Friday 31 January 2014

బ్రతుకు పోరాటము........................


సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు


ఆగిపోయిన ముందు

సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.
తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.
బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.
                             charitra







SANDESH TV song....

Wednesday 29 January 2014

ఒక ఉన్మాది తూటాతో నేను మరణించాలని రాసి ఉంటే.. అటువంటి చావును నేను చిరునవ్వుతో ఆహ్వానిస్తాను


1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది.  కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కల్గిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు.


కానీ ఆ సమయంలో బాపు హేరాం అని ఉచ్ఛరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు. గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లారు. అక్కడే కుప్ప కూలిన గాంధీమహాత్ముని నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లించే పరిస్థితి మరోలా ఉండేదేమో! కానీ ఆయనను బిర్లా హౌస్‌లోకే తరలించారు.  


పోలీసుల విచారణలో గాడ్సే ఆశ్చర్యపోయే వివరాలను బయట పెట్టారు. 1934, 1944 మే లో, 1944 సెప్టెంబరు 9న ఇలా మూడు సార్లు తాను బాపూజీని హత్య చేయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. 1948 జనవరి 20న కూడా ప్రయత్నించి విఫలమయ్యానని గాడ్సే వ్యాఖ్యానించారు. అయిదో సారి అంటే జనవరి 30, 1948 తాను అనుకున్నది సాధించ గలిగానని వెల్లడించడం గమనార్హం. గాంధీ హత్యకు 48 గంటల ముందు ఆయన అభిమాని ఒకరు జాగ్రత్తగా ఉండాలని బాపూజీని కోరారు.

అప్పుడు ఆయన నవ్వుతూ ఒక ఉన్మాది తూటాతో నేను మరణించాలని రాసి ఉంటే.. అటువంటి చావును నేను చిరునవ్వుతో ఆహ్వానిస్తాను. ఆ ఉన్మాదిపై నాకు ఎటువంటి కోపమూ రాదు. పరమాత్మ నా హృదయంలోనూ, పెదాలపైనా నర్తిస్తున్నప్పుడు నేను చావుకు ఎందుకు భయపడాలి అని అన్నారు.
 


Tuesday 28 January 2014

తిరుమల,తిరుపతి........





ఆంధ్రులకే కాదు భారతదేశంలో సకల జనావళికి ఆరాధ్యదైవమై వెలసిన ఉత్తరాది వారికి - బాలాజిగాను, దక్షిణాది వారికి శ్రీవేంకటేశ్వరస్వామిగాను కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ వెలసియున్న కలియుగ వైకుంఠవాసుడయిన శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ వేంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలు మంగా, బీబీనాంచారమ్మలతో కొలువు దీరిన మహా సుందర ప్రదేశం.

క్షేత్ర వైభవం
శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రినీలాద్రిగరుడాద్రి,అంజనాద్రివృషభాద్రినారాయణాద్రివేంకటాద్రి.. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర .

సప్తగిరుల్లో ప్రధానమైనది శేషాద్రి.విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవటంతో స్వామి వారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకొనేందుకు ఓ మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనందశిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా, ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనందశిఖరాన్ని చుట్టుకొని ఉండగా, వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం! పట్టుసడలింది. క్షణమాత్రకాలంలో వాయువు ఆనందశిఖరాన్ని కదిలించి స్వర్ణముఖీ నదీ తీరాన దించాడట. అదో శేషాచలమని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.

స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండలలో ఒకదానికి "నీలాద్రి" గా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు.


\
దాయాదులైన కద్రువ పుత్రుల (నాగులు) ను సంహరించిన గరుత్మంతుడు పాపపరిహారార్ధం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్ధించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.

వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలాకాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్ళతరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడనీ అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందనీ అంటారు.

కృతయుగంలో... తిరుమలలోని తుంబురుతీర్ధం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజూ తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారీ కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే ఆ మూఢ భక్తుడు తనకు శివునితో ద్వంద్వ యుద్దం చేయాలని ఉన్నదని చెప్పాడట. చాలాకాలం పాటు జరిగిన ఆ యుద్దంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడనీ అదే వృషభాద్రి అనీ పురాణగాధ.

విష్ణుదర్శనం కోసం తపస్సు చేయ సంకల్పించిన నారాయణ మహర్షి తన తపస్సుకి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్రస్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణమహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు.

కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి... అలవైకుంఠం నుంచి గరుడుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. "వేం" అంటే పాపాలు అని, "కట" అంటే హరించడం అనీ అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వపాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్రగిరిని "వేంకటాద్రి" అంటారని ప్రతీతి.

బహ్మోత్సవ సంబరం చూతము రారండీ...
తిరుమలలో ప్రతి రోజూ పర్వదినమై అనేక ఉత్సవములు జరుగుతున్నా విశేష పరవడి ఉత్సవములుగా చైత్రమాసంలోను, భాద్రపదమాసంలోను స్వామివారికి విశేషంగా జరిగే బ్రహ్మొత్సవాలు ముఖ్యం. వైభవోపేతంగా జరుగుతాయి.

"కట్టెదుట వైకుంఠము కాణాచైన కొండ" పై వెలసిన వేంకటేశ్వరుడు సకల సింగారాలతో తిరువీధుల మెరసిపోయేందుకు సిద్దమవుతున్న బ్రహ్మ ఉత్సవాల శుభఘడియలివి ఆనంద నిలయంలో కొలువై ఉండి భక్తులను తన వద్దకు రప్పించుకునే దేవదేవుడు ఏడాదికొక్కసారి బహు వైభవంగా జరిగే ఊరేగింపు ఉత్సవాలలో పాల్గొని, భక్తులకు మరింత చేరువయ్యేందుకు ముస్తాబవుతున్న శుభవేళ ఇది... బ్రహ్మాండంలోని భక్తకోటి అంతా తరలి వచ్చి స్వామివారి శోభాయాత్రను కనులారా తిలకించి, మనసారా పులకించే తరుణమిది... సకల లోకాలలోని సర్వ దేవతా గణాల్ని సాదరంగా భువికి ఆహ్వానించి బ్రహ్మ ఉత్సవాల్ని జరుపుకోవటానికి తిరుమల యావత్తూ సంసిద్దమవుతున్న సమయంలో... ఇంతటి ప్రాశస్త్యం గల ఈ బ్రహ్మ ఉత్సవాలు ఎలా జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పటినుంచి ఆరంభమయ్యాయన్న విశేషాలను గుర్తు తెచ్చుకోవటం సందర్భోచితం. తిరుమలేశుని ఆలయంలో నిత్యకల్యాణం-పచ్చతోరణమే అయినా, బ్రహ్మ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మ ఉత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి "బ్రహ్మ ఉత్సవాలు" అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే - నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిదిరోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి "బ్రహ్మ ఉత్సవాలు". అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి చాలా పెద్దయెత్తున జరిగేవి కాబట్టి వీటిని "బ్రహ్మ ఉత్సవాలు" అంటారనీ ఇంకొందరి భావన. ఈ ఉత్సవాలన్నీ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీవారికి చేసే గొప్ప ఉత్సవాలు కాబట్టి వీటిని "బ్రహ్మ ఉత్సవాలు" అంటున్నారని మరికొందరి భావన. బ్రహ్మ ఉత్సవాలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిని ఆయా సందర్బాలను బట్టి నిత్య బ్రహ్మ ఉత్సవం, శాంతి బ్రహ్మ ఉత్సవం, శ్రద్దా బ్రహ్మ ఉత్సవాలుగా పేర్కొంటారు. ప్రతి సంవత్సరం నిర్థారిత మాసంలో, నిర్థారిత నక్షత్ర ప్రధానంగా జరిగేవి నిత్య బ్రహ్మఉత్సవాలు. ఇవి మూడురోజులుగానీ, అయిదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు రోజులుగానీ జరుగుతాయి. ఇవి ప్రతి సంవత్సరం కన్యా మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసే విథంగా తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. ఇక కరువుకాటకాలు, భయాలు, ప్రమాదాలు, వ్యాధులు, గ్రహపీడల నివారణ కోసం ప్రత్యేకంగా జరిపించేవి "శాంతి బ్రహ్మ ఉత్సవాలు". ఇలాంటి శాంతి బ్రహ్మ ఉత్సవాలను గత చరిత్రకాలంలో చాలా మంది ప్రభువులు, దేశ, ప్రాంత, జనహితార్థం అయిదు రోజుల పాటు నిర్వహించిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. ఇక మూడోది శ్రద్దా బ్రహ్మఉత్సవం. ఎవరైనా భక్తుడు తగినంత ధనాన్ని దేవస్థానంలో కాని, దైవసన్నిధిలో కాని సమర్పించి, భక్తిశ్రద్దలతో జరిపించుకొనేది "శ్రద్దా బ్రహ్మ ఉత్సవం". శ్రీవారి ఆలయంలో ఇలాంటి శ్రద్దా బ్రహ్మ ఉత్సవాలను "అర్జిత బ్రహ్మ ఉత్సవాలు" గా పేర్కొంటున్నారు. శ్రీవారి బ్రహ్మ ఉత్సవాలు మొత్తం 9 రోజులు కన్నులపండుగగా జరుగుతాయి. "నానాదిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి" అంటూ అన్నమాచార్యుడు వర్ణించిన తీరులో అన్ని ప్రాంతాల భక్తులు ఈ ఉత్సవాలను దర్శించి తరించేందుకు తండోపతండాలుగా వస్తారు. స్వామివారికి జరిగే బ్రహ్మ ఉత్సవాలను కన్నులారా తిలకించి, భక్తిపారవశ్యంతో పునీతులవుతారు.

