Tuesday 18 March 2014

భారతీయ ఆయుర్వేదానికి గుండెకాయ చరకుడు


చరకుడు {చరక సంహిత}


 

******************

ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివాడు. భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో "చరకులు" అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్యవైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవాడని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో చరకుని గురించి ఒక ఆశక్తిదాయకమైన కథ ఉంది. క్షీరసాగర మధనంలో పుట్టిన ధన్వంతరి మొదటగా ఆయుర్వేద విజ్ఞానాన్ని సర్పరాజైఅ ఆదిశేషుడిని ఉపదేశించాడు. ఒకసారి ఆయన భూలోకానికి వచ్చి తీవ్రమైన ఒకానొక వ్యాధికి గురియ్యాదు. కదలడానికి కూడా కష్టమైపోయింది. ఈ విచిత్ర పరిస్థితిలో తన వ్యాధిని పోగొట్టుకోనుoదుకు ముని కుమారునిగా జన్మించిన ఆదిశేషునే చరకునిగా చెబుతారు. "చర" అంటే భూమి మీద ధరించేవి అని అర్థం.

చరకుడు తన శిష్యులతో సంచరిస్తూ, అంటే పల్లెపల్లె తిరుగుతూ సంపన్నులకు, అతి సామాన్యులకు సమ ప్రాధాన్యం యిస్తూ వైద్య సహాయం అందించాడు. చరకుని వల్ల ఆయుర్వేదం భారతదేశంలో బహుళ వ్యాప్తి పొందింది. ఆయుర్వేద వైద్యం భారత దేశం లోని గ్రామ గ్రామాన విస్తరించి, ప్రతి ఊళ్ళోను ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేలా చేయడంలో చరకుడు - ఆయన శిష్యులు అవిరళ కృషి చేశారని చరిత్ర సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి.

చరక సంహిత

*********
చరకుడు గొప్ప ఆయుర్వేద శిఖామణి. సుశ్రుతుడి లాగానే చరకుడు కూడా "చరక సంహిత" అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథం రచించాడు.
"చరక సంహిత" క్రీ.శ.3-2 శాతాబ్దాల మధ్య కాలంలో రచించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఈ చరక సంహిత "అష్టాంగ స్థానములు" గా రచించబడినది. దీనిలో మొత్తం 120 అధ్యాయాలున్నాయి.

సూత్రస్థానం : 30 అధ్యాయములు
నిదానస్థానం : 8 అధ్యాయములు
విమానస్థానం : 8 అధ్యాయములు
శరీరస్థానం : 8 అధ్యాయములు
ఇంద్రియస్థానం : 12 అధ్యాయములు
చికిత్సస్థానం : 30 అధ్యాయములు
కల్పస్థానం : 12 అధ్యాయములు
సిద్ధిస్థానం : 12 అధ్యాయములు


చరకుని ఆయుర్వేద పరిజ్ఞానం మహోత్కృష్టమైనది. చరక సంహిత వెలువడిన కొన్ని శాతాబ్దాల తరువాత కూడా అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు చరక సంహితను మళ్ళీ మళ్ళీ తిరిగి రచించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశాడు. వాళ్ళలో కాశ్మీకరుడు, ధృవబాల మొదలైన వాళ్ళు ముఖ్యులు. "చరకసంహిత" క్రీ.శ.987 లో అరబ్, పర్షియన్ భాషల్లోకి అనువదింపబడినది.

దీనిలో చికిత్స స్థానంలో 17 అధ్యాయాలు, కల్పస్థానం, సిద్ధిస్థానాలు పూర్తిగా క్రీ.శ. వ శతాబ్దానికి చెందిన ధృవబాల అనే ఆయుర్వేద శాస్త్రవేత్త రచించి కలిపినట్లుగా చరిత్రకారుల అభిప్రాయం.

శరీరానికి కలిగే వ్యాధులు ముఖ్యంగా వాత,పిత్త,శ్లేష్మ దోషాల వల్లే కలుగుతాయని సిద్ధాంతీకరించాడు చరకుడు. ఆయుర్వేద వైద్యుల చిట్టాలో ముఖ్య ఔషధాలలో ఒకటైన ఉసిరి కాయ, తానికాయ, కరక్కాయ లతో తయారైన త్రిఫల చూర్ణం చరకుడు ప్రసాదించినదే! అలాగే వ్యాధికి జరిపే చికిత్స కంటే ముందు వ్యాధి కారణాలను కనుగొనడం ముఖ్యమని ప్రతిపాదించాడు చరకుడు. క్యాన్సర్ కణాలకు, పక్షవాతం , మూర్చ , కుష్టువ్యాధి, చూపు మందగించటం లేదా పూర్తిగా పోవడం వంటి వ్యాధులకు అతి సులభమైన నివారణోపాయాలను చరకుడు తన చరక సంహితలో పొందుపరిచాడు.

మనిషి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎన్నో మొండి రోగాలకు పాదరసాన్ని పుటం పెట్టి చరకుడు వైద్య ప్రయోగం చేసి రోగం నయం చేసిన తీరు పెద్ద పెద్ద వైద్య ప్రముఖుల్ని సైతం విస్మయానికి గురి చెసింది. మానసిక, శారీరక, ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యస్థితి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం ఎన్నడో పేర్కొంది. భౌతిక పదార్థాలైన వృక్ష,జంతు, ఖనిజ,రసాయన సంబంధమైన ఔషధాలు శారీరక రుగ్మతల్ని తగ్గిస్తే కొన్ని రకాలైన మంత్రోచ్ఛాటన ఒక క్రమ పద్ధతిలో చేయటం వల్ల మానసిక రుగ్మతలు ఉపశమిస్తాయని చరకుడు ప్రతిపాదించాదు. ఇప్పుడు ఆధునిక వైద్యులు చేస్తున్న "ఆల్టాసోనిక్" వైద్య చికిత్సా విధానానికి చరుని సిద్ధాంతమే ప్రేరన.

