన్యాలు: పరిశోధనా సంస్థలు
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపుపొందిన రాజేంద్రనగర్‌ పరిశోధనా రంగంలో ప్రపంచఖ్యాతిని పొందింది. వ్యవసాయ ఉత్పత్తుల గురించి తెలుసుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ ఇక్కడికి వచ్చారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా రంగంలో ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రసిద్ధి పొందింది. దీంతో పాటు నారం, ఎన్‌ఐఆర్‌డీ, శంషాబాద్‌లో కేంద్ర విత్తన పరిశోధనాకేంద్రం ఉంది. మరోవైపు ఔటర్‌రింగురోడ్డులతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అన్నీ ప్రాంతాలకంటే ప్రత్యేకతను చాటుతోంది.
గ్రామాలు: మణికొండ, పుప్పాలగూడ, నెక్నాపూర్‌, ఖానాపూర్‌, కోకాపేట,


శేరిలింగంపల్లి

ఈ నియోజకవర్గం పరిధిలో చందానగర్‌, మియాపూర్‌, లింగంపల్లి ప్రాంతాలున్నాయి. నియోజకవర్గం పరిధిలో 4,21,113 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,25,830 మంది పురుషులు కాగా 1,95,283 మంది స్త్రీలు.
చేవెళ్ల నియోజకవర్గం

ఎమ్మెల్యే : కె.ఎస్‌.రత్నం
ఓటర్ల సంఖ్య : 1,95,975
పురుష ఓటర్లు : 1,00,440
స్త్రీ ఓటర్లు : 95,535

చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్‌ మండలంలోని చిల్కూరులో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం.
మండలాలు: చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, నవాబుపేట, షాబాద్‌ మండలాల పరిధితో ఏర్పాటయింది.
సహజవనరులు: చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, నవాబుపేట మండలాల్లో ఇసుక, కంకరరాయి, ముల్తానీమట్టి, బిల్డింగ్‌ స్టోన్‌, ఆర్డినరీ క్లే, ఇటుక మట్టి, ఇసుక లభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: శంకర్‌పల్లి మండలంలోని శంకర్‌పల్లిలో, నవాబ్‌పేట మండలంలోని గుల్లగూడ, చిటిగిద్దలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.


పరిగి నియోజకవర్గం

ఎమ్మెల్యే : కె.హరీశ్వర్‌రెడ్డి (ప్రస్తుతం రాజీనామా చేశారు)
ఓటర్ల సంఖ్య : 2,05,455
పురుష ఓటర్లు : 1,01,676
స్త్రీ ఓటర్లు : 1,03,779
మండలాలు:
రిగి నియోజకవర్గం పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూరు, గండేడ్‌ మండలాల పరిధితో ఏర్పాటయింది.
ఈ నియోజకవర్గంలోని పరిగి, కుల్కచర్ల, దోమ, గండేడ్‌, పూడూరు మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, గ్రానైట్‌, బ్రిక్‌ ఎర్త్‌, ఇసుక, ముల్తానీమట్టి లభిస్తున్నాయి.
ఈ నియోజకవర్గంలో రైల్వేస్టేషన్లు లేవు.


వికారాబాద్‌ నియోజకవర్గం

ఎమ్మెల్యే : జి.ప్రసాద్‌ కుమార్‌
ఓటర్ల సంఖ్య : 1,85,945
పురుష ఓటర్లు : 93,327
స్త్రీ ఓటర్లు : 92,618
మండలాలు:
వికారాబాద్‌ నియోజకవర్గంలో వికారాబాద్‌ మున్సిపాలిటీ, వికారాబాద్‌, మర్పల్లి, మోమిన్‌పేట, ధారూర్‌, బంట్వారం మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలోని వికారాబాద్‌ మండలం అలంపల్లిలో పేరొందిన అలంపల్లి మఠం ఉంది.
సహజవనరులు: వికారాబాద్‌, ధారూర్‌, మర్పల్లి, మోమిన్‌పేట, బంట్వారం మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇసుక, ఆర్డినరీ క్లే, ముల్తానీ మట్టి, ఇటుక మట్టి(బ్రిక్‌ ఎర్త్‌), సున్నపురాయి లభిస్తున్నాయి.
రైల్వేస్టేషన్లు: మర్పల్లి మండలంలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలంలోని సదాశివపేట రోడ్‌లో, ధారూర్‌ గాడంగూడలో, వికారాబాద్‌లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

తాండూరు నియోజకవర్గం







 
ఎమ్మెల్యే : డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి
ఓటర్ల సంఖ్య : 1,82,417
పురుష ఓటర్లు : 88,724
స్త్రీ ఓటర్లు : 93,693
మండలాలు:
ఈ నియోజకవర్గం పరిధిలో తాండూరు మున్సిపాలిటీ, తాండూరు, పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌ మండలాలు ఉన్నాయి. తాండూరు మండలం జుంటపల్లిలో శ్రీరామచంద్రస్వామి ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.
సహజవనరులు: తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండలాల్లో సున్నపురాయి, ఆర్డినరీ క్లే, షాబాద్‌ స్టోన్‌, ముల్తానీ మట్టి(ఫుల్లర్స్‌ ఎర్త్‌), బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఆర్డినరీ క్లే, ఇసుక తదితర సహజవనరులులభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: తాండూరులో పెద్దేముల్‌ మండలంలోని రుక్మాపూర్‌లో, బషీరాబాద్‌ మండలంలోని మైలారం, నవాన్‌డగ్‌లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

No comments:

Post a Comment