స్వామిని దర్శించేందుకు పలు మార్గాలు
శ్రీవారి దర్శనానికి 90గంటలు కొండమీద ఉండటానికి చోటు చాలక భక్తుల అగచాట్లు క్యూకాంప్లెక్స్‌లో తొక్కిసలాట వీఐపీ బ్రేక్ దర్శనాలపై భక్తుల ఆగ్రహం మహాలఘ దర్శనంపై అసంతృప్తి ఇవీ నిత్యం టీవీ ఛానెళ్ళలో, దినపత్రికల్లో చూసే తిరుమల విశేషాలు. ఎందుకిలా జరుగుతోంది? సరే! వీఐపీలకు తితిదే రాచమర్యాదల సంగతి పక్కన పెడితే మిగతా ఇబ్బందులను భక్తులు ముందస్తు ప్రణాళిక వేసుకోవడం ద్వారా తప్పించుకోవచ్చు. సెలవులు కలిసొచ్చాయి కదా అని ఎవరికి వారు పండుగ దినాల్లో, వారాంతపు రోజుల్లో తిరుమల ప్రయాణం పెట్టుకుంటారు. అలాంటి సమయాల్లోనే పైన చెప్పిన చేదు అనుభవాల్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఇబ్బందులేవీ లేకుండా తిరుమల యాత్ర ప్రశాంతంగా జరగాలంటే భక్తులు అనుసరించాల్సిన పద్దతులివీ కోరిన వరాలిచ్చే కోనేటి రాయని మొక్కు తీర్చుకునేందుకు రోజూ తిరుమలకు వేల సంఖ్యలో భక్తులు వెళ్ళివస్తుంటారు. ఉత్సవ సమయాల్లో ఆ సంఖ్య లక్షకు పైగా చేరుతుంది. జాతీయ సెలవు దినాలు, శని, ఆది, మంగళవారాల్లో తిరుమలలో మామూలుగానే రద్దీ విపరీతంగా ఉంటుంది. ధనుర్మాసంలో, ఆణివార ఆస్థానం, ఉగాది లాంటి సమయాల్లో అన్ని సేవలూ రద్దు చేసి వాటిని ఏకాంతంలో జరుపుతారు. ఆయా సమయాల్లో శ్రీవారి సేవల్లో పాలుపంచుకునే అవకాశం భక్తులకు లభించదు. దర్శనం మాత్రమే ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకూ ఆ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో వెళ్ళేటట్లుగా ప్రణాళిక వేసుకోవాలి. అందులో ప్రధానమైనవి
  • శ్రీవారి దర్శనానికి, తిరుమలలో ఉండడానికి ఏర్పాట్లు.
  • ఆర్జిత సేవలు చేయించదలిస్తే ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం.
  • ఎన్ని రోజులు ఉండేదీ అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా రానూ పోనూ ప్రయాణ టిక్కెట్లు రిజర్వు చేయించుకోవడం. ఈ ప్రణాళిక అమలులో భాగంగా మొట్టమొదట చేయాల్సిన పని మీ ఊళ్ళో / ఊరికి సమీపంలో తితిదే ఆన్‌లైన్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడం.
ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా...
సాధారణంగా తితిదే కల్యాణమంటపాల్లో లేదా జిల్లా కేంద్రాల్లో ఈ ఆన్‌లైన్ కేంద్రాలు ఉంటాయి. అక్కడ అర్చనానంతరం దర్శనం (ఏఏడీ-రూ.200), దర్శనం (రూ.50), కాటేజీ (రూ.100) లకు రిజర్వేషన్ కోసమైతే ఒక్కరు వెళితే సరిపోతుంది. ఏఏడీ, దర్శనం టోకెన్లను బయోమెట్రిక్ పద్దతిలో (వేలిముద్రల ఆధారంగా) ఇస్తారు. కాబట్టి తిరుమలకు ఎంత మంది వెళ్ళాలనుకుంటే అందరూ ఆన్‌లైన్ కేంద్రానికి వెళ్ళి వేలిముద్రలు ఇవ్వాల్సిందే.