మనిషి ఎప్పుడూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, శారీరక మానసిక దృడత్వాన్ని కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని, ఆహార విహారాదుల విషయంలో పరిశుభ్రత విధిగా పాటించినప్పుడే శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ బాగున్నప్పుడే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చరకుడు స్పష్టం చేశాడు.

ఆధునిక వైద్యులు నేటికీ చరక సంహిత లోని వైద్య సూత్రాలను, సూక్ష్మాలను గ్రహించి వైద్యసేవలు అందించటం విశేషం. చరకుని వైద్యగ్రంథం "చరకసంహిత" మీద మరిన్ని ఎక్కువ పరిశోధనలు విస్తృతంగా జరగవలసి ఉంది. అప్పుడే సర్వమానవాళికీ ఆయుర్వేదం ఆరోగ్యప్రదాయనిగా పరిఢవిల్లుతోంది.

Monday 17 March 2014

సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి వసిష్ఠ మహర్షి హరిశ్చంద్రుడు


దస్త్రం:Raja Ravi Varma, Harischandra and Tharamathi.jpg



హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు.

పురాణాల ద్వారా హరిశ్చంద్ర కథ

హరిశ్చంద్రుడు ఒక చక్రవర్తి. ఇతని తండ్రి త్రిశంకువు. భార్య చంద్రమతి. కొడుకు లోహితాస్యుడు. మంత్రి సత్యకీర్తి. ఇతడు మహాసత్యసంధుడు. ఒకనాడు దేవేంద్రుడు సుధర్మాభ్యంతరమున కొలువు తీరి ఉండి అప్పుడు అచట ఉండిన మహర్షులను కని ప్రపంచమున తాము ఎఱిగినవారి లోపల సత్యసంధుడు ఎవడు అని ప్రశ్న చేయగా వసిష్ఠ మహర్షి హరిశ్చంద్రుడు అని పలికెను. ఆమాటకు విశ్వామిత్రుడు సహింపక హరిశ్చంద్రుడు అంత సత్యసంధుడా అతనిని బొంకించెదను చూడుము అని శపథము చేసి ఇతనికి పెక్కులు ఇడుములు కలుగచేసెను. అది ఎట్లనిన తొలుత ఇతని రాజ్యమును దానరూపమున పరిగ్రహించి అనంతరము అంతకు ముందు ఇతడు తన యజ్ఞమునకై ఇచ్చునట్లు వాగ్దత్తముచేసి ఉండిన ధనమును ఇమ్మని నిర్బంధించి దానికి ఇతని భార్యను అమ్మించి చండాలుని కొలుచునట్లును స్మశాన భూమియందు వసించునట్లును చేసి ఇతని కొడుకును పాముచే కఱపించి చంపి ఆవల నిరపరాధ అయిన ఇతని భార్యపై శిశుహత్యాపాతకమును మోవజేసి ఆమెను శిక్షార్హురాలు అగునట్లు చేయించి ఎట్లును బొంకింప నేరక పోయెను. కడపట తన ప్రయత్నము ఎల్ల వ్యర్థములు అయిపోగా రుద్రాదిదేవతలు ఈ హరిశ్చంద్రునికి ప్రత్యక్షము అయి ఇతని కొడుకును బ్రతికించి మరల మునుపటియట్ల రాజ్యాధిపత్యము వహించునట్లు అనుగ్రహించిరి. అప్పుడు విశ్వామిత్రుడు తాను తీసికొన్న రాజ్యమును ఇచ్చి బహుకాలము శ్రమకు ఓర్చి తపస్సుచేసి ఆర్చించిన మహాపుణ్యఫలమును ఇతనికి ధారపోసి చిరకాలము రాజ్యపదస్థుడవై సత్య హరిశ్చంద్రుఁడు అన విఖ్యాతిని ఒందుము అని ఆశీర్వదించి చనియెను. కనుకనే సత్యమునందు హరిశ్చంద్రునికి మించినవారు లేరు అని జగద్విఖ్యాతి కలిగి ఉన్నది. ఇట్లు విశ్వామిత్రుడు కారణములేకయే హరశ్చంద్రుని మిగుల ఇడుములు పెట్టినందుకై వసిష్ఠుడు అతనిని బకము అగునట్లు శాపము ఇచ్చెను. అందుకు విశ్వామిత్రుడు అతనికి ఆడేలు అగునట్లు ప్రతిశాపము ఇచ్చెను. ఇట్లు ఒండొరులు మాత్సర్యమున శపించుకొని పోరాడుచు ఉండు నవసరమున బ్రహ్మ వారిని శాంతవచనములచే అనునయించి వారి పోరాటమును ఉడిపి వారి పూర్వరూపములను మరల వారికి ఇచ్చి ఇరువురకును మైత్రి కలుగజేసి పోయెను.
హరిశ్చంద్రుడు ఒక చక్రవర్తి. ఇతని తండ్రి త్రిశంకువు. భార్య చంద్రమతి. కొడుకు లోహితాస్యుడు. మంత్రి సత్యకీర్తి. ఇతడు మహాసత్యసంధుడు. ఒకనాడు దేవేంద్రుడు సుధర్మాభ్యంతరమున కొలువు తీరి ఉండి అప్పుడు అచట ఉండిన మహర్షులను కని ప్రపంచమున తాము ఎఱిగినవారి లోపల సత్యసంధుడు ఎవడు అని ప్రశ్న చేయగా వసిష్ఠ మహర్షి హరిశ్చంద్రుడు అని పలికెను. ఆమాటకు విశ్వామిత్రుడు సహింపక హరిశ్చంద్రుడు అంత సత్యసంధుడా అతనిని బొంకించెదను చూడుము అని శపథము చేసి ఇతనికి పెక్కులు ఇడుములు కలుగచేసెను. అది ఎట్లనిన తొలుత ఇతని రాజ్యమును దానరూపమున పరిగ్రహించి అనంతరము అంతకు ముందు ఇతడు తన యజ్ఞమునకై ఇచ్చునట్లు వాగ్దత్తముచేసి ఉండిన ధనమును ఇమ్మని నిర్బంధించి దానికి ఇతని భార్యను అమ్మించి చండాలుని కొలుచునట్లును స్మశాన భూమియందు వసించునట్లును చేసి ఇతని కొడుకును పాముచే కఱపించి చంపి ఆవల నిరపరాధ అయిన ఇతని భార్యపై శిశుహత్యాపాతకమును మోవజేసి ఆమెను శిక్షార్హురాలు అగునట్లు చేయించి ఎట్లును బొంకింప నేరక పోయెను. కడపట తన ప్రయత్నము ఎల్ల వ్యర్థములు అయిపోగా రుద్రాదిదేవతలు ఈ హరిశ్చంద్రునికి ప్రత్యక్షము అయి ఇతని కొడుకును బ్రతికించి మరల మునుపటియట్ల రాజ్యాధిపత్యము వహించునట్లు అనుగ్రహించిరి. అప్పుడు విశ్వామిత్రుడు తాను తీసికొన్న రాజ్యమును ఇచ్చి బహుకాలము శ్రమకు ఓర్చి తపస్సుచేసి ఆర్చించిన మహాపుణ్యఫలమును ఇతనికి ధారపోసి చిరకాలము రాజ్యపదస్థుడవై సత్య హరిశ్చంద్రుఁడు అన విఖ్యాతిని ఒందుము అని ఆశీర్వదించి చనియెను. కనుకనే సత్యమునందు హరిశ్చంద్రునికి మించినవారు లేరు అని జగద్విఖ్యాతి కలిగి ఉన్నది. ఇట్లు విశ్వామిత్రుడు కారణములేకయే హరశ్చంద్రుని మిగుల ఇడుములు పెట్టినందుకై వసిష్ఠుడు అతనిని బకము అగునట్లు శాపము ఇచ్చెను. అందుకు విశ్వామిత్రుడు అతనికి ఆడేలు అగునట్లు ప్రతిశాపము ఇచ్చెను. ఇట్లు ఒండొరులు మాత్సర్యమున శపించుకొని పోరాడుచు ఉండు నవసరమున బ్రహ్మ వారినిదస్త్రం:Harishchandra by RRV.jpg 

