కాగితం నిర్మాణం స్పెయిన్‌లో 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆ దేశంలో మూర్ అనే ముస్లిం దేశ ద్రిమ్మరులు కాగితం మిల్లులను నెలకొల్పారు. 13వ శతాబ్దంలో ఉత్తర భాగంలో పేపర్ నిర్మాణ యంత్రాంగశాలలు ఇటలీలో స్థాపించబడ్డాయి. 14వ శతాబ్దంలో ఫ్రాన్స్, జర్మనీలో కూడా ఈ యంత్రాంగాలు బయలుదేరాయి. ఐరోపాలో చాలా దేశాల్లో రాయడానికి కాగితం విరివిగా వాడబడింది. శతాబ్దాలు గడిచేటప్పటికి కాగితం నిర్మాణంలో వివిధ ప్రక్రియలు చాలా యాంత్రికమయ్యాయి. కాని దాని మౌలిక ప్రక్రియ మాత్రం మారలేదు. తడి పీచు, కర్ర, గుడ్డ పీలికలు మొదలైనవి మెత్తటి ముద్ద చేయబడి తరువాత పీచురేకుగా తయారవుతుంది. అది బాగా ఒత్తబడి దానిలో నీటిని వెలువరించాక దానిని ఆరబెట్టి వివిధ రసాయనిక పదార్ధాలతో అది వ్యవహరించబడ్డాక ఏ రకం కాగితం కావాలో దానికి అవసరమైనట్లు విభిన్న ప్రక్రియలలో అది పంపబడుతుంది. ఈ పీచుకు కర్ర ముఖ్యాధారమైనా, అత్యధికమైన గట్టితనానికీ, మన్నికకు స్థిరతకు గుడ్డ పీలికల నార యింకా ఉపకరిస్తోంది. గడ్డి, చెరుకుపిప్పి, వెదురు, జనపనార, గోగునార కూడా దీని వాడుకలో వున్నాయి. 1450లో ముద్రణా యంత్రం కనుగొనబడినప్పటి నుండి కాగితం యొక్క ఆవశ్యకత చాలా పెరిగింది. మొట్టమొదటి విజయవంతమైన కాగిత యంత్రశాల ఇంగ్లాండులో 1859లోనూ, అమెరికాలో 1690లోనూ ఫిలడెల్ఫియాకు చెందిన విలియం రిటెన్ హౌస్ చేత నెలకొల్పబడ్డాయి.
Saturday, 31 May 2014
కాగితం కథ
కాగితం నిర్మాణం స్పెయిన్‌లో 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆ దేశంలో మూర్ అనే ముస్లిం దేశ ద్రిమ్మరులు కాగితం మిల్లులను నెలకొల్పారు. 13వ శతాబ్దంలో ఉత్తర భాగంలో పేపర్ నిర్మాణ యంత్రాంగశాలలు ఇటలీలో స్థాపించబడ్డాయి. 14వ శతాబ్దంలో ఫ్రాన్స్, జర్మనీలో కూడా ఈ యంత్రాంగాలు బయలుదేరాయి. ఐరోపాలో చాలా దేశాల్లో రాయడానికి కాగితం విరివిగా వాడబడింది. శతాబ్దాలు గడిచేటప్పటికి కాగితం నిర్మాణంలో వివిధ ప్రక్రియలు చాలా యాంత్రికమయ్యాయి. కాని దాని మౌలిక ప్రక్రియ మాత్రం మారలేదు. తడి పీచు, కర్ర, గుడ్డ పీలికలు మొదలైనవి మెత్తటి ముద్ద చేయబడి తరువాత పీచురేకుగా తయారవుతుంది. అది బాగా ఒత్తబడి దానిలో నీటిని వెలువరించాక దానిని ఆరబెట్టి వివిధ రసాయనిక పదార్ధాలతో అది వ్యవహరించబడ్డాక ఏ రకం కాగితం కావాలో దానికి అవసరమైనట్లు విభిన్న ప్రక్రియలలో అది పంపబడుతుంది. ఈ పీచుకు కర్ర ముఖ్యాధారమైనా, అత్యధికమైన గట్టితనానికీ, మన్నికకు స్థిరతకు గుడ్డ పీలికల నార యింకా ఉపకరిస్తోంది. గడ్డి, చెరుకుపిప్పి, వెదురు, జనపనార, గోగునార కూడా దీని వాడుకలో వున్నాయి. 1450లో ముద్రణా యంత్రం కనుగొనబడినప్పటి నుండి కాగితం యొక్క ఆవశ్యకత చాలా పెరిగింది. మొట్టమొదటి విజయవంతమైన కాగిత యంత్రశాల ఇంగ్లాండులో 1859లోనూ, అమెరికాలో 1690లోనూ ఫిలడెల్ఫియాకు చెందిన విలియం రిటెన్ హౌస్ చేత నెలకొల్పబడ్డాయి.
Friday, 30 May 2014
సూపర్‌స్టార్ కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
తొలి కలర్ మూవీతో ఎంట్రీ..

కౌబాయ్ ని టాలీవుడ్ కు పరిచయం చేశాడు..
'అల్లూరి'తో సంచలనం సృష్టించాడు..
ఇక కృష్ణ కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్.. 'అల్లూరి సీతారామరాజు'. ఎన్నో ఏళ్లుగా ఎన్టీఆర్ చేయాలనుకుంటూ ఆగిపోతున్న అల్లూరి క్యారెక్టర్లో నటించిన కృష్ణ ఈ సినిమాతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు. వీర రసాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటీకీ ప్రేక్షకుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. సొంత బ్యానర్ పై భారీ వ్యయ ప్రయాసలకి ఓర్చి ఆయన నిర్మించిన ఈ సినిమా, సంచలనానికి సరైన అర్థం చెప్పింది . కృష్ణ పేరు ప్రతిష్టలని ఎవరెస్టు శిఖరమంత ఎత్తులో నిలిపింది.ఒక్క ఏడాదిలో 17 సినిమాలు..
కృష్ణ కేవలం సాహసానికే కాదు డెడికేషన్‌కు కూడా పెట్టింది పేరు. అందుకే ఆయన ఒకే సంవత్సరం 17 సినిమాలు విడుదల చేసి సంచలనం సృష్టించాడు. అంతేకాదు ఆ 17 సినిమాల్లో 9 సినిమాలు 100 రోజులు ఆడటం మరో విశేషం. 'ఈనాడు'లో పవర్ ఫుల్ క్యారెక్టర్ ని పోషించారు. కార్మిక - శ్రామిక పక్షాన నిలిచి అవినీతి రాజకీయాలపై సమర శంఖాన్ని పూరించే శక్తిగా కృష్ణ కనిపిస్తారు. ఈ సినిమాతో జనం మెచ్చిన నటుడుగా నీరాజనాలు అందుకున్న కృష్ణ, 'ఏకలవ్య', 'అడవి సింహాలు', 'ముందడుగు', 'శక్తి', 'పచ్చని కాపురం', 'పల్నాటి సింహం' వంటి చిత్రాలతో ఘన విజయాల్ని అందుకున్నారు. 70 నుంచి 90వ దశకంలో కూడా అద్భుతమైన చిత్రాల్లో నటించారు కృష్ణ.. 'నెంబర్ వన్', 'అమ్మదొంగ' లాంటి సినిమాలతో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకు కూడా గట్టి పోటీనిచ్చారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా కృష్ణ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. పద్మాలయ బ్యానర్ పై బాలీవుడ్ చిత్రాలని సైతం నిర్మించిన ఘనత ఆయన సొంతం.
దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించి 'సూపర్ స్టార్' గా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఆయన నటనకు ఎన్నో అవార్డులు వరించాయి. పద్మభూషణ్, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, పలు ఫిల్మ్ ఫేర్ లతోపాటు, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు, నంది అవార్డులను సాధించారు.
ఇప్పటికీ కొన్ని సినిమాల్లో గెస్ట్ లోస్ వేస్తూ అటు తన అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఇలా కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కృష్ణ.. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరకుంటూ మరోసారి ఈ నటశేఖరునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం..
Thursday, 29 May 2014
గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
- ద గ్రేట్ చైనా వాల్‌ను 2500 ఏళ్ళ క్రితం నిర్మించారు.
- చైనా మొదటి చక్రవర్తి క్విన్ షి హుయాంగ్టి మొదటి గోడను కట్టించారు.
- చైనా భాషలో దీనిని వాన్ లీ క్వాంగ్ క్వెంగ్ అంటారు. అంటే పొడవాటి గోడ అని అర్ధం.
- గ్రేట్ వాల్ పొడవు 4వేల మైళ్ళ వరకు ఉంది.
- ఉత్తర చైనాలోని పర్వతాల మీద నుండి రాజధాని బీజింగ్ ఉత్తర దిక్కు, నైరుతి దిక్కు వరకు ఈ గోడ విస్తరించి ఉంది.
- గోడలు 15 నుండి 30 అడుగుల మందాన, 25 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.
- చైనా గ్రేట్ వాల్ ప్రపంచంలో మానవ నిర్మితమైన అతి పొడవాటి కట్టడం.
- విదేశీయుల దండయాత్రల నుండి దేశాన్ని కాపాడుకోవడం కోసం సరిహద్దుల్లో రాజులు గ్రేట్ వాల్‌ను నిర్మించడానికి ముందు నిర్మించిన గోడలకు కేవలం చిన్న చిన్న ఆయుధాలను తట్టుకోగల సామర్ధ్యం మాత్రమే వుండేది.
- క్విన్ చక్రవర్తి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఉత్తర భాగాన్ని కలుపుతూ కొత్త గోడలు నిర్మించాలని నిర్ణయించారు.
- గ్రేట్ వాల్ నిర్మాణం కోసం భారీ ఎత్తున నిర్మాణ సామాగ్రిని తరలించడం కష్టం కాబట్టి స్థానికంగా లభ్యమైన వనరులనే వాడుకున్నారు.
- పర్వతాల నుండి రాళ్ళను, మట్టిని చెక్కను నిర్మాణంలో ఉపయోగించుకున్నారు.
- కొన్ని చోట్ల చైనా వాల్ మెట్లు ఏటవాలుగా చాలా ఎత్తుగా ఉంటాయి.
- గోడలో వాల్ టవర్స్, రక్షక భటులు ఉండడానికి ఆయుధాల నిల్వలు చేయ్డానికి గదులు ఉన్నాయి.
- స్మోక్ సిగ్నల్స్, శత్రువుల కదలికలను తెలిపే సిగ్నల్ టవర్స్ కూడా ఉన్నాయి.
- చైనా వాల్ చంద్రుడి మీద నుండి కనిపిస్తుందని అంటారు. కానీ అది యదార్ధం కాదు.