ఇంటర్‌నెట్...
విదేశాల్లో ఉన్న వారైతే ఇంటర్‌నెట్ ద్వారానే అన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు. ఆర్జిత సేవల టిక్కెట్లను www.ttdsevaonline.com వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. కాటేజీ వసతి (రూ.100, రూ.750) కూడా ముందుగానే రిజర్వు చేసుకోవచ్చు. సిటీబ్యాంక్‌తో అనుసంధానమైన ఏ క్రెడిట్ కార్డు ద్వారానైనా చెల్లింపులు జరిపితే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో లావాదేవీలు పూర్తికాగానే... క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు జరిగినట్లు ఒక నివేదిక వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. తిరుమల చేరుకున్నాక ఒకరోజు ముందుగా అక్కడి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో ఆ రసీదును చూపిస్తే అసలు టిక్కెట్టు జారీ చేస్తారు. గుర్తింపు కోసం డ్రైవింగ్ లైసెన్స్ / పాస్‌పోర్ట్ / ఓటరు గుర్తింపు కార్డు / పాన్‌కార్డు వీటిలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. పద్మావతి గెస్ట్‌హౌస్ విచారణ కౌంటర్ 24 గంటలూ తెరిచే ఉంటుంది. ఒకరోజు ముందు వెళ్ళడం కుదరని పక్షంలో ఆర్జిత సేవ జరిగే సమయానికి ముందు వెళ్ళినా టిక్కెట్లు జారీ చేస్తారు కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంకా... www.tirumala.org వెబ్‌సైట్‌లో తిరుమల విశిష్టత, శ్రీవారి సేవలకు సంబంధించి చాలా వివరాలు లభ్యమవుతాయి. ఈ బుకింగ్ సదుపాయాన్ని ఇక్కడి భక్తులు కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ ఆన్‌లైన్ బుకింగ్ కోటా చాలా తక్కువగా ఉంటుంది. అందునా ఇంటర్‌నెట్ విప్లవం వచ్చాక ఇప్పుడందరూ నెట్ ద్వారానే టిక్కెట్లు బుకింగ్ చేస్తున్నారు. దాంతో మూడు నెలలు ముందుగానే దాదాపు అన్ని సేవలకూ, వసతికీ రిజర్వేషన్లు అయిపోతున్నాయి. ఈ మార్గంలో ప్రయత్నించే వారికి చాలావరకూ నిరాశ తప్పదు. కానీ ఒకసారి ప్రయత్నించి చూడొచ్చు.