Sunday 16 March 2014

రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు:- కార్ల్ హెన్రిక్ మార్క్స్




కార్ల్ హెన్రిక్ మార్క్స్
(మే 5, 1818 - మార్చి 14, 1883) 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రష్యన్ తత్త్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త మరియు విప్లవ కారుడు.

ఒక మేధావిగా మాత్రమే కాక రాజకీయంగా చాలా క్రియాశీలంగా వ్యవహరించిన మార్క్స్ సామ్యవాద పితామహుడుగా పరిగణింపబడుతున్నాడు. ఈయన అనేక రాజకీయ, సామాజిక సమస్యల మీద దృష్టి సారించినా కూడా ముఖ్యంగా చరిత్రను అధ్యయనం చేసిన విధానం ఈయనకు ఒక విశిష్టతను చేకూర్చినది. ఈయన రచించిన కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక లోని ఈ ప్రారంభవాక్యం చరిత్రను గురించిన ఈయన దృక్పథాన్ని తెలుపుతుంది.



 
వర్తమాన సమాజపు చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రే.

'పూర్వ వ్యవస్థల వలెనే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా తన వినాశనానినికి దారితేసే అంతర్గత వైరుధ్యాలను తనలోనే సృష్టించుకుంటుంది. భూస్వామ్య వ్యవస్థ ఏవిధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా తొలగింపబడిందో అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా సామ్యవాద వ్యవస్థ ద్వారా తొలగింపబడి రాజ్యం లేని వర్గరహిత సమాజం ఏర్పడుతుంది. కాకపోతే ఈ వర్గరహిత సమాజం అనేది కార్మిక వర్గ నియంతృత్వం అనబడే పరిణామ దశను దాటిన తరువాతనే ఆవిర్భవిస్తుంది' అని మార్క్సు విశ్వసించాడు.

మార్క్స్ తన జీవితకాలములో అంత గుర్తింపు పొందనప్పటికీ, మరణించిన కొద్ది కాలము లోనే కార్మికుల జీవితాలలో ఆతని ఆలోచనలు చాలా ప్రభావాన్ని చూపించడము మొదల్లు పెట్టాయి. రష్యాలో అక్టోబరు విప్లవము దీనికి సహాయ పడినది.

జీవితం


కార్ల్ మార్క్స్ జర్మనీ లోని ట్రీర్ అనే పట్టణంలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. మార్క్స్ బాన్,బెర్లిన్ మరియు జెనా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించాడు.1842 లో మార్క్స్ ఒక పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. పత్రికా యాజమాన్యంతో వచ్చిన విభేదాలతో 1843 లో మార్క్స్ సంపాదకత్వ బాధ్యతలనుండి తప్పుకుని పారిస్ చేరుకున్నాడు. అక్కడ చరిత్ర ,రాజనీతి శాస్త్రం మరియు తత్వశాస్త్రాలను అభ్యసించటంతో మార్క్స్ లో సామ్యవాద భావాలు రూపుదిద్దుకున్నాయి. మార్క్స్ 1844 లో ఎంగెల్స్ ను పారిస్ లో మొదటిసారి కలిసాడు. భావ సారూప్యత కలిగిన వారిద్దరూ శాస్త్రీయ కమ్యూనిజం యొక్క సైద్దాంతిక సూత్రాలను ఆవిష్కరించటానికి మరియు ఆ సూత్రాల ప్రకారంగా అంతర్జాతీయ కార్మికవర్గ ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టటానికి కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.వారి స్నేహం మార్క్స్ జీవించి ఉన్నంతవరకు అలానే కొనసాగింది.

కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక




1845 లో మార్క్స్ తన విప్లవ కార్య కలాపాల వలన పారిస్ నుండి బహిష్కరించబడ్డాడు.దానితో మార్క్స్ బ్రస్సెల్స్ చేరుకుని అచట మరలా తన విప్లవ కార్యాచరణను ప్రారంభించాడు.

యూరోపియన్ నగరాలన్నింటిలోని విప్లవ సమూహాలన్ని 1847 లో కమ్యూనిస్టు లీగ్ గా ఏకీకృతమయ్యాయి. మార్క్స్ మరియు ఎంగెల్స్ ఈ కమ్యూనిస్టు లీగ్ కు సైద్దాంతిక సూత్రీకరణలను తయారు చేయుటకు నియమింపబడ్డారు. ఎంగెల్స్ సహయంతో మార్క్స్ ఈ బాధ్యతను నిర్వర్తించాడు.అలా రచింపబడినదే చరిత్రలో ఆధునిక సోషలిస్టు సిద్ధాంతం యొక్క మొట్టమొదటి శాస్త్రీయ ప్రకటనగా ప్రసిద్ది చెందిన కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక.

ఈ రచనలో మార్క్స్ చారిత్రక భౌతిక వాద దృక్కోణంలో చరిత్రను వ్యాఖ్యానించాడు.సమాజపు చరిత్రంతా పీడక మరియు పీడిత వర్గాల అంటే పాలక మరియు పాలిత వర్గాల మధ్యన జరిగిన సంఘర్షణల చరిత్రే.ఈ క్రమంలో పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ వ్యాప్త కార్మిక వర్గ విప్లవం ద్వారా తొలగింపబడి వర్గరహిత సమాజం ఏర్పడుతుందని ఈ ప్రణాళికలో మార్క్స్ సూత్రీకరించాడు.



లండన్ లో జీవితం


కమ్యూనిష్టు పార్టీ ప్రణాళిక రచనానంతరం తన విప్లవ కార్య కలాపాల వలన యూరప్ లోని అనేక దేశాలు మార్క్స్ ను బహిష్కరించాయి. దానితో మార్క్స్ చివరికి లండన్ చేరుకుని తన మిగిలిన జీవితాన్నంతా అక్కడే గడిపాడు. లండన్ లో మార్క్స్ అధ్యయనానికి,రచనా వ్యాసంగానికి మరియు అంతర్జాతీయ కమ్యూనిష్టు ఉద్యమ నిర్మాణ ప్రయత్నానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ కాలంలో మార్క్స్ సామ్యవాద సాహిత్యంలో మకుటాయమానమనదగిన ఎన్నో రచనలు చేశాడు. వీటన్నింటి లోకి ప్రధానమైనది దాస్ కాపిటల్. ఈ గ్రంథం లో మార్క్స్ సమాజం లోని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క క్రమబద్దమైన మరియు చారిత్రకమైన విశ్లేషణను చేశాడు. ఈ గ్రంథలోనే పెట్టుబడిదారులు శ్రామిక వర్గం సృష్టించే అదనపు విలువ ను దోపిడీ చేసే విధానాన్ని సిద్ధాంతీకరించాడు.ఆ తదనంతరం మార్క్స్ ఫ్రాన్స్ లో 1871 లో నెలకొల్పబడి అతికొద్దికాలం మనగలిగిన పారిస్ కమ్యూన్ అనబడే విప్లవ ప్రభుత్వం గురించి వివరించిన ఫ్రాన్స్ లో అంతర్యుద్దం (ద సివిల్ వార్ ఇన్ ఫ్రాన్స్) అనే గ్రంథం రచించాడు. ఇవే కాక మార్క్స్ ఆకాలంలో ఇంకా అనేక రచనలను చేశాడు.

చివరి రోజులు



1852 లో కమ్యూనిస్టు లీగ్ రద్దవ్వగానే మార్క్స్ అనేక మంది విప్లవకారులతో సంబంధాలు కొనసాగించి చివరకు 1864 లో మొదటి ఇంటర్నేషనల్ అనే విప్లవ సంస్థను లండన్ లో స్థాపించాడు. ఈ సంస్థ కార్యక్రమమంతా మార్క్స్ ఆధ్వర్యంలోనే,అతని మార్గదర్శకత్వంలోనే నడిచేది. కానీ ఈ సంస్థలోని సభ్యులు పారిస్ కమ్యూన్ విప్లవంలో పాల్గొనడం, ఆ విప్లవం క్రూరంగా అణచి వేయబడటంతో మొదటి ఇంటర్నేషనల్ కూడా క్షీణించడంతో దాని కేంద్ర స్థానాన్ని మార్క్స్ అమెరికా కు మార్పించాడు. జీవితంలో ఆఖరి కొద్ది సంవత్సరాలు మార్క్స్ అనేక వ్యాధులతో బాధ పడ్డాడు. అవి అతని రాజకీయ ,రచనా వ్యాసంగానికి ఆటంకంగా పరిణమించాయి.దానితో మార్క్స్ తాను రచించదలచుకున్న వాటిలో కొన్నింటిని రచించలేక పోయి చివరకు లండన్ లోనే మార్చ్ 14,1883 న మరణించాడు.


మార్క్స్ ప్రభావం


మార్క్స్ జీవితకాలంలో అతడి సిద్ధాంతాల ప్రభావం స్వల్పంగానే ఉండేది. ఐతే మరణానంతరం అతని ప్రభావం కార్మికోద్యమం తో పాటు పెరుగుతూవచ్చింది. అతని విధానాలు, సిద్ధాంతాలు, మార్క్సిజం లేక శాస్త్రీయ సామ్యవాదం గా పేరు గాంచాయి. కార్ల్ మార్క్స్ చేసిన పెట్టుబడిదారీ ఆర్థిక విశ్లేషణ మరియు అతడి చారిత్రక భౌతికవాద సిద్ధాంతాలు, వర్గ పోరాటం, అదనపు విలువ, కార్మిక వర్గ నియంతృత్వం మొదలైన సూత్రీకరణలన్నీ కూడా ఆధునిక సామ్యవాద సిద్ధంతానికి పునాదిగా నిలిచాయి. మార్క్స్ సిద్ధాంతాలన్నీ అతడి మరణానంతరం పెక్కు మంది సోషలిష్టులచే పరిశీలించబడినాయి. ఐతే 20 వ శతాబ్దం లో లెనిన్ ఈ సిద్ధాంతాలన్నింటినీ మరింతగా అభివృద్ధి చేసి ఆచరణలోకి తెచ్చాడు.










