Saturday, 8 February 2014

కుంటాల జలపాతం....భారత దేశా నయాగరాగా పిలుచుకునే అతిపె ద్ద జలపాతం


కాశ్మీరు - కన్యాకుమారిని కలిపే ఏడవ నంబర్ జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది కుంటాల జలపాతం. శకుంతల పేరిట ఈ జలపాతానికి కుంతల అనే పేరు వచ్చింది. అదే క్రమంగా కుంటాలగా మారింది అని స్థానికులు చెబుతారు.
రెండేళ్ల క్రితం అటవీ శాఖ ప్లానింగ్‌ విభాగం ‘ఎకో టూరిజం’ పేరుతో కొంత అభివృద్ది చేసినప్పటికీ పర్యాటకులకు మరినిన సౌకర్యాలు కల్పించాల్సివుంది.
- See more at: http://www.adilabaddistrict.com/2012/01/blog-post_2206.html#sthash.DaPgDXpl.dpuf
కుంటాల జలపాతం రాష్ట్రంలో అతిపెద్ద జలపాతం ఇది. ఆంధ్రప్రదేశ్ నయాగరాగా పిలుచుకునే  అతిపె ద్ద జలపాతం కుంటాల జలపాతం చూసి పరవశించని వారు ఉండరు.మయురాల నాట్యాలు, కోయిల కూత లు ఇక్కడ ప్రవహించే జలధారల్లో చూస్తాం. వంద అడుగల పై నుంచి తుళ్లిపడే జలధారలను ఎంత చూసిన తనివితీరదు. నిత్యం వచ్చి పోయే పర్యాటకులతో కుంటాలజలపాతం అలరారుతుంది.ఈ జలపాతం పర్యాటకులనే కాకుండా శివభక్తులను ఆహ్వానిస్తుంది. వంద అడుగుల నుంచి కిందికి వచ్చే జలధారల్లో మధ్యలో గల గుహలో సోమేశ్వరుడు నాగదేవత విగ్రహాలున్నాయి. కుంటాల జలపాతం అందాలు తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులునిత్యం వస్తుంటారు. ఆదివారం పర్యాటకుల తాకిడితో కుంటాలజలపాతం శోబిస్తుంది. షెడ్‌లు ఏర్పాటు చేసి కొండలు దిగి జలపాతం విక్షించేందుకు మెట్లు నిర్మించారు. జలపాతం వద్ద వాచ్‌మెన్‌లు , గైడ్‌లను నియమించకపోవడంతో పర్యాటకులు పలు ప్రమాదాలకు లోనై మృతి చెందిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కుంటాల జలపాతం నేరడిగొండ మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివరాత్రి పండుగ రోజు ఇక్కడ జాతర జరుగుతుంది.

ఈ నీటిప్రవాహం ఎక్కడ మొదలైంది... ఈ ప్రయాణం ఎక్కడికి దారి తీస్తోంది... తెలుసుకుందాం.

కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్టుకు దిగువన ఉంది. ఉత్తర దక్షిణ భారతానికి వారధిగా ఉన్న సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో ఏర్పడిన సహజ జలపాతం ఇది. కడెం నదిపై కుంటాల గ్రామం వద్ద నేలమీదకు దూకే దృశ్యాలను ఆస్వాదించడానికి రెండు కళ్లు చాలవు. ఈ జలధార గిరిజన, ఆదివాసీలకు ‘లైఫ్‌లైన్’ లాంటింది. ఈ జలపాతం చుట్టూ దట్టమైన కుంటాల రిజర్వ్ ఫారెస్టు, నాగమల్ల, రోల్‌మామడ, సిరిచెల్మ రిజర్వ్ ఫారెస్టులున్నాయి. దేశంలో 41వ పులుల అభయారణ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. కవ్వాల టైగర్‌జోన్ పరిధిలోకి వచ్చే జలపాతం చుట్టూ దట్టమైన అడవులు... శ్రేష్టమైన గ్రానైట్‌పై ప్రవహించి కిందకి దూకి నాగమల్ల రిజర్వు ఫారెస్టును చీల్చుకుంటూ కడెం రిజర్వాయర్ చేరుతుంది.
ఎక్కడ పుట్టింది?
మహారాష్ట్రలోని కొండకోనల్లో కురిసే వానతో వాగు ప్రవహిస్తుంది. 60 కిలోమీటర్లు ప్రవహించి కుంటాల గ్రామం వద్ద 46 మీటర్ల పైనుంచి నీరు కిందికి దూకుతూ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. నేరడిగొండ మండల కేంద్రం నుంచి 12 కి లోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో ఒంపుసొంపులతో ఒయ్యారాలు ఒలకబోస్తూ కొండలు కోనలు దాటి రాళ్లను రప్పలను మీటుతూ లోయల సోయగాన్ని నీటితో తడుముతూ కుంటాల ప్రాంతంలో క్రిందికి దుముకుతోంది. బోధ్ తాలూకా భూతాయి ప్రాంతంలో జన్మించిన ఈ నది దారిలోని చిన్న వాగులను తనలో కలుపుకుంటూ ‘కడెం’ జలాశయంగా రూపుదిద్దుకొని వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ గోదావరిలో కలుస్తుంది.