- చైనా మహా కుడ్యాన్ని పలువురు చక్రవర్తులు వివిధ కాలాల్లో కట్టించారు.
- చైనా మొదటి గోడను క్రీస్తు పూర్వం 22-207 మధ్య క్విన్ వంశానికి చెందిన ద్విన్ షి హుయాలగ్డి చక్రవర్తి నిర్మించారు.
- హుయాంగ్డి ఐక్య చైనాను నిర్మించి, ఉత్తరం వైపు నుండి శత్రువుల దాడిని నిరోధించడానికి గోడ నిర్మాణం ప్రారంభించారు.
- మొదటి వాల్ నిర్మాణానికి నాలుగేళ్ళు పట్టింది.
- మొత్తం ఎనిమిది లక్షల మంది కూలీలు ఈ నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
- తర్వాత క్రీస్తు పూర్వం 206లో అధికారంలోకి వచ్చిన హాన్ వంశం చక్రవర్తి టైజాంగ్ రెండవ గోడను నిర్మించారు.
- అయినా శత్రువుల దాడులు ఆగలేదు. ఫలితంగా పలుచోట్ల ఈ గ్రేట్ వాల్ దెబ్బతింది.
- 130 బిసిలో వూడి చక్రవర్తి గ్రేట్ వాల్ పునర్మిర్మాణం, గోడ పొడవును పెంచడం చేపట్టారు.
- వూడి హయాంలో గోడ పొడవునా అవుట్ పోస్ట్లు ఏర్పాటు చేశారు.
- తర్వాత హాన్ వంశం మూడుగా చీలిపోయింది. వీటిలో ఒకటైన వెయ్ వంశం చక్రవర్తి ఈ మహాకట్టడాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకున్నారు.
- రూరన్ అనే జాతుల దాడుల్లో గ్రేట్ వాల్ దెబ్బతింది.
- తర్వాత వివిధ రాజవంశాల వారు ఈ గోడ వెలుపల లోపల కూడా అదనంగా గోడలు నిర్మించారు.
- కొత్త గోడలు శత్రువుల దాడులను ఆపలేకపోయాయి.
- క్రీస్తు శకం 1115లో జిన్ రాజ వంశం అధికారం చేపట్టి మూడవదైన గ్రేట్ వాల్‌ను నిర్మించింది.
- మూడవ వాల్ హీలాంగ్ జియాంగ్ అనే రాష్ట్రంలోను, మంగోలియా అంతర్భాగం వరకు విస్తరించి ఉంది.
- తర్వాత 1276లో మంగోలులు జిన్‌లను కూలదోసి యువాన్ వంశపాలనను ప్రవేశపెట్టారు. వీరి హయాంలో గ్రేట్ వాల్‌ను పట్టించుకోలేదు.
- ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మింగ్ రాజులు చైనాను శతృవుల బారి నుండి రక్షించడానికి, గ్రేట్ వాల్ పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకున్నారు.
- మింగ్ వంశ తొలి చక్రవర్తి హొంగ్వూ గ్రేట్ వాల్ పొడవునా రక్షక భటులను ఏర్పాటు చేశారు.
- వాల్‌కు రక్షణగా అదనపు గోడలు, కోటలు, ఆయుధాగారాలను నిర్మించారు.
- 1569-1583 మధ్యలో గ్రేట్ వాల్‌లో కీలకమైనదిగా చెప్పుకునే నాలుగవ వాల్‌ను చక్రవర్తి హొంగ్వూ నిర్మించారు.
- నాలుగవ వాల్ వలన చైనాకు మంగోలుల బెడద తప్పింది.
- 1644 నుండి గ్రేట్ వాల్ నెమ్మదిగా దెబ్బతినడం ప్రారంభమయింది.
- ఆ కాలంలో అధికారంలో ఉన్న క్వింగ్ చక్రవర్తులు గ్రేట్ వాల్‌ను పట్టించుకోలేదు.
- చైనాలో సాంస్కృతిక విప్లవం వచ్చిన తర్వాత వాల్ పతనం మరింత మొదలయింది. ఈ గోడ నుండి రాళ్ళు, పెద్ద పెద్ద బండలను తీసి ప్రాజెక్టుల నిర్మాణానికి వాడుకున్నారు.
- 1984లో అప్పటి అధ్యక్షుడు డెంగ్. జీయావో పింగ్ గ్రేట్ వాల్ పరిరక్షణకు, మరమ్మతులకు చర్యలు తీసుకున్నారు.
- 1987లో బీజింగ్‌కు దగ్గరగా ఉన్న బదాలింగ్‌లో ఉన్న గ్రేట్ వాల్ను యునెస్కో ప్రపంచ సాంస్కృతిక సంపదగా ప్రకటించింది.
- ఉత్తర చైనాలోని పర్వతాలు, మైదానాలు ఎడారులు, మీదగా చైనా వాల్ విస్తరించి ఉంది. ఈ గ్రేట్ వాల్ ఎక్కువ భాగం ఎడారి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది.
- బీజింగ్, హెబీ ప్రాంతాల వైపు ఉన్న గోడనే ప్రజలు ఎక్కువగా సందర్శిస్తుంటారు.
- బీజింగ్ నుండి మొదలుపెట్టి ఒక్కరోజులో చైనావాల్‌ను చూడాలంటే బదాలింగ్, జుయోంగ్వాన్ ప్రాంతాలకు వెళ్ళవచ్చు. ఇక్కడ
- గ్రేట్ వాల్ టూరిస్ట్లకు పెద్ద ఎట్రాక్షన్.
- ఇక హెబి ప్రాంతం వైపున గ్రేట్ వాల్‌ను చూడాలంటే షాంహైగ్వాన్ నుండి మొదలు పెట్టాలి. గ్రేట్ వాల్ ఓల్డ్ డ్రాగన్ హెడ్ నుండి మొదలవుతుంది. ఇక్కడ సముద్రం లోపలి వరకు వాల్ ఉంటుంది.
- హువాంగ్వాగ్వాన్ వద్ద గ్రేట్ వాల్‌లో ఇప్పటికే స్ట్రాంగ్‌గా నిలిచి ఉన్న టవర్లు, నీటి సరఫరా వ్యవస్థను చూడవచ్చు.
- ఇవీ ప్రపంచ నెంబర్ వన్ వింత ది గ్రేట్ చైనా వాల్ విశేషాలు.
సరస్వతి
ఈ ఆధునిక యుగంలో చదువే సమస్తానికి మూలమని అందరికీ
తెలుసు. విద్యతోనే పిల్లలు సభ్య మానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు.
కవి, లేఖనుడు, సమీక్షక్షుడు, ఆలోచనాపరుడు, పాఠకుడు, గాయకుడు, సంగీతజ్ఞుడు,
తార్కికుడు, అధ్యాపకుడు, ప్రవక్త, ఉపదేశకుడు, జ్యోతిష్కుడు, వక్త మొదలైన
వారందరికీ కావలసింది వాక్పటుత్వం. వాక్చాతుర్యం ద్వారానే వ్యక్తులు ఇతరులపై
ప్రభావం చూపగలుగుతారు. సంగీత ఇతర లలిత కళలకు కూడా సరస్వతి అధిష్టాన దేవత.
పవిత్రంగా, మనపూర్వకంగా, నిర్మలమైన మనస్సుతో ఆరాధిస్తే చాలు ఆ చదువులమ్మ
ప్రసన్నమై కోరిన విద్యలు ప్రసాదిస్తుంది.
సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. సకల సవాజ్మయానికీ మూలం. మనం నోటితో ఏదైన మధురంగా
మాట్లాడుతున్నామంటే అది ఆ తల్లి చలవే. ఆమె
అంతర్వాహినిగా ఉండటం వల్లే మనలో మేధాశక్తి పెంపొందుతుంది. ఆమె అనుగ్రహం
లేకపోతే అజ్ఞానాంధకారం లో కొట్టుమిట్టాడవలసిందే. అందుకే ఆ చల్లని తల్లి
అనుగ్రహం ప్రతీ ఒక్కరికీ అవసరం.
యా కుందేదు తుషార హర ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవ్యై స్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవ్యై స్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ
అని స్తుతిస్తాం సరస్వతిని. ఆ తల్లిని పూజిస్తే
బుద్ది వికాసం కలుగుతుందని, సకల శుభాలూ సమకూరుతాయని భక్తుల విశ్వాసం.
వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానాలకు, భాషకు, లిపికి అధిష్టాన దేవత సరస్వతీ
దేవి. ఈమె వీణా పుస్తక ధారిణి. శుద్ద సత్య స్వరూపిణి. హంస ఆమె వాహనం.
సరస్వతి బ్రహ్మదేవుని నలుకయందు నివసిస్తుంది. పలుకు తేనెల బంగారుతల్లి.
వేదాలకు జనయిత్రి. తెల్లని వన్నెలు విరజిమ్ముతూ, తెల్లని వస్త్రాలు ధరించి
వీణ, పుస్తకాలు చేదాల్చి, రత్న భూషణాలు మెడలో ధరించి, సకల శాస్త్రాలకూ అధి
దేవత అయిన సరస్వతీదేవి అవిర్భవించింది. ఆమె దయ ఉంటే మూర్ఖుడు సైతం పండితుడు
కాగలడు. ఆమెను తృణీకరించిన మహపండితుడుసైతం జ్ఞాన భ్రష్టునిగా,
వివేకశూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుని పిచ్చివాడయిపోతాడు. అందుకే ఆ
తల్లి కరుణ కోసం పరిపరివిధాల ప్రాధేయపడతాం.
సరస్వతీదేవి ఇతర నామాలు
సరస్వతీదేవి పలు నామాలతో విలసిల్లుతోంది. భారతి,
మహవిద్య, వాక్, మహరాణి, ఆర్య, బ్రహ్మి, కామధేను, బీజగర్భ, వీణాపాణి, శారద,
వాగీశ్వరీ, గాయత్రి, వాణి, వాగ్దేవి, విద్యావాచస్పతి తదితర నామాలు ఉన్నాయి.
అక్షరాభ్యాసానికి అనుకూలం
అక్షరాభ్యాసం లేదా విద్యారంభానికి మంచి ముహూర్తం
ఉత్తరాయణం. అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల లో
శుక్లపక్షంలో విదియ, తదియ, పంచమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, తిధులు, అశ్వని,
మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్ర, స్వాతి, అనూరాధ, శ్రవణం,
ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రాలు శ్రేష్ఠం. మంగళ, శని వారాలు తప్ప తక్కిన
వారాలన్నీ మంచివేనని శ్రీ కాశీనాధోపాధ్యాయ విరచిత ధర్మసింధు పేర్కొంది.