అబ్రహం లింకన్ తన కుమారుని ఉపాధ్యాయుడికి వ్రాసిన లేఖ....



ఈరోజు నుండి నాకొడుకుకి విద్యాలయంలో విద్యాబ్యాసం మొదలు. కొంత కాలం వాడికి అక్కడి పరిస్థితులు అన్ని కొత్తగా వింతగా అనిపిస్తాయి, వాడిని సున్నితంగా చూసుకుంటారనే భావిస్తున్నాను. ఈరోజు వాడికి ఒక సాహసం వంటిది, ఈసాహాసం వాడికి ఖండఖండాంతరాలు తిరిగే అవకాశం ఇవ్వచ్చు. చరిత్రలో సాహసాలు రాజ్యాలనీ, యుద్దలనీ , వేదననీ మాత్రమే మిగిల్చాయి. కానీ జీవితం మీద సాహసం చెయ్యటానికి, ఒక మంచి మనిషిగా మిగలటానికి వాడికి నమ్మకం, ప్రేమ, దైర్యం అవసరం.

ప్రియమైన ఉపాధ్యయులారా, నా కొడుకుని మీచేతులలోకి తీసుకుని వాడికి అవసరమైనవన్నినేర్పండి, కానీ సున్నితంగా వాడి మనసుకి అర్థమయ్యేలా.

మనుష్యులు అందరూ నీతిమంతులు కారనీ - మనుష్యులు అందరూ సత్యవాదులు కారనీ - వాడు నేర్వాలని నాకు తెలుసు. కానీ ప్రతి నీచుడికి ఒక ఉత్తముడు కూడా ఉంటాడని - ప్రతి స్వార్ధ రాజకీయనాయకుడికి ఒక నిబద్ద నాయకుడు కూడా ఉంటాడని వాడికి భోదించండి. ప్రతి శత్రువుకి ఒక మిత్రుడు కూడా ఉంటాడని వాడికి తెలియపరచండి.

ఈర్ష్యకు వాడిని దూరం చెయ్యండి. మాట్లాడే మాట మీద నియంత్రణ, మాటల్లో గొప్పతనం వాడికి నేర్పండి.
ఎదుటివారి మీద ఆదారపడి బ్రతకటం కన్నా, సొంత కాళ్ళ మీద నిలబడటం గౌరవం అని భోదించండి. మీవల్లనయితే నిశబ్దపు నవ్వులో రహస్యాన్ని విప్పండి. సాద్యమైతే పుస్తకాలు, వాటి గొప్పతనం వాడు తెలుసుకునేలా చేయండి
అయితే అదే సమయంలో... ఆకాశంలోని పక్షులలో, ఎండలోని తేనటీగల్లో, పచ్చని కొండల్లోని పువ్వులలో
ఎడతెగని మర్మాన్ని గ్రహించేటంత నిశబ్ద ఖాళీ సమయాన్ని కూడా వాడికి ఇవ్వండి. ప్రకృతిని వాడు ఆరాధించి, ఆస్వాదించే మనస్సుని పెంచండి.

వంచనకన్న ఓటమి మంచిదని, గొప్పగా ఉంటుందని మీ పాఠశాలలో భోదించండి. దొరికిన 100 రూపాయల కన్నా సంపాదించిన 10 రూపాయలు విలువ ఎక్కువని వాడికి చెప్పండి. వాడికి వచ్చే సొంత మంచి ఆలోచనలపై నమ్మకాన్ని కలిగి ఉండటం నేర్పించండి. వాడి ఆలోచనలు తప్పు అని అందరూ అంటున్నా సరే
సున్నితస్తులతో సున్నితంగా, మొండివాళ్ళతో మొండిగా ఎలా ఉండాలో నేర్పించండి.

అందరూ వేలంవెర్రిగా ఒకే మందలో చేరి పోతునప్పుడు గుడ్డిగా అనుసరించక ప్రకక్కు నిలబడగలిగి, నిర్ణయించుకోగల సామర్ద్యాన్ని నాకొడుక్కి ఇవ్వండి. ఎవరు ఏది చెప్పిన, వినడాన్నిభోదించండి.
అయితే విన్న అన్నిటిని, సత్యపు జల్లెడలో వడకట్టి, పైన నిలిచే మంచి మాత్రమే గ్రహించటాన్ని నేర్పించండి.

మీవల్లనయితే విషాదంలో నవ్వటం ఎలానో భోదించండి. ఓటమిని-గెలుపుని, సుఖాన్ని-ధుఃఖాన్నికూడా సమానంగా ఎలా స్వీకరించి ఆనందించాలో భోదించండి. కన్నీరు లజ్జాకరం కాదని భోదించండి. వాడిదగ్గర ఉన్నది నలుగురికి పంచటం నేర్పించండి. అలాగే అతి చనువు పట్ల జాగురూకత భోదించండి. అలాగే బలాన్ని బుద్దిని అత్యదిక ధరకు అమ్ముకోవటం భోదించండి. కానీ వాడి హృదయంపైన, అత్మపైన అమ్మకపు ధర అతికించుకోవద్దు అని చెప్పండి.

