Tuesday 18 February 2014

గాంధీజీ హత్యకు దారితీసిన పరిస్థితులు..




1947 దేశవిభజన సమయంలో పాకిస్తాన్‌ ప్రాంతంలోని హిందువులు, సిక్కులు లక్షలాది మంది కొత్తగా గీసుకున్న సరిహద్దులు దాటి ఇటువైపు ప్రవేశించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో మతకల్లోలాలు చెలరేగాయి. హిందువులు, సిక్కులు లక్షలాదిగా చనిపోయారు. హిందువుల శవాలతో కూడిన రైళ్ళు లాహోర్‌ నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్నాయి. ఢిల్లీలోకి పాకిస్తాను నుంచి పదిలక్షల మందికిపైగా కాందిశీకులు వచ్చి చేరారు. హిందూ కాందిశీకులను కాదని గాంధీ ఢిల్లీలో ముస్లింల రక్షణపైనే దృష్టి పెట్టారు. పైగా పాకిస్తాన్‌ నుంచి వచ్చిన హిందువులు, సిక్కుల్ని తిరిగి అక్కడికే పంపేయాలని, ఇక్కడ నుంచి అటువై పు వెళ్ళిన మహ్మదీయుల్ని తిరిగి భారత్‌కు రప్పించాలంటూ మహాత్ముడు ప్రతిపాదించాడు. పశ్చిమ పంజాబ్‌లో లక్షలాదిమంది హిందువుల్ని చంపేశారు. వారి శవాల్ని రైళ్ళలో వేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై సిక్కులు తిరగబడ్డారు. పాకిస్తాన్‌పై కాలుదువ్వారు. అప్పుడు కూడా సిక్కుల్ని నిలువరించేందుకు మహాత్ముడు నిరాహారదీక్షకు పూనుకున్నారు. 1948 జనవరి 13న పాక్‌కు రూ.55కోట్లు చెల్లించని పక్షంలో తాను ఆమరణదీక్షకు కూర్చుంటానంటూ గాంధీ ప్రకటించారు. సరిగ్గా అదే రోజున సంస్కృత పండితుడు నారాయణఆప్టే గాంధీని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి కారణాలే మదన్‌లాల్‌ పహ్వా, భార్గే మరి కొంతమందిని కూడా గాంధీ హత్యకు ప్రేరేపించాయి. రానురాను గాంధీ మైనారిటీ అనుకూల వైఖరితో హిందువుల్లో ఆందోళనలు చెలరేగాయి. మెజారిటీ హిందువులకు ఈ దేశంలో హక్కుల్లేకుండా చేసేస్తారన్న భయం హిందూనాయకుల్లో ఆవహించింది. శంకర్‌ క్రిస్టియా, గోపాల్‌గాడ్సే, మదన్‌లాల్‌పహ్వా, దిగంబర్‌ రామచందర్‌ బడ్గే, నారాయణఆప్టే, వినాయక్‌సావర్కర్‌, విష్ణుకర్కరే, నాథూరాం గాడ్సేలతో కూడిన బృందం 1948 జనవరి 31 న సాయంత్ర 5.14 నిముషాలకు మహాత్ముడిని హత్య చేసింది...

No comments:

Post a Comment