సరస్వతీ వ్రతం
ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి వరలక్ష్మీ
వ్రతం చేసినట్లుగానే విద్యాధిదేవత సరస్వతీదేవి వ్రతం కూడా ఉంది. ఈ వ్రతం
చేయడం వల్ల అజ్ఞానంతో చేసిన పాపాలన్నీ తొలగి జ్ఞానప్రాప్తి కలుగుతుంది.
పాండిత్యం సిద్ధిస్తుంది. ఆ వ్రతవిధానమిది. ఈ వ్రతానికి మాఘశుద్ధ పంచమి
లేదా ఏ మాసమైనా శుక్లపక్ష పంచమి, పూర్ణిమ తిధులు శ్రేష్ఠం. సంకల్పం
చెప్పుకున్న శుభముహూర్తాన ఉదయం పూట శుచిగా సరస్వతిని పూజిస్తామని
సంకల్పించుకోవాలి. స్నానాదికాలు, నిత్యకృత్యాలు అయిన పిదప కలశ స్దాపన
చేయాలి. గణపతిని పూజించి, కలశంలో దేవిని అవాహాన చేయాలి. విద్యాదాయిని
సరస్వతీదేవికి ధవళ వస్త్రాలను సమర్పించి, తెల్లని నగలు అలంకరించాలి.
తెల్లని పూలు, అక్షరాలతో, మంచిగంధంతో, ధ్యానావాహనాది షోడశోపచారాలతో
పూజించిన అనంతరం పాయసం నివేదించాలి. పూజానంతరం కధ చెప్పుకుని అక్షంతలు
శిరస్సున ధరించి పాయస ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. ఈ విధంగా 5
వారాలు చేసిన తదుపరి ఉద్యాపన చేయాలి.
ఉద్యాపన విధానం
ఐదుగురు పిల్లలను గణపతి ప్రతిరూపాలుగా భావించి,
పూజించి, నూతన వస్త్రాలు కట్టబెట్టి, పలకాబలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి
సంవత్సరంపాటు వారిని చదివించాలి. లేదా వారి చదువుకయ్యే ఖర్చు భరించాలి.
ఎవరైనా తమకిగానీ, తమవారికిగానీ అసాధారణ విద్య అబ్బాలనుకున్నా, ఉన్నత
విద్యాప్రాప్తి, లేదా పదోన్నతి కావాలనుకుంటే ఈ వ్రతం ఆచరించి సత్ఫలితాలు
పొందవచ్చు. శ్రావణమాసం లేదా ఫాల్గుణ మాసాలు ఈ వ్రతమాచరించడానికి శుభప్రదం.
Wednesday, 28 May 2014
వీర తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర
తెలంగాణలో పదకొండు జిల్లాలు. మహారాష్ర్టలో 5 జిల్లాలు, కర్నాటక ప్రాంతంలో 3 జిల్లాలు కలసి హైదరాబాద్ సంస్థానం ఉండేది. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో 90 లక్షల జనాభా ఉండేది. హైదరాబాద్ సంస్థానంపై నైజాం రాచరిక ప్రభుత్వ పాలనవుంది. జాగీరుదారుల నిరంకుశ పరిపాలనలో ప్రజానీకం అనేక బాధలు పడినారు. వెట్టిచాకిరికి గురయ్యారు. చంటిపిల్లల తల్లులు, బాలింత లను కూడా దొరలు, జాగీరుదారులు వ్యవసాయ పనులకు భయపెట్టి తీసుకుపోయేవారు. బాలింతలను మధ్యాహ్నం తమ బిడ్డలకు పాలు యిచ్చుటకు వెళ్ళనిచ్చేవారు కారు. రైతులు వేసుకున్న పంటలను పట్ట పగలే తమ కిరాయి గుండాలతో కోయించి తమ గడిలను నింపుకునే వారు. పట్టా భూములను దొరలకప్పగించేవారు. ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములన్నీ దొరల, భూస్వాముల చేతిలో అధీనంలో వుండేవి. విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ఆరుగాలం రైతులు పండించి పంటలను స్వాధీనం చేసుకునేవాడు. దొరలకు వెట్టి పనులు చేయడానికి నిరాకరిస్తే మూటాముల్లే సర్దుకుని గ్రామాన్ని వదిలి వెళ్ళాల్సిందే. వ్యాపారం చేసే వైశ్యులు అధికారులకు కావాల్సివున్న సన్న బియ్యం, నెయ్యి, నూనె, పప్పు, చింతపండు, బీడీలు, సిగరెట్లు, చుట్టలు సబ్బులు, మాలు మసాలా తదితర వస్తు సామగ్రినిని ఉచితంగా సరఫరా చేయాలి. సకాలంలో అధికారులకు అందకుంటే అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సిందే. పల్లెల ప్రజానీకాన్ని అనేక విధాలుగా దోపిడి చేసి ప్రజాకంటకులయిన దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు కుబేరులయినారు. దొర గడిల నుంచి బయటకు వెళ్ళి బజారున పోతుంటే దొరకు ఎదురయ్యే ప్రజలంతా కాళ్ళకు చెప్పులుంటే వాటిని విడిచి వంగి వంగి దండాలు పెట్టాలి. అరుగులపై కూర్చున్న వారంతా లేచి నిలబడి నమస్కరించాలి. గ్రామాలకు ప్రభుత్వ అధికారులు వస్తే వంతుల ప్రకారం గొర్లమందల నుంచి గొర్లను, మేకలను తెప్పించి కోసి అధికారులకు విందులు చేసేవారు. ఈ అధికారులకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్న ప్రయోజనం లేదు. వెట్టిచాకిరి చెయ్యటానికి పుట్టినామని మాబ్రతుకులు మారయని నిస్పృహతో కుమిలి కుమిలి పోయేవారు. చెప్పిన పాడుపనులన్నీ కడుపులు మాడ్చుకుని చేసినప్పటికీ అధికారులు, దొరలు ఆగ్రహావేశాలకు తన్నులు, తిట్లు తినాల్సి వచ్చిన రోజులవి. ఎన్ని పనులు చేసినా నోరు మెదపకుండా ఉండాల్సిన బానిసత్వ రోజులవి. హైదరాబాద్ సంస్థానంలో జిల్లా కేంద్రంలో హై స్కూలు మాత్రం ఉండేది. మిడిల్ స్కూలు కూడా లేని తాలూకా కేంద్రాలెన్నోఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు పెట్టుకొనుటకు, గ్రంథా లయాల స్థాపనకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇలా తెలంగాణ ప్రాం తంలో ప్రజలు దోపిడి అణచివేతలు అన్యాయాలకు వెట్టిచాకిరికి గురై బానిసత్వపు బతుకులు జీవిస్తున్నారు. చదువు సంధ్యలు లేని చీకటి రోజులవి.
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉద్యమం భారీగా నడుస్తున్న రోజులవి. అలాంటి సమయంలో, 1930లో ఆంధ్రమహాసభ సురవరం ప్రతాప రెడ్డి అధ్యక్షతన మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. వితంతు వివాహాలను చేయాలి, బాల్య వివాహాలను నిషేధించాలి, వెట్టిచాకిరిని నిర్మూలించాలి. దేవాలయాల్లోకి దళితులకు ప్రవేశం కల్పించాలి, మద్యపానం నిషేధించాలి, దొరలకు, భూస్వాములకు వంతుల పద్దతిని నిషేధించాలి అంటూ ఆ మహాసభలో పలు తీర్మానాలు చేసినారు. ఆ మహాసభ వేదిక నుంచి ఆయా తీర్మానాలను రావి నారాయణరెడ్డి చది వారు. మహాసభలో పాల్గొన్న యువకులు, సంఘసంస్కర్తల హృదయా లను అవి ఆకర్షించాయి. ఉత్తేజాన్ని నింపాయి. ఈ తీర్మానాలను ప్రభుత్వానికి పంపించారు. ఎక్కడికక్కడ మహాసభ ప్రచారకులను నియమించారు. నల్గొండ జిల్లా చండూరును కేంద్రంగా చేసుకుని వెట్టి చాకిరి విధానానికి, వంతుల విధానానికి వ్యతిరేకంగా జనాన్ని సమీ కరించి ఉద్యమాన్ని నిర్మాణానికి నడుం బిగించారు. ప్రభుత్వధికారులు గ్రామాలకు వెళ్ళినప్పుడు పని పాటల వారిచేత నిర్బంధంగా పనులు తీసుకోకూడదని, పనికి దగ్గ ప్రతిఫలమిచ్చి వారితో పనులు చేయించు కోవాలని ప్రభుత్వం ఆదేశాలు వెలువరించింది. భువనగిరి తాలుకా లోని పాముకుంట, జాల కురారం, రేణికుంట, నమిలె బేగంపేట, రాజపేట తదితర గ్రామాల్లో వందలాది మంది దళితులను సమీకరించి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోకి ప్రవేశం చేయించా రు. జనసమీకరణకు కురారం రామిరెడ్డి శ్రమించాడు. ప్రజా సమస్య లపై ఉద్యమిస్తూ, నిజాం దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజానీకాన్ని కదిలించి ప్రజా పోరాటాల్లోకి దించేవారు. దీంతో దొరలు ఆంధ్రమహా సభ ఉన్న ప్రదేశాలలో వెట్టిచాకిరి పనులు చేయించుకోవడం మానుకు న్నారు. పాత సూర్యాపేట, వరంగల్లు, జనగామ, ఖమ్మం ఏరియాలలో భూస్వామ్య దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు నడుపు తుంటె మితవాద నాయకులైన కొండ వెంకట రంగారెడ్డి, మందుముల నర్సింగరావులు ఆంధ్ర మహా సభలో చేరి కమ్యూనిస్టులు గ్రామాలలో వర్గకలహాలు తెస్తున్నారని వారిని సభ్యత్వం నుంచి తొలగించారు.
రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలంలో పశ్చిమ బెంగాల్‌లో 60 లక్షల మంది ప్రజలు కరువు కాటకాలతో బలైపోయి నారు. నైజాం ప్రభుత్వం ప్రతి చిన్న పేద రైతు నుంచి పండినా, ఎండినా నిర్బంధ లేవీ వసూళ్లకు పూనుకుంది. హైదరాబాద్ సంస్థానంలో నూటికి 90 మంది హిందూమతానికి పది మంది ముస్లిం మతానికి చెందినవారు. బహదూర్ యార్ జంగ్ ముస్లిం మతతత్వవాది. మత మార్పిడి ద్వారా ముస్లింల సంఖ్య పెంచుకొని ముస్లిం రాజ్యాన్ని రక్షించు కోవాలని పథకం పన్నాడు. భూస్వాముల ఇనుప చక్రాల కింద నలిగి నలిగి నరకయాతన అనుభవిస్తున్న కొంత మంది బీసీలు, దళితులు తమ మతం మార్చుకుని ముస్లిం మతంలో చేరారు. గ్రామాలలో మత మార్పిడితో భూస్వాములు విసునూరు రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమా వేశమై హిందు సమితి పేరుతో మత సంస్థలను స్థాపించారు. హిందూ మతం పేరిట మతాన్ని రక్షించే కుంటి సాకుతో మధ్యయుగాల నాటి బానిస విధానాన్ని కొనసాగించదలిచారు. పీడిత ప్రజలు ఆర్య సమాజ నాయకుల మాటలను నమ్మలేకపోయారు.
భారతదేశమంతటా జాతీయ ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతు న్నాయి. సత్యాగ్రహ పోరాటాలు సాగిస్తున్నారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనర్సింహారెడ్డి సమావేశమై స్టేటు కాంగ్రె స్‌ను నిషేధించుటకు ఉత్తర్వులు జారీ చేసినారు. సత్యాగ్రహంలో పా ల్గొన్న నాయకులు అక్రమంగా అరెస్ట్‌చేసి జైళ్లలో నిర్బంధించినారు. తెలంగాణ జిల్లాల్లో సత్యగ్రహం తీగలాగ అల్లుకుని పోయింది. జన గామ తాలుకా నల్గొండ జిల్లాలో ఉండేది. 50 గ్రామాలలో విసునూర్ దేశ్‌ముఖ్‌ల పరిపాలన సాగుతుంది. విసునూర్ దొరల దోపిడి కింద నలిగిపోతున్న ప్రజానీకమంతా ఆంధ్ర మహాసభలో స్వచ్ఛందంగా చేరి నారు. కడివెండి సీతారాంపురం నిర్మాల గ్రామాల్లో గ్రామ రాజ్య కమిటీ లను ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. కడి వెండిలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కమ్యూనిస్టులు గ్రామాలలో పోరాటం ఉదృతం చేయడంతో భూస్వామ్య దొరల గుండెల్లో వణుకు పుట్టింది. విసునూర్ దేశ్‌ముఖులు కడివెండిలో స్వాధీన పర్చుకున్న 250 ఎకరాల భూమిని ఒకే రోజు పది గ్రామాల ప్రజలు పశువులు, గొర్రెలు, మేకలతో మేపుకున్నారు. సంఘటిత బలాన్ని చూపించారు. పాలకుర్తి కుట్ర కేసులో 12 మందిని అరెస్ట్ చేశారు. భూస్వాములు, పోలీసులు మిలాఖతై 35 గ్రామాల ఆంధ్ర మహాసభ కార్యకర్తలపై దాదాపుగా వెయ్యిమంది కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు. కల్లు దొంగలించినారని స్త్రీలను అవమాన పరిచినారని, దొరల ఆయిల్ ఇంజిన్లు దొంగలించినారని రకరకాల కేసులు సృష్టించారు. ఈ కేసులన్నింటినీ న్యాయస్థానం ఒక సంవత్సరపు కాలంలో కొట్టివేసింది.
చాకలి ఐలమ్మ నాలుగు ఎకరాల పంట చేసుకుంటుంది. విసునూర్ రామచంద్రారెడ్డి దాడి చేయించుటకు పథకం పన్నాడు. ఐలమ్మ భర్త నర్సింహా, కొడుకులయిన లచ్చయ్య, సోమయ్యలను పాలకుర్తి కుట్రకేసులో అరెస్ట్ చేసి జైలులో నిర్బంధించారు. కడివెండి గ్రామం విసునూర్ దేశ్‌ముఖ్ తల్లి నివసించే ప్రదేశం. తల్లి పెత్తనం కింద గ్రామం నలిగిపోతుంది. దీంతో వేలాది ప్రజానీకమంతా చైతన్యమై గడీలోనే రౌడీలను బంధించారు.
గడిలో వుండే రౌడీలు తుపాకులను గాలిలోకి పేల్చారు. ప్రజా నీకం చేతుల్లో వడిశెలలు, రాళ్లు, కర్రలు, కారపు పొట్లాలు ఉండేవి. వీటితోనే నైజాం దొర భూస్వాములను తరిమి తరిమి కొట్టారు. రౌడీలు పేల్చిన తుపాకి గుండ్లు మంగలి కొండయ్య, కొంగళ్ళ సాయిలు బండారి అయిలయ్య పెద్దగాల్ల నరస్సయ్యకు తగిలాయి. మరి కొంతమంది కింద పడిపోయినారు. దీనిలో దొడ్డి కొమరయ్య వీరమరణం పొందాడు. దొడ్డి కొమరయ్య హత్యకు ప్రతీకారంగా చుట్టుపక్కల గ్రామాల 5వేల ప్రజలు కర్రలు వడిశెలతో కారంపొడి పొట్లాలతో కడివెండి చేరుకున్నారు. పాలకుర్తి, ధర్మాపురం కడివెండి గ్రామాలలో జరిగిన పోరాటాలు చరిత్రాత్మకమయినవి. విసునూరు దేశ్‌ముఖ్‌లకు చెందిన 150 ఎకరాల భూమిని పేదలకు పంపిణి చేశారు కమ్యూనిస్టులు. విసునూర్ చిన్న కొడుకు దేవరుప్పల గ్రామానికి చెందిన 11 మందిని దారుణంగా హత్య చేయించాడు. దీంతో ఆందోళనకు గురయిన దేవ రుప్పుల గ్రామ ప్రజలు పోరులోకి దిగారు. రెండు వేలమందిని చెల్లా చెదురుచేసి మందడి సోమిరెడ్డిని దారుణంగా పోలీసులు కాల్చి చంపా రు. మరో 40 మందిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధిం చారు. రేణికుంట గ్రామంలో మిలటరీ క్యాంపు ఏకపక్షంగా కాల్పులు జరిపి రేణికుంట రామిరెడ్డితో పాటు మరో 75 మందిని కాల్చి చంపి గడ్డి వాములలో మృతదేహాలను తగులబెట్టినారు. బైరాన్‌పల్లిలో అల్లరి మూకలు స్త్రీలను బట్టలు ఊడదీసి బతుకమ్మలు ఆడించారు. 6 మంది ని దారుణంగా కాల్చి చంపారు. భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర దేశంగా ప్రకటించబడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో సంస్థానాలన్నీ (రెండు మినహా) ఇండియన్ యూనియన్‌లో చేరిపోయినవి. హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర దేశమయిన ఇండియన్ యూనియన్‌లో చేరదని నిజాం నవాబు బహిరంగ ప్రకటన చేశారు.
గెరిల్లా శిక్షణ:
కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు ఆంధ్రప్రాంతంలో గెరిల్లా శిక్షణ నిచ్చారు. గెరిల్లా పోరాటాలతో ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపిం చారు. గ్రామ గ్రామాన రక్షణ దళాల నిర్మాణం జరిగింది. కమ్యూని స్టులు ఏ పిలుపునిచ్చిన అది పూర్తిగా విజయవంతమయింది. కురారం రామిరెడ్డి నాయకత్వంలో వాసాలమర్రి శత్రు క్యాంపుపై దాడి చేసి నైజాం అల్లరి మూకల నుంచి అమెరికాన్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకు న్నారు. వంగపల్లి రైల్వేస్టేషన్‌లో రైఫిల్స్‌లో కూడిన ఒక రిజర్వు ఉం డేది. రిజర్వు దళంలో ముగ్గురిలో ఒకరు 303 రైఫిల్‌తో తక్కిన ఇద్దరు 12 బోర్‌గన్స్‌తో వుండేవారు. ఆ ఆయుధాల సేకరణకు కామ్రేడ్స్ కురా రం రామిరెడ్డి బొందుగుల నారాయణరెడ్డి గంటం వెంకటరెడ్డి నాయ కత్వంలో 12 మందితో కూడిన గెరిల్లా దళం వంగపల్లి వెళ్లింది. అయ్యగారి వేషాలతో వున్న దళనేతలు గదిలోకి ప్రవేశించి 303 రైఫిల్స్ ను, 12 బోర్స్ రెండు తుపాకులను తీసుకొని స్వాధీనపర్చుకుని బయటపడినారు. రాజపేట మండలంలోని రేణికుంట గ్రామం పాడి పంటలకు పుట్టినిల్లువంటిది. రజాకర్లను తుదిమట్టిస్తానని ప్రజలకు అండగా ఉంటానని రేణికుంట రామిరెడ్డి శపథం చేసినాడు. రేణి కుంటలో 55 మందితో లోకల్ గెరిల్లా దళాన్ని నిర్మించుకున్నాడు. నైజాం రిజర్వుమూకలను ఎదురించాడు. నైజాం అల్లరి మూకలు రేణి కుంట గ్రామాన్ని చుట్టుముట్టాయి. రేణికుంట రామిరెడ్డి బంగ్లాపైకి ఎక్కి శత్రువుదాడులను ఎదురించాడు. ఆ తరువాత, రాంరెడ్డి బంగ్లా సమీపంలో గల చింత చెట్టు పైకి ఎక్కి ఎదుర్కొంటుండగా రిజర్వు పోలీసులు గురిపెట్టి కాల్చారు. అనంతరం రిజర్వు పోలీసులు దళ సభ్యులను కిందికి దింపించి లైన్లో నిబెట్టి ముగ్గురిని స్టెన్‌గన్‌తో కాల్చిచంపారు. ఊరికి నిప్పు అంటించి గ్రామాన్ని దహనం చేశారు. 60 మందిని గ్రామస్థులను అక్రమంగా అరెస్ట్ చేసినారు. ఎంతోమంది క్షేత్రగాత్రులయినారు. మరెంతో మంది బాధితులుగా మిగిలారు. గెరిల్లా దళాలు వచ్చి తిండిగింజలు, కట్టుకునేందుకు బట్టలు, నిత్యావసర వస్తువుల్ని అందించారు. కమ్యూనిస్టులు కాలినడకతో గ్రామ రక్షక్ దళా లను ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలిచారు. చివరకు రజాకార్లు తెలంగాణను వదిలి పాకిస్తాన్‌కు పారిపోయారు. కాశిం రజ్వీ లాంటి నరహంతుకుడితో భూమికోసం, భూ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం మెజ్వలమైనది. తెలంగాణ త్యాగాల చిరు నామాగా ప్రపంచచరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించబడింది. తెలంగాణ అంటే అది ఒక యుద్ధభూమి. తెలంగాణ ఒక గాయాలవీణ. తెలం గాణ అంటే బతుకు పోరాటం. త్యాగాల చరిత్ర తెలంగాణకే సొంతం.