సత్యం తనవైపు ఉన్నదని తెలిసినప్పుడు లోకుల మూకుమ్మడి కేకలను పట్టించుకోకుండా, దైర్యంగా నిలబడటాన్ని, పోరాడటాన్నిభోదించండి. వాడికి అన్ని నెమ్మదిగా నేర్పించండి, సున్నితంగా ప్రవర్తించండి, అలా అని గారాభం, ఎత్తుకు తిప్పటం చేయకండి. వాడికి తప్పు అంటే భయం నేర్పండి, వీటితోపాటు ఎంత కష్టానికైనా దైర్యంగా నిలబడే సహనాన్ని భోదించండి. ఎందుకంటే నిప్పులో కాలినాకే నిజమైన బంగారం బయటకి వస్తుంది.
వాడిమీద వాడికి ఉత్కృష్టమైన విశ్వాసాన్ని పెంచండి. అది వాడికి సమస్త మానవాళిమీద అదే విశ్వాసాన్ని పెంచుతుంది. ఇవన్నీ వాడు తెలుసుకున్ననాడు వాడు మనుష్యులలో ఉత్తముడిగా మిగులుతాడు.

ఇదంతా పెద్ద పట్టికే, తండ్రిగా వాడు అలా ఉండాలని నా కోరిక.. అలా తయారుచేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ మీవల్లనేమవుతుందో అది మీరు చేయండి,,,
వాడు ఒక పసిపిల్లవాడు, మనం ఎలా మలుస్తామో అలా పెరుగుతాడు
జాగ్రత్తగా చూసుకోండి.....
from:-
www.sandeshtv.com http://charitrarealfacts.blogspot.in/

Saturday 15 March 2014

“ఎందుకంత అవస్థ పడుతున్నావ్! నన్ను చంపటానికొచ్చావని తెలుసు. చంపరా పిరికిపందా!....చే గెవారా


“ఎందుకంత అవస్థ పడుతున్నావ్! నన్ను చంపటానికొచ్చావని తెలుసు. చంపరా పిరికిపందా! ఓ మనిషిని చంపబోతున్నావు అంతే కదా ” అని గర్జించాడతను.

కాళ్లలో రెండూ, మోకాళ్లలో రెండూ, చాతీలో రెండు, పక్కటెముకల్లో రెండు, గుండెలో ఒకటీ మొత్తం తొమ్మిది బుల్లెట్లు శరీరంలో దిగబడటం వల్ల మరణం సంభవించిందని అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలిపింది.
******

నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి నేటికీ ఆదర్శం.
ప్రపంచంలో ఎకడచుసినా నీ రూపం...
ఏ కీ చైన్ చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...
 

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...


చే గెవారా దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు. రాజకీయ నాయకుడు. ఇతడు పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేకించాడు. క్యూబా ప్రభుత్వం లో కాస్ట్రో తరువాత అంతటి శక్తివంతుడైన నాయకుడు.
అర్జెంటీనా లోని రొసారియా అనే పట్టణంలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో చే జన్మించాడు. 1953 లో బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్యలో పట్టా పొందాడు. ఆ తదుపరి మోటారు సైకిల్ పై దక్షిణ అమెరికా ఖండమంతటా పర్యటిస్తున్న సమయంలో ప్రజల జీవన స్థితిగతులను గురించి తెలుసుకున్నాడు. విప్లవమొక్కటే సామాజిక అసమానతలను తొలగించగలదని భావించాడు


1950 వ దశకం చివరలో అప్పటి క్యూబా నియంత బాటిస్టా కు వ్యతిరేకంగా కాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన గెరిల్లా పోరాటం(1956-1959)లో ముఖ్య పాత్ర పోషించాడు. డాక్టర్ గా మరియు మిలిటరీ కమాండర్ గా సేవలందించాడు. ఈ సమయం లోనే ఇతను 'చే' గా పిలువబడ్డాడు. చే గెవారా అసలు పేరు ఎర్నెస్టో గెవారా డి లా సెర్నా. గెవారా ఎవరినైనా పలకరించే సమయంలో చే అనే అర్జెంటీనా శబ్దాన్ని ఎక్కువగా వాడుతుండటంతో క్యూబన్ విప్లవకారులందరూ అతన్ని 'చే' అని పిలువనారంభించారు.
ఈ పోరాటం విజయవంతమై కాస్ట్రో 1959 జనవరిలో క్యూబా ప్రభుత్వాధికారాన్ని చేపట్టినపుడు చే పరిశ్రమల మంత్రిగా, క్యూబా జాతీయ బాంకు ప్రెసిడెంట్ గా పనిచేసాడు. క్యూబా ప్రతినిధిగా అనేక దేశాలు పర్యటించాడు. ఈ పర్యటనలలో భాగంగానే చే 1959 జూలై నెలలో భారతదేశం లో కూడా పర్యటించాడు. తృతీయ ప్రపంచ దేశాల మీద అమెరికా పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చే క్యూబా సామ్యవాద దేశం గా మారటానికి దోహదపడ్డాడు.


ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా
ఎదురించడానికి సిద్దంగా ఉండు - చే


అలా 1967, అక్టోబర్ 9 మద్యాహ్నం 1:10 నిముషాలకు, బొలీవియా సేనలకు చిక్కిన పోరాటయోధుడు చే గెవారా హత్య జరిగింది. మరణం దేహానికే కానీ ఆలోచనలకు కాదని చరిత్ర నిరూపించింది.
చే గెవారా మరణించి నాలుగు దశాబ్దాలు నిండాయి. దేశదేశాల విప్లవకారులు, రాజకీయవిశ్లేషకులు అతని గురించి ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. అనుకూలంగానో, వ్యతిరేకంగానో.

గొప్ప రాజకీయవేత్త, మేధావి, దుస్సాహసికుడు, నిజాయితీకల విప్లవకారుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శవంతమైన నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు – అంటూ ఎవరికి తోచినట్లుగా వాళ్లు నిర్వచిస్తూనే ఉన్నారు.