అడ్వాన్స్ బుకింగ్
ఆన్‌లైన్ కేంద్రాలు, ఇంటర్‌నెట్ ద్వారా ఆర్జిత సేవలు, వసతి, దర్శన టిక్కెట్లు పొందలేని వారు అడ్వాన్స్ బుకింగ్ పద్దతిలో టిక్కెట్లు పొందవచ్చు. తిరుమలలోని ఆర్జితం ఆఫీసుకు ఫోన్ చేస్తే (0877-2263277, 2263679) ఏయే తేదీల్లో సేవా టిక్కెట్ల లభ్యత ఉందో తెలుస్తుంది. ఆ వివరాల ఆధారంగా తితిదే ఈవో పేరిట డీడీ తీసి పంపితే సరిపోతుంది. ఉదాహరణకు... కల్యాణోత్సవ సేవలో పాల్గొందామనుకునే భక్తులు తమకు ఫలానా రోజున అవకాశం కల్పించాలని కోరుతూ "కార్యనిర్వాహణాధికారి, తితిదే, తిరుపతి" పేరిట రూ.1000 డిమాండ్ డ్రాప్ట్ తీసి మూడు నెలలు ముందుగా "పేష్కార్, తిరుమల దేవస్థానం, తితిదే, తిరుమల-517504" చిరునామాకు పంపించాలి. కవరుపై భక్తులు తమ చిరునామాతో పాటు, టెలిఫోన్ నెంబరు కూడా రాయాలి. అత్యవసర సమయాల్లో దేవస్థానం వారు ఫోన్ ద్వారా కూడా సంప్రదిస్తారు. భక్తులు అడిగిన రోజున సేవా టిక్కెట్ల లభ్యత ఉండకపోతే తితిదే చేయగలిగేదేమీ ఉండదు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మరో నాలుగు తేదీలను కూడా సూచించాలి. అలా చేసినట్లైతే భక్తులు సూచించిన నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజుకి సేవా టిక్కెట్ల లభ్యత ఉంటుంది. ఆ తేదీని ఖరారు చేస్తూ కార్యనిర్వహణాధికారి కార్యాలయం నుంచి 15 రోజుల లోపలే సేవా టిక్కెట్టు వస్తుంది. భక్తులు సూచించిన నాలుగు తేదీల్లోనూ సేవా టిక్కెట్ల లభ్యత లేకపోతే డీడీని తిరిగి పంపించేస్తారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో అర్చన, తోమాలసేవ ఏకాంతంలో జరుగుతాయి. ఈ రెండు సేవలకూ డీడీలు పంపేటప్పుడు భక్తులు తాము సూచించే తేదీలు ఆయా రోజుల్లో రాకుండా జాగ్రత్త పడాలి.

అప్పటికప్పుడే ఆర్జిత సేవా టిక్కెట్లు
ఇంటర్‌నెట్, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టిక్కెట్లు పొందలేకపోయినవారు అప్పటికప్పుడు ఆ టిక్కెట్లను పొందే మార్గమే కరెంట్ బుకింగ్. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న విజయా బ్యాంక్ కౌంటర్‌లో తర్వాత రోజు జరిగే ఆర్జిత సేవలకు గాను టిక్కెట్లు విక్రయిస్తారు. వీలైనంత ముందే కరెంట్ బుకింగ్ వరుసలో ఉండడం మంచిది. దర్శనం, ఆర్జితం, వసతి టిక్కెట్లను ఏ పద్దతిలో తీసుకున్నా వాటిని రద్దు చేసుకునే వీలుండదు. అవకాశాన్ని బట్టి ఆ తేదీలను ముందు వెనుకలకు జరుపుకోవడం తప్ప, ఇక కరెంట్ బుకింగ్‌లో తీసుకున్న టిక్కెట్లనైతే వాయిదా వేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు.

వీఐపీ కోటాలో...
మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు ఇచ్చిన సిఫారసు లేఖల ద్వారా అన్ని రకాల ఆర్జిత సేవా టిక్కెట్లను పొందవచ్చు. అర్చన, తోమాలసేవ, కళ్యాణోత్సవం, అభిషేకం వంటి సేవల టిక్కెట్ల కోసం సిఫారసు ఉత్తరాలతో ఒక రోజు ముందుగా తిరుమలలోని ప్రత్యేక అధికారిని సంప్రదించాలి. అర్చనానంతర దర్శనం, నిజపాద దర్శనం వంటి సేవలకు గాను విజయాబ్యాంక్ రెండో అంతస్తులో ఉన్న ఆలయ డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించాలి. ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఈవోల అనుమతి లభించాక ఆ రసీదులు తీసుకుని విజయా బ్యాంక్‌కు సమర్పించి నగదు చెల్లిస్తే సేవా టిక్కెట్లను మంజూరు చేస్తారు.

ప్రయాణం... దర్శనం... శీఘ్రం
దర్శనానికీ, వసతికీ, సేవాటిక్కెట్లకీ రిజర్వేషన్ అయ్యాక చెయ్యాల్సింది ప్రయాణం టిక్కెట్ల రిజర్వేషన్. భక్తులు ఉండే ప్రదేశం, వారి ఆర్థిక స్థోమతను బట్టి ప్రయాణ సాధనాలను ఎంచుకోవచ్చు. హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన సౌకర్యం ఉంది. తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు విమానాలు వచ్చే వేళకు అక్కడ తితిదే బస్సులు సిద్దంగా ఉంటాయి.రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు,నగరాల నుంచి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.