జైలు పోరాటాలు:
నైజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినందుకు వేలాదిమంది ప్రజలు ఉద్యమకారులపై కమ్యూనిస్టులను జైలులో నిర్బంధించినారు. జైలులో ఒకరినొకరిని మాట్లాకునిచ్చేవారు కాదు. కమ్యూనిస్టు అగ్ర నా యకులు, గెరిల్లా దళనాయకులు, ఆనాటి మిలటరీ ప్రభుత్వ దృష్టిలో వుండేవారినంతా తిరుమలగిరి జైలుకు తీసుకుని వచ్చేవారు. ఆరుట్ల రాంచంద్రారెడ్డి ఎడ్ల గురువారెడ్డి ఆరుట్ల లక్ష్మీ నర్సింహ్మరెడ్డి అందరిని ఒకే జైలులో నిర్బంధించారు. సిరిసిల్లా జైలులో బద్దం ఎల్లారెడ్డిని నిర్బంధించారు. ఒక్కొక్క జైలులో ఇరవైఐదు వందల మంది కమ్యూ నిస్టులను బంధించారు. జైలులో ఎలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. కూర్చోడానికి చాపలు కూడా ఇవ్వలేకపోయారు. ముంతడు నీళ్లు అందించేవారు. ఈ నీళ్లతో దూప తీరేది కాదు. ముడి జొన్నలు ఇచ్చేవారు. ఆ జొన్నలు ఉడకబెట్టి ఆకలి మంటలతో బుక్కితే ఆ జొన్నలు జీర్ణం గాక జొన్నలకు జొన్నలే బయలు భూమిలో పడిపోయేవి. ఆరోగ్యాలు పూర్తిగా చెడిపోయినవి. స్నానాలు చేయుటకు గదులు లేవు. జైళ్లలో ఖైదీల బాధలు అన్ని ఇన్ని కావు. రాజకీయ ఖైదీల పట్ల జైలు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించినట్లయితే జైలులో ఉద్యమాలు నిర్మిస్తామని జైలు అధికారులకు అర్జి పెట్టుకున్నారు. జైలులో ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఖైదీల హక్కులు సాధించారు. జైళ్ళలో ఉన్న రాజకీయ ఖైదీలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు రాత్రి గంటల నుంచి 10 గంటల వరకు పుస్తకాలు చదివేవారు. జైలులో కమిటీలను ఏర్పాటు చేసుకొని జైళ్లను పోరాటాలకు వేదికగా మలుచు కుని ఖైదీల హక్కులను సాధించారు.
రాజకీయ తరగతుల నిర్వహణ విద్యాకమిటీ నిర్మాణం
వంటశాల నిర్వహణ కమిటీ, జైలు కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు చేసినారు. జైలు బ్యారక్‌లలో రాజకీయ ఖైదీలు గోడలపై నినాదాలను రాస్తే, ప్రపంచ పటాలనువేస్తే వాటిని సున్నం వేయించి తుడిచివేసేవారు. జైలు జైలుగా కాకుండా పోరు పాఠశాలగా మలచు కున్నారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. వందలాది మంది తో జైల్లు కిటకిటలాడినవి. అన్నీ తప్పుడు కేసులే. న్యాయస్థానాల ఎదుట ఏ ఒక్కటి నిరూపితం కాలేదు. చివరకు న్యాయస్థానాలు కొట్టివేసినవి. విద్యావిహీనులకు మట్టి చిప్పలపై చదువు నేర్పించారు. ఆరుట్ల కమలా దేవిని నెలల తతరబడి జైలులోనిర్బంధించారు. ప్రభుత్వ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జైలులో ఉద్యమాలను బలోపేతం చేశారు. ప్రజాకవి మఖ్దూం మొహిద్దీన్ బహిరంగంగా వచ్చి ఉపన్యాసాలు చేశా రు. నైజాం హయాంలో జైళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేవి. రాజకీయ ఖైదీలు పోరాటాల ద్వారా హక్కులను సాధించారు.
భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం నిజాం నిరంకుశ ప్రభుత్వంపై సాగిన సాయుధ పోరాటం ఆ తరువాత మరెన్నో పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది. నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కూడా బీజాలు అందులోనే ఉన్నాయి. ప్రపంచ విప్లవ చరిత్రలో తెలంగాణ చిత్రపటం లిఖించబడింది. నమ్మిన ఆశయ సిద్ధాంతానికి కట్టుబడి తుదిశ్వాస విడిచేంతవరకు పోరాటాల దారిలో నేలరాలిన వారెందరో ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగువేల మందికి పైగా రైతాంగ వీరులు ప్రజా యుద్ధంలో అమరులైనారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది అమరులు చిందించిన రక్తమే నేడు తెలంగాణ రాష్ర్ట ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.
Tuesday, 27 May 2014
రాణి రుద్రమదేవి చరిత్ర
భరతఖండం చరిత్ర గర్భంలో ఎన్నో కోణాలు, దృక్కోణాలు. తరచి చూడాలన్న తపన ఉండాలే కానీ చరిత్రపుటల్లో ఎన్నో అద్భుతాలు, సాహస గాథలు కళ్ళముందు సాక్షాత్కరిస్తాయి, ఆవిష్కృతమవుతాయి. క్రీస్తుకు పూర్వం నుంచే అనూహ్యమైన, సువిశాల రాజ్యాలు, సామ్రాజ్యాలు అనేకం అవిర్భవించాయి. రాజుల పాలనలో ప్రముఖంగా కన్పించేవి కుట్రలు, కుతంత్రాలు, పోరాటాలు, యుద్ధాలు. ప్రవహించేవి సామాన్యుల రక్తపుటేర్లు. వినిపించేవి ప్రజల అరణ్యరోధనలు, హాహాకారాలు.
అయితే ఆ కాలంలో కూడా దట్టంగా అలుముకున్న కారు చీకట్ల లోనూ అరుదుగానైనా కొన్ని కాంతి పుంజాలున్నాయి. సుపరిపాలనను అందించిన మహారాజులూ, మహా రాణులూ ఉన్నారు. శత్రు దుర్భేద్యమైన సైన్యాలు నిర్మించి, సుభిక్షమైన స్వర్ణయుగాలు స్ధాపించిన చక్రవర్తులూ, ప్రభువులూ ఉన్నారు. ఒక్కసారి గంతంలోకి తొంగిచూస్తే భరత ఖండాన్ని ఎన్నో రాజ వంశాలు, ఎందరో సామ్రాట్ లు, ఎందరో రాజాధి రాజులు ఎందరో మహా రాజులు పాలించినట్టు మనకు అవగతమవుతుంది. ఒక్కో వంశంలో అనేక మంది రాజులు, రారాజులు. ఒక్కొక్కరిది ఒక్కో విశిష్టమైన, వైవిధ్యమైన పాలన. ఒకరు ప్రజలను నానా హింసలకు గురిచేసి నరహంతలై పీక్కుతింటే మరొకరు అదే ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నారు. ఒకరు తమ మతం తప్ప పర మతాలు పనికి రావని మత మార్పిళ్ళకి పాల్పడి సామాజిక, సాంస్కృతిక బీభత్సం సృష్టిస్తే, మరి కొందరు సర్వమతాల సారం ఒకటేనని చాటారు. మత సహనాన్ని బోధించారు, పాటించారు. కొందరు రాజులు కరకు కత్తులతోనే పాలన సాగించారు. కానీ మరికొందరు మాత్రం శాంతి, ప్రేమ, పూదోటలు వేశారు. కొందరు రాజులు ప్రజలను కేవలం పన్నులు చెల్లించేవారుగా, బానిసలుగా చూశారు. కానీ మరికొందరు మాత్రం ప్రజా సంక్షేమమే ఊపిరిగా బతికారు. ఆధునిక పాలకులకు సైతం ఆదర్శప్రాయమయ్యారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. యావత్ తెలుగునాడును ఏకం చేసి, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుభిక్ష పాలనను అందించిన కాకతీయవంశ గజకేసరి, సామ్రాజ్ఞి..రాణీ రుద్రమదేవి.
జనరంజక పాలన..
రుద్రమదేవి పాలన ప్రజారంజకమై భాసిల్లింది. శాంతి, సుస్థిరతలతో విరాజిల్లింది. దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ క్రితమే ఆమె సమాజంలో బలంగా వేళ్ళూనిన పురుషాధిక్యంపై సవాలు విసిరింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అన్న పురుషాధిక్యం తలలు వంచింది, అందరి నోళ్లు మూయించింది.
కాకతీయుల పాలనా కాలం..
తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాలతో పాటు ఇప్పటి కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలోని చాలా భాగాలు రుద్రమ సామ్రాజ్యంలో అంతర్భాగాలయ్యాయి. బలవంతులదే రాజ్యమన్న మధ్యయుగాల్లోనే ఈమె దక్షిణాపథంలో సువిశాల మహాసామ్రాజ్యాన్ని నెలకొల్పింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం. రాణీరుద్రమ తనదైన శైలిలో, అరుదైన రీతిలో పాలన సాగించింది. ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఆమె అర్థం చేసుకున్నట్టుగా ఏ ఇతర రాజలూ అర్థం చేసుకోలేదు. ఆమె సాహసానికీ, ధీరత్వానికీ, తెగువకూ, పాలనా దక్షతకూ మారుపేరుగా నిలిచింది. తెలుగు మహిళ పాలనా పటిమను- తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది. అందుకే ఇప్పటికీ రాణీ రుద్రమ పేరు వింటేనే తెలుగు వారి ఒళ్ళు గగురుపొడుస్తుంది. తెలుగు జాతి రోమాంచితమవుతుంది.
శత్రువుల పాలిట సింహస్వప్నం..
అసమాన పరాక్రమశాలి రాణీ రుద్రమదేవి. ఆమె కాకతీయ పాలకుల వైభవానికి సమున్నత కేతనమై నిలిచింది. రుద్రమ్మ తన భుజ శక్తి, ధీయుక్తితో శత్రువుల పాలిట సింహ ప్వప్నమైంది. ఆనాడే స్త్రీ సాధికారతను అమలు చేసిన మహారాణి ఆమె. అంతశ్శత్రువుల, బైటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షణాన తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన ఛత్తీస్ గఢ్ బస్తర్ సీమ వరుకు, పడమరన బెడదనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గంజాం.. అంటే అస్సాం వరకు కాకతీయ సామ్రాజ్యం విస్తరింపజేసింది.
మూల పురుషుడు కాకర్త్య గుండ్యన..