చే గెవారా జీవితంలోని సమకాలీన ప్రాధాన్యతను కాత్యాయని గారు రచించిన చే గెవారా అనే పుస్తకం మనముందుకు తెస్తుంది.
క్యూబా విప్లవోద్యమంలో కార్యకర్తగా అడుగుపెట్టి, ఫిడల్ కాస్త్రో కు కుడి భుజంగా మెసలి, విముక్త క్యూబా రాజ్య పునర్నిర్మాణంలో ప్రధాన పాత్రవహించి, బొలీవియా విమోచనోద్యమంలో అసువులు బాసిన అమరవీరుడు చెగువెరా. ఆయన తన జీవితమంతా అమెరికన్ సామ్రాజ్యవాదం మీద రాజీ లేని పోరాటాన్ని సాగించాడు. జీవితానికీ మరణానికీ సార్ధకత ఉండాలని తపించిన అచ్చమైన మనిషి. మార్పు జీవితమంత విశాలమైనది అని చెప్పిన విప్లవకారుడు.

ప్రభుత్వాలు మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే, నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించుకొన్న విశ్వమానవుడు.
చే గెవారా జీవితమంతా సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయం. తన మార్గం అనితర సాధ్యం అనిపించేలా జీవించిన ఒక గెరిల్లా యోధుడు ఇతను. క్యూబా విప్లవవిజయానంతరం లభించిన అధిపత్యాన్ని స్వచ్ఛందంగా వొదులుకొని మరిన్ని ఇతర లాటిన్ అమెరికన్ ప్రాంతాలను విముక్తం చేయాలని మరలా విప్లవపోరాటమార్గన పయనించిన గొప్ప ధీశాలి. ఆ ప్రయత్నంలో బొలీవియా సైనికులకు చిక్కి హత్యచేయబడ్డాడు.


ఏమిటీ మనిషి? ఎందుకలా ప్రవర్తించాడు? ఇతనికేంకావాలి? సుఖమైన జీవితాన్ని వొదిలిపెట్టి ఎందుకలా చిత్తడి బురదలో వందలకిలోమీటర్లు ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి పోరాడాడు? ఒక మనిషిని శృంఖలాలనుంచి విముక్తుడిని చేయటానికి మరో మనిషిపై తుపాకి గురిపెట్టాలా? అన్న ప్రశ్నలకు చనిపోయే ముందురోజువరకూ చే వ్రాసుకొన్న డైరీలలో కొన్ని సమాధానాలు దొరుకుతాయి. ఇతని నిబద్దత, రాజకీయ అవగాహనా, పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్ర్ర్యాలను అందించాలన్న తపన వాటి ప్రతీ పేజీలో కనిపిస్తాయి. మార్పు తీసుకురావటానికి చే గావేరా ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు, కానీ ఇతని నిజాయితీని శంకించలేము.

“మార్పు అనేది ముగ్గగానే రాలిపడే పండు కాదు, మనమే దానిని రాల్చాలి” అన్న చే గెవారా మాటలే అతని జీవితం.

Monday 10 March 2014

రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామీ వివేకానంద......






స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 - జూలై 4, 1902), (బెంగాలీలో 'షామీ బిబేకానందో') ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు.భారతదేశాన్ని ప్రేమించి,భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.


తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా1984 లో ప్రకటించింది.



ముఖ్య సూత్రములు తత్త్వములు



వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదంతము తత్త్వ శాస్త్రములో నే కాకుండా , సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగ పడుతుంది. రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో 'జీవుడే దేవుడు' అనేది అతని మంత్రముగా మారింది. 'దరిద్ర నారాయణ సేవ' (పేదవారి సేవ తో భగవంతుని సేవ) అనే పదాన్ని ప్రతిపాదించాడు. "విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్ప వారని తక్కువ వారని ఎలా అనుకుంటాము?" అనే ప్రశ్న తనకు తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయములో కలిగే దివ్యజ్యోతి లో కలిసి పోతాయని తెలుసుకున్నాడు. అప్పుడు పుట్టే ప్రేమ నుండి, తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది.అందరు తనవార నుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు. వ్యక్తిగత మోక్షము పై వ్యామోహము ను కూడా వదిలివేసి, ఇతరులను బంధవిముక్తులను చెయ్యడమే మనిషికి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి. రామకృష్ణా మిషన్ (రామకృష్ణా మఠము)ను "వ్యక్తి మోక్షమునకు, ప్రపంచ హితమునకు"(आत्मनॊ मोक्षार्थम् जगद्धिताय च) అనే నినాదము మీద స్థాపించాడు.
  • సిద్ధాంతాలు, పిడివాదాలు, సంప్రదాయాలు, దేవాలయాలు మున్నగువాటిని గురించి ఆలోచించకు. మనిషి హృదయంలో దీపిస్తూన్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకూ కొరగావు. ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి. మొదట ఈ శక్తిని సముపార్జించండి. ఇతర ధర్మాలను నిందించవద్దు. ప్రతి మతంలోను, ప్రతి సిద్ధాంతంలోను, ఎంతోకొంత మంచి వుంటుంది.సోదర ప్రేమ గురించి ప్రసంగాలుమాని, ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు. వ్యర్థ వాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు. అపుడే మానవాళికి సహాయం చేయగలడు. వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మంయొక్క అంశాలు.
  • స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు. అవి ఇక్కడ వివరించబడ్డాయి.
    1. గమ్యం చేరేవరకు ఆగవద్దు. జాగ్రుతులు కండి.
    2. దీర్ఘ (?)అంతమౌతోంది. పగలు సమీపిస్తోంది. ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు. ఆవేశపూరితులు కండు; ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.
    3. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాలయి. సాహసాన్ని ప్రదర్శించండి.
    4. మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపువద్దు. వారికి మీ సేవలను అందించండి.

 

Thursday 6 March 2014

ఉపపాండవులెందరు?