పర్యాటక కేంద్రం కుంటాల...

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతాన్ని చూడడానికి ఆగస్టు-డిసెంబర్ మధ్య రోజుకు వెయ్యి నుంచి 1500 మంది వరకు పర్యాటకులు వస్తారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ సరిహద్దులోని చత్తీస్‌గడ్, మహారాష్ట్రల నుంచి పర్యాటకులు వస్తారు. ప్రకృతి రమణీయమైన జలపాత దృశ్యాలు టీవీ సీరియళ్లకెక్కాయి. ఈ ప్రాంతం గోండులకు పవిత్ర ప్రదేశం. సంవత్సరానికి రెండు సార్లు ఈ గుండంలో స్నానం చేసి తమ దేవుడు పెర్సపేన్‌కు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జలపాతం దగ్గర ఉన్న గుహలో శివుడు సోమేశ్వరుడి పేరిట పూజలందుకుంటున్నాడు.అతి ప్రమాదమని తెలిసి కూడా గుహలో పూజలు చేసి తరించడం గమనార్హం. ఈ గుహ నుంచి ఇచ్చోడ ప్రాంతంలోని సిరిచెల్మ మల్లేశ్వర స్వామి ఆలయం వరకు సోరంగ మార్గం ఉందనే వాదన కూడా ఉంది. ఈ గుహను ప్రజలు సోమన్న గుహగా కూడా చెప్పుకుంటారు. ప్రకృతి సహాజ సిద్దమైన జలపాతంగా ఉన్న కుంటాలను రాష్ట్రప్రభుత్వం మరింత అభివృద్ధి పరచాల్సి ఉంది.
రెండేళ్ల క్రితం అటవీ శాఖ ప్లానింగ్‌ విభాగం ‘ఎకో టూరిజం’ పేరుతో కొంత అభివృద్ది చేసినప్పటికీ పర్యాటకులకు మరినిన సౌకర్యాలు కల్పించాల్సివుంది.
- See more at: http://www.adilabaddistrict.com/2012/01/blog-post_2206.html#sthash.DaPgDXpl.dpuf

ఆదిలాబాద్ జిల్లా లో కుంటాల జలపాతం ధీ ఒక ప్రత్యేకం స్థానం . 
 రెండేళ్ల క్రితం అటవీ శాఖ ప్లానింగ్‌ విభాగం ‘ఎకో టూరిజం’ పేరుతో కొంత అభివృద్ది చేసినప్పటికీ పర్యాటకులకు మరినిన సౌకర్యాలు కల్పించాల్సివుంది..పర్యాటక శాఖ అటవిశాఖాధికారులు అలసత్వం వల్ల జలపాతల అభివృద్దికి నోచుకోవడం లేదు. ఈజలపాతాలను తీర్చిదిద్దితే పర్యాటక కేంద్రాలుగా విరజిల్లుతాయని స్థానికులు కోరుతున్నారు.. కాని దీని పైన కొన్ని తెలంగాణా వ్యతిరేఖ శక్తుల కళ్ళు పడి మన కుంటాల జలపాతం ని ఒక పవర్ ప్రాజెక్ట్ కింద మర్చుకుందాం అని ప్రయత్నాలు ఎన్నో రోజులనుంచి జరుగుతున్నాయి, తెలంగాణా లో ఆదిలాబాదు జిల్లా ధీ ఒక ప్రతేయ స్థానం ఆదిలాబాదు జిల్లా ఎన్నో ఖనిజాలు అడవులకు ప్రసిద్ధి.. అందులో గల గల పారే కుంటాల జలపాతం ఆదిలాబాదు కే కాక యవత్హు తెలంగాణా కే తల మానికం, మన తెలంగాణా లో ఉన్న ఎన్నో పర్యాటక ప్రాంతాలలో కుంటాల ఏంటో ప్రాముక్యం .. అలంటి మన కుంటాల జలపాతం ని నాశం కానివ్వకుండా జరిపే ఈ ఉద్యమం లో మనం అనాదరం కలిసి పోరాడుదాం..

మన తెలంగాణా
మన కుంటాల
మన వనరులు

No comments:

Post a Comment