క్రీ.శ. 1083 నుంచి 1323 వరకు దాదాపు 250 ఏళ్ళపాటు తెలుగు నేలనేలింది కాకతీయ వంశం. వీరికాలంలోనే తెలుగునాడంతా ఒకే తాటిమీదకు వచ్చింది. వీరి కాలంలోనే త్రిలింగ, ఆంధ్ర పదాలకు ఒక అర్థం, పరమార్థం ఏర్పడ్డాయి. దేశపరంగా, జాతిపరంగా కూడా ఎంతో ప్రచారంలోకి వచ్చాయి. ఈ వంశానికి మూలపురుషుడు కాకర్త్య గుండ్యనుడు.
ఈ వంశంలో సప్తమ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, పుత్ర సంతానం లేదు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు తలొగ్గిన ఆయన, రెండవ కుమార్తె రుద్రమదేవినే కుమారుడిగా పెంచాడు, అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతిదేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినపుడు ఆమె వయసు పధ్నాలుగేళ్ళే. అప్పటి నుంచి ఆమె తండ్రి చాటు బిడ్డగా దాదాపు పాతికేళ్ళ పాటు పాలన సాగించింది. ఆమె ఆడపిల్లన్న నిజాన్ని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారు. అనంతరం రుద్రమదేవి చక్రవర్తిగా 1262 నుంచి 1289 వరకు అంటే ఇరవైఏడేళ్ళ పాటు అప్రతిహతంగా పాలన సాగించింది. సువిశాలమైన భూభాగాన్ని ఒక మహిళగా అసమాన ధైర్యసాహసాలతో ఎంతో సమర్థవంతంగా పరిపాలించడం వల్ల ఈ కాలం తెలుగువారి చరిత్రలో ఒక సువర్ణధ్యాయంగా నిలిచిపోయింది.
ప్రతికూల పరిస్థితులను అధిగమించి..
రుద్రమదేవి పాలనాకాలమంతా యుద్ధాలతోనే గడిచింది. తొలుత స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్నిసహించలేని సామంతులనుంచి, దాయాదులనుంచి ఆమెకు తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. తండ్రి గణపతి దేవుని కాలంలో సామంతులుగా ఉన్న రాజులు రుద్రమ సింహాసనం అధిష్టించగానే ఎదురుతిరిగారు. తిరుగుబాట్లు లేవదీశారు. అయితే ఈ విపత్తులన్నింటినీ ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంది. అదే సమయంలో దేవగిరి యాదవ మహదేవుడు ఎనిమిది లక్షల మహాసైన్యంతో రుద్రమ పైకి దండెత్తి వచ్చాడు. మహదేవునిపై పది రోజులకు పైగా జరిగిన భీకర పోరాటంలో రుద్రమ ప్రత్యక్షంగా పాల్గొన్నది. తన అపార శక్తి సామర్థ్యాలతో అపరభద్రకాళిలా విజృంభించింది. ఆమె తన చిరకాల ప్రత్యర్థి మహదేవుడ్ని ఆ యుద్ధంలో మట్టికరిపించి మూడు కోట్ల బంగారు వరహాలను పరిహారంగా గ్రహించింది. ఆ విధంగా శత్రువును ఆర్థికంగా చావు దెబ్బకొట్టి మళ్ళీ తలెత్తకుండా చేసింది. తరువాత 1262 సంవత్సరంలో తూర్పున గంగ నరసింహదేవుడు వేంగి ప్రాంతాన్ని ఆక్రమించాడు. కాని రుద్రమ సేనా నాయకులైన పోతినాయకుడు, ప్రోలినాయకుడు వీరిని ఓడించి తిరిగి అక్కడ కాకతీయుల అధికారం నెలకొల్పారు.
రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. రుద్రదేవుడి రూపంలో ఉన్న రుద్రమ పట్టోధృతి అంటే రాజప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేశమంతా కలియ దిరిగింది. ప్రజాసమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుంది. యువరాజుగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించింది. రాజ్యంలో ఒక చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడం చూసి రుద్రమ తల్లడిల్లింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ''మహామంత్రీ.. గ్రామగ్రామాన ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇక పై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు.'' అని ప్రకటించింది.
మార్కోపోలో ప్రశంస..
ఇటలీ దేశ రాయబారి మార్కో పోలో 1293 సంవత్సరంలో కాకతీయ రాజ్యంగుండా ప్రయాణించి గోల్కొండను సందర్శించాడు. గోల్కొండ ఆ కాలంలో కాకతీయులకు సైనిక కేంద్రంగా ఉండేది. మార్కో పోలో రుద్రమదేవిని అత్యంత సమర్థురాలైన, పాలనాదక్షతగల చక్రవర్తిగా అభివర్ణించాడు.
ప్రజాసేవలో..
రుద్రమదేవి పాలన గురుంచి, ఆనాటి కాలమాన విశేషాల గురించి తెలిపే సరైన చారిత్రక ఆధారాలు గానీ, శిలా శాసనాలు గానీ పెద్దగా లేవు. రెండున్నర శతాబ్దాలపాటు నిర్విఘ్నంగా సాగిన కాకతీయుల పాలనపై సమగ్ర పరిశోధనలు జరగాల్సి ఉంది. రుద్రమదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. వేలాది ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువులను ఆ రోజుల్లో సముద్రాలుగా వ్యవహరించేవారు. వీరి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా విస్తరించింది, విరాజిల్లిది.
తిక్కనామాత్యుడు..
మనుమసిద్ధి ఆస్థాన మహాకవి, కవిత్రయంలో ఒకరైన తిక్కనామాత్యుడు తమ రాజ్యం శత్రువుల వశం కావడంతో తమ ప్రభువుల రాయబారిగా రుద్రమను ఆశ్రయించాడు.
కట్టడాలకు, కళలకు నిలయం..
శత్రుదుర్భేద్యమైన ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి, పాలంపేటలోని రామప్ప గుడి, భద్రకాళి ఆలయం, ఘణపురం కోటగుళ్ళు కాకతీయుల శిల్పకళా పోషణకు, నైపుణ్యానికి చక్కని తార్కాణం. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు ధీటైన పేరిణి శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుబోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జయాప సేనాని పేరిణి నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో సంగీతం, సాహిత్యం, శిల్పకళ, నృత్యం కలగలసిపోయి విరాజిల్లాయి.
వీరభద్రునితో వివాహం..
పధ్నాలుగవ యేటనే పాలనా పగ్గాలు చేపట్టిన రుద్రమకు ఇరవై ఐదవ యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రేశ్వరుడితో వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్ళు ముమ్మడమ్మ, రుద్రమ్మ కలిగారు. ఈమెకు మరో పెంపుడు కూతురు రుయ్యమ్మ కూడా ఉంది. తనకు మగ సంతానం లేక పోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది.
సర్వవర్గ సమానత్వం..
ప్రజల సాంస్కృతిక జీవనంపై పట్టు లేకపోతే పాలన దుర్లభమవుతుందని గ్రహించిన మేధావి, రాజనీతిజ్ఞురాలు రుద్రమ. అందుకే ఆమె రాజ్యంలో జాతరలకు, పండుగలకు, ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. శైవ-జైన మతాల మధ్య అమోఘమైన సఖ్యత సమకూర్చిన అసలు సిసలైన లౌకిక పాలకురాలు రుద్రుదేవి. అలాగే ఆమె తన ముగ్గురు కూతుళ్ళను వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన రాజులకిచ్చి వివాహం జరిపి సర్వ వర్గ సమానత్వాన్ని చాటింది. రాజనీతిజ్ఞతను ప్రదర్శించింది.
అంబదేవుని దొంగదెబ్బ..
అనేకసార్లు ఓటమి పాలైన వల్లూరు నేలే అంబదేవుడు రుద్రమదేవి పై కక్షగట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరించాడు. అదనుకోసం చూస్తున్న సామంతుడైన అంబదేవుడికి సమయం కలసి వచ్చింది. రుద్రమ రాజ్యంపైకి పాండ్యులు, చోళులు, ఇతర సామంతులు ముప్పేట దాడికి దిగారు. దాన్ని అదనుగా తీసుకున్న అంబదేవుడు కుట్రలు, కుతంత్రాలతో ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. రుద్రమకు అండగా నిలవాల్సిన తమ సేనలను రుద్రమపైకే ఎక్కుపెట్టాడు.
అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయింది. అంబదేవుడికి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. కత్తిపట్టి స్వయంగా కదన రంగాన దూకింది. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్ళ పైచిలుకే. ఇరు పక్షాల మధ్య దాదాపు రెండు వారాలకు పైగా భీకర పోరాటం సాగింది. ఆ వయసులోనూ రుద్రమను అంబదేవుడు ఓడించలేక పోయాడు. యుద్ధంలో రుద్రమను నేరుగా ఎదుర్కోలేని అంబదేవుడు కపట మాయోపాయం పన్నాడు.
ఆ రోజు రాత్రి వేళ యుద్ధక్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా పరమ భక్తురాలైన రుద్రమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమై ఉంది. పూజారుల స్థానంలో తమ వాళ్ళను పంపిన అంబదేవుడు తన దుష్టపథకాన్ని అమలు పర్చాడు. పూజలో ఉన్న రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచారు. రుద్రమదేవి ఎప్పుడు చనిపోయిందో నల్లగొండ చెందుపట్ల శాసనంలో ఉంది. అయితే రుద్రమ మనవడు ప్రతాపరుద్రుడు అమ్మమ్మ శపథం నెవేర్చాడు.ద్రోహి అంబదేవుడిని హతమార్చాడు. తెలుగువారే కాదు జాతి యావత్తూ గర్విందగ్గ అసమాన పాలనాదక్షురాలు రుద్రమ. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీక. స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాక. అసమాన పరాక్రమశాలి రాణీ రుద్రమదేవి.
ఎన్టీఆర్ 91వ జయంతి
ఎన్టీఆర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపుగా 302 చిత్రాల్లో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా ఎన్టీఆర్ అనేక చిత్రాలు నిర్మించారు. మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో మాత్రం శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడంలో ఆయనకుఆయనేసాటి. రామునిగా అవతారమెత్తినా, శ్రీకృష్ణునిగా లీలావినోదం అందించినా, విశ్వామిత్రునిగా సరికొత్త సృష్టి చేసినా ఎన్టీఆర్‌కే చెల్లింది. ఎల్వీ ప్రసాద్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఫోటోను చూసిన ప్రముఖ నిర్మాత బి.ఎ. సుబ్బారావు వెంటనే ఎన్టీఆర్‌ను మద్రాసుకు పిలిపించారు. పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకునిగా ఎంపికచేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలుకాలేదు. ఈలోగా మనదేశం సినిమాలో నటించారు. దీంతో మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా `మనదేశం’ అయింది. 1949లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. 1950లో `పల్లెటూరి పిల్ల’ విడుదలైంది. అదే సంవత్సరంలోనే `షావుకారు’ కూడా రిలీజైంది. సినీరంగంలో నిలదొక్కుకోగానే మద్రాసుకు మకాం మార్చేశారు. THOUSAND LIGHTS ప్రాంతంలో ఓ చిన్న రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవారు.