త్రేతాయుగపు కాలంనాటి హరిశ్చంద్రుని సత్యవ్రత దీక్షను పరీక్షించాలని విశ్వామిత్రుడు అతనిరాజ్యము, భార్య, పిల్లలు కట్టు బట్టలతో సహా వదిలి పొమ్మని ఆదేశిస్తాడు... ఈక్రమంలో రాణిపై చేయికూడా చేసుకుంటాడు... ఆ సమయంలో పరమ వీరులయిన అయిదుగురు సైనికులు/రక్షకభటులువిశ్వామిత్రుని చర్యకు మండిపడి అతనిచర్యలను ఖండిస్తారు... దీనికి ఆగ్రహం చెందినవిశ్వామిత్రుడు మీకు ఈ జన్మలో మోక్షం రాకపోవుకాక అని శపిస్తాడు... ... భీతిల్లిన ఆ రక్షకభటులుమునివర్యుని శాంతింపజేసి శాపానికి విరుగుడు ప్రసాదించమని వేడుకుంటారు.. శాంతించినవిశ్వామిత్రుడు మీరు వచ్చేజన్మలో ఏ బంధాలు ఏర్పడక ముందే చనిపోవుదురు, తర్వాతి జన్మలోపాండవుల పుత్రులుగా జన్మించి ఏ తప్పు చేయనప్పటికీ అశ్వథ్థామ చేతిలో నిద్రించే సమయంలోమరణించి మోక్షం పొందుతారు అని అభయమిస్తాడు... (వారిని చంపిన అశ్వథ్థామ రహస్యం తల్లిఅయిన ఉత్తర గర్భంలో ఉన్న పరిక్షిత్తుకు (అభిమన్యుని కుమారునికి) తెలుస్తుంది... ఈ విషయంతెలుసుకున్న అశ్వథ్థామ ఆ గర్భస్థ శిశువును హతమార్చాలని కూడా చూస్తాడట... కానీ శ్రీకృష్ణుడుకాపాడతాడని ఇంకొక కథ ఉంది) ఆ విధంగా పుట్టిన వారే ఉప పాండవులు....
“ధర్మరాజు కు పాంచాలియందు ప్రతివింధ్యుడు,భీమునికి శ్రుతసోముడు, అర్జునునకు శ్రుత కీర్తి,నకులునకు శతానీకుడు, సహదేవునకు శ్రుత సేనుడు కలిగారు. వీరు కాక ధర్మరాజుకు స్వయంవరంలో భార్యయైన దేవిక అనే ఆమెకు యౌధేయుడు కలిగాడు. భీమునికి జలంధర అనే ఆమెయందు సర్వగుడు కలిగాడు. అర్జునునకు సుభద్రయందు అభిమన్యుడు కలిగాడు. నకులునకు చేది రాజపుత్రి కరేణుమతికి నిరమిత్రుడు కలిగాడు. సహదేవునికి స్వయంవరం మూలంగా లభించిన భార్య విజయకు సుహోత్రుడు కలిగాడు.భీమునకు హిడింబ వలన ఘటోత్కచుడు కలిగాడు. వీళ్ళు మొత్తం పదకొండు మంది.”
1.ధర్మ రాజు+ద్రౌపది= ప్రతివింధ్యుడు,
2.భీముడు+ద్రౌపది= శ్రుతసోముడు
3.అర్జునుడు+ద్రౌపది= శ్రుత కీర్తి
4.నకులుడు+ ద్రౌపది=శతానీకుడు
5.సహదేవుడు+ద్రౌపది= శ్రుత సేనుడు

6.ధర్మరాజు+దేవిక=యౌధేయుడు.
7.భీముడు+జలంధర=సర్వగుడు
8.భీముడు+హిడింబ= ఘటోత్కచుడు
9.అర్జునుడు+సుభద్ర=అభిమన్యుడు.
10.నకులుడు+కరేణుమతి=నిరమిత్రుడు.
11.సహదేవుడు+విజయ=సుహోత్రుడు.

వీరిలో భీమునికి హిడింబ వలన కలిగిన ఘటోత్కచుడే పెద్దవాడు. పాంచాలి వలన కలిగిన వారు కాక, మిగిలినవారంతా యుద్ధం లో మరణించారు. ఉపపాండవులలో మిగిలిన, పాంచాలి పుత్రులు ఐదిగురిని పాండవులుగా భ్రమించి, అశ్వద్ధామ నిదరపోతుండగా చంపేశాడు. ఇదీ ఉపపాండవుల చరిత్ర. ఇక అభిమన్యునికి ఉత్తర కు జన్మించినవాడు పరీక్షిత్తు.

వీరుకాక అర్జునునికి ఉలూపి, చిత్రాంగద అనే ఇద్దరు భార్యలున్నారు. ఇందులో చిత్రాంగద కుమారుడు భభ్రువాహనుడు, ఇతను మణి పురాజ్యాధిపతి, తాత గారి రాజ్యానికి వారసుడయ్యాడు,అందుకు ఉప పాండవులలో చేర్చలేదు. ఇతను భారత యుద్ధం తరవాత బతికి ఉన్నవాడు.

Tuesday 4 March 2014

అక్షతల పరమార్థం


వివాహ శుభకార్యంలో జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగల్యధారణ వేళ, వధూవరులపై ఆహుతులు అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదు, ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు, పిన్నలకు అక్షతలు వేసి ‘దీర్ఘాయుష్మాన్‌ భవ, చిరంజీవి భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు’ అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి, పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. ‘అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’. క్షతం కానివి అక్షతలు. అంటే రోకలి పోటుకు విరగని, శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు లేక కుంకుమతో, నేతితో కలిపి అక్షతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కు వగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మన స్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
శాస్ర్తీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్త్యికాలనే త్రిగుణాలకూ కారకము. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహంలోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
భగవద్గీతలో

‘అన్నాద్భవన్తి భూతాని’ అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.
తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.
తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.
పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ‘ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి’ ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగుతూ ఉండాలి’ అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది. వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు. ‘ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!’ అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.


అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదించడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి....