Saturday 25 January 2014

దైవ సాక్షాత్కారానికి సాయిబాబా చెప్పిన పది సూత్రాలు

తెలుగు మాటలు దైవ సాక్షాత్కారానికి సాయిబాబా చెప్పిన పది సూత్రాలు:-



 1. ఈ లోకం క్షుద్రమైనదని తెలిసి ఇహపర సుఖాల మీద మమకారం వదులుకోవాలి. 
2. బంధ విముక్తికి నిరంతరం పాటుపడాలి. 
3. ఆత్మ సాక్షాత్కారం కోరేవాడు అంతర్ముఖుడు కావాలి. 
4. జ్ఞానం సంపాదించిన, దుశ్చర్యలు మానకపోతే శాంతిలేదు. 
5. సత్యం, తపస్సు, అంతర్ముఖం, సదాచారం సాధకుడికి అవసరం. 
6. వివేకవంతుడు శ్రేయస్సు, గొప్పతనాన్ని గ్రహించాలి. 
7. ఇంద్రియ నిగ్రహం లేకపోతే గమ్యం చేరలేడు. 
8. మనస్సు నిష్కామనగా, నిర్మలంగా ఉండాలి. 
9. సద్గురువును ఆశ్రయించి జ్ఞానం పొందాలి. ఆత్మ నిగ్రహం అలవరచుకోవాలి. 
10. అన్నిటికంటే భగవనుగ్రహం ముఖ్యం. నిరాశలో, నిశ్ప్రుహలో అది ఆశాకిరణం.

   లక్ష్మి సారము: మనకి ఎవరో సహాయము చేయాలి, మనలను ఎవరో కాపాడాలి, మనలను ఎవరో మార్చాలి అని భావిస్తూ నడవటము వ్యర్ధజీవుల లక్షణము. సహాయము ఎక్కడనుంచో రాదు. అది మనలోనుండే ఉద్భవించాలి. మనకుమనమే నిజమైన సహాయము చేసుకోగలము. మనకుమనము సహాయము చేసుకోలేనపుడు వేరెవరూ సహాయము చేయలేరు. మనము మన మానశిక శక్తిని ఉపయోగించగలిగినపుడు అనుకున్నది సాధించగలుగుతాము. అందరూ మెచ్చుకునే నాయకునిగా ఎదుగుతాము. మనము నడిచే బాట ఆదర్శముగా మారుతుంది.మన ఉన్నతికిమన పనులే కారణం.మన అభివృద్దికిమనo తీసుకున్న నిర్ణయాలే కారణం.మన నిర్ణయాల నాణ్యత మన మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన గమ్యానికి మనమే భాద్యులము.ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచుకుంటూ మన ముందున్న అనేక సమస్యలను జయించ వచ్చును, గొప్ప విషయాలను సాదించ వచ్చును.

https://www.facebook.com/Charitrarealfacts

No comments:

Post a Comment