1951లో పాతాళభైరవి, అదే సంవత్సరం బీఎన్‌రెడ్డి తీసిన మల్లీశ్వరి చిత్రాలు సూపర్‌హిట్. 50దశకంలో రిలీజ్ అయిన `పెళ్లిచేసిచూడు’ చిత్రం ప్రేక్షకాదరణపొందింది. విజయావారి సినిమాల్లో నెలకు 500 రూపాయల జీతం, 500 రూపాయల పారితోషికంతో పనిచేశారు. పాతాళభైరవి అప్పట్లో 34 కేంద్రాల్లో వందరోజులు ఆడి ఆడి విజయఢంకా మ్రోగించింది. ఆ సినిమాలో ఉంగరాల జుట్టు… స్ఫూరధ్రూపి, అమాయక యువకునిగా అఖిలాంద్ర ప్రేక్షకుల మన్ననలు ఎన్టీఆర్ అందుకున్నారు. `సాహసం చేయిరా డింభకా…’ అన్నట్టుగానే ఎన్టీఆర్ అప్పటి నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనేక సాహసాలు చేస్తూ అంచెలంచెలుగా తన విరాట్ రూపాన్ని ఆవిష్కరించారు.
1956లో మాయాబజార్ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం ఏడువేల ఐదు వందల రూపాయలు. ఇదే అప్పట్లో అత్యధిక పారితోషికంగా చెప్పుకునేవారు. 1959లో ఎవీఎంవారి భూకైలాస్ చిత్రంలో రావణబ్రహ్మగా అత్యధ్బుతమైన నటనను ప్రదర్శించారు.
శ్రీమద్విరాటపర్వంలో ఐదు పాత్రలు పోషించి అబ్బురపరిచారు. ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు, యమగోల వంటి చిత్రాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
క్రమశిక్షణకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. నటన అంటే ఆయనకు ప్రాణం. అందుకోసం కఠోర శిక్షణ పొందేవారు. అంతేస్థాయిలో శ్రమించేవారు. నర్తనశాల సినిమా కోసం వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. డైలాగ్‌లు కంఠతాపట్టేశాకే కెమేరా ముందు నిలబడేవారు. అంతేకాదు పాత్రలో పూర్తిగా లీనమవడం వల్ల డైలాగ్‌లు అప్పజెపుతున్నట్టుగా ఎక్కడా ఉండేదికాదు.
సినిమాల్లో విశ్వరూపాన్ని ప్రదర్శించిన నందమూరి తారకరామారావు అంతే స్థాయిలో రాజకీయాల్లో కూడా విరాట్ రూపం ప్రదర్శించి రాష్ట్ర రాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా…అంటూ ఎలుగెత్తి పిలుస్తూ పాలిటిక్స్‌లో కొత్త ఒరవడి సృష్టించారు. ప్రజాసేవలో పునీతులయ్యారు.
1982 మార్చి 29 మధ్యాహ్నం రెండు గంటల ముప్పయినిముషాలకు ఎన్టీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ శుభముహుర్తంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ నాయకునిగా కూడా ప్రజలకు మరింత చేరువయ్యారు. తన దగ్గర ఉన్న పాత వ్యాన్‌ను బాగుచేయించి ప్రచార రథాన్ని తయారుచేయించారు. ఖాకీ దుస్తులు ధరించి కోట్లాది ఆంధ్రుల్లో తానూ ఒకనిగా కలిసిపోయారు. `తెలుగుదేశం పిలుస్తోంది రా… కదలిరా..’ అంటూ నినదించారు. ఇప్పుడు ఊరూవాడ తిరుగుతున్న అనేక రాజకీయ రథాలకు స్ఫూర్తి ఈ చైతన్య రథమే. ఆయన చేసిన ప్రసంగాలు ఉద్వేగభరితంగాసాగేవి.
ముప్పైమూడేళ్ల తెర జీవితంలోనూ, పదమూడేళ్ల రాజకీయ జీవితంలోనూ స్టార్‌గా వెలుగొందిన ఎన్టీఆర్ 73 ఏళ్ల వయసులో 1996 జనవరి 18న గుండెపోటుతో మరణించారు.
బాల్యం ఓ కమ్మని కావ్యం
ఎన్టీఆర్ బాల్యం కూడా ఓ కమ్మని కావ్యంలా సాగింది. కాలేజీ కుర్రాడిగా ఉన్నరోజుల్లోనే మీసాల నాగమ్మగా కొత్త రూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సాహసి. అప్పటి నుంచి ఎన్నో నాటకాల్లో నటించారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులంటే ఏమిటో రుచిచూశారు. అయినా కళామతల్లిని మాత్రం విడవలేదు.
నందమూరి తారకరామారావు 1923 మే 28 సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో జన్మించారు. కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకటరామమ్మ దంపతులకు పుట్టిన ముద్దుల బిడ్డడు ఎన్టీఆర్. పండంటి బిడ్డడికి ముందుగా కృష్ణ అని పేరుపెట్టాలని కన్నతల్లి అనుకున్నారు. మేనమామ సలహా మేరకు తారక రాముడు పేరు ఖరారు చేశారు. తరువాత ఆ పేరు తారక రామారావుగా మారింది. విజయవాడ మున్సిపల్ స్కూల్‌లో చదువుకున్న తరువాత అక్కడే ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో చేరారు. రామారావు ఆ కాలేజీలో చేరే సమయంలో విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు. అప్పుడే రామారావును నాటకంలో నాగమ్మ పాత్ర పోషించమని విశ్వనాథవారు కోరారు. అయితే మీసాలు తీయడానికి ఎన్టీఆర్ ఇష్టపడలేదు. దీంతో మీసాలతోనే ఆ నాటకంలో నటించారు. మీసాల నాగమ్మగా పేరు తెచ్చుకున్నారు.
1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో తన మేనమామ కుమార్తె బసవరామ తారకంను ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అక్కడే నాటక సంఘాల వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్.శర్మ వంటివారితో కలిసి ఎన్నో నాటకాల్లో నటించారు. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. ఆయన గీసిన చిత్రానికి రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో బహుమతి కూడా అందుకున్నారు. ఒక సారి సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు ఆయన చిత్రాన్ని గీసి కానుకగా ఇచ్చాడు. రామారావు కాలేజీలో చదివేరోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో జీవనం కోసం కొన్ని రోజులు పాలవ్యాపారం చేశారు. మరి కొన్ని రోజులు కిరాణాకొట్టు నడిపారు. ఇకొన్ని రోజులు ముద్రణాలయం నడిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏనాడు అప్పుజేసేవారు కారు. ఆ తరువాత సబ్‌రిజిస్టార్ ఉద్యోగం వచ్చినా సినిమాలమీద ఉన్న మోజుతో ఎక్కువకాలం జాబ్ చేయలేకపోయారు. సినిమాల్లో చేరాక ఇక వెనుదిరిగి చూసుకోలేదు. విజయోత్సాహంతో ముందుకే ఉరికారు.
సినీరంగంలోనూ, రాజకీయ జీవితంలోనూ రారాజుగా వెలుగొందిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. తాను అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు విశ్రమించని కార్యోన్ముఖుడు ఎన్టీఆర్. కాలం పరుగులుతీస్తున్నా నేటికీ కళ్లముందు కనిపించే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. తెలుగువారి గుండెల్లో ఆరని జ్యోతి ఎన్టీఆర్. మరచిపోని మధురస్మృతులే ఆయనకు మనం అందించే నీరాజనం.
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం'
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం' మన భారతదేశంలో లేదని ..! అది 'కాంభోజ దేశం' లో వుందని ..? ఆదేశం ఎక్కడ వుందో ..! దాని పూర్తి “కధ – కమామీషు”లు .. ఇదిగో ..ఇక్కడ చదవండి..! ఆ దేవాలయ ఫోటోలు ..చూసి హిందూ ధర్మ/మతం గొప్పదని తెలుసుకొని .. గర్వపడుదాం..!!
Angkor Wat (లేదా Angkor Vat) ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లేదా కాంబోడియా (ప్రాచీన నామం 'కంపూచియా') లోని అంగ్ కోర్ వద్ద 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II నిర్మించారు. ఇది 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం'. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం.

భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా? అసలు విషయానికొస్తే ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో 'కాంభోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంభోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజ దేశం కాలక్రమంలో కంపూచియాగా మారిపోయింది.

ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం కంపూచియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీ.శ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.
భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి....
Monday, 26 May 2014
గ్రహాల ద్వారా కలిగే అనారోగ్యాల నివారణ ...
గ్రహాల దుష్టకిరణాల ద్వారా వ్యక్తిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు గ్రహాల మంచి కిరణాల ద్వా రా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి అనేది జ్యోతిర్వైద్య సిద్ధాం తం. వ్యక్తి తగిన ఆహారాన్ని తీసుకోవాలి అని భగవద్గీత వచనం. ఆయుర్వేద సిద్ధాంతం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం ఉపనిషోద్ఘోష. .ఈ తగిన అనే పదం చాలా విలువ కలిగి ఉంది. వేదాంతపరంగా మితమైన సాత్వికాహారం ఆయుర్వేదపరంగా వ్యక్తి శరీరానికి తగిన పౌష్టికాహారం అనే అర్థాలు చెప్పినా జ్యోతిర్వైద్యపరంగా వ్యక్తి దశకు గ్రహమిచ్చిన లోపాన్ని పూరించే ఆహారమని చెప్పాల్సి ఉంది. ఈ కోణంలో ఆలోచన చేసినప్పుడు జ్యోతిర్వైద్యం ఆయుర్వేదం కంటే భిన్నమైన సమగ్రతను, ప్రత్యేకతను నిలుపుకుంటోంది.
‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వా రా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన ధాన్యం, గో ధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. జ్యో తిశ్వాస్త్ర రీత్యా పగడం రవికి చెందిన అల్పమూల్య రత్నం. ఇలా రవి లక్షణాలు గల పదార్ధా లు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.
కాల్షియంకు ము త్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడు అది దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.
ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగ డం కలిసిపోతుందని ఫ్రాన్స్ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం.
బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెస లు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.
గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్ప డే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చం ద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.
శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.
శని- వాత లక్షణం కలవాడు.చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమకూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.
ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎ క్కువగా పండి దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి. . సప్త గ్ర హాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే ఆనం ద సామ్రాజ్యాన్ని, ఆరోగ్య సా మ్రాజ్యాన్ని మ నమేలుకోవచ్చు. మనవారి మేలు కోరవచ్చు.
జవహర్ లాల్ నెహ్రూ
జవహర్ లాల్ నెహ్రూ 1889వ సంవత్సరం నవంబరు 14న జన్మించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ వాళ్ళది సాంప్రదాయ కాశ్మీరీ బ్రాహ్మణుల కుటుంబం. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ అప్పట్లో పేరు మోసిన లాయరు. మామూలుగా మనదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ మధ్యతరగతి, సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. కానీ నెహ్రూ మాత్రమే మంచి డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారు. నెహ్రూ గారి బాల్యమంతా ఆయన ఇంట్లోనే గడిచింది. ఆయనకు విద్యను నేర్పడానికి అప్పట్లోనే ప్రత్యేకంగా మస్టార్లు ఇంటికి వచ్చి చేప్పేవారు. ఆ తర్వాత ఈయన తన ఉన్నతాభ్యాసం కొరకు ఇంగ్లాండు వెళ్ళి అక్కడి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తన చదువు కొనసాగించారు. ఆ తర్వాత నెహ్రూ గారి వివాహం 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8న ఢిల్లీలో ఓ మంచి సంపన్న కుటుంబంలో జన్మించిన "కమలా నెహ్రూ" తో వివాహమయ్యింది.
ఆ తరువాత నెహ్రూ గారు అనిబిసెంట్ గారి మాటల వలన ప్రభావితులై స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. జలియన్ వాలాబాగ్ లో డయ్యర్ జరిపిన హెచ్చరికలేని కాల్పుల వలన వేలాది మంది అమాయక ప్రజలు మరణించటం, గాయపడటం జరిగింది. ఈ సంఘటన తరువాత నెహ్రూ గారు, మహాత్మాగాంధీకి సన్నిహితంగా మెలగసాగారు. 1921వ సంవత్సరంలో నెహ్రూ సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. 1934వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థగా కాంగ్రెస్ సోషలిష్ట్ పార్టీ ఏర్పడటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత 1936వ సంవత్సరంలో నెహ్రూజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కూడా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్థినంతా దారపోసింది. చివరకు తన ఇంటిని సైతం కొంత భాగం హాస్పటల్ గా మార్చి స్వాతంత్ర్య పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించేవారు.
స్వతంత్ర్య భారతదేశానికి తొలి ప్రధానిగా 1947వ సంవత్సరం నుంచి తాను మరణించేదాకా సుమారు 17 సంవత్సరాలు ప్రధానిగా వ్యవహరించారీయన. చైనాతో కలసి "పంచశీల" సూత్రాలను ప్రతిపాదించారీయన. ఈయన ప్రధానిగా ఉన్న కాలంలోనే స్టీలు పరిశ్రమలు, పెద్ద పెద్ద కర్మాగారాలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన "ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.) లు, పరిశోధన సంస్థలు" ఏర్పాటుకు ఆయన తీవ్ర కృషి చేశారు. పండిట్ నెహ్రూ మంచి రచయిత కూడా. ఈయన 'ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ', వంటి సుప్రసిద్ధ రచనలు చేశారు. ఈయనకు తన కూతురు ఇందిరా ప్రియదర్శిని (ఇందిరాగాంధీ) అంటే చాలా అభిమానం. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమెకు లేఖలు వ్రాసేవారు. వాటిలో ఆయన వ్రాసిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచెప్తాయి. సాహిత్యం మీద ఆయనకు విపరీతమైన అభిమానముండేది. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన తన కోటు పై ఎప్పుడూ గులాబీ పువ్వును పెట్టుకునేవారు. పిల్లలపై ఆయన అభిమానానికి గుర్తుగా ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాం మనం. 1964 వరకు ప్రధానిగా ఉన్నారు. వీరి నాయకత్వంలో దేశం చాల పురోగమించింది. నెహ్రూను "చాచా నెహ్రూ" అని అంటారు. ఎందుకంటే వీరికి పిల్లలంటే ఎంతో మక్కువ.
మే 27 వ తేది 1964వ సంత్సరంలో పండిట్ నెహ్రూ భౌతికంగా మనకు దూరమయ్యారు. కానీ ఆయన దేశాభివృద్దికి పడిన శ్రమ, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ను అగ్రస్థానానికి చేర్చాలన్న ఆయన అభిలాష, దేశం కోసం యావదాస్తిని కర్పూరంలా అర్పించిన ఆయన నిస్వార్ధత ఇవన్నీ ఆయనను భారతీయుల గుండెల్లో చిరకాలం కొలువుండేలా చేశాయి.
Sunday, 25 May 2014
తెలంగాణ చరిత్ర
తెలంగాణ చరిత్ర
1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు భౌగోళిక విభాగాలలో తెలంగాణా ఒకటి. ఈ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు (పూనె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి, తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్దారెడ్డి, సహజకవి బమ్మెరపోతన, దక్షిణా భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పివి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. చకాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారతం కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ మొత్తం వైశాల్యం 114,840 చకిమీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757 (రాష్ట్ర జనాభాలో 41.6%)గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ లో 5వ శక్తిపీఠం, భద్రాచలంలో ప్రముఖమైన రామాలయం, బాసరలో సరస్వతీ దేవాలయం ఉన్నాయి.
భౌగోళిక స్వరూపము - నదులు
తెలంగాణ ప్రాంతము దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణాలో దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ ప్రాంతాన్ని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ ప్రాంతం విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. ఈ ప్రాంతానికి సముద్రతీరం లేదు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కృష్ణానది పరీవాహకప్రాంతంలో 69%, గోదావరి నది పరీవాహకప్రాంతంలో 79% ఈ ప్రాంతంలోనే ఉంది.
నదులు
గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమా నది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీ నది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమం దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.
1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు భౌగోళిక విభాగాలలో తెలంగాణా ఒకటి. ఈ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న నిజాం పాలన నుంచి విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు ఆంధ్రరాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ (కొత్త పేరు 44వ) నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు (పూనె-విజయవాడ) జాతీయ రహదారి, హైదరాబాదు-భూపాలపట్నం జాతీయ రహదారి, తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దు నుంచి దక్షిణాన రాయలసీమ ప్రాంతం వరకు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దు నుంచి తూర్పున ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరించియుంది. తెలుగులో తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్దారెడ్డి, సహజకవి బమ్మెరపోతన, దక్షిణా భారతదేశంలో తొలిమహిళా పాలకురాలు రుద్రమదేవి, ప్రధానమంత్రిగా పనిచేసిన పివి.నరసింహారావు తెలంగాణకు చెందినవారు. చకాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన భూభాగమిది. రామాయణ-మహాభారతం కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్ళున్న ప్రదేశమిది. తెలంగాణ మొత్తం వైశాల్యం 114,840 చకిమీ, కాగా 2011 లెక్కలప్రకారం జనాభా 35,286,757 (రాష్ట్ర జనాభాలో 41.6%)గా ఉంది. 17లోకసభ స్థానాలు, 119 శాసనసభ స్థానాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ లో 5వ శక్తిపీఠం, భద్రాచలంలో ప్రముఖమైన రామాలయం, బాసరలో సరస్వతీ దేవాలయం ఉన్నాయి.
భౌగోళిక స్వరూపము - నదులు
తెలంగాణ ప్రాంతము దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణాలో దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ ప్రాంతాన్ని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ ప్రాంతం విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. ఈ ప్రాంతానికి సముద్రతీరం లేదు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కృష్ణానది పరీవాహకప్రాంతంలో 69%, గోదావరి నది పరీవాహకప్రాంతంలో 79% ఈ ప్రాంతంలోనే ఉంది.
నదులు
గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమా నది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీ నది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమం దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.
తెలంగాణా రాష్ట్రీయ గీతం
జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన
శుభతరుణం
జై తెలంగాణ - జై జై తెలంగాణ
పొతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్
జై తెలంగాణ - జై జై తెలంగాణ
జానపద జన జీవన జావలీలు జాలువారే
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ - జై జై తెలంగాణ
సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువనువు ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వన సంపద సక్కనైన పూవుల పొద
సిరులు పండే సారమున్న మాగాణి కరములీయ
జై తెలంగాణ - జై జై తెలంగాణ
గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే
స్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి
జై తెలంగాణ - జై జై తెలంగాణ
Saturday, 24 May 2014
ఏడుపాయలు
తెలంగాణ ప్రాంతంలో జరిగే జాతరలలో 'ఏడుపాయల జాతర'కు ఎంతో ప్రాధాన్యత వుంది. భారీ భక్త జన సందోహం నడుమ ఈ జాతర ఘనంగా జరుగుతుంది. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం మెదక్ జిల్లా సమీపంలో అలరారుతోంది. గోదావరికి ఉపనది అయిన మంజీరా నది ఇక్కడ ఏడు పాయలుగా చీలిపోయి ... ఆ తరువాత ఒక్కటిగా కలిసిపోతుంది.
అయితే ఈ ఏడు పాయల మధ్య ప్రదేశంలోని ఓ గుహలో 'దుర్గాదేవి' దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం అరణ్య ప్రదేశంలో వెలిసిన కారణంగా ఇక్కడి అమ్మవారిని 'వనదుర్గ' గా భక్తులు భావిస్తుంటారు. ఏడు పాయలను అత్రి ... వశిష్ఠ ... కశ్యప ... విశ్వామిత్ర ... జమదగ్ని ... గౌతమి ... భరద్వాజ అనే సప్త ఋషులకు ప్రతీకగా చెప్పుకుంటారు.
పూర్వం జనమేజయ మహారాజు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆయన 'సర్పయాగం'చేసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. అందుకు నిదర్శనంగా ఈ పరిసరాల్లో ఇసుక మేటల కింద లభించే మెత్తటి బూడిదను చూపిస్తుంటారు.
సర్ప జాతులన్నీ సర్పయాగానికి ఆహుతి అవుతుండటంతో, వాటికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు ... గంగను ఇక్కడికి తీసుకు వచ్చాడని అంటారు. ఈ కారణంగానే ఇక్కడి మంజీరాను 'గరుడ గంగ' అని పిలుస్తుంటారు. ఈ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబళ్లు చెల్లిస్తూ వుంటారు.
Subscribe to:
Posts (Atom)