రైల్లో వెళితే...
 
 
తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కొండ మీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతుంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి సరాసరి కొండ మీదకు వెళ్ళిపోవచ్చు.

బస్సులో వెళితే...
రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. మొదటిది స్టేషన్ ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్ స్టేషన్. రైలు వచ్చే సమయానికి అక్కణ్ణుంచి తిరుమలకు వెళ్ళే బస్సులు బయలుదేరేందుకు సిద్దంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్‌గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్‌స్టాండ్‌కు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాద్, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్‌స్టాండ్ (పెద్ద బస్‌స్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వే స్టేషన్ వెనుక వైపు శ్రీ పద్మావతి బస్‌స్టాండ్ ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

నడక దారిలో...
కొండమీదకు నడిచి వెళ్ళే వారికి సామాను మోయాలనే చింతే అక్కర్లేదిప్పుడు. అలిపిరి టోల్‌గేటు వద్ద ఉన్న కౌంటర్లో సామాను ఉంచి, టోకెన్ తీసుకుంటే వారు కొండ ఎక్కేసరికి వారికన్నా ముందే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస (సీ ఆర్ వో) కు సామాన్లు చేరిపోతాయి. తిరుపతిలో తితిదే నిర్వహిస్తున్న సత్రాల్లో ఎక్కడైనా సామాన్లు ఉంచి, టోకెన్ తీసుకుంటే చాలు వాటిని తిరుమలకు చేరవేస్తారు. ఈ సదుపాయం పూర్తిగా ఉచితం. నడిచి వెళ్ళే భక్తుల కోసం తితిదే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అలిపిరి వరకు ప్రతి అరగంటకు రెండు ఉచిత బస్సులు నడుపుతుంది. వారి సౌకర్యార్థం తాగు నీరు, మరుగు దొడ్లు, విశ్రాంతి కోసం షెల్టర్లు, వైద్య సౌకర్యాలు... ఇలా ఎన్నో ఏర్పాట్లు చేసింది. బీపీ, హార్ట్ ఎటాక్ పేషెంట్లు, ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు నడిచి వెళ్ళే కన్నా బస్సులోనే వెళ్ళడం మంచిది.

బండి మీద వెళ్ళితే...
కొంత మంది తమ సొంత వాహనాల్లోనే తిరుమలకు బయలుదేరతారు. దురదృష్టవశాత్తూ ఆ బళ్ళు ఘాట్ రోడ్ మార్గంలో ఆగిపోతే? భయపడక్కర్లేదు. అలాంటి వాహనాలను బాగుచేసేందుకు తితిదే ఆటోమొబైల్ క్లినిక్ నడుపుతోంది. వాహనం బ్రేక్‌డౌన్ అయిన సంగతి, ఏ ప్రాంతంలో ఉన్నదీ అలిపిరి టోల్‌గేట్ వద్ద ఉన్న సిబ్బందికి సమాచారమిస్తే తితిదే నియమించిన మెకానిక్‌లు మొబైల్ వ్యాను, స్పేర్‌పార్ట్స్ తో సహా అక్కడికి చేరుకుని ఆగిపోయిన వాహనాన్ని బాగు చేస్తారు. సర్వీసును బట్టి రుసుము, కొత్త పరికరాలు అమర్చితే వాటి విలువ చెల్లించాల్సి ఉంటుంది.

వసతికి కీలకం సీ ఆర్ వో
 

 
తిరుమలలో బస్సు దిగాక మొట్టమొదట చేయాల్సిన పని సీ ఆర్ వో కు వెళ్ళడం. సీ ఆర్ వో అంటే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్. ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ వెబ్‌సైట్ల ద్వారాను వసతి రిజర్వేషన్ చేయించుకున్న వారు ఆ కార్యాలయానికి వెళ్ళి... తాము సొమ్ము చెల్లించిన రసీదును చూపిస్తే లభ్యతను బట్టి గదులు కేటాయిస్తారు. ఉచిత వసతి సౌకర్యం కావాలన్నా సీ ఆర్ వో లోనే సంప్రదించాలి. తిరుమలలో ఉచితంగా వసతి కల్పించే సత్రాలు మూడు ఉన్నాయి. సీ ఆర్ వో పక్కనే మూడు ఉచిత వసతి భవన సముదాయాలు (పిలిగ్రిం ఎమినిటీస్ కాంప్లెక్స్-పీ ఏ సీ) ఉన్నాయి. ఈ కాంప్లెక్స్‌లో బస చేసిన యాత్రికులు విలువైన వస్తువులు ఉంచుకునేందుకు ఉచిత లాకర్ల సౌకర్యం కూడా ఉంది. ఈ భవన సముదాయాల్లో బస చేయాలంటే ముందుగా రూ.200 డిపాజిట్ చేయాలి. ఖాళీ చేసేటప్పుడు ఆ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. తలనీలాలు ఇచ్చేందుకు పీ ఏ సీ ల్లో మినీ కళ్యాణ కట్ట ఉంది. అదీ ఉచితమే. సీ ఆర్ వో లోనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. తిరుపతి నుంచి బయలు దేరే ఏ రైలుకైనా 24 గంటల ముందు వరకూ కూడ అక్కడ రిజర్వేషన్ చేయించుకోవచ్చు. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే దర్శనం సులభంగా అవుతుంది. ముందస్తు ప్రణాళిక లేకుండా వెళ్ళి నానా అగచాట్లు పడే బదులు చక్కటి ప్లానింగ్‌తో వెళ్ళి స్వామి వారిని ప్రశాంత చిత్తంతో దర్శించండి.

తిరుమలలోనే ఒక వైపున పాపనాశనం జలపాతం, మరోవైపున గోగర్భం నీటి యూట మొదలయినవి మరియు ఆంజనేయస్వామి తల్లియైన అంజనా దేవి పుత్రార్ధియై తపమాచరించిన చోటు - తిరుమలలో శ్రీ వేంకటేశుని దర్శించబోయే ముందు ముఖ్యంగా చూడవలసిన వరాహ నరసింహ స్వామి దేవాలయము, పవిత్ర పుష్కరిణీ స్నానం చేసి స్వామి దర్శనానికి భక్తులు తేలికగా వరుసగా వెళ్ళటానికి ఏర్పరచిన క్యూలలో ప్రవేశించి దర్శనోత్సాహులై ఎన్ని గంటలయినా నిరీక్షించి క్యూలల్లో కదిలి వెళ్ళి స్వామిని దర్శించి పునీతులవుతారు.

తిరుమలపై నూతనంగా అభివృద్ధి పరచబడిన ఎన్నో ఉద్యానవనాలున్నాయి. తిరుమలకొండపై ఎక్కడ వున్నా భగవన్నామ స్మరణ నిత్యం జరుగుతూ మన చెవులకు శ్రావ్యంగా వినపడటానికి స్పీకర్లు అన్ని చోట్లా అమర్చారు. అక్కడ వున్నంత సేపు తనువూ, మనసూ మైమరచి భక్తిభావంతో పులకించిపోతారు భక్తులు ఆ దివ్యానుభూతిని కలకాలం మనసులో దాచుకుని మరచిపోలేరు కూడా.

ఆధ్యాత్మిక తత్వానికి తోడుగా ప్రకృతి రమణీయమై, నేత్రపర్వంగా మనోహర దృశ్యాలు దృగ్గోచర మవుతాయి.

తిరుమల నుండి క్రిందికి దిగితే తిరుపతి పట్టణం చూడముచ్చటగా సాక్షాత్కారమవుతుంది. ఒక వంక విజ్ఞానభాండారమైన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ భవనాలు, పద్మావతీ కళాశాల - అనేక శాఖోపశాఖలుగా విలసిల్లిన కళాశాల భవనాలు ఒక వంక, మరో ప్రక్క కపిల తీర్థమనే ఎత్తునుండి నీరు ధారగా పడే జలపాతం కమనీయంగా కనబడతాయి. తిరుపతి నుండి పట్టణాన్ని ఆనుకునే తిరుచానూరు, అలివేలు మంగాపురం. పద్మావతి అమ్మవారి దేవాలయం, కళ్యాణ మండపం, శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం, గోవిందరాజుల స్వామి వారి ఆలయం మొదలైన దేవాలయాలు ఎంతో చూడదగినవి.

హైదరాబాద్ పరిశ్రమల చరిత్